Monday, 4 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ప్రపంచంలో రేబిస్ వ్యాధితో 9 నిమిషాలకు ఒకరు మృతి

సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) భారతదేశంలో అత్యధికంగా మూడవ వంతు మరణాలు వెంటనే వ్యాక్సినేషన్, అవగాహన సదస్సులు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో సూచన ప్రపంచ వ్యాప్తంగా రేబిస్ వ్యాధితో ప్రతీ తొమ్మిది నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని, అందులో మూడవ వంతు మరణాలు భారత దేశంలోనే సంభవిస్తున్నాయని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో ఇండియాలో 2023 సంవత్సరంలో 284 మంది రేబిస్ వ్యాధితో మరణించారని, కోట్ల సంఖ్యలో వీధి కుక్కలు ఉండడంతోనే ఈ దుస్థితి అని పార్లమెంట్‌కు నివేదిక అందజేసిన ఐడీఎస్‌పీ(ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్) పలు దేశాల్లో వాక్సినేషన్ 70% సాధించి రేబిస్ నివారించినట్టు, భారతదేశం కూడా ఆ ప్రక్రియ అమలు చేయనున్నట్టు పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం

ఖమ్మం

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా.

పున్నమి ప్రతి నిధి ఖమ్మం బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతు పువ్వులను పూజించే అరుదైన వేడుక ప్రకృతిని ఆరాధించే సాంస్కృతికి వేదిక అని తరతరాలుగా తెలంగాణ నేలపై విరాజిల్లుతున్న గొప్ప సాంప్రదాయం, వారసత్వ సంపద, అస్తిత్వం, ఆత్మగౌరవం, సంబురం బతుకమ్మ అని అన్నారు ఆడబిడ్డలు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు

జాతీయ అంతర్జాతీయ

ట్రోపీ లేకుండానే “కప్పు చేతిలో ఉన్నట్లు” సెలెబ్రేట్ చేసుకొన్న భారత జట్టు!

సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) ACC ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న పాక్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ నక్వీ చేతులమీదుగా ట్రోపీని‌ అందుకోవడానికి భారత జట్టు సభ్యులు నిరాకరించడంతో ట్రోపీని వెనక్కి తీసుకెళ్ళారు. ఆతర్వాత భారత జట్టు ఆటగాళ్ళు పోడియం‌వద్దకు చేరుకొని కప్ లేకుండానే సెలబ్రేట్ చేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. భారత ఆటగాళ్ళు మెడళ్ళను కూడా నిరాకరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి అరుదైన విజయోత్సవ సెలబ్రేషన్ జరగడం విశేషం!

సినిమా

ఓజస్ గంభీర… అసలు పరీక్ష మొదలాయెరా

సినిమా : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) లాంగ్ వీకెండ్ ని టార్గెట్ గా పెట్టుకుని గురువారం విడుదలైన ఓజి అనుకున్న దానికన్నా బాగా పెర్ఫార్మ్ చేయడం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. రెండు వందల కోట్ల గ్రాస్ సునాయాసంగా దాటేయగా,. ఓవర్సీస్ లో 5 మిలియన్ మార్కు వైపు పరుగులు పెట్టడం కొత్త మైలురాళ్లను తెస్తోంది. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఏపీ తెలంగాణలో అత్యధిక డిస్ట్రిబ్యూటర్లు జీవో ప్రకారం పెంచిన రేట్లనే సోమవారం నుంచి కూడా కొనసాగించడం పట్ల ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కొన్ని సెంటర్స్ లో తగ్గించినప్పటికీ ప్రధాన కేంద్రాల్లో మాత్రం టికెట్ మీద 100, 150 రూపాయల పెంపు అలాగే కనిపిస్తోంది. దీని వెనుక కారణం దసరా సెలవులే. స్కూళ్ళు, కాలేజీలు హాలిడేస్ లో ఉన్నాయి. పిల్లలు ఇంటి పట్టునే ఉన్నారు. యూత్ కి ఖాళీ సమయం చాలా ఉంది. సో ఈ అవకాశాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్లు పది రోజుల పాటు అవే ధరలే పెట్టే ఉద్దేశంతో ఉన్నారట. మూడు నాలుగు వారాల్లో ఉన్న మిరాయ్, లిటిల్ హార్ట్స్ కు సైతం మంచి ఆక్యుపెన్సీలు కనిపించడానికి కారణం ఏమిటో చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ దృష్ట్యా పెంచిన మొత్తాన్ని భరించి మరీ ఆడియన్స్ వస్తారనే ధీమా నిర్మాత, బయ్యర్లలో కనిపిస్తోంది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ అంత స్థాయిలో లేవనేది పరిశీలించాల్సిన విషయం. సరే ఎవరి పట్టు వారిదే కానీ ఒకవేళ ఓజి కనక నెమ్మదించకపోతే వీక్ డేస్ పరీక్షలో ఫస్ట్ క్లాసులో పాసైనట్టే. ఎందుకంటే అక్టోబర్ 5 దాకా సెలవులున్నాయి. కాంతార చాప్టర్ 1, ఇడ్లి కొట్టు రూపంలో కొత్త పోటీ వస్తున్నప్పటికీ అవి డబ్బింగ్ సినిమాలు కాబట్టి పవన్ మూవీనే జనాలకు ఫస్ట్ ఛాయస్ అవుతుందనే నమ్మకం ఎగ్జిబిటర్లలో ఉంది. ఒకవేళ ఓజి కనక ఇవాళ్టి నుంచి రెగ్యులర్ రేట్లకు వచ్చేసి ఉంటే మాస్ బుకింగ్స్ తో పాటు వరసగా హౌస్ ఫుల్స్ పడేవన్న అభిప్రాయాన్ని ఎంత మాత్రం కొట్టిపారేయలేం. థియేటర్ ఫైనల్ రన్ ఇంకా దూరంలో ఉంది కాబట్టి పవన్ కెరీర్ బెస్ట్ నెంబర్స్ వస్తాయో లేదో వేచి చూడాలి.

ఆంధ్రప్రదేశ్

అమరావతి పనులు 24/7 ప్రతి కేంద్ర ప్రభుత్వ విభాగ కార్యాలయం ఉండేలా

సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) అమరావతిలో ప్రతి కేంద్ర ప్రభుత్వ విభాగ కార్యాలయం ఉండేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పుడో కాదు.. ఇప్పుడే ఉన్న పళంగా నిర్మాణాలు ప్రారంభించేందుకు ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఆయన రంగంలోకి దించుతున్నారు. పన్నెండు బ్యాంకులు ఇప్పుడు అమరావతిలో రాష్ట్ర స్థాయి కార్యాలయాల నిర్మాణాన్ని ఒకే సారి ప్రారంభించబోతున్నాయి. ఆర్థిక నగరంలో వీటికి కేటాయించిన స్థలాలను చదును చేసి ఇచ్చేశారు. ఇప్పుడు బ్యాంకులు నిర్మాణాలు ప్రారంభించబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకే రోజు అన్ని కార్యాలయాలకు శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన స్థలాల్లోనూ నిర్మాణాలు ప్రారంభించేలా చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారు. కేవలం ప్రభుత్వం చేపట్టిన పనుకలకే ప్రస్తుతం పదమూడు వేల మంది కార్మికులు పని చేస్తున్నారు . ఇతర ప్రైవేటు సంస్థలు.. కేంద్ర ప్రభుత్వం సంస్థలు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు చేపట్టిన నిర్మాణాల కోసం రోజుకు కొన్ని వందల మంది అమరావతికి వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అమరావతిలో పనులు జరుగుతూ కనిపిస్తున్నాయి.

తెలంగాణ

వెంకయ్య నాయుడి బతుకమ్మ శుభాకాంక్షలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ బతుకమ్మ పండుగ సం దర్భముగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్పు వరపు వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియ జేశారు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ప్రకృతిని పూజించడం భారతీయ సంప్రదాయం. దేవతార్చనకు వాడే పుష్పాలనే ప్రకృతిగా భావించి తీరొక్కపూలతో దేవీ రూపంగా పూజించే ఘనమైన సంప్రదాయం ‘బతుకమ్మ’ పండుగ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.అని వెంకయ్య అన్నారు

ఆంధ్రప్రదేశ్

గుంటూరు కొత్తపేట రావుస్ ఆసుపత్రిలో జరిగిన దారుణం! పెద్ద చర్చనీయాంశమైంది.

సెప్టెంబర్ 30 పున్నమి ప్రతినిధి గుంటూరు కొత్తపేటలోని రావుస్ ఆసుపత్రిలో జరిగిన విషాద ఘటన పెద్ద చర్చనీయాంశమైంది. భుజం నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన 35ఏళ్ల బ్రహ్మానందరెడ్డికి డాక్టర్ మోహన్ రావు మెడకు సర్జరీ చేశారని, ఆ సర్జరీ వల్లే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని తల్లి పద్మావతి ఆరోపించారు. వైద్య నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ముందుగానే 6 లక్షలు వసూలు చేశారని, మొత్తంగా 35 లక్షలు ఖర్చైనా తన కుమారుడిని కాపాడలేకపోయామంటూ ఆమె కన్నీటి గాధ వెల్లడించారు. 12 గంటలపాటు సర్జరీ విజయవంతమైందని డాక్టర్ చెప్పినా, తర్వాత తీవ్రమైన వాంతులు, విరేచనాలు వచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కి తరలించేందుకు అనుమతించకపోవడం వల్లే మరణం జరిగిందని అన్నారు. బాధితురాలు డీఎస్పీ, కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డాక్టర్ మోహన్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి సత్యకుమార్‌ను కలిసి, మెడికల్ కౌన్సిల్‌ అధికారులను కలుసుకుని న్యాయం కోసం పోరాడతానని పద్మావతి తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

వడ్డీ రేట్లు తగ్గే అవకాశం.. SBI రీసెర్చ్‌ అంచనా

సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మరో 0.25 శాతం తగ్గించే అవకాశం ఉందని SBI రీసెర్చ్ అంచనా వేసింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రెపో రేటు 1 శాతం తగ్గి ప్రస్తుతం 5.5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటంతో వడ్డీ రేట్లలో మరో కోతకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, కొంతమంది ఆర్థిక నిపుణులు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచవచ్చని అభిప్రాయపడుతున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్ 1న వెలువడనున్న RBI పాలసీ నిర్ణయం కీలకంగా మారింది. ఈ నిర్ణయం రుణాలపై ప్రభావం చూపనుంది.

జాతీయ అంతర్జాతీయ

ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సబ్సిడీ.. గైడ్లైన్స్ ఇవే

సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వం PM E-Drive స్కీం కింద రూ.2000 కోట్లతో దేశవ్యాప్తంగా 72,300 పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు గైడ్లైన్స్ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసే ఛార్జింగ్ స్టేషన్లకు 100% సబ్సిడీ, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్ డిపోలు, టోల్ ప్లాజాలు వంటి ఇతర ప్రజా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే 80% సబ్సిడీ అందించనుంది. ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఈ ప్రాజెక్టుల కోసం తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ గైడ్లైన్స్ ద్వారా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం, EV వాహనాల వాడకాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

జాతీయ అంతర్జాతీయ

ఇక మీ గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవచ్చు!

సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) గుడ్‌ న్యూస్‌.. ఇక మీ గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవచ్చు! వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. మొబైల్ నంబర్‌ పోర్టబిలిటీ తరహాలో త్వరలో LPG కనెక్షన్లను కూడా మరో కంపెనీకి మార్చుకోవడానికి అనుమతించే “LPG ఇంటర్‌ఆపరబిలిటీ”పై పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB) ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. దీనిపై వినియోగదారులు, పంపిణీదారుల నుండి సూచనలు కోరింది. 2013లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానం, అప్పట్లో డీలర్‌ను మార్చుకునే పరిమిత అవకాశాలను ఇచ్చింది. ఇప్పుడు కంపెనీల మధ్య పోర్టబిలిటీని పరిశీలిస్తోంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.