Monday, 4 May 2026

Blog

అన్నమయ్య

రాజుకుంట యువనాయకుల చేరికతో చిట్వేలు మండలంలో జనసేన బలం

చిట్వేల్, సెప్టెంబర్ 26 (మీ స్పందన) చిట్వేలు మండలం రాజుకుంటకు చెందిన ముగ్గురు ప్రముఖ యువ నాయకులు శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం విజయవాడలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ కొనిదల నాగబాబు, రాజకీయ కార్యదర్శి, పార్టీ విప్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలో జరిగింది.రైల్వే కోడూరు సీనియర్ నాయకులు తాతం శెట్టి నాగేంద్ర, జోగినేని మణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజుకుంటకు చెందిన యువనాయకులు ఆనాల సునీల్ కుమార్, మాజీ సర్పంచ్ మాదినేని కనకరాజు, మాదినేని లోకేష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలో చేరారు.ఈ పరిణామంతో మండలంలో జనసేనకు కొత్త ఊపుని తెచ్చిందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నాలుగేళ్లకే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నాలుగేళ్ల ట్రిషా తోసర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2023లో విడుదలైన మరాఠీ చిత్రం నాల్ 2లో ‘చిమి’ పాత్రలో అద్వితీయంగా నటించి ఆమె జాతీయ ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకుంది. తన చిన్న వయస్సులోనే గొప్ప నటనా ప్రతిభను ప్రదర్శించిన ట్రిషా, ప్రేక్షకులను ఆకట్టుకుంది. వేడుకలో ఆమెకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. ఆమె నటన చిత్రానికి జీవం పోసిందని విమర్శకులు కొనియాడుతున్నారు. ఈ అరుదైన ఘనతతో ట్రిషా తోసర్ భారతీయ చలన చిత్రరంగంలో బాల నటులకి ఆదర్శంగా నిలిచింది. వేడుకలో ట్రిషా హాజరై అందరినీ మెప్పించింది.

ఎన్ టి ఆర్ జిల్లా

*గత జగన్ ప్రభుత్వం యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసిందుకే జీవోలు తెచ్చింది.*

*గత జగన్ ప్రభుత్వం యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసిందుకే జీవోలు తెచ్చింది.* ఎన్టీఆర్ జిల్లా (పున్నమి ప్రతినిధి) సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (ఎం.ఎస్.ఎం.ఈ) పాలసీలోని లోపాలను సవరించాలని, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాలను చెప్పు చేతల్లో పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసేందుకు కొన్ని జీవోలను చేసిందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఏపీ ఎం.ఎస్.ఎం.ఈ ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీపై ఉపాధి అవకాశాలు, పరిశ్రమల గురించిన లఘు చర్చలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శుక్రవారం మాట్లాడారు. వన్ ఎంటర్ ప్రెన్యూర్ వన్ పాలసీలోని పలు లోపాలను ఆయన ప్రస్తావించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘వన్ ఎంటర్ ప్రెన్యూర్ వన్ పాలసీ, జీవో నెంబరు 69లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఎం.ఎస్.ఎం.ఈలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే టెండర్లలో లోకల్ ప్రొక్యూర్ మెంట్ కింద 25 శాతం పర్చేజ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ దీనివల్ల వారికి ఉపయోగం ఏమి లేదు. ఎందుకంటే పెద్ద సంస్థలు టెండర్లలో పాల్గొన్నప్పుడు ఎం.ఎస్.ఎం.ఈలు పోటీ పడగలిగే పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 25 శాతం ప్రోక్యూర్ మెంట్ స్థానిక ఎం.ఎస్.ఎం.ఈలకు ఇవ్వాలి. అలాగే ఎల్ 1 ఎవరైతే ఉన్నారో వారికంటే ప్రైస్ లో 15 శాతం లోకల్ గా ఉన్న ఎం.ఎస్.ఎం.ఈలకు తగ్గించి ఇవ్వాలి. ఎం.ఎస్.ఎం.ఈలకు స్థానికంగా ఉన్న వారికి ప్రైస్ కూడా ప్రాధాన్యత ఇచ్చి, రిబేటు ఇవ్వాలి. దీనివల్ల స్థానికంగా పరిశ్రమలు పెరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గత ప్రభుత్వ జీవోలో సవరణ అవశ్యం. స్థానికులకు పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు ఇవ్వాలని, 25 శాతం బయట రాష్ర్టాల వారిని తీసుకోవాలని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో ఇచ్చింది. స్థానికంగా కార్మికుల లభ్యత ఉంటే బయట నుంచి ఉద్యోగులను తెచ్చుకోవాలని ఏ యాజమాన్యం కోరుకోదు. కేవలం పరిశ్రమల యాజమాన్యాలను చెప్పు చేతుల్లో పెట్టుకొని, బ్లాక్ మెయిల్ చేసేందుకు అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా ఈ జీవో ఇచ్చింది. ఈ నిబంధన కింద గత ప్రభుత్వం హయంలో కూడా ఎక్కడ ఒక కేసు కూడా నమోదు కాలేదు. దీనివల్ల అధికారులు పరిశ్రమలపై బ్లాక్ మెయిల్ చేసేందుకు అవకాశం ఉంది. దయచేసి ఈ నిబంధన తొలగించాలి. నూతన ఇండస్ట్రియల్ పాలసీలో గైడ్లైన్స్ లో స్పష్టత లేని కారణంగా జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన సమావేశాలు నిలిచిపోయాయి. ఎస్.ఎల్.సిలు కూడా సమావేశాలు జరగడం లేదు. వీటన్నింటినీ సరిదిద్దుకోవాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఇదే కర్తవ్య దీక్షతో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ లక్ష్యాలు సాధించాలంటే స్థానికంగా ఉన్నటువంటి ఎం.ఎస్.ఎం.ఈలను ప్రోత్సహించాలి. వీరికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 25 శాతం ప్రాధాన్యత ఇచ్చి, రేటులో కూడా ఎల్ 1 కంటే 15 శాతం తగ్గించి ఇవ్వాలి. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలి.’ అని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.

జోగులాంబ గద్వాల

శ్రీ జోగులాంబ అమ్మవారిని సినీ నటుడు బండ్ల గణేష్ దర్శించుకున్నారు.

అలంపూర్ : సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, సినీ నటుడు బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ దేవికి కుంకుమార్చన నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

జోగులాంబ గద్వాల

సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.

అలంపూర్ : సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదవ రోజు స్కందమాత దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు, తిరుపతి రెడ్డి, కుటుంబ సమేతంగా జోగులాంబ వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని అభిషేకించి అనంతరం హోమంలో పాల్గొన్నారు. తరువాత జోగులాంబ దేవికి కుంకుమార్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి ఆలయ అధికారి ప్రసాదాలు అందజేశారు.

తెలంగాణ

శాలిగౌరారం మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి ని ఘనంగా జరిపిన: మండల రజక నాయకులు

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) శాలిగౌరారం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని మండల రజక సంఘం అధ్యక్షులు బాసాని వెంకన్న, ప్రధాన కార్యదర్శి తాందారి నాగయ్య, ఉపాధ్యక్షులు తందారి సోమయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాందారు సత్తయ్య, మాజీ అధ్యక్షులు శ్రీరాములు,చిత్తలూరు అడ్లూరు, రామంజపురానికి చెందిన రజక సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని వీరనారికి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి మండల తహసీల్దార్ కార్యాలయంలో గౌరవ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

E-పేపర్

_బాలయ్యవి అహంకారపూరిత వ్యాఖ్యలు_*

పున్నమి ప్రతినిధి కొండపల్లి, సెప్టెంబర్ 26: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణవి అహంకారపూరిత వ్యాఖ్యలు అని కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాసు మండిపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సైకో అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ ఇంటిలో జరిగిన సంఘటనలో అతనికి చేసిన సాయం మరచిపోయి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఎన్టీఆర్ కుమారుడు కాకపోయి ఉంటే బాలకృష్ణకు గుర్తింపు ఉండేది కాదన్నారు. స్త్రీ జాతిని కించపరిచే విధంగా, అవమానకరంగా మాట్లాడిన బాలకృష్ణ హిందూపురానికి ఎమ్మెల్యే కావడం దురదృష్టకరమన్నారు. అఖండ సినిమా టికెట్ల పెంపు విషయంలో జగన్ ద్వారా పొందిన మేలు మర్చిపోయావా? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్

తమ పే స్కేల్ డిమాండ్ కు సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 తెలంగాణ సానుకూలంగా స్పందించి ఫైల్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు (MGNREGA-FTES) సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా దినోత్సవ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క తో శుక్రవారం బేటి అయ్యారు. గత 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో FTE లుగా పనిచేస్తున్న తమకు పే స్కేల్ వర్తింపచేయాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. కేవలం రూ. 30 కోట్లు ప్రతి సంవత్సరం అదనంగా వెచ్చిస్తే తమకు పే స్కేల్ అమలు చేయవచ్చని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క పే స్కేల్ కు సంబంధించిన ఫైల్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పే స్కేల్ పై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న చిరు ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. అయితే పలు సాంకేతిక సమస్యలను కారణంగా చూపుతూ పే అండ్ అకౌంట్స్ సెక్షన్ తమ జీతాల చెల్లింపుల్లో జాప్యం చేస్తుందని FTES లు మంత్రికి మోర పెట్టుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క పే అండ్ అకౌంట్స్ సెక్షన్ అధికారులతో మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలతో చిరు ఉద్యోగుల జీతాలు ఆపొద్దని, మానవత దృక్పథంతో వ్యవహరించి జీతాలు చెల్లించాలని ఆదేశించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయు జయంతి

దీన్ దయాళ్ ఉపాధ్యాయ109 జయంతి ఏకాత్మా మానవతావాద సిద్ధాంతకర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీన్ దయాళ్ ఉపాద్యాయ జయంతి కాట్రేనికోన మండల ప్రధాన కార్యదర్శి కొత్తలంకు సురేష్ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నానాజీ మాట్లాడుతూ రాజకీయ నాయకుడు సమగ్ర మానవతావాద సిద్ధాంత ప్రతిపాదకుడు హిందుత్వ పునర్జీవనం యొక్క ఆదర్శాలను వ్యాప్తి చేయడానికి జాతీయ విధులు అనే అర్థం వచ్చేలా మాసపత్రికను ప్రారంభించారు మరో ముఖ్య అతిథి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వారపత్రిక పాంచ్ జన్య లక్నో దినపత్రిక స్వదేశ్ లకు సంపాదీయకులగా వ్యవహరించారు వికేంద్రీకృత రాజకీయ వ్యవస్థ స్వాలంబన దేశంగా ఉండాలని అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టా సూరిబాబు మండల యువమోర్చా అధ్యక్షులు మట్టా సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ

తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన దీరవనిత చాకలి ఐలమ్మ అన్న :జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) వీరనారి చాకలి ఐలమ్మ 130 వ జయంతిని పురస్కరించుకుని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.నల్గొండ జిల్లా కేంద్రంలో నాగార్జునసాగర్ రోడ్ లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించాలని,ఆనాటి దేశముఖలపై తిరుగుబాటు చేసి భూ పోరాటానికి నాంది పలికారని, తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో ఉందని,రాష్ట్ర ప్రభుత్వం చాకిలి ఐలమ్మ జయంతిని, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.