Monday, 4 May 2026

Blog

తిరుపతి

లోపించిన ఆహార భద్రత -పట్టించుకోని అధికారులు

ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి పట్టణంలో పేరుకే పేరు మోసిన హోటల్లు నాసిరికంగా ఆహార పదార్థాలు.వరుసగా జరుగుతున్న సంఘటనలతో పుర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.మొన్న శ్రీకాళహస్తి పట్టణం లోని మసీదు వీధిలో ఉన్న ఓ హోటల్లో అన్నంలో బొద్దింక కనిపించగా,నిన్న నగరి వీధిలోని ఓ బేకరీ మిక్చర్ లో బీడీ ముక్క.నేడు సన్నిధి వీధిలోని ఓ హోటల్లో చోలా పూరీలో పాత్రలు కడిగే స్టీల్ స్క్రబ్ ఇలా వరుస సంఘటనలు జరుగుతున్న శ్రీకాళహస్తి వైపు మాత్రం కన్నెత్తి చూడని ఫుడ్ సేఫ్టీ అధికారులు.అధికారులు పట్టించుకోని ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.అలాగే ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలోనే ఆహార భద్రతాధికారి కార్యాలయం అందుబాటులో ఉండేలా చేయాలంటున్న పుర ప్రజలు.

హైదరాబాద్

MGBS బస్ స్టేషన్ తాత్కాలిక ముసివేత

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ హైదరాబాద్ లోని ప్రధాన బస్ స్టేషన్ అయినా మహాత్మ గాంధీ బస్ స్టేషన్ ని అధికారులు తాత్కాలికముగా ముసివేశారు. భారీ వర్షాలు కారణం గా మూసి నది కి వరద ప్రభావం ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పటికే బస్ స్టేషన్ లోకి నీరు చేరడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ టి సి అధికారులు తెలిపారు. కర్నూల్ వెళ్లే బస్ లో ఆరంగర్ నుండి, ఖమ్మం వెళ్లే బస్ లు దిల్ షుక్ నగర్ నుండి నడిస్తాయి అని తెలిపారు.

హైదరాబాద్

తెలంగాణ కి కొత్త పోలీస్ బాస్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గా శివధర్ రెడ్డి ని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శివధర్ రెడ్డి తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రం అందజేసి అభినందనలు తెలియ జేశారు.

తెలంగాణ

గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నద్ధత సమావేశాన్ని నిర్వహించిన : స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణపై నియమించబడిన అధికారులు వారి విధులలో ఎలాంటి తప్పులు దొర్లకుండా నిర్వర్తించాలని స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ కోరారు.శుక్రవారం తన చాంబర్లో గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో ఆయన గ్రామపంచాయతీ ఎన్నికల సన్నద్ధత సమావేశాన్ని నిర్వహించారు. గ్రామపంచాయతీ నోడల్ అధికారులుగా ఈ క్రింది అధికారులను నియమించారు. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, బ్యాలెట్ బాక్స్ ల నిర్వహణ నోడల్ అధికారిగా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి సుజాత, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ మోడల్ అధికారిగా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి లావణ్య, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల నిర్వహణ నోడల్ అధికారిగా నల్గొండ ఆర్డిఓ సిపిఓ వై. అశోక్ రెడ్డి, ఎన్నికల వ్యయ నిర్వహణ నోడల్ అధికారిగా డిసిఓ పత్యా నాయక్, ఎన్నికల పరిశీలకుల నోడల్ అధికారిగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి.రమేష్, బ్యాలెట్ పత్రాల నోడల్ అధికారిగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారిగా డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, హెల్ప్ లైన్ కంప్లైంట్స్ నోడల్ అధికారిగా జిల్లా జడ్పీ సీఈవో శ్రీనివాసరావు, నివేదికల నోడల్ అధికారిగా డిపిఓ కార్యాలయ ఏవో ఎస్ కృష్ణను జిల్లా కలెక్టర్ నియమించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

‼️పోలీస్ వారి హెచ్చరిక‼️ అంబేద్కర్ కోనసీమ లో

అంబేద్కర్ కోనసీమ సెప్టెంబర్ 27 (పున్నమి ప్రతినిధి) డా’ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ చురుకుగా దోపిడీలు, దాడులకు పాల్పడుతోంది. గ్రామ శివారు ప్రాంతాల్లో తిరుగుతోందని పోలీసులు వెల్లడించారు. రాత్రి సమయంలో తలుపు తడితే తీయవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇళ్లు ఖాళీగా వదిలి వెళ్లే ముందు పోలీసులకు తెలపాలని, తద్వారా నైట్ బీట్ ద్వారా చెకింగ్‌ చేపడతామని తెలిపారు. లాడ్జ్‌ యజమానులు కూడా అనుమానాస్పద వ్యక్తుల వివరాలను పోలీసులకు తెలియజేయాలన్నారు. రామచంద్రాపురం, అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం ప్రాంతాల్లో దొంగతనాల ప్రమాదం ఉందని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టీవీ నరేష్ కుమార్ హెచ్చరించారు.

క్రైమ్

జైలు నుంచే చదువు.. ఖైదీకి గోల్డ్ మెడల్

సెప్టెంబర్ 27 (పున్నమి ప్రతినిధి) తిరుపతికి చెందిన యుగంధర్, ‘స్టూడెంట్ నం.1’ మూవీ హీరోలా, జైలులో ఉన్నప్పటికీ విద్యను ఆశ్రయించాడు. 2011లో హత్య కేసులో అతనికి జీవితఖైదు పడింది. కడప జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతను దూరవిద్య ద్వారా నాలుగు B.Aలు, మూడు M.Aలు పూర్తి చేశాడు. ఇటీవల పాలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీలో B.A పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. శిక్ష సమయంలో అతని ప్రవర్తన శుభ్రంగా ఉండటంతో అతని తల్లి చెంగమ్మ, కుమారుడిని విడుదల చేయాలని కోరుతున్నారు. విద్య ద్వారా మార్పు సాధించిన యుగంధర్ కథ, పునరవాసానికి మంచి ఉదాహరణగా నిలుస్తోంది.

ఎన్ టి ఆర్ జిల్లా

ప్రివిలేజ్ కమిటీ తొలి సమావేశం – అధ్యక్షత వహించిన చైర్మన్ బీటీ.నాయుడు

ఈరోజు అసెంబ్లీ నందు ప్రివిలేజ్ కమిటీ తొలి సమావేశం జరిగింది..కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ బీటీ.నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కమిటీకి చెందిన సభ్యులు జయేంద్ర భరత్ గారు,పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు,తలసీల రఘురాం గారు,రాజగోల్ల రమేష్ యాదవ్ గారు మరియు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యుల హక్కులు అధికారాలు,అలాగే వచ్చిన ఫిర్యాదులపై విస్తృతంగా చర్చ జరిగింది.సభ్యుల ప్రతిష్టను కాపాడే దిశగా కమిటీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం..

అమరావతి

𝐕𝐈𝐉𝐀𝐘𝐀𝐖𝐀𝐃𝐀 𝐔𝐓𝐒𝐀𝐕 – 𝟐𝟎𝟐𝟓 𝐎𝐍𝐄 𝐂𝐈𝐓𝐘…. 𝐎𝐍𝐄 𝐂𝐄𝐋𝐄𝐁𝐑𝐀𝐓𝐈𝐎𝐍

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ” సారధ్యంలో “విజయవాడ ఉత్సవ్” అక్టోబర్ 2వ తేదీన వ‌ర‌ల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివ‌ల్ వాక్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథులుగా విచ్చేయవలసిందిగా కమిటీ సభ్యులు ముత్తవరపు మురళీకృష్ణ గారు, సుంకర అనిల్ గార్లతో కలిసి ఆహ్వానించడం జరిగింది . విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని తెలియజేసే దసరా ఉత్సవ్ వరల్డ్ బిగ్గెస్ట్ కార్నివల్ వాక్ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతామని తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు…

తెలంగాణ

నల్గొండ జిల్లా జాతీయ అవార్డును కైవసం చేసుకోవడం గర్వకారణం అన్న : మంత్రి

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) జల సంచయ్ మరియు జన్ భాగీదారి (జె ఎస్ జె బి) జాతీయ అవార్డుల్లో దక్షిణ భారత జోన్ లో టాప్ త్రీ స్థానాలు తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకోవడం గర్వకారణం. ప్రత్యేకంగా మన నల్గొండ జిల్లా బెస్ట్ డిస్ట్రిక్ట్ కావడం విశేషం అని, ఈ విజయాన్ని అందించిన నా నల్గొండ ప్రజలకు, అధికారులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నీటి సంరక్షణ మరియు సమాజ భాగ స్వామ్యంలో మీ ప్రయత్నాలు నిజంగా స్ఫూర్తిదాయకం అని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాతోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ముస్లిం సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన గద్దె

శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశాలలో ముస్లిం సోదరుల సమస్యలను ప్రస్తావించి, వారికి అవసరమైన స్థలాలను కేటాయించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ కోరడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు sk షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ ఆటోనగర్ కాలనీ మసీదు కు స్థలం కేటాయింపు గురించి ఈద్గా స్థలం గురించి అసెంబ్లీ లో మాట్లాడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నము మీ తమ్ముడు Sk షరీఫ్ 5వ డివిజన్ టిడిపి నాయకులు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.