Monday, 4 May 2026

Blog

తిరుపతి

పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమమ

పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 62 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు,కార్యకర్తలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్,పేట చిరంజీవి తొట్టంబేడు మండలం ఉపాధ్యక్షుల తేజ,లక్ష్మణ్,ప్రదీప్ కుమార్,మనీ,ముని చంద్ర,యాసీన్ భాష,రాజా,నాగరాజు,వీర మహిళలు బత్తెమ్మ,పద్మ,తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

*స్పందన లో వికలాంగత్వానికి కారణాలు నివారణోపాయాలు పై అవగాహన సదస్సు*

గన్నవరం నియోజకవర్గం(పున్నమి ప్రతినిధి) వికలాంగత్వానికి కారణాలు అనేకమని ముఖ్యంగా మేనరికం,క్రోమో జోముల లోపం, బాల వివాహాలు వంటి కారణాలెన్నో ఉన్నాయని పెద్ద ఆవుటపల్లి పీహెచ్ డాక్టర్ సుజిత అన్నారు. గన్నవరం మండలం దావాజిగూడెం హెల్పింగ్ హ్యండ్స్ _సొసైటీ_ ఆధ్వర్యంలో గురువారం నాడు స్పందన మానసిక వికాస కేంద్రం నందువికలాంగత్వానికి కారణాలు నివారణోపాయాలు అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుజిత మాట్లాడుతూ మేనరికం పెళ్లిళ్లతో పుట్టే పిల్లలకు వైకల్యం రావడానికి వీలుందన్నారు.జన్యుపరమైన లోపాలు,గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల వికలత్వం సంభవిస్తుందని గర్భిణీలు మంచి ఆహారం తీసుకుంటే సమస్య ఉండదని ముఖ్యంగా మేనరికం పెళ్లిళ్లు మానుకోవాలన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పల్స్పోలియో చుక్కలు వేయడం వల్ల వికలాంగత్వం రావడానికి వీలుండదని, ప్రజల్లో ఇంకా అవగాహన రావలసిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ వివరించారు.గన్నవరం ప్రాంతంలో దివ్యాంగుల కొరకు స్పందన మానసిక వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి దివ్యాంగులను చేరదీసి ఉచితంగా విద్య వైద్య రవాణా భోజన వంటి సౌకర్యాలను అందిస్తున్న సంస్థ చైర్మన్ సంకాబత్తుల వెంకట్, సెక్రటరీ సంకాబత్తుల రజిత వెంకట్ ను డాక్టర్ సుజిత అభినందించారు. హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ సెక్రటరీ సంకాబత్తుల రజిత వెంకట్ మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ ఎంతోమంది దివ్యాంగులకు వెలుగులు నింపుతున్నమని ఆమె అన్నారు. ప్రభుత్వం సహకారం అందించాలని,కార్పొరేట్ సంస్థలు,దాతలు ముందుకు వచ్చి మా సంస్థ లో భాగస్వామ్యం అయినట్లయితే దివ్యాంగులకు మరిన్ని సేవలు విస్తరిస్తామని రజిత వెంకట్ పేర్కొన్నారు. అనంతరం విజయవాడ యూసానా హెల్త్ సైన్సెస్ వారి సహకారంతో స్పందన బాలలకు,వారి తల్లిదండ్రులకు ప్రజలకు,దివ్యాంగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్,ఎంఆర్పిఎస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఎలీషా ,సీనియర్ కోచ్ శ్రీమతి మధు మోహన్,తమన్న, రమేష్, మహేందర్,యెహోవా, స్పందన మానసిక వికాస కేంద్రం తల్లిదండ్రులు సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు

పశ్చిమ గోదావరి

భీమవరంలోని విజేత సూపర్ మార్కెట్‌ను సందర్శించిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (బిజెపి వర్మ)

ఈరోజు, భీమవరంలోని విజేత సూపర్ మార్కెట్‌ను సందర్శించి, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనాలను కొనుగోలుదారుల నుండి నేరుగా తెలుసుకున్నాను.​ గతంలో 18% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించడం వల్ల ధరలు తగ్గాయని, ఇది ఆర్థికంగా తమకు ఎంతో ఉపయోగకరమని కొనుగోలుదారులు సంతోషంగా తెలియజేశారు. ఈ నిర్ణయం పట్ల తమకున్న కృతజ్ఞతను తెలుపుతూ, వారితో కలిసి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. ప్రధాని మోడీ గారు సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశంలోని మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుంది.

E-పేపర్

భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న భక్తజనం..*

పున్నమి ప్రతినిధి) హిరణ్యవర్ణాం హరిణీమ్ అని అమ్మవారిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మినీ పద్మ హస్తే, పద్మాలయే అని అమ్మవారిని కొలుస్తూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ వారి అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు- కుంకుమలంటే ఎంతో ప్రీతికరం… అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది… ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతునే ఉంటాయి….దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు బృందాలుగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మహామండపం ఆరో అంతస్తులో ఆలయ అర్చకస్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజలకు తరలి రావడంతో దేవస్థాన అధికారులు పూజలకు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉభయ దాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. సౌభాగ్య ప్రధాయిని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజన్మాంతం సకల సౌఖ్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని వేద పండితులు వివరించారు. పెద్దసంఖ్యలో ఉభయదాతలతో పాటు తమ భక్తప్రపత్తులు చాటుకున్నారు.. కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జై భవాని… జై జై భవాని

E-పేపర్

నందిగామలో స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మొక్క నాటి పరిశుభ్రతా సందేశం..

నందిగామ, సెప్టెంబర్ 25, 2025: (పున్నమి ప్రతినిధి)స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ‘స్వచ్ఛ ఉత్సవ్’ కార్యక్రమాన్ని గురువారం నాడు నందిగామ పట్టణంలోని మధిర ఆర్చి రోడ్‌పై నున్న చిన్న బ్రిడ్జి వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పాల్గొని, మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతలపై సందేశం ఇచ్చారు. స్వచ్ఛ ఉత్సవ్ ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ మతి మండవ కృష్ణకుమారి,కూటమి నేతలు, స్థానిక ప్రజలు,మున్సిపల్ అధికారులు,యువత హాజరై, బ్రిడ్జి పరిసరాల్లో శుభ్రతా కార్యకలాపాలు చేపట్టారు. ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య స్వచ్ఛతలో భాగంగా మొక్కను నాటారు. మతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, “స్వచ్ఛత మన జీవితంలో అంతర్భాగం కావాలి మనమంతా కలిసి పర్యావరణాన్ని కాపాడుకుందాం.మొక్కలు నాటడం ద్వారా ఆక్సిజన్ సమృద్ధి పెంచి, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందిద్దాం” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా జరిగిందని, ఇలాంటి ఉద్యమాలు ప్రతి గ్రామం, పట్టణంలో నిర్వహించాలని ఆమె సూచించారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘనంగా దీన దయాళ్ ఉపాధ్యాయ జయంతి

శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షలు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో అంత్యోదయ,ఏకాత్మతా మానవవాద సిద్ధాంత రూపకర్త,సంఘ సంస్కర్త,అర్థశాస్త్రవేత్త,రాజకీయ నాయకులు,భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులు,నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాలులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం కార్యకర్తలు,నాయకులకు స్వీట్స్ పంచిపెట్టారు.

ఆంధ్రప్రదేశ్

పని గంటలు పెంచడం అంటే కార్మికులకు ద్రోహం తలపెట్టడమే – ఏఐటీయూసీ

రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటల పెంచుతూ రాష్ట్ర శాసనసభ మరియు శాసనమండలిలో తీర్మానం చేస్తూ కార్మిక వర్గానికి ద్రోహం తలపెట్టిందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం మన్మధరావు తీవ్రంగా ఖండించారు.గురువారం మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ముఠా కార్మికుల నిర్వహించిన నిరసనలో అయన మాట్లాడుతూ 135 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినం ఇప్పుడు 10 గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాలు చేయడం అంటే కార్మికుల శ్రమను దోపిడీ చేయడమేనని, యజమానులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇప్పటికే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలకు బదులు నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకొని వచ్చి కార్మికులకు తీవ్ర అన్యాయం ఇప్పటికే చేసిందని దేశంలో ఏ రాష్ట్రంలోని లేబర్ కోడ్స్ అమలు చేయకపోయినా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అత్యంత వేగంగా అమలకు పూనుకొని పని గంటలు పెంచడం కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడమేనని రాష్ట్ర ప్రభుత్వం పని గంటల పెంపును ఉపశంహరించాలనిఏఐటీయూసీ విశాఖ జిల్లా తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం పైడిరాజు, ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ ఏఐటీయూసీ ముఠా కార్మిక నాయకులు ఎం బంగారయ్య, టి అప్పలరాజు, చిన్నరావు ముఠా కార్మికులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

గొప్ప నిబద్దత గల సిపిఐ నేత కామ్రేడ్ ఎ బి బర్ధన్

101 జయంతి సందర్బంగా మధురవాడలో ఘనంగా నివాళులు. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన కామ్రేడ్ ఎ బి బర్ధన్ (92) గొప్ప నిబద్దత కలిగిన నాయకుడని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు నివాళులు అర్పించారు.గురువారం కామ్రేడ్ ఎ బి బర్ధన్ 101 వ జయంతిని మధురవాడ సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్బంగా పైడిరాజు మాట్లాడుతూ 1924 సెప్టెంబరు 25 వ తేదీన జన్మించిన బర్ధన్ 2016 జనవరి 02 వ తేదీన మరణించారని కార్మిక నేతగా అనేక ఉద్యమాలు నిర్వహించిన బర్ధన్ 20 సార్లు అరెస్టయ్యారని, నాలుగేళ్లకుపైగా జైలు జీవితం గడిపారన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో 1957లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నాగ్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారని, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీకి అధ్యక్షునిగా పనిచేశారని, 1990లో దేశ రాజకీయాలలో ప్రవేశించి సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా 1996లో యూపీఏ1 సంకీర్ణ ప్రభుత్వంలో సీపీఐ చేరడంలో బర్ధన్ కీలక పాత్ర పోషించి, పనికి ఆహార పథకం, సమాచార చట్టం రూపకల్పనకు విశేష కృషి చేశారని, అప్పటివరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఇంద్రజిత్ గుప్త హోంమంత్రి కావడంతో, బర్ధన్ ప్రధాన కార్యదర్శి అయ్యారని, 2012 మార్చి వరకూ ఆయన ఆ పదవిలోనే కొనసాగారని, ఆ తర్వాత పార్టీ శ్రేణులకు ఆయన తన విలువైన సూచనలిస్తూ పార్టీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గా పనిచేశారని తెలిపారు. కాంగ్రెస్తో సహా భాజపాయేతర పక్షాలను ఒక్క తాటిపైకి తీసుకురావడంలో విశేషంగా కృషి చేసిన బర్ధన్ గొప్ప రాజనీతి గల నాయకుడని అయన ఆశయాలకు కమ్యూనిస్టులు కృషి చేసినప్పుడే అయనకు నిజమైన నివాళులని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా పార్టీ కార్యదర్శి వి సత్యనారాయణ, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి బేగం, జి వేళంగిణిరావు, బి కేశవయ్య, ఎస్ కె సల్మ, కె జగ్గస్వామి, ఎన్ అప్పారావు, కాళిషా, ఎన్ త్రినాద్, డి సతీష్, పి రమణ, కె రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

క్రైమ్

వివాహం చేసుకుంటానని చెప్పి బిహార్లో 22 ఏళ్ల యువతిపై ఏడాదిన్నరగా బాబా లైంగిక దాడి

సెప్టెంబర్ 25 పున్నమి ప్రతినిధి @ బిహార్ సహర్సాలో బాబా గోవింద్ ఝా అనే వ్యక్తి 22 ఏళ్ల యువతిని వివాహం చేసుకుంటానని ప్రలోభపెట్టి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడు. ఆమె బెదిరింపులు, ఆందోళనతో ఏడాదిన్నర పాటు ఈ ఉచ్చులో ఉండిపోయినట్లు బాధితురాలు తెలిపారు. ఆ మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సహర్సా రైల్వే స్టేషన్లో బాబాను అరెస్టు చేసి జైలుకు పంపారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

కామారెడ్డి జిల్లాలో ఆగని ఇసుక అక్రమ రవాణా: ‘ఇంద్రమ్మ ఇండ్లు’ పేరుతో దందా

 కామారెడ్డి,25 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి    : కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛ గా సాగుతోంది. ప్రభుత్వం పేదలకు నిర్మించే ‘ఇంద్ర మ్మ ఇండ్లు’ పథకం పేరుతో దళారు లు ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్లుగా వ్యవహరి స్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ని పలు మండలాలు, గ్రామాల్లో ఇసుక రీచ్‌లలో ఎలాంటి అనుమతులు లేకుండా యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ ఇసుకను తొలు త ‘ఇంద్రమ్మ ఇండ్లు’ పథకం లబ్ధి దారుల కోసం కేటాయించినట్లు చూపిస్తూ, ఒకటి లేదా రెండు ట్రిప్పులు మాత్రమే వారికి ఇస్తున్నారు. మిగిలిన ఇసుకను అధిక ధరలకు బహిరంగంగా విచ్చల విడిగా బిల్డర్లకు, మార్కెట్లో విక్రయించి దళారులు లాభ పడుతున్నారు. ఈ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోవడమే కాకుండా, పర్యావరణా నికి  తీవ్ర నష్టం జరుగుతోంది. స్థానికు లు, సామాజిక కార్యకర్తలు ఈ అక్రమ రవాణాపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో యంత్రాలు, భారీ వాహనాలతో ఇసుక తరలింపు విచ్చలవిడిగా సాగుతోందని వారు చెబు తున్నారు. ఈ అక్రమ దందాపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిఘా పెంచాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఇంద్ర మ్మ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరకే ఇసుకను అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలను రెవెన్యూ సిబ్బంది పట్టించుకోకుండా, ఇష్టానుసారం పర్మిష న్లు ఇస్తూ ఇసుకను దుర్వినియోగం చేస్తున్నారనేది ప్రజా  సమస్య…  ఇంద్రమ్మ ఇళ్లకు ఇసుక పక్కదారి:  పేదల కలలకు గండి కొడుతున్న రెవెన్యూ సిబ్బం ది! పేదలకు సొంత ఇళ్లు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం అడుగడుగునా అవినీతి, అక్రమాలతో నీరు గారుతోంది. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి కేవలం నామమాత్రపు రుసుముతో ఇసుకను అందించాల న్న జిల్లా కలెక్టర్ ఆదేశాలు కాగితాలకే పరిమితం అయ్యాయి. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తూ, పేదల ఇళ్ల కలను అమ్ముకుంటున్నారు.ప్రభుత్వం పేదలకోసం చేపట్టి న ఈ బృహత్తర పథకంలో కీలకమైన ఇసుక సరఫరాలోనే భారీగా అవకతవకలు జరుగుతు న్నాయి. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కేవలం రెండు వందల రుసుముతో ఒక ట్రాక్టర్ ఇసుకను ఇవ్వాలని ఉన్నా, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తమకిష్ట మైన వారికి మాత్రమే పర్మిషన్లు జారీ చేస్తున్నారు. పేదలు రోజుల తరబడి కార్యాలయా ల చుట్టూ తిరిగినా పర్మిషన్లు ఇవ్వకుండా వేధిస్తు న్నారని లబ్ధి దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇలాంటి పర్మిషన్లను అక్రమంగా బయ టి వ్యక్తులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నా యి. దీంతో మార్కెట్‌లో ఇసుక ధరలు అమాంతం పెరిగిపోయి, ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారు లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికా రుల నిర్లక్ష్యం, సిబ్బంది అవినీతి కారణంగా ప్రభు త్వ పథకం  ముఖ్య ఉద్దేశం దెబ్బతింటోంది. ఈ విషయంపై పలువురు లబ్ధిదారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు లు చేసినా,ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతా ధికారులు జోక్యం చేసుకొని, ఈ అక్రమాలను అరిక ట్టి, పేద లకు సకాలంలో, సరసమైన ధరకే ఇసుక అందేలా చూడాలని కోరుతున్నారు. లేకపోతే, ఇంద్రమ్మ ఇళ్ల కల కేవలం కలగానే మిగిలిపోతుం దని ప్రజలు అభియప్రాయపడుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.