Monday, 4 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

స్థానిక ఎన్నికల సమీక్ష: రామారెడ్డి కాంగ్రెస్ నేతలు ఐక్యతకు పిలుపు

కామారెడ్డి, 29 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి.  :  స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, రామారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు  గొల్లపల్లి లక్ష్మా గౌడ్ నివాసం లో సోమవారం నాడు కీలకమైన సమీక్ష సమావే శం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై, పార్టీ బలోపేతంపై చర్చించా రు. ఈ సందర్భంగా, జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా, కలసికట్టు గా పనిచేయాలని ఉద్ఘాటించారు. “వార్డు మెంబర్ నుండి జెడ్పిటిసి వరకు ప్రతిచోటా కాంగ్రెస్ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపు నిచ్చారు. అంతకుముందు రాష్ట్రంలో బీఆర్ఎస్  హవా కొనసాగుతున్న సమయంలోనూ, రామారెడ్డి మండలంలో కాంగ్రెస్ వీర సైనికుల, అభిమానుల సహకారంతోనే తాను కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి పార్టీ జెండాను ఎగరేయగలిగానని గుర్తుచేశారు. ఈ ఘనత కాంగ్రెస్ వీర సైనికులదనే ఆయ‌న అదే పట్టుదల, ఉత్సాహంతో రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

జాతీయ స్థాయి కరాటే పోటీలలో శ్రీకాళహస్తి విద్యార్థి ప్రతిభ

శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహారంలోని విజయ వాణి ఈటెక్నో & ఒలంపియాడ్ స్కూల్ నందు తొమ్మిదవ తరగతి చదువుతున్న ఎం.చంద్రమౌళి గురువారం చెన్నైలో జరిగిన జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ 2025 లో పాల్గొనడం జరిగింది.ఈ పోటీలలో చంద్రమౌళి కరాటే విభాగంలో ఒక బహుమతి కుమితే మరియు కటా విభాగంలో మరో బహుమతి గెలుచుకోవడం జరిగింది.కరాటే లో ప్రతిభ కనబరిచిన తమ పాఠశాల విద్యార్థి చంద్ర మౌళిని ని,అలాగే శిక్షణ ఇచ్చిన ఇంతటి విజయం అందుకోవడానికి కారకులైన కరాటే గురువు సుధాకర్ ని కరస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ శ్యామల రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ చంద్రమౌళి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్

మన హృదయం, మన చేతుల్లోనే .. – హృదయం అద్దం లాంటిది. – లయన్ డా. పైడి. సింధూర

హృదయం అద్దం లాంటిదని, పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదేనని, మన హృదయ శ్రేయస్సు, మన చేతుల్లోనే ఉందని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా. పైడి. సింధూర అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా, స్థానిక సింధూర వైద్యశాలలో రోగులకు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఇందులో భాగముగా వైద్యులు డిఎం న్యూరాలజి అమర కార్తీక్, ఎండి జనరల్ మొదలవలస.మురళి, ఇతర వైద్యులబృందంతో కలసి రోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో, వృద్ధులలోనే కాకుండా యువతలో కూడా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతోందని, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితమే ప్రధాన కారణాలన్నారు. శారీరక శ్రమ లేకపోవడం కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణమని, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటి శారీరక శ్రమను ప్రతిరోజూ చేయాలని, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం చాలా ముఖ్యమన్నారు. వైద్యులు అమర కార్తీక్ మాట్లాడుతూ జంక్ ఫుడ్, చక్కెర, అధిక కేలరీల ఆహారాన్ని నివారించాలని, వీటికి బదులుగా, మీ ఆహారంలో బాదం, వాల్‌నట్స్, క్యారెట్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలన్నారు. తగినంత నిద్ర, సుమారు 7 నుండి 8 గంటలుగంటలు అవసరమని, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలిని మెరుగుపరచుకోవాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ నటుకుల. మోహన్, కార్యదర్శి టెక్కం. రామ్ గోపాల్, మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు. చరణ్, సింధూర హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

ఎట్టకేలకి వెలువడిన స్థానిక సంస్థ ల ఎన్నికల నోటిఫికేషన్

పున్నమి ప్రతి నిధి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆసక్తి తో ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నేడు నోటిఫికేషన్ విడుదల చేసినది. MPTC, ZPTC ఎన్నికలు 2 దఫాలు గా అలాగే పంచాయితీ ఎన్నికలు 3 దాఫాలు గా నిర్వహించెందుకు ఎన్నికల కమిషన్ నేడు విడుదల చేసిన ప్రకటన లో వెల్లడించినది. ZPTC, MPTC ఎన్నికల నిర్వహన వివరాలు మొదటి దశ: అక్టోబర్ 9నామినేషన్, అక్టోబర్ 23 న పోలింగ్ రెండవ దశ: అక్టోబర్ 13 న నామి నేషన్, 27 న పోలింగ్ MPTC, ZPTC ఫలితాలు నవంబర్ 11 న ప్రకటిస్తారని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. అలాగే గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహన మూడు దఫాలుగా నిర్వహించడం జరుగుతుంది అని మొదటి దశ: అక్టోబర్ 17 న నామినేషన్ 31 పోలింగ్ అదే రోజు ఫలితాలు ప్రకటన రెండవ దశ: అక్టోబర్ 21 నామినేషన్ నవంబర్ 4 పోలింగ్ అదే రోజు ఫలితాలు ప్రకటన మూడవ దశ: అక్టోబర్ 25 న నామినేషన్ నవంబర్ 8 న పోలింగ్ అదే రోజు ఫలితాలు ప్రకటన అని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. అలాగే ముగ్గురు సంతానము ఉంటే ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హులు అని తెలిపింది. నేటి నుండి తెలంగాణ లో ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చింది అని ఎవరు అయినా ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు

తూర్పు గోదావరి

విజయదుర్గ అమ్మవారి మండపంలో వైభవంగా సరస్వతి పూజ

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్29) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం వాటర్ ట్యాంక్ వీధిలో ప్రతిష్ఠించిన విజయదుర్గ అమ్మవారి మండపం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సరస్వతీ దేవి అవతారం ఎత్తిన అమ్మవారి దగ్గర విద్యార్థి విద్యార్థిని లచే పురోహితులు వెలవలపల్లి ప్రకాశం వారు సామూహిక సరస్వతీ దేవి పూజ జరిపించారు,తదనంతరం విద్యార్థుల చేత అక్షర పూజలు చేయించి,విద్యార్థులకు దాత బహుకరించిన పెన్నులు యిచ్చారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీ శ్రీ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం స్థానిక దేవాది గ్రామంలో 78 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పవిత్రక్షేత్రంలో ప్రతీ శరదృతువులో ఉత్సవ రంజితంగా విరాజిల్లే శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ ఏడాది మరింత వైభవంగా జరుగుతున్నాయి. ఆదిమహాశక్తికి ప్రతీ ఉదయం ప్రాతఃస్మరణ సేవలతో ప్రారంభమై, సంధ్యాకాలంలో దీపాంతరాల కాంతుల మధ్య శ్రీలలితా సహస్రనామ కుంకుమార్చనల ఘోష ఆలయం అంతటా మార్మోగుతోంది.మహాదేవికి ప్రతిరోజూ అవతారాల అలంకరణలతో అమ్మవారి మహిమను స్తుతిస్తూ, వినోదారాధన అనే భావంతో నిన్న దేవాది గ్రామంలోని యువతులు సాంప్రదాయపూర్వకంగా, ఆనందోత్సాహాలతో కొలాటం ఆడి దేవిని ప్రసన్నం చేసుకున్నారు. శరన్నవరాత్రులలో ఆరవ అవతారంగా శ్రీలలితా త్రిపురసుందరి దీపాలంకరణతో విరాజిల్లగా, నేడు మహాసరస్వతి అవతారాన్ని పురస్కరించుకొని పిల్లలందరికీ సరస్వతి పూజలు నిర్వహించబడినట్లు ఆలయ అర్చకులు శ్రీ నమశ్శివాయ గారు పేర్కొన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ అనగా రేపటి నాడు అమ్మవారికి ప్రత్యేకంగా కుమారి పూజ నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్త మహాశయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందగలరని ఆయన పిలుపునిచ్చారు.

E-పేపర్

బీజేపీ ఆధ్వర్యంలో కేసరపల్లిలో ఘనంగా రక్తదాన శిబిరం*

*బీజేపీ ఆధ్వర్యంలో కేసరపల్లిలో ఘనంగా రక్తదాన శిబిరం* ప్రాణదాతలుకావాలని మనోజ్ కుమార్ పిలుపు. కేసరపల్లి, సెప్టెంబర్ 29 ( పున్నమి ప్రతినిధి సురేష్ ) కృష్ణా జిల్లా, గన్నవరం మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ , బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ , కృష్ణ జిల్లా బీజేపీ అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ సహకారంతో గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో పంచాయితీ ఆఫీస్ నందు పిన్నమనేని హాస్పిటల్స్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ మాట్లాడుతూ రక్త దానం అంటే ప్రాణదానం, ప్రతి ఒక్కరు రక్త దానం చేసి ప్రాణ దాత కావాలని కోరారు, ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే మూల్పూరి బాలకృష్ణ , కేసరపల్లి గ్రామా సర్పంచ్ కుమారి చేబ్రోలు లక్ష్మి మౌనిక , కేసరపల్లి గ్రామా నాయకులు బసవరాజు , వీర బాబు , కేసరపల్లి గ్రామా ఉప సర్పంచ్ చిన్ని, పిఆర్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ కృష్ణ , బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషు కుమార్ , గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య , కేసరపల్లి గ్రామ అధ్యక్షులు పలగాని బాల కృష్ణ , నిడదవోలు బీజేవైఎం అధ్యక్షులు మోర్త సాయి కుమార్ ,పిన్నమనేని హాస్పిటల్స్ డాక్టర్ కళ్యాణ్ కృష్ణ , డాక్టర్ జాస్మిన్ , బీజేపీ కార్యకర్తలు , కేసరపల్లి గ్రామా ప్రజలు పాల్గొన్నారు.

తెలంగాణ

ముగ్గురు పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చా?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ ఎన్నికలు తర్వాత జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీ చేయవచ్చా? అనేది స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో సందిగ్ధం నెలకొంది. అయితే గతంలో ముగ్గురు పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పరిగణించారు. మరి ఈసారి దీనికి మినహాయింపు ఇస్తారా? లేదా అనేది స్పష్టం చేయాల్సి ఉంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.