Monday, 4 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేజర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

సెప్టెంబరు (చేజర్ల పున్నమి ప్రతినిధి) రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం: సొసైటీ చైర్మన్ వీరారాఘవ రెడ్డి రైతులకు మద్దతు ధరతో నేరుగా కొనుగోలు సదుపాయం కొనుగోలు కేంద్రంపై రైతుల సంతోషం, ప్రభుత్వానికి కృతజ్ఞతలు రైతులకు సహకరించే దిశగా చేజర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ భూదళ్ళ వీరారాఘవ రెడ్డి, ఎన్‌డీసీసీ బ్యాంకు మేనేజర్ భగవాన్,సొసైటీ సీఈఓ ఖలీల్, సొసైటీ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.ధాన్యం సేకరణ ద్వారా రైతులకు తగిన మద్దతు ధర లభించడానికి ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని నిర్వాహకులు తెలిపారు. రైతులు తమ పంటను నేరుగా ఈ కేంద్రానికి విక్రయించడం ద్వారా మధ్యవర్తుల జోక్యం తగ్గుతుందని, లాభం నేరుగా రైతులకు చేరుతుందని వారు వివరించారు.ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ భూదళ్ళ వీరారాఘవ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, పంట కొనుగోలు, రుణ సదుపాయాలు, నిల్వ సౌకర్యాల విషయంలో అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.సీఈఓ ఖలీల్ మాట్లాడుతూ, రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ధాన్యం తూకం, చెల్లింపులు పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం ఈ ఏడాది సాధారణ రకం ధాన్యం క్వింటా రూ.2360, పుట్టి రూ.20,136, అలాగే గ్రేడ్–ఏ రకం క్వింటా రూ.2389, పుట్టి రూ.20,306 గా కొనుగోలు జరగనుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రం తమకు ఎంతో ఉపయుక్తమని, సరైన ధరకు పంట విక్రయం జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

E-పేపర్

బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా రాయచోటి *లక్కిరెడ్డిపల్లి వద్ద కరెంట్ షాక్ కొట్టి పశ్చిమబెంగాల్ యువకుడు మృతి*

( పున్నమి ప్రతినిధి సురేష్) విద్యుత్తు లైనుకు మరమ్మతు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి, పచ్చిమబెంగాల్ రాష్ట్రం యువకుడు మృత్యువాత పడ్డాడు. సోమవారం వెలుగు చూసిన ఘటనపై రాయచోటి ఏఎస్సై గోపి నాయక్ తెలిపిన వివరాలు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పూర్వబర్ధమాన్ జిల్లా, రామగోపాల్ పూర్ కు చెందిన ధనంజయ్ బాగ్ది కొడుకు సంజయ్ బాగ్ది(32), అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లి వద్ద ఓలైన్ మెన్ కు సహాయకుడిగా పనిచేస్తూ లైన్ మీద కరెంటు షాక్ కొట్టి చనిపోయాడు.

తెలంగాణ

అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి!!

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామపంచాయతీ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున, తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూ.చా. తప్పకుండా పాటించాలని ఆమె అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ,ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న దృశ్య వచ్చే సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని, అప్పటివరకు ప్రజావాణి కార్యక్రమము జరగదని అందువల్ల జిల్లా ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వినతులను సమర్పించేందుకు సోమవారం జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్

నరసన్నపేట బంగారం మరియు వెండి వర్తకుల సంఘం గమనిక

🔸 కస్టమర్ల ఆర్డర్లపై చెల్లించిన మొత్తానికి మాత్రమే ఆ సమయంలో ఉన్న బంగారం రేటు వర్తిస్తుంది. 🔸 మిగిలిన మొత్తాన్ని మరుసటి రోజుల్లో చెల్లిస్తే, ఆ రోజున ఉన్న పెరిగిన లేదా తగ్గిన బంగారం రేటు ప్రకారం లెక్కించబడుతుంది. 🔸 ఈ నిబంధనలను కస్టమర్లు గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వర్తకుల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఇట్లు నరసన్నపేట బంగారం మరియు వెండి వర్తకుల సంఘం

ఆంధ్రప్రదేశ్

“Guard Your Heart – The Drum of Life”..!చూసుకో పదిలంగా..హృదయాన్ని అద్దంలా..!

Your heart fights for you every second. When was the last time you fought for it..!? When your heart is peaceful, Your whole world is bright..A calm, loving heartbeat, Can conquer any fight..! One Heart. One Beat. One Chance..Hence, protect it before it stops..!🕊️🩷 World Heart Day/ప్రపంచ హృదయ దినోత్సవం, 29-9..!🩷🌎 _____________________2025 Theme is : “Don’t Miss a Beat”. It’s a powerful reminder to: Listen to your heart literally and emotionally.Don’t ignore symptoms, stress, or unhealthy habits.Act before it’s too late.Get regular checkups, stay active, eat smart and care for mental well-being. Be aware, be proactive and never take your heart for granted. అమ్మను మించి దైవమున్నదా..ఆత్మను మించి అర్థమున్నదా..! ఆ దైవం ఇచ్చిన దేహంలో అన్నిటినీ మించిన అవయవం గుండె..!దాని కదలికే మన ఊపిరి..అది ఉన్నంతవరకే మన శ్వాస..అది ఆడమన్నట్టు నువ్వు ఆడకపోయినా…అది ఆడుతున్నంత సేపే నువ్వు ఆడేది..! నీ రక్త ప్రసరణ..ఉచ్వాశనిశ్వాసాలు..నీ భయం..నీ అభయం..నీ ఆరోగ్యం..నీ మహాభాగ్యం.. మనిషి భావం..మనిషి శైవం.. అదే ఆగిపోయిన నాడు మనిషి శవం..! చూసుకో పదిలంగా..హృదయాన్ని అద్దంలా..కదిలేది కాలం ఏదైనా.. రగిలేది నీలో వేదన..! కవి చెప్పినా..రవి చెప్పినా ఆ గుండెను కాపాడుకొమ్మన.. అనవసర ఆలోచనలు.. కలుషిత శ్వాసలు..వృధా ప్రయాసలు..ఆపై ఆయాసాలు…!వీటికి దూరంగా నీ గుండె ఉంటే నువ్వు బండ.. అప్పుడు నువ్వు కావెవరికీ ఓ గుదిబండ..! కొంతమందికి అవసరమేమో కుట్రలు..కుతంత్రాలు..పనికిరాని విషయాలపై అటెన్షన్లు..నిజానికి అవన్నీ ..గుండె తట్టుకోలేని టెన్షన్లు..!ఇవన్నీ వద్దు, వద్దురా ఆని నీ గుండె ఎప్పుడూ ఇస్తుంది కాషన్లు..పట్టించుకోని నీకు లేనిపోని పరేషాన్లు..ఆపై ఆపరేషన్లు..! స్టెంటు..బైపాస్..ఓపెన్ హార్ట్..పరాకాష్టగా గుండె మార్పిడి..వీటన్నిటికీ కారణం.. నీలోని రాపిడి..!అతిగా ఆశపడి సంపాదించే ధనం..అందుకోసం అంతర్మధనం..!నీ యాతన..నీ వేదన..అదంతా నీ గుండెకు కోత..నీకు కలత..అంతిమంగా నీ గుండెకు నలత..! “గుండె మంట..గుండె కోత..గుండె కరిగి..గుండెల్లో గుడి”..ఇలా గుండెకు ఎన్నో భాషలు..అవే నీ జీవితకాలపు ఘోషలు..!అలా గుండె రాయి చేసుకుని నువ్వుంటే నువ్వో బండరాయి.. సాటి మనిషి కష్టానికి నువ్వు కరిగితే నువ్వు మానవతకే కలికితురాయి..నీ గుండెలో శాంతి దూత పావురాయి ఉన్నంత కాలం నీ జీవితం హాయి హాయి..!🕊️😇🙂 గుండె మంటలారిపే..సన్నీళ్లు కన్నీళ్లు..ఉండమన్న ఉండవమ్మ..సాన్నాళ్ళు..!నీ గుండె..నీ ఆస్తి..అది చెదిరితే..చెడితే..ఇక నీ బ్రతుక్కే స్వస్తి..!💝❤‍🩹❤‍🔥🩶🖤🤍🩷💛💚🩵💙 Your heart is not just flesh and beat..It is your rhythm, your pulse, your heat..!It laughs when you laugh,It breaks when you cry..It pleads with you softly, “Let me not die.”..! No wealth can buy it, No crown can replace..It lifts your courage, It carries your grace…! So feed it with kindness, Not anger or greed..Give it fresh air, And good thoughts to feed..! Walk a little farther..Breathe a little deep..Forgive a little faster Let no hatred seep…! This World Heart Day, make one vow to start.. Care for your life’s temple… your Heart..!🛕🕍🩷🛐🙏 #ForumForBetterSociety SocietyConnect #ServeAllSociety #WorldHeartDay #GuardYourHeart #BeatForLife #HeartHealth #LiveWithHeart #HealthyHeartHappyLife #ForumForBetterSociety#SocietyConnect #ServeAllSociety#NashaMuktBharatAbhiyaan #SayNoToDrugs #YesToLife #AntiDrugAbuse #TrafficSafety #WomenSafety #LawAndOrder #Justice #Values #Training #GoodGovernance #Education #Analysis #iamsureshbetha Drona #Advocate #HighCourt #AndhraPradesh #Telangana సేకరణ: వాట్సాప్ through suresh Betha 7386254666

తూర్పు గోదావరి

నిడదవోలు బ్రాండ్ ఇమేజ్ ను పెంచుదాం

15 నెలల కాలంలో నిడదవోలు పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం రుడా, మున్సిపల్ శాఖ సహకారంతో మరిన్ని కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం *అమృత్ పథకం ద్వారా రూ.105 కోట్ల అంచనా వ్యయంతో నిడదవోలు పట్టణానికి మంచినీరు* *రూ.9.5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సాధించాం* *జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై దసరా నుండి దీపావళి వరకు నెలరోజులు ప్రచార కార్యక్రమం..అక్టోబర్ 19న పెద్ద పండుగగా కార్యక్రమం నిర్వహిస్తాం* *రాష్ట్రవ్యాప్తంగా 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర క్రింద ఏటా రూ.15వేలు.. దసరా కానుకగా ఈ అక్టోబర్ 4న నిధుల విడుదల* *నిడదవోలు పురపాలక సంఘ సాధారణ సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి* *నిడదవోలు మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపు..అందరి సహకారంతో నిడదవోలులో అభివృద్ధి సాధ్యం* నిడదవోలు: 15 నెలల కాలంలో నిడదవోలు పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం నిడదవోలు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పురపాలక సంఘ సాధారణ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని నిడదవోలు పట్టణ అభివృద్ధికి తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజావసరాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ సభ్యులు, అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సుదీర్ఘంగా చర్చించి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. *రుడా, మున్సిపల్ శాఖ నిధులతో నిడదవోలు పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు:మంత్రి దుర్గేష్* రుడా,రాష్ట్ర మున్సిపల్ శాఖ నుండి ఇతోధికంగా నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి దుర్గేష్ అన్నారు.రూ.7.74 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. అంతేకాదు తమ ప్రత్యేక కృషితో నిడదవోలులో షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్ తదితర అభివృద్ధి పనులకు రుడా నిధులు సమీకరించామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి రూ.1 కోటి 60 లక్షలు రావాల్సి ఉందన్నారు. రుడా సాధారణ నిధుల నుండి రూ.86 లక్షలు తీసుకువచ్చామన్నారు. ఈ విషయమై రుడా ఛైర్మన్, వీసీతో మాట్లాడానన్నారు. డీపీఎస్, ఎల్ఆర్ఎస్ నుండి రూ.3 కోట్ల నిధులు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. కోటి మంజూరు అయిందన్నారు. వాస్తవానికి ఒక కోటి రూపాయల నిధులు మాత్రమే మున్సిపాలిటీలకు కేటాయిస్తుండగా నిడదవోలు మున్సిపాలిటీ కోసం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో ప్రత్యేకంగా మాట్లాడి రూ.3 కోట్ల నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నానన్నారు. తద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశముందన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి విషయంలో చాలా ప్రగతి సాధించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నామన్నారు. మంచినీటి పథకం విషయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి రైల్వే శాఖ 8 కోట్ల 67 లక్షల 61 వేల 539 రూపాయలు ఇస్తే, మున్సిపల్ శాఖ నుండి రూ.75 లక్షలు ఏర్పాటు చేస్తామన్నామన్నారు. మొత్తంగా 9 కోట్ల 42 లక్షల 61 వేల 539 రూపాయలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సాధించామని వెల్లడించారు. రహదారులపై చెత్తా చెదారం, మురుగు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ నిడదవోలుకు బాటలు వేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా నిడదవోలు పట్టణ అభివృద్ధికి నడుం బిగిద్దాం అని వెల్లడించారు. *అమృత్ పథకం ద్వారా నిడదవోలుకు మంచినీరు:మంత్రి దుర్గేష్* నిడదవోలు పట్టణంలో అమృత్ పథకం, గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మంత్రి దుర్గేష్ విమర్శించారు. సరిగ్గా ఆ కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల నిడదవోలు పట్టణానికి అందాల్సిన గోదావరి జలాలు అందలేకపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం ఏషియన్ బ్యాంక్ తో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు చర్చించి సంబంధిత నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారన్నారు. తాము రాసిన లేఖలకు ఏషియన్ బ్యాంక్ స్పందించి సహకారం అందిస్తామన్నారు. ఈ క్రమంలో నిడదవోలు పట్టణానికి గోదావరి వాటర్ ప్రాజెక్ట్ అమృత్ క్రింద నీళ్లు రప్పించేందుకు ఆమోదం లభించిందన్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.85 కోట్ల 82 లక్షలు కాగా అందులో ఎన్టీఆర్ నగర్ కు రూ.5 కోట్ల 96 లక్షలు, మాలకొండ చెరువుకు రూ. 4 కోట్ల 53 లక్షలు, ఎస్ టీపీ (సూయజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్) కి రూ.11 కోట్ల 5 లక్షలు మొత్తంగా రూ.105 కోట్ల అంచనా వ్యయంతో అమృత్ పథకం ద్వారా నిడదవోలు పట్టణానికి మంచినీరు అందించనున్నామన్నారు. గతంలో సోర్స్ సరిగా లేకపోవడం వల్ల ఎక్కడి నుండి నీరు తీసుకుంటున్నామో స్పష్టత కొరవడిందన్నవారు.తద్వారా ప్రాజెక్టు పట్టాలెక్కలేదని, ఈ క్రమంలో కేవలం పైప్ లైన్లతో సరిపెట్డడం వల్ల నీళ్లు రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సోర్స్ ను ఏర్పాటు చేసి విజ్జేశ్వరం దగ్గర గేట్ల ఏర్పాటు ద్వారా గ్రిడ్ నుండి నీరు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. *జిఎస్టి 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పన:మంత్రి దుర్గేష్* ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఉపయోగం ఉందని మంత్రి దుర్గేష్ వివరించారు. జీఎస్టీ తగ్గించడం వల్ల చాలా వస్తువులు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిపోయన్నారు. దసరా నుండి దీపావళి వరకు నెలరోజుల పాటు జీఎస్టీ వల్ల ప్రజలకు కలిగే మేలుపై అవగాహన కల్పిద్దామన్నారు. అక్టోబర్ 19న పెద్ద పండుగగా నిర్వహిద్దామని సూచించారు. *ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి:మంత్రి దుర్గేష్* స్త్రీశక్తి ద్వారా మహిళలకు కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని మంత్రి దుర్గేష్ అన్నారు. తద్వారా ఆటో డ్రైవర్లు నష్టపోకుండా అక్టోబర్ 4వ తేదీన వారి ఖాతాల్లో వాహనమిత్ర క్రింద రూ.15వేలు జమ చేయనుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి జరుగనుందన్నారు. *అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు లబ్ధి:మంత్రి దుర్గేష్* ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అధికారుల ద్వారా తెలుసుకునే హక్కు ప్రజలకుందని మంత్రి దుర్గేష్ అన్నారు. అదే విధంగా ప్రజా ప్రతినిధులకు సమాచారాన్ని చేరవేసే బాధ్యత అధికారులకుందని అన్నారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన ద్వారా రైతన్నలకు అందిస్తున్న రూ.20వేల ఆర్థికసాయం, దీపం-2 ద్వారా ఏటా ప్రజలకు అందిస్తున్న 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న విషయాలు ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మెప్మా ద్వారా చేపట్టే కార్యక్రమాలు అందరికీ తెలియాలన్నారు. వివిధ పథకాల క్రింద కూటమి ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. *కోటసత్తెమ్మ ఆలయం వెనుక మురుగునీరుకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు* తిమ్మరాజుపాలెంలో కొలువైన కోటసత్తెమ్మ ఆలయం వెనుక ఉన్న మురుగు అమ్మవారి పాదాల చెంతకు వచ్చి అపవిత్రం అవుతుందని, అధికారులు యుద్ధప్రాతిపదికన పరిష్కార చర్యలు చేపట్టాలని మంత్రి దుర్గేష్ ఆదేశించారు. కాలయాపన చేయకుండా త్వరితగతిన సమస్యను పరిష్కరించాలన్నారు. *నిడదవోలు సమగ్రాభివృద్ధి చేసి చూపిస్తాను:మంత్రి కందుల దుర్గేష్* నిడదవోలులో 100 పడకల ఆస్పత్రి, మినీ స్టేడియం నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.నిడదవోలులో మంచి బస్ సర్వీసులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.ఈ విషయమై ఇప్పటికే చర్చించానన్నారు.సాంకేతిక సమస్యలు పరిష్కారం అయిన వెంటనే నిడదవోలు పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్లౌడ్ స్పేస్ పెంచే విషయమై ఇప్పటికే మంత్రి నారా లోకేష్ తో, ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ తో మాట్లాడానన్నారు.నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ పట్టణంలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు తాను హాజరవుతున్నానన్నారు.తద్వారా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. నిడదవోలుకు మంచి పరిశ్రమలు వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. *అందరి సహకారంతో నిడదవోలు అభివృద్ధికి చర్యలు..నిడదవోలు ఖ్యాతి పెరిగేలా పనిచేద్దామని పిలుపు:మంత్రి దుర్గేష్* అందరి సహకారంతో నిడదవోలు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు గొప్పతనం ప్రజలకు తెలియాలన్నారు.శాతావాహనుల కాలం నుండి నిడదవోలుకున్న చరిత్రను బయటి ప్రపంచానికి తెలపాల్సిన అవసరాన్ని వెల్లడించారు. నిడదవోలులోని ఆలయాలు, చర్చిలు, మసీదులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు.వాటిని పబ్లిసిటీ చేసుకోవాలన్నారు. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలకతీతంగా అందరూ నియోజకవర్గం అభివృద్ధికి పనిచేయాలన్నారు.నిడదవోలు ఖ్యాతి పెరిగేలా పనిచేద్దామని పిలుపునిచ్చారు.నిడదవోలు చరిత్ర అందరికీ తెలిసేలా వేడుకలు నిర్వహించుకుందామన్నారు.విజయవాడ ఉత్సవ్ లా నిడదవోలు బ్రాండ్ ఇమేజ్ ను వివిధ ఉత్సవాల ద్వారా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.సాంస్కృతిక శాఖ మంత్రిగా తాను అనేక శాశ్వత సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేలా కృషి చేస్తానన్నారు.భవిష్యత్ లో నిడదవోలు అభివృద్ధికి ఏ తరహా చర్యలు చేపడితే బాగుంటుందో అభిప్రాయాలు తెలపాలని కోరారు. కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, కౌన్సిలర్లు , అధికారులు పాల్గొన్నారు.

ఎలూరు

సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి స్థానిక రుద్రభూమి వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 4 వేల మంది భక్తులుకు అన్నదానం చేశారు. వట్టిగుడిపాడు రామాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈదులగూడెంలో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తోటపల్లి లో అమ్మవారికి తోటపల్లి ట్రెండ్ సెట్టర్స్ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

సత్యసాయి

*సేవా తత్పరునికి ఘన సత్కారం* *ఏపీ జె ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన యాల్లంరాజు ను ఘనంగా సత్కరించిన జర్నలిస్టులు,పలు పార్టీల నాయకులు.* *సమావేశంలో చౌడేశ్వరి ఆలయ ధర్మకర్త పురుషోత్తం రెడ్డి కామెంట్స్* *గత 20 సంవత్సరాలుగా యాల్లంరాజు జర్నలిస్టుగా అనేక సేవా కార్యక్రమాలు* *అమడగూరు లో జర్నలిస్టుగా ప్రారంభమై జిల్లా స్థాయికి ఎదగడం హర్షించదగ్గ విషయం* *మా ప్రాంత వాసి జిల్లా ఉపాధ్యక్షులుగా ఎంపిక కావడం అమడగూరు మండలానికే గర్వకారణం* *జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడడం యాల్లంరాజు నైజం* *మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించిన జర్నలిస్టులు పలు పార్టీల నాయకులు.*

ఆమడగూరు పున్నమి న్యూస్ సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సేవా తత్పరుడు యల్లంరాజును అమడగూరు మండల కేంద్రంలోని చౌడేశ్వరి కళ్యాణ మండపంలో జర్నలిస్టులు ,పలు పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.యల్లంరాజు సన్మాన కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా యాల్లంరాజు జర్నలిస్టులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారాని ,గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. అమడగూరులో జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి జిల్లా స్థాయికి ఎదగడం హర్షించదగ్గ విషయం అన్నారు. మా ప్రాంత వాసి జిల్లా ఉపాధ్యక్షులుగా ఎంపిక కావడం ఆమడగూరు మండలానికే గర్వకారణం అని తెలిపారు జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడడం యల్లంరాజు నైజం అని పేర్కొన్నారు.యాల్లంరాజు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జర్నలిస్టులు, పలు పార్టీ నాయకులు ఆకాంక్షించారు. అనంతరం యాల్లంరాజు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జర్నలిస్టుగా రాణిస్తున్నానంటే కారణం అమడగూరు మండలమే అన్నారు. ఈ ప్రాంత పలు పార్టీల నాయకులు తోటి జర్నలిస్టుల సహకారంతో ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయడానికి ముందు ఉంటానన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చొరవ తీసుకుంటానని ముఖ్యంగా అందరి సహకారంతో ఇంటి పట్టాలు లేని జర్నలిస్టులను గుర్తించి పట్టాతోపాటు ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా చొరవ తీసుకుంటానని తెలుపుతూ ఇంత స్థాయిలో ఘనంగా సత్కరించిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పురుషోత్తం రెడ్డి, గుండు వారి పల్లి సర్పంచ్ గోపిరెడ్డి, పాత్రికేయుల మండల సంఘం అధ్యక్షులు ధర్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహులు, ఉపాధ్యక్షులు శివరాం, కోటిరెడ్డి,లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ దొడ్డప్ప వార్డు మెంబర్ నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షుడిగా శేషు ఎన్నిక

గొల్లప్రోలు : గొల్లప్రోలు మండలం ఫోటో గ్రాఫర్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. మండలంలోని సుమారు 35 మంది ఫోటో గ్రాఫర్లు ఉండగా 25 ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అందులో 18 ఓట్లు కేశవమతం శేషుకి పోల్ అవ్వగా అధ్యక్షుడిగా నియమించారు. కార్యదర్శిగా బండారి రమణ, ఉపాధ్యక్షుడిగా సూరిబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ మండలంలో ఉన్న ఫోటోగ్రాఫర్ల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. అదే విధంగా సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రెండేళ్ల పదవీకాలంలో యూనియన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. అధ్యక్ష, కార్యదర్శిగా ఎన్నికైన కేశవమతం శేషు, బండారి రమణలను ఫోటోగ్రాఫర్లు అందరూ పూలమాలలు వేసి, దుశ్శాలువతో సత్కరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.