Monday, 4 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

భగత్ సింగ్ మరియు గుర్రం జాషువా లకు ఘన నివాళి

నాగిరెడ్డిపల్లి పంచాయతీ నందలి బచ్చు భవన్ నందు దేశం గర్వించదగ్గ ఇరువురు మహనీయుల( *భగత్ సింగ్ మరియు గుర్రం జాషువా)* జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ జయ భాస్కరరావు గారి అధ్యక్షతన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్ మన్నెం రామమోహన్ మాట్లాడుతూ గుర్రం జాషువా గారు పల్నాడు ప్రాంతంలో జన్మించారని వారు తన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై జలుపిస్తూ సుప్రసిద్ధ నవలలు గబ్బిలం మరియు పిరదోసి లాంటి మంచి ప్రాముఖ్యత పొందిన నవలల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేశారని అటువంటి మహనీయుని జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగిందని తెలిపారు తదుపరి భారత స్వతంత్ర ఉద్యమ పోరాటంలో వేలాదిమంది యువకులు స్ఫూర్తిని నింపుతూ బ్రిటిష్ వారి పై పోరాటం సలిపి చరిత్ర పుటలకు ఎక్కిన సర్దార్ భగత్ సింగ్ గారు పంజాబ్లో జన్మించారు ఇప్పుడు ఆయన జన్మస్థలం దేశ విభజన కారణంగా పాకిస్థాన్లో ఉన్నదని, తన 13వ ఏటనే భారత స్వాతంత్ర ఉద్యమ పోకడలు అలవర్చుకొని యువకులందరినీ ఏకం చేసి ఉద్యమం చేస్తున్న సమయంలో లాలా లజపతిరాయ్ గారిని బ్రిటిష్ వారు కొట్టి చంపడంతో ఆవేశానికి లోనై బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపారన్న ఆరోపణ మీద మరియు ఢిల్లీ శాసనసభ మీద బాంబు వేశారన్న ఆ కారణాలతో నిండా పాతికేళ్లు కూడా నిండని ఆ నవ యువకుడిని ఉరితీసి చంపడం జరిగింది, అటువంటి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా కూడా మనందరం నివాళులర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుపుతూ క్లబ్ సభ్యులందరూ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బచ్చు జయ భాస్కరరావు, లయన్ మన్నెం రామమోహన్, కుర్రా మణి యాదవ్, ఉప్పు శెట్టి సుధీర్, మోడపోతుల రాము, మంటి మారయ్య,గండికోట కృష్ణ కుమార్, ఆంజనేయులు, తీగల కుంట వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

తిరుపతి

ప్రజల విజ్ఞప్తికి టిడిపి 4 వ వార్డు ఇంచార్జ్ స్పందన

శ్రీకాళహస్తి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు నందు పరిసరాలు శుభ్రంగా లేవన్న విషయాన్ని స్థానిక ప్రజలు వార్డు ఇంచార్జ్ అయినటువంటి ఉలస రామ్మూర్తి కి తెలియజేయడం జరిగింది.వార్డు నందు పరిశీలించిన రామ్మూర్తి వార్డు ప్రజల విన్నపం మేరకు కలుపు మొక్కలు రబ్బిష్ రాళ్లతో అపరిశుభ్రంగా ఉన్న పరిసర ప్రాంతాలను వెంటనే జెసిబి తో శుభ్రం చేయించడం జరిగింది.ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

తిరుపతి

భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

శ్రీకాళహస్తి లో భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు.ఆదివారం కావడంతో అధికారుల కళ్ళు కప్పి కొందరు వ్యక్తులు శ్రీకాళహస్తిలో ని రాజీవ్ నగర్ నందు భూ ఆక్రమణకు యత్నం చేశారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి తాహసీల్దార్ జనార్ధన్ రాజు అధికారులను అప్రయత్నం చేయగా,వారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణ శివారు ప్రాంతం సర్వే నెంబర్ 368 ఎల్ బ్లాక్ రాజీవ్ నగర్ లో భూ అక్రమాణలకు రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేయడంతో సమీప ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఫైనల్ నేడు… పాక్‌తో భారత్ మ్యాచ్

సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) ఆసియా కప్ ఫైనల్లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు తుదిపోరులో ఎదురుపడటం ఇదే మొదటిసారి. ఇప్పటికే లీగ్, సూపర్-4 రౌండ్లలో పాక్‌ను భారత్ ఓడించింది. ఇప్పుడు చిత్తుగా ఓడించి తొమ్మిదోసారి కప్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు టీమ్ ఇండియా చేతిలో వరస పరాజయాలకు బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. కాగా, రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది…

తిరుపతి

వంతెన నిర్మాణం వెంటనే చెప్పటాలని అసెంబ్లీలో అడిగిన నెలవల…*

తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో కాలంగి నది పై ఉన్న పాత వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు (MLA) డా. నెలవల విజయశ్రీ గారు ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరడమైనది. సమస్య యొక్క తీవ్రత పాత వంతెన పరిస్థితి: ప్రస్తుతం ఉన్న వంతెన బ్రిటీష్ కాలంలో, 1930లో ఇటుకలతో నిర్మించబడింది. ఇది ఇప్పుడు చాలా బలహీనంగా, సన్నగా మారింది, వంతెన వెడల్పు కేవలం 5.5 మీటర్లు మాత్రమే ఉండటం వలన ప్రస్తుతం కార్లు, టూ-వీలర్లకే అనుమతిస్తున్నారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సి వస్తోంది, దీనివల్ల సాధారణ ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈ రహదారి NH-16 జాతీయ రహదారికి కలుస్తుంది. అలాగే శ్రీ చెంగలమ్మ అమ్మవారి ఆలయం, శ్రీహరికోట స్పేస్ సెంటర్, నెలపట్టు పక్షుల అభయారణ్యం, పులికాట్ సరస్సు, శ్రీ సిటీ SEZ వంటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో భారీ ట్రాఫిక్, VVIP రాకపోకలు అధికంగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ సమస్యను నాలుగేళ్ల పాటు వాయిదా వేసి, ఎన్నికలకు కేవలం నాలుగు నెలలు మిగిలి ఉన్న సమయంలోనే 06.11.2023 (G.O.Rt.No.325) ద్వారా ఆమోదం ఇచ్చింది. కానీ ఆమోదం వచ్చిన తరువాత కూడా పనులు ఇంకా ప్రారంభం కాలేదు అని సభ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. ప్రజల ఇబ్బందులు మరియు ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, వంతెన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలంటూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని శాసనసభ ద్వారా కోరడమైనది.

తిరుపతి

దళితుల పొలంను ఆక్రమించుకున్న అగ్రవర్ణనికి చెందిన వారు

తిరుపతి జిల్లా తడ మండలం చేనిగుంట గ్రామంలో దళిత కుటుంబం కీ చెందిన కారిమెటి శ్రీరాములు చెందిన భూమిని (పొలం) అగ్ర కులం వారు ఆక్రమించుకుని, ప్రభుత్వం వారు వేసిన సరిహద్దు రాళ్లను తొలగించి వాళ్ళ పొలంలో కలిపేసుకున్నారు, ఇదేంటి వాళ్ళని అడిగితే *కులం పేరుతో దుషించి* , మీరు మా పక్కన భూమిని ఎలా సాగు చేస్తారు అని బెదిరుస్తున్నారు, ఈ పరిస్థితి గురించి తడ మండల రెవిన్యూ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు, మూడు నెలలుగా హద్దులు చూపమని చలానా కట్టిన కనీసం కూడా మాకు చూపించకూడా మేము వస్తాము అని రోజులు దాటావేస్తునారు, అగ్రవర్ణనికి చెందిన వాళ్ళకి బయపడి ఎవరు రావడం లేదు దయచేసి మాకు ఎవరైనా సహాయం చేయగలని వేడుకుంటున్నారు…

తిరుపతి

శ్రీకాళహస్తి లో విజిబుల్ పోలీసింగ్

శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీస్ సిఐ గోపి ఆధ్వర్యంలో పూసల వీధి,NTR నగర్ నందు స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బందిచే ఏరియా డామినేషన్ మరియు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.శాంతి భద్రతల పరిరక్షణ పై అలాగే నేరాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వచించామని సిఐ గోపి తెలిపారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ కి పట్టం కడుతారో…?

పున్నమి ప్రతినిధి ఖమ్మం ఖమ్మం జిల్లా పరిధిలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడుతారో అనే ప్రశ్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుల్లో ఉంది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కి జిల్లా లో ఉన్న 5నియోజక వర్గాల్లో పార్టీ యొక్క శాసన సభ్యులు ఉన్నారు. కాబట్టి జిల్లా లో తామే విజయం సాధిస్తామని అధికార కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీ కి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు వస్తున్నాయి అని వాటి వల్ల నే గ్రామ పంచాయతీ లు అభివృద్ధి చెందాయ్ అని కాబట్టి బీజేపీ కే పట్టం కడుతారు అని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. మేము అధికారం లో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ని ప్రజలు మాకే పట్టం కడుతారని బి ఆర్ ఎస్ నాయకులు చెప్పుకున్నారు.మేము ఏ పార్టీ కి మద్దత్తు ఇస్తే ఆ పార్టీ విజయం ఖాయం అని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దత్తు ఇచ్చాము కనుక నే కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి ని తెలుగు దేశం పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ లు అంటున్నారు. బీజేపీ జనసేన తెలుగు దేశం కూటమి ఏర్పాటు అవుతుంద, కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్ట్ కూటమి ఏర్పాటు అవుతుంద.. అనే అనుమానం కూడా లేక పోలేదు. ఏది ఎం అయినా ప్రజలు ఎవరికి పట్టం కడుతారు అనే సందేహం కి తెరపడాలి అంటే కొంచం సమయం వేచి చూడాల్సిందే.

తిరుపతి

ప్రకృతి సిద్ధమైన ఆహారమే ఆరోగ్యానికి పునాది:బీజేపీ నేత డా.చంద్రప్ప

శ్రీకాళహస్తి మండలం కాపు గున్నేరి గ్రామంలో తేజోరస సంస్థ ఆధ్వర్యంలో ఆహారోగ్యం పేరుతో గ్రామ ప్రజలకు శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన సహజ ఆహారాల అవసరం నేటి సమాజానికి ఎంతైనా ఉందని మాట్లాడారు. మన సమాజం సాంకేతికంగా ఎదుగుతున్నప్పటికీ,ఆరోగ్య పరంగా మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.చిన్న వయసులోనే ఆహారోగ్యం ఉత్పత్తులను ప్రారంభించి, ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్న కీర్తి ని వారు అభినందించారు.ఇలాంటి యువత సమాజానికి మార్గదర్శకులు కావాలి అని అన్నారు.అనంతరం చంద్రప్పను తేజోరస సంస్థ వారు సన్మానించారు.

ఖమ్మం

స్థానిక సంస్థ ల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా రిజర్వేషన్ వివరాలు…

పున్నమి ప్రతి నిధి తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థ ల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా లోని ఎంపీటీసి, జెడ్ పిటిసి  రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయ్. ఎంపీపీ లు రిజర్వేషన్లు ఇలా. 1) సత్తుపల్లి ST 2) కొణిజర్ల ST (W) 3) పెనుబల్లి ST 4) ముదిగొండ SC 5) తల్లాడ – SC (W) 6) చింతకాని – SC 7) తిరుమలాయపాలెం – SC (W) 8) బోనకల్ -BC 9) వైరా. – BC 10) ఖమ్మం రూరల్ – BC 11) నేలకొండపల్లి – BC 12) వేంసూరు – BC (W) 13) మధిర. – BC(W) 14) కూసుమంచి – BC (W) 15) కల్లూరు. – BC (W) 16) ఎర్రుపాలెం GEN(W) 17) రఘునాథపాలెం GEN 18) సింగరేణి. (GEN) 19) ఏన్కూరు ST (W) 20) కామేపల్లి ST(W) ZPTC రిజర్వేషన్లు ఇలా.. 1) సత్తుపల్లి ST(W) 2) కొణిజర్ల ST 3) పెనుబల్లి BC (W) 4) ముదిగొండ SC 5) తల్లాడ – SC (W) 6) చింతకాని – GEN 7) తిరుమలాయపాలెం – ST (W) 8) బోనకల్ -BC (W) 9) వైరా. – BC 10) ఖమ్మం రూరల్ – BC (W) 11) నేలకొండపల్లి – BC 12) వేంసూరు – BC 13) మధిర. – BC (W) 14) కూసుమంచి – ST 15) కల్లూరు. – SC (W) 16) ఎర్రుపాలెం SC 17) రఘునాథపాలెం BC 18) సింగరేణి. GEN (W) 19) ఏన్కూరు GEN 20) కామేపల్లి GEN(W)

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.