Monday, 4 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి.గన్నవరం నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం

సెప్టెంబర్ 27 (పున్నమి ప్రతినిధి) రేపు మధ్యాహ్నం 3:00 గంటలకు పి.గన్నవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులకు ప్రతిగా, పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి రూపొందించిన “డిజిటల్ రెడ్ బుక్” క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ ZPTCలు, MPPలు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీలు, గృహ సారధులు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. — గన్నవరపు శ్రీనివాసరావు, పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్.

తెలంగాణ

నల్లగొండ జిల్లా జెడ్పీటీసీ స్థానల్లో రిజర్వేషన్ వివరాలు

అడవిదేవుల పల్లి- జనరల్ (మహిళ) అనుముల- బీసీ (మహిళ) చందపేట- జనరల్ చండూరు- జనరల్ (మహిళ) చింతపల్లి- బీసీ (జనరల్) దామరచర్ల- జనరల్ దేవరకొండ- ఎస్టీ (జనరల్) గట్టుప్పల్- బీసీ (జనరల్) గుడిపల్లి- బీసీ (మహిళ) గుండ్లపల్లి- ఎస్టీ(మహిళ) గుర్రంపోడు- బీసీ (జనరల్) కనగల్- జనరల్ (మహిళ) కట్టంగూరు- ఎస్సీ (మహిళ) కేతేపల్లి- బీసీ (జనరల్) కొండమల్లేపల్లి- ఎస్టీ (జనరల్) మాడ్గులపల్లి- బీసీ (మహిళ) మర్రిగూడ- బీసీ (మహిళ) మిర్యాలగూడ- బీసీ (మహిళ) మునుగోడు- ఎస్సీ (జనరల్) నకిరేకల్- ఎస్సీ (ఉమెన్) నల్లగొండ- బీసీ (ఉమెన్) నాంపల్లి- బీసీ (ఉమెన్) నార్కెట్‌పల్లి- ఎస్సీ (జనరల్) నేరేడుగొమ్మ- జనరల్ (మహిళ) నిడుమనూరు- ఎస్సీ (జనరల్) పీఏపల్లి- ఎస్టీ (జనరల్) పెద్దవూర- ఎస్టీ (ఉమెన్) శాలిగౌరారం- బీసీ (జనరల్) తిప్పర్తి- ఎస్సీ (మహిళ) తిరుమలగిరి (సాగర్)- జనరల్ త్రిపురారం- బీసీ (జనరల్) వేములపల్లి- బీసీ (జనరల్)

తూర్పు గోదావరి

ఆరికిరేవులలో బాబు ష్యురిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తలారి..

పున్నమి న్యూస్ ప్రతినిది కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ము కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు,ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం యిచ్చిన మాట నిలబెట్టుకొని నవరత్నాలు అన్నీ అన్న మాట ప్రకారం చేశారు,ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల , గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చెయ్యరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద స్వస్తానారీ స్వస్థ పరివార్ అభియాన్ కార్యక్రమం

.. న్యూస్ 2 సెప్టెంబర్ 27 కాట్రేను కోన డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యరు గ్రామాలలో జరిగిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి వైద్య శిబిరాల నిర్వహణలో విశిష్ట సేవలు అందిస్తున్న ఎం ఎల్ హెచ్ పి లు ,ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, 104 సిబ్బంది, ఆశా వర్కర్లు వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మండల బిజెపి అధ్యక్షుడు మట్ట శివకుమార్, మండల బిజెపి ప్రధాన కార్యదర్శి కొత్తలంక సురేష్ కోటా సత్య ప్రసాద్ బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ జిల్లా నాయకులు సుంకర నాగేశ్వరరావు మట్ట సూరిబాబు కూటమ నాయకులు తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సేవ పక్షోత్సవాలు ,

న్యూస్ సెప్టెంబర్ 27 గ్రంధి నానాజీ నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆరోగ్య శిబిరం చినబొడ్డు వెంకటయపాలెం, చిన వలసల, గ్రామాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది డా,,శివ పవన్, డా,, భరత్ సేవ పక్షోత్సవాల మండల కన్వీనర్ మీ అజయ్ వర్మ,, పర్యవేక్షణలో జరిగింది కూటమి నాయకులు వాడ్రెవు వీరబాబు, దత్తాత్రేయ వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు కన్వీనర్ అజయ్ వర్మ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా పక్షోత్సవాలు గౌ,, నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది . ఆ కార్యక్రమంలో భాగంగా స్వస్త్ నారి సశక్తి పరివార్ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి బీపీ షుగర్ పరిక్షలు నిర్వహించడం మహిళల కోసం ప్రత్యేకించి వివిధ రకాల క్యాన్సర్లను మొదటి స్టేజ్ లోనే గుర్తించి అవగాహన కల్పించడం వారికి ఉచితంగా మందులు అందించడం స్టేజ్ దాటిన వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలియజేయడం జరుగుతుందని ఈ శిబిరాలు మండల వారిగా ప్రతి సచివాలయంలో నిర్వహించడం జరుగుతుంది రామన్నపాలెం,ఉప్పొంగల, జార్జిపేట, జి వేమవరం, మండలంలో అనేక ప్రాంతాల్లో నిర్వహించాల్సి ఉంది ప్రజలు చైతన్యవంతమై సద్వినియోగం చేసుకోవాలని కోరారు కో కన్వీనర్ విజయ్ కుమార్, పవన్ కుమార్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు…

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మంత్రి నారా లోకేష్ దృష్టికి సమస్యలు

27/09/2025 గ్రంధి నానాజీ అసెంబ్లీ ప్రాంగణంలో యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ని కలిసి రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించవలసిందిగా కోరిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లు, పేరాబత్తుల రాజశేఖరం , శ్రీ కంచర్ల శ్రీకాంత్ ,శ్రీ వేపాడ చిరంజీవి రావు , శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ , మరియు శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి . గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు యువనేత విద్యాశాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ వారిని కలిసి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం పట్ల పార్టీ నాయకులు గ్రామస్థులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ధర్మకర్త మండలి సభ్యులుగా *త్సవటపల్లి*

న్యూస్ సెప్టెంబర్ 27 గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం మురమళ్ల: నిత్య కల్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ నూతన ధర్మకర్త మండలి సభ్యులగా *త్సవటపల్లి నాగేంద్ర రావు*,(నాగు) నియామకం త్సవటపల్లి నియామకం పట్ల ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వారి కి కృతజ్ఞతలు తెలిపారు దాట్ల పృద్వి దాట్ల పవన్ తనకి అన్నివిధాల సహాయ సహకారాలందించిన పార్టీ నాయకులకు కూటమి నాయకులకు అభిమానులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తనకర్తవ్యం ను నీతి నిజాయితీగా నిబద్దతతో కృషి సల్పుతానన్నారు

హైదరాబాద్

దశ.. దిశ మారనున్న మెట్రో

-ఎల్‌అండ్‌టీ కథ ముగింపు – ప్రభుత్వమే ముందడుగు * పున్నమి స్టాఫ్ రిపోర్టర్ : యామల రామమూర్తి* హైదరాబాద్‌ మహానగరంలో ఎల్‌అండ్‌టీ మెట్రో అధ్యాయం ముగిసింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దేశంలోనే తొలిసారి పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (PPP) విధానంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగనుంది. 2010లో ప్రారంభమైన ప్రయాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలంలో 2010లో ఎల్‌అండ్‌టీతో మెట్రో నిర్మాణ ఒప్పందం కుదిరింది. అంతకు ముందు సత్యం అనుబంధ సంస్థ మేటాస్ ఇన్‌ఫ్రాకి ప్రాజెక్టు అప్పగించగా, సత్యం సంక్షోభం కారణంగా అది ఆగిపోయింది. దీంతో ఎల్‌అండ్‌టీ ముందుకొచ్చి, ఇది దేశంలోనే కాక ప్రపంచంలోనే అతిపెద్ద PPP ప్రాజెక్టుగా రికార్డుల్లో నిలిచింది. 2017లో ప్రజలకు అందుబాటులోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2017 నవంబర్‌ 29న మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. దశలవారీగా మూడు కారిడార్లలో 69 కి.మీ. మేరకు రైళ్లు నడపబడ్డాయి. ఉప్పల్‌, మియాపూర్‌లో డిపోలు నిర్మించబడ్డాయి. కరోనా దెబ్బ 2020లో కరోనా మహమ్మారి కారణంగా 169 రోజుల పాటు మెట్రో నిలిచిపోవడం ఎల్‌అండ్‌టీకి పెద్ద ఎదురుదెబ్బ అయింది. అప్పట్లో తీసుకున్న రుణాలు, వడ్డీ భారం, ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. అప్పుల ఊబిలో నుండి బయటపడలేక సంస్థ ప్రభుత్వ సహకారం కోరినా, ఆశించిన సాయం రాకపోవడంతో చివరికి ప్రాజెక్టు నుండి తప్పుకోవాలని అంగీకరించింది. రెండో దశకు మార్గం సుగమం ఎల్‌అండ్‌టీ తప్పుకోవడంతో రెండో దశ మెట్రో విస్తరణకు అడ్డంకులు తొలగిపోయాయి. అయితే మొదటి విడతలో నిర్మించిన 69.2 కి.మీ. కారిడార్లను ప్రభుత్వమే నిర్వహించనుందా? లేక ఎల్‌అండ్‌టీకి ఈక్విటీ వాటా కొనసాగుతుందా? అన్న సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైటెక్‌సిటీ, రాయదుర్గం, ఎర్రమంజిల్‌, పంజాగుట్ట, మూసారాంబాగ్‌లో నిర్మించిన మాల్స్‌ నిర్వహణపై నిర్ణయం కీలకం కానుంది. కొత్త దిశలో మెట్రో ఇకపై ప్రభుత్వమే మెట్రో బాధ్యతలు చేపట్టనుండటంతో రెండో దశ డీపీఆర్‌ అనుమతులకు కూడా మార్గం సుగమమైంది. ప్రయాణికులకు ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. హైదరాబాద్‌ మెట్రో కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఎల్‌అండ్‌టీ ప్రయాణం ముగిసినా – మెట్రోకు కొత్త దిశ మొదలైంది.

నిర్మల్

నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు,తానూర్ మాజీ జెడ్పిటిసి, అన్న భావు సాటే క్రాంతి సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉత్తం బాలేరావు కీర్తి చక్ర” జాతీయస్థాయి పురస్కారం ప్రదానం చేశారు.

నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు,తానూర్ మాజీ జెడ్పిటిసి, అన్న భావు సాటే క్రాంతి సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉత్తం బాలేరావు గారి సామాజిక సేవలను మరియు ఆధ్యాత్మిక సేవలను గుర్తించి ఆర్యాణి సకల కళా వేదిక వారు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ” కీర్తి చక్ర” జాతీయస్థాయి పురస్కారం ప్రదానం చేశారు. శ్రీ ఉత్తమ్ బాలేరావ్ గారికి కీర్తి చక్ర జాతీయ అవార్డు అందుకున్న శుభ సందర్భంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ గడ్డిగార్ విఠ్ఠల్ రెడ్డి గారు,భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సిందే ఆనందరావు పటేల్ గారు, వైస్ చైర్మన్ శ్రీ ఫారుఖ్ గారు,మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సాగరబాయి రాజన్న గారు,శ్రీ భూమన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్, కుబీర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ రాథోడ్ అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ శ్రీ గణేశ్ పాటిల్, భైంసా మండల్ కోఆప్షన్ మెంబర్ శ్రీ సింధే గజానన్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భైంసా శ్రీ చిలింకర్ గంగాధర్ గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ శంకర్ గారు,భోసి వీడీసీ ఉపాధ్యక్షులు శ్రీ మాముల్ వార్ గంగాధర్, భోసి గణేష్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ కర్జల పెద్ద నరసయ్య గారు, శ్రీ టక్కన్ హన్మాండ్లు గారు, నాగేష్ గారు, వి డి సి సభ్యులు శ్రీ సల్ల రాజన్న గారు, శ్రీ లోస్రం ముత్యం గారు గారు, శ్రీ నర్సింలు కాంబ్లే జయ ప్రకాష్ గారు, శ్రీ ఎమ్మాయి నాగప్ప గారు, శ్రీ గాడే లచ్చారాం గారు,శ్రీ బ్యాగల్ రఘునాథ్ గారు, శ్రీ నీలపు నర్సయ్య గారు, శ్రీ సబ్బన్ రఘునాథ్ గారు, శ్రీ బుట్టి శ్రీనివాస్ గారు, శ్రీ దివిసి నర్సింలు గారు,శ్రీ ధర్భస్త్ వార్ పెంటు గారు మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ విట్టల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉత్తం బాలే రావు గారు ఒక ఉత్తమమైనటువంటి సమాజ సేవకుడు,మంచి ఆధ్యాత్మికవేత్త, నిఖార్సైన నాయకుడు, నిస్వార్ధంగా ప్రజల సేవ కోసం నిరంతరం పాటుపడే కార్యశీలి అటువంటి ఉత్తంభాలే రావు గారికి కీర్తి చక్ర జాతీయ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది అలాంటి అవార్డులు మరెన్నో రావాలని కోరుతున్నామని అన్నారు. బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సిందే ఆనందరావు పటేల్ గారు మాట్లాడుతూ ఉత్తం బాలే రావు నిజంగా ఉత్తమమైన మనీషి అని ఈ సందర్భంగా వారిని అభినందించారు. శ్రీ బాసెట్టి రాజన్న గారు మాట్లాడుతూ మిత్రుడు ఉత్తంభాలే రావు గారికి కీర్తి చక్ర జాతీయ అవార్డు రావడం బోసి గ్రామానికి కాదు మా తానూరు మండలానికి గర్వకారణమని అన్నారు

విశాఖపట్నం

విశాఖలో పెట్టుబడికి స్వర్గధామం*

-తిరుగులేని రిటర్న్స్ ఇచ్చే హాట్‌స్పాట్‌లు ఇవే! పున్నమి స్టాప్ రిపోర్టర్ : యామల రామమూర్తి, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదే మెట్రో సిటీగా రూపాంతరం చెందనున్న విశాఖపట్నం, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు సరికొత్త అవకాశాలను అందిస్తోంది. నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ విపరీతమైన వృద్ధిని కనబరుస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ప్రాజెక్టులు, మరియు పలు బడా సాఫ్ట్‌వేర్ కంపెనీల పెట్టుబడులు ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. విశాఖపట్నంలో తిరుగులేని రాబడిని అందించే కొన్ని కీలక ప్రాంతాలు కింద వివరంగా ఇవ్వబడ్డాయి. *ఐటీ, విద్యా కేంద్రాలు:* మధురవాడ, యెండాడ, రుషికొండ **మధురవాడ** విశాఖపట్నంలో ఐటీ హబ్‌లు, విద్యా సంస్థలు, మరియు రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు కేంద్రంగా మారింది. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలు, హై-రైజ్ అపార్ట్‌మెంట్లు, మరియు విల్లాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. రహదారుల విస్తరణ, కొత్త ఐటీ పార్కులు, మరియు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం ఈ ప్రాంత ఆకర్షణను మరింత పెంచుతున్నాయి. **యెండాడ** కూడా ఐటీ హబ్‌లు మరియు విద్యా సంస్థలకు చేరువలో ఉండటంతో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు అధిక డిమాండ్‌ను చూపిస్తోంది. **రుషికొండ** ఐటీ పార్కులు, బీచ్‌ఫ్రంట్ లొకేషన్, మరియు విలాసవంతమైన గృహనిర్మాణ ఎంపికల కారణంగా హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా పరిణమిస్తోంది. ఈ ప్రాంతం పెట్టుబడిదారులకు, ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐలకు, అత్యంత ఆకర్షణీయంగా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలు: దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస ఒకప్పుడు విశాఖపట్నానికి శివారు ప్రాంతంగా ఉన్న **దువ్వాడ** ఇప్పుడు నగరం పరిధిలోకి వచ్చి రియల్ ఎస్టేట్ హబ్‌గా మారుతోంది. ఇక్కడ 2 BHK అపార్ట్‌మెంట్లు మరియు విల్లాలకు డిమాండ్ పెరుగుతోంది. **పెందుర్తి** విశాఖపట్నం శివారులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ సరసమైన ధరల్లో ఓపెన్ ప్లాట్లు మరియు గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ పెరుగుతోంది. విశాఖపట్నం విస్తరణ జోన్‌లో భాగంగా ఉన్న **కొత్తవలస** ఎంఎస్‌ఎంఈ (MSME) పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. ఇక్కడ కూడా సరసమైన ధరల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు మంచి డిమాండ్ ఉంది. పారిశ్రామిక ఉద్యోగులకు అనుకూల ప్రాంతాలు: కుర్మన్నపాలెం, కొమ్మాడి పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో ఉండటం వల్ల, **కుర్మన్నపాలెం**లో తక్కువ బడ్జెట్ ఫ్లాట్లు మరియు ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ప్రాంతం పారిశ్రామిక ఉద్యోగులకు అత్యంత అనుకూలంగా ఉంది. ఐటీ పరిశ్రమల అభివృద్ధి మరియు మధురవాడకు సామీప్యత కూడా ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. సరసమైన రెసిడెన్షియల్ ఆప్షన్లు మరియు విశాఖపట్నంతో మెరుగైన కనెక్టివిటీ వల్ల **కొమ్మాడి**లో పెట్టుబడి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా, మధురవాడ, భీమిలి, యెండాడ, రుషికొండ, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, కుర్మన్నపాలెం, పరదేశిపాలెం, కొమ్మాడి వంటి ప్రాంతాలు విశాఖపట్నంలో పెరుగుతున్న డిమాండ్‌తో కూడిన శివారు ప్రాంతాలుగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతాలు పెట్టుబడిదారులకు అధిక రాబడిని అందిస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.