Monday, 4 May 2026

Blog

యాదాద్రి భువనగిరి

శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలలో వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో దుర్గా మాత కి మహా హారతి

భువనగిరి పట్టణంలోని మీనా నగర్లో వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మ వారికి నేడు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. వీర శివాజీ యూత్ అధ్యక్షులు సూదగాని రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు తమ ఇంటి నుండి మంగళ హరతులు తీసుకువచ్చి అమ్మవారికి హారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వీర శివాజీ యూత్ సభ్యులు కరిపె సురేష్, తంగేళ్లపల్లి మోహన్, కుసుమ సాయితేజ, కరిపె నరేష్, మాదాసు రుత్విక్, జంగిటి వరుణ్, పరిమల్ రాజ్, సోను, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

దుర్గామాత శరన్నవరాఉత్సవాలలో భాగంగా అన్న ప్రసాద వితరణ

ఈరోజు భువనగిరి పట్టణ 10వ వార్డు హౌసింగ్ బోర్డ్ భక్త భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మాత శరన్నవరాత్రోత్సవాలు 6వ రోజు సందర్భంగా ఇలియాస్ మహమ్మద్ గారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ 10వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ గారు 26వ వార్డు కౌన్సిలర్ ఈరపాక నరసింహ 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కుల మతాలకు దుర్గ మాత శరన్నవరాఉత్సవాలు ఎంతో వైభవంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగింది భారతదేశంలో లౌకికతత్వానికి భిన్నత్వంలో ఏకత్వంలో సాంప్రదాయ పరిస్థితులను అనుసరించి భువనగిరిలో కూడా దుర్గామాత వద్ద కులాలకు మతాలకు అతీతంగా మైనార్టీ సోదరులు పూజలు నిర్వహించి అన్న ప్రసాద దాతగా నిలవడమే చారిత్రాత్మక విషయం అని ప్రజలందరూ కొనియాడడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు శీలం క్రాంతి రెడ్డి బింగి నరేష్ చిన్న సందీప్ రాజా మల్ల భరత్ వంశీ శ్రీకాంత్ శివ తిలక్ సాయి అఖిల్ బిట్టు మాటూరి బాలేశ్వర్ అమానత్ ఇమ్రాన్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొనడం జరిగింది

తిరుపతి

నడకతోనే గుండెకు ఆరోగ్యం

ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని MGM హాస్పిటల్ వారు ఆదివారం 3 k రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్,పీడి మాస్టర్ కిషోర్,యువత పాల్గొనగా యం.జి.యం డైరెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భావితరాలకు ఆరోగ్యం పట్ల అవగాహన కోసం ఈ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గుండె యొక్క ప్రాముఖ్యత దాని రక్షణ కొరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అవగాహన కల్పించడం కోసం ఈ 3 కె రన్ నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు.గుండె పదిలంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు రోజులు గంట అయిన నడవాల్సిన ఆవశ్యకత పై ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా తెలియ జేయడం జరిగింది

ఎన్ టి ఆర్ జిల్లా

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా దుర్గాపురం విజయ్‌ నర్సింగ్‌ కళాశాలలో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవింద్ ఉషాకటారియా, రోహిత్ సంగీత కటారియా సహకారంతో శతాధిక వృద్ధుల సత్కార కార్యక్రమం నిర్వహించారు.

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా దుర్గాపురం విజయ్‌ నర్సింగ్‌ కళాశాలలో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవింద్ ఉషాకటారియా, రోహిత్ సంగీత కటారియా సహకారంతో శతాధిక వృద్ధుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నా సతీమణి ట్రస్టీ బొండా సుజాత, తూర్పు నియోజకవర్గ MLA గద్దె రామ్మోహన్ రావు గారితో కలిసి హాజరై 14 మంది శతాధిక వృద్ధులను సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో 6 జూనియర్ & సీనియర్ – సి నేషనల్ యోగాసన ఛాంపియన్ షిప్ 2025 – 26 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయస్థాయి పోటీలను ప్రారంభించడం జరిగింది…

సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు జాతీయస్థాయిలో ఈ పోటీలు జరగనున్నాయి … యోగాసనాలు శారీరిక – మానసిక ఆరోగ్యానికి పునాది… విజయవాడలో జాతీయస్థాయి పోటీలు జరగడం గర్వకారణం… యోగాసన క్రీడలను కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చాయి… యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సారథ్యంలో యోగాసన భారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 1500 మంది పైగా క్రీడాకారులు హాజరవడం జరిగింది… ఈ కార్యక్రమంలో యోగాస‌న స్పోర్ట్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ గౌర‌వ అధ్యక్షుడు గొట్టిపాటి రామ‌కృష్ణ‌ గారు, యోగాస‌న స్పోర్ట్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రెసిడెంట్ ఎ.రాధిక గారు, యోగాస‌న స్పోర్ట్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సెక్ర‌ట‌రీ పి.ప్రేమ‌కుమార్ గారు, యోగాస‌న భార‌త్ కోశాధికారి ర‌చ్చిత్ కౌశిక్ గారు, కాంపీటీష‌న్ డైరెక్ట‌ర్ అభిజిత్ బోస్ జీ గారు, యోగాస‌న భార‌త్ జాయింట్ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ జ‌యంతి గారు, జాయింట్ సెక్ర‌ట‌రీ వికాస్ గోస్వామి గారు, భార‌త్ స్వాభిమాన్ ట్ర‌స్ట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డి.దుర్గారావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు…

పశ్చిమ గోదావరి

ఏపీ మెగా డీఎస్సీ లో 108 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషం

భీమవరం : మెగా డీఎస్సీలో భీమవరం నుంచి శిక్షణ పొంది 108 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం శ్రీవిజేత ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైన్ అండ్ ఆన్ లైన్ కోచింగ్ టెస్ట్ సిరీస్ ఉపయోగించుకుని 108 మందిప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు సాధించిన సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ వివిధ కేటగిరీల వారిగా 1,2,3,4,6,8వ ర్యాంక్ లతో విజయభేరీ మ్రోగించడం హర్షించదగ్గ విషయమని, ఇటువంటి అద్భుతమైన విజయాలతో బోధన అందించిన శ్రీవిజేత ఇనిస్టిట్యూట్ వారిని అభినందించారు. శ్రీవిజేత ఇనిస్టిట్యూట్ చైర్మన్ గుడిసె కనకయ్య, డైరెక్టర్ గుడిసె రాము మాట్లాడుతూ జిల్లా టాప్ ర్యాంకు లతో 108 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ శ్రీవిజేత ఇనిస్టిట్యూట్ అని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

అంతారంలో ఘనంగా అంతారంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28 విప్లవకారుడు దేశ స్వతంత్ర సంపూర్ణ స్వతంతానికి పూనుకున్నటువంటి నునుగు మీసాల వ్యక్తి 23 ఏళ్ల అతి చిన్న వయసులో దేశం కోసం ఉరికంబాలెక్కిన గొప్ప నాయకుడు విప్లవకారుడు ఇంకి లబ్, జిందాబాద్ అని నినాదాన్ని పట్టుకొని పోరాడినటువంటి ఆదర్శమూర్తి పలువురికి విద్యార్థులకు యువకులకు స్ఫూర్తినిచ్చేటువంటి నాయకులు భగత్ సింగ్ జయం సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాము.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

త్సవటపల్లి* నాగేంద్రరావు ని సన్మానించిన బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ

* మురమళ్ల: నిత్య కల్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ నూతన ధర్మకర్త మండలి సభ్యులగా *త్సవటపల్లి నాగేంద్ర రావు*,(నాగు) వారిని మర్యాదపూర్వకంగా కలిసి బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ అప్పన సత్యనారాయణమూర్తి వారిని సన్మానించడం జరిగింది

ఆంధ్రప్రదేశ్

రేపు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక – జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

రేపు (సోమవారం ) ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ లో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీ దారుల అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించి సమాచారం గూర్చి తెలుసుకోవాలంటే 1100 (డబల్ వన్ డబల్ జీరో)కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజ్యసభ సభ్యులు శ్రీపా కా సత్యనారాయణ ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు

న్యూస్ సెప్టెంబర్ 28 నానాజీ కాట్రేనికోనడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ కళాశాల ఆడిటోరియంలో ఈరోజు కవి కోకిల శ్రీ గుర్రం జాషువా జన్మదిన ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఈ సమావేశానికి హాజరైన రాజ్యసభ సభ్యులు శ్రీ పా కా సత్యనారాయణ ను ముమ్మిడివరం అసెంబ్లీ కార్యకర్తలు ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం ప్రధానమంత్రి మనకి భారత్ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు మట్ట సూరిబాబు ముమ్మిడివరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి చెక్క అజయ్ వర్మ రాయపురెడ్డి భైరవమూర్తి పెనమండ్ర విజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాది వీరబాబు గనిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.