Monday, 4 May 2026

Blog

తిరుపతి

ముఖ్యమంత్రి సహాయ నిధితొ పేదలకు చేయూత:బొజ్జల రిషితా రెడ్డి

శ్రీకాళహస్తి:ఏర్పేడు మండల పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 4,79,050/- రూపాయల చెక్కులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి 10 బాధితులకు నేరుగా వారి ఇంటికి వెళ్లి పంపిణి చేయడం జరిగింది.ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేసి సహాయం చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కి మరియు ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి లబ్ధిదారులు ధన్యవాదములు తెలిపారు.

E-పేపర్

మడపల్లిలో స్వస్థ్ నారీ – స్వశక్తి పరివార్ కార్యక్రమం

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) స్వస్థనారి – స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమములో భాగంగా చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మడపల్లి గ్రామంలో ప్రత్యేకంగా మహిళల ఆరోగ్యం గురించి బీపీ, షుగరు, క్యాన్సర్, రక్తహీనత, టిబి, లెప్రసీ, వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మెహతాబ్ మాట్లాడుతూ, మండలంలోని ప్రజలందరూ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగించుకోవాలని ప్రభుత్వాసుపత్రిలో మంచి వసతులతో కూడిన వైద్యం అందుతుందని మంచి డాక్టర్లు అందుబాటులో ఉన్నారని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమములో డా|| షేక్ మెహతాబ్, సి.హెచ్.ఓ యం. వెంగయ్య, పీహెచ్ ఎన్, హెచ్ వి, ఎం పి హెచ్ ఎ లు , ఎం ఎల్ హెచ్ పి లు, ప్రజలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

ఇరువురు రోగులకు వైద్యచికిత్స నిమిత్తం రూ. 3.50లక్షలు మంజూరు

గన్నవరం : నియోజకవర్గం (పున్నమి ప్రతినిధి) గన్నవరం నియోజకవర్గంలోని ఇరువురు రోగులకు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ రూ. 3.5లక్షలు ఆర్థిక సాయం మంజూరు చేయించారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామానికి చెందిన బేవర కుమారికి రెండు లక్షలు, గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన బుద్ధాల రామదాసు కు రూ. 1.5లక్షలు ఎల్ఓసి లను బుధవారం సాయంత్రం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో రోగుల కుటుంబ సభ్యులకు యార్లగడ్డ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. గన్నవరం నియోజవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి ఎక్కువ మంది రోగులకు ఆర్థిక సాయం అందించినట్లు ఈ సందర్భంగా యార్లగడ్డ వివరించారు.

E-పేపర్

ఇరువురు రోగులకు వైద్యచికిత్స నిమిత్తం రూ. 3.50లక్షలు మంజూరు

గన్నవరం : నియోజకవర్గం (పున్నమి ప్రతినిధి) గన్నవరం నియోజకవర్గంలోని ఇరువురు రోగులకు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ రూ. 3.5లక్షలు ఆర్థిక సాయం మంజూరు చేయించారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామానికి చెందిన బేవర కుమారికి రెండు లక్షలు, గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన బుద్ధాల రామదాసు కు రూ. 1.5లక్షలు ఎల్ఓసి లను బుధవారం సాయంత్రం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో రోగుల కుటుంబ సభ్యులకు యార్లగడ్డ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. గన్నవరం నియోజవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి ఎక్కువ మంది రోగులకు ఆర్థిక సాయం అందించినట్లు ఈ సందర్భంగా యార్లగడ్డ వివరించారు.

తిరుపతి

శ్రీకాళహస్తి కైలాసరి కాలనీలో కొండచిలు కలకలం

శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో 8 అడుగుల కొండచిలువ పాము కలకలం రేపింది. కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ పాములు బెడద ఎక్కువగా ఉంటుంది. జనావాస ప్రాంతంలో కొండచిలువ కనబడడంతో ప్రజలు భయాందోళన కు గురయ్యారు. వెంటనే ఆపరతమైన ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రజలు సమాచార ఇవ్వడంతో వెంటనే ఫారెస్ట్ అధికారులు స్నాక్ క్యాచర్ ను పిలిపించి అక్కడ ఉన్న కొండ చిలువ పాముని పట్టుకొని సురక్షితంగా రామాపురం అడవుల్లో వదిలిపెట్టారు.

ఆంధ్రప్రదేశ్

నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నారా లోకేష్

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ పాలకొల్లు: సీఎం చంద్రబాబునాయుడు, భువనేశ్వరి గారితో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బ్రాడిపేట బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటుచేసిన కల్యాణవేదికకు వచ్చి నూతన వధూవరులు శ్రీజ, దుర్గా హరిహర సాయి పవన్ కుమార్ లను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్‌ చెల్లించేందుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 78 రోజుల వేతనాన్ని ‘ఉత్పాదకతతో ముడిపడిన బోనస్‌’ (PLB) రూపంలో చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందిరైల్వే పనితీరును మెరుగుపరిచేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించడానికి బోనస్‌ చెల్లింపు ఉపయోగపడుతుందని రైల్వే మంత్రి తెలిపారు. 78 రోజుల బోనస్‌ అయినా చెల్లింపులపై పరిమితి వల్ల ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 మాత్రమే లభించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే 1614.90 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా చేపట్టగా.. 730 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది.

ఆంధ్రప్రదేశ్

10 గ్రా. బంగారం ధర రూ.2లక్షలు?.. ‘జెఫరీస్’ అంచనా

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ ప్రపంచ ఆర్థిక అనిశ్చితులతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని, దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రఖ్యాత స్టాక్ బ్రోకరేజ్ సంస్థ ‘జెఫరీస్’ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న ధరల నుంచి ఏకంగా 77% మేర పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇదే నిజమైతే 10గ్రా బంగారం ధర రూ 2 లక్షల మార్కును చేరుకోనుంది. అయితే ఎప్పటివరకు గోల్డ్ ఆ మార్క్ అందుకుంటుందో చెప్పలేదు.

అనంతపురం

నూతన జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు సన్మానం, సమస్యలపై వినతిపత్రం సమర్పణ

అనంతపురం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు హోన్నూరప్ప, ఉపాధ్యక్షుడు కోటేగంటి నబి రసూల్, కమిటీ సభ్యులు నూతన జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్‌ను సన్మానించి, శాలువాతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమాజ, అభివృద్ధి సమస్యలపై వినతిపత్రాలను సమర్పించారు. కలెక్టర్ అనంతపురం జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేయమని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అంకె రామలింగమయ్య, బి. అనంత కుమారి, హుస్సేన్ పీరా, జాయింట్ సెక్రటరీ మనోజ్ కుమార్, కల్చరల్ సెక్రటరీ రషీద్, సింగనమల మండలం కన్వీనర్ రాజ కుల్లాయప్ప, కళ్యాణదుర్గం కన్వీనర్ గోవిందరాజులు పాల్గొన్నారు.

ఖమ్మం

*నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలి*!

T.Ravinder పున్నమి Daily న్యూస్ ప్రతినిథి : ఖమ్మం *నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలి*! *ఖమ్మం బిజెపి 2 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో వినతులు*! వార్త…. ఖమ్మం 2 టౌన్ : ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాల్లోనెలకొన్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు *వెంకటనారాయణ* ఆధ్వర్యంలో అందజేశారు. ఖమ్మం పట్టణం పరిధిలో 44వ డివిజన్, ఎన్ ఎస్ టీ,రోడ్ క్యూర్ హాస్పిటల్ లైన్, లెనిన్ నగర్, బాలాజీ నగర్, నెహ్రూ నగర్, ఏరియాలలో హాస్పిటల్స్ వెళ్లే సామాన్య ప్రజలకు, ఆ ఏరియా నివాసులకు,వాహనదారులకు, ఎమర్జెన్సీ పేషెంట్ల అంబులెన్స్లకు ట్రాఫిక్ రద్దీగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారని ఖమ్మం టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఖమ్మం కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి కి , రూల్స్ కి విరుద్ధంగా హాస్పిటల్ కి సంబంధించిన బిల్డింగ్స్ మరియు కమర్షియల్ బిల్డింగ్స్, రోడ్స్ ని ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల, ఇరుకు రోడ్లు కావడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవ్వడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, 53,57,56 డివిజన్లకు అనుసంధానంగా ఉన్న ఖమ్మం బైపాస్ రోడ్ లో విజయనగర్ కాలనీ సాయిబాబా ఆర్చ్ దగ్గర కొత్త బస్టాండ్ ఏరియాలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి నియంత్రించాలని, వినతి పత్రం అందచేశారు, ఈ కార్యక్రమంలో ఖమ్మం బిజెపి టూ టౌన్ నేతలు, *మందడపు సుబ్బారావు,మేకల నాగేందర్, దాసరి మధు, రుద్ర గాని మాధవ్గౌడ్, కృష్ణ చారి, మహేందర్ సింగ్,నక్క రవి గౌడ్, పాశం శ్రీనివాసరెడ్డి, భూక్యా వెంకట్, ఉపేంద్రమ్మ, సురేష్ గౌడ్,యుగంధర్ నాయుడు*, తదితరులు పాల్గొన్నారు,

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.