Monday, 4 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆసియాకప్ చరిత్రలోనే తొలిసారి ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) ఈ నెల 28న ఆసియా కప్- 2025 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. ఈ ఎడిషన్లో లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్లలోనూ భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి

తెలంగాణ

బి ఆర్ ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఖారారు.

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ జూబ్లీహిల్స్ శాసన సభ్యులు మాగంటి బాబు మృతి తో అనివార్యం అయిన ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా సిట్టింగ్ స్థానము ని నిలుపుకోవాలానే ప్రయత్నం లో భారత రాష్ట్ర సమితి జూబ్లీహిల్స్ స్థానం నుండి మరణించిన సిట్టింగ్ శాసన సభ్యులు శ్రీమతి అయినా మాగంటి సునీత పేరు ని ఖారారు చేసింది. కార్యనిర్వాహక అధ్యక్షులు కలవకుంట్ల తారక రామారావ్ జూబ్లీహిల్స్ నాయకలుతో వరుస సమావేసాలు నిర్వాహస్తూ ఎలాగైనా గెలుస్తాం అనే దృఢ సంకల్పం తో జూబ్లీహిల్స్ బి ఆర్ ఎస్ శ్రేణులు ఉన్నాయ్

తిరుపతి

శ్రీ మహాలక్ష్మీ గా కనక దుర్గ అమ్మవారు

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన కనకాచలంపై వెలసి ఉన్న శ్రీ కనక దుర్గా మాత ఆలయం నందు శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం ఐదవ రోజు శ్రీ కనక దుర్గా మాత అమ్మవారు మహాలక్ష్మి లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.భక్తులు విశేషంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

ఆంధ్రప్రదేశ్

సింహాచలంలో కదం తొక్కిన భవాని భక్తులుభక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పణఅగ్నిగుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్న భక్తులు

సింహాచలంలో కదం తొక్కిన భవాని భక్తులు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పణ అగ్నిగుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్న భక్తులు సింహాద్రినాధుని పాదాల చెంత అడవివరం గ్రామం ఆయిల్ మిల్ ప్రాంతంలో శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అమ్మవారిని అందంగా తీర్చిదిద్దారు.. అర్చకులు సిహెచ్ రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుమారు 300 మందికి పైగా భక్తులు శిరస్సున బోనాలు ధరించి అడవివరం గ్రామం అంతా ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించారు. సింహాద్రి నాథుడు తొలిపావంచతో పాటు అప్పన్న సోదరీమణులు పైడితల్లమ్మ.. బంగారమ్మ ..ఎల్లమ్మ అమ్మవార్లకు శిరస్సును ధరించిన బోనాలతో దర్శించుకున్నారు అలాగే దుర్గాదేవి అమ్మవారి విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నడిచి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఎర్రటి నిప్పులలో నడుస్తూ తమను చల్లగా కాపాడాలని ఆ దుర్గాదేవిని వేడుకున్నారు .. భోగాపురం నుంచి విచ్చేసిన బృందం అగ్నిగుండం ఏర్పాట్లు చేసింది.. శ్రీ గణేష్ యువజన సేవా సంఘం అధ్యక్షులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ..సింహాచలం దేవస్థానం ధర్మకర్తలు మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు సంఘం సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ గావించారు.. అలాగే అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు

నాగర్‌కర్నూల్

బిజినేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో వీరనారి వనిత చాకలి ఐలమ్మ జయంతి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 26 బిజినేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో.వీరనారి వనిత చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి కార్యక్రమాన్ని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.వారు మాట్లాడుతూ భారీ వర్షాలు సైతం లెక్కచేయకుండా ఐలమ్మ గారి విగ్రహం దగ్గర ఐలమ్మ గారు సాధించినటువంటి విజయాలను గుర్తు చేసుకున్నారు. తన భూమిని సాగు చేసుకోవడానికి విన్నర్ దేశ్ముక్ అని పిలవబడే జమీందార్ రామచంద్రారెడ్డిని ధిక్కరించిన ఆమె చర్య తెలంగాణ ప్రాంతంలోని భూస్వామ్య ప్రభువులపై తిరుగుబాటు సమయంలో చాలామందికి ప్రేరణగా మారిందని అన్నారు తెలంగాణ మహిళా మణులందరికీ ఆమె స్ఫూర్తి దాయకం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన వారు దాసరాజు శ్రీనివాసులు, బాల నాగయ్య, మంగలి కృష్ణయ్య, కావాల అంజి,శ్రీను,రాజేందర్ గౌడ్, దాసరాజు సాయి ప్రశాంత్, వెంకటేష్, శివ, ఆకాష్,మహేష్,సాయి రెడ్డి, శేఖర్, భరత్,మాజీ రైతు సమితి అధ్యక్షుడు నెల్లికంటి మహేష్ రెడ్డి గారు మాజీ MPTC చీర్ణం బాలస్వామి గారు. మండల్ మైనార్టీ నాయకులు ఎండీ గఫూర్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు

మహా విశాఖ నగర్ మాజీ మేయర్ హరి వెంకట్ కుమారి శ్రీనివాస్ గాంధీ నగర్ లో అంబేద్కర్ యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఐయిదవ రోజు శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారికి అభిషేకంతో ప్రత్యేక పూజులు మహా విశాఖ నగర్ మాజీ మేయర్ గొలగాని హరి వెంకట్ కుమార్ శ్రీనివాస్ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహం విశాఖ నగర ప్రజలపై ఉండాలని కోరారుఈ కార్యక్రమంలో చిన్న, సంతోష్, సత్తిబాబు, శివ, అర్జున్, పారిపిళ్లి, గోవింద్, సతీష్, అలాగేయ్ కమిటీ సభ్యులు, మహిళలు, యువత, పాల్గొన్నారు*

కర్నూలు

ఎమ్మెల్యే బీవీ చేత ఉద్యోగ నియామక పత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది:-డీఎస్సీ అభ్యర్థులు

అమరావతిలో జరిగినా మెగా డీఎస్సీ విజయోత్సవ సభలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి చేత నూతన ఉపాధ్యాయ నియామకాల పత్రాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మిగనూరు నియోజకవర్గ కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు తెలిపారు.ఈ సందర్భంగా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు అపాయింట్ మెంట్ లెటర్ లను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికలో ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన సంవత్సరం మూడు నెలల్లోపు యువతకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వదిలి 150 రోజుల్లోపు ఉద్యోగాలు భర్తీ చేసినా ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరీ ముఖ్యంగా మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ వల్లే సాధ్యపడింది అనీ తెలిపారు.కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం డీఎస్సీ పై చేసి రికార్డ్ స్థాయిలో 16347 పోస్టులు భర్తీ చేశారని అన్నారు.

నారాయణపేట

ఘనంగా ఐదవరోజు బతుకమ్మ సంబరాలు

పున్నమి ప్రతినిధి:నారాయణపేట జిల్లా సెప్టెంబర్26 క్రిష్ణ మండల కున్సి గ్రామంలో మారెమ్మదేవి దేవాలయం దగ్గర 5 వ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. 5 వ రోజు అటుకుల బతుకమ్మ ను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగలో అడపడుచులంధరు,గునుగు,చామంతి,తంగేడు,వంటి తిరొక్కాపూలతో బతుకమ్మ ను పేర్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ …బతుకమ్మ… ఉయ్యాలో అంటూ బొడ్డెమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు , మహిళందరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

నారాయణపేట

ఘనంగా ఐదవరోజు బతుకమ్మ సంబరాలు

పున్నమి ప్రతినిధి:నారాయణపేట జిల్లా సెప్టెంబర్26 క్రిష్ణ మండల కున్సి గ్రామంలో మారెమ్మదేవి దేవాలయం దగ్గర 5 వ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. 5 వ రోజు అటుకుల బతుకమ్మ ను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగలో అడపడుచులంధరు,గునుగు,చామంతి,తంగేడు,వంటి తిరొక్కాపూలతో బతుకమ్మ ను పేర్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ …బతుకమ్మ… ఉయ్యాలో అంటూ బొడ్డెమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు , మహిళందరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

నాగర్‌కర్నూల్

అచ్చంపేట పట్టణంలో ఘనంగా చాకలి ఐలమ్మ 130వ జయంతి

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 26 నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ లో చాకలి ఐలమ్మ 130 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ తెలంగాణ విప్లవకారిణి ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములను వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. 1895 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలోని కిస్టాపురంలో జన్మించిన ఆమె విస్నూర్ దేశ్ముఖ్ వంటి భూస్వాముల దౌర్జన్యానికి ఎదురొడ్డి నిలిచింది. నిజాం పాలనలో ఉన్న భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. భూమికోసం భుక్తి కోసం తిరుగుబాటు చేసి కిరంకుశ పాలనపై దండే ఎత్తింది ఆమె పోరాట పటిమ ధీరత్వం తెలంగాణ నేలకు ప్రతికాగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశన యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.