Monday, 4 May 2026

Blog

తెలంగాణ

గోకుల్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు..

కామారెడ్డి, 24 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి   : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గోకుల్ తండా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసిన ట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ తెలి పారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈపథకాన్ని చేపట్టిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ, అర్హులంద రికీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్  పార్టీ మండల ఉపాధ్యక్షులు లాగల ప్రసాద్,  పోసానిపేట్ మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేం దర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 1 నుంచి ఆధార్ ఛార్జీలు పెంపు

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ ఆధార్: వచ్చే నెల 1 నుంచి ఆధార్ సర్వీస్ ఛార్జీలు పెరగనున్నాయి. తప్పుల సవరణకు లేదా వివరాల అప్డేట్కు ప్రస్తుతం రూ.50 ఉండగా రూ.75కు, బయోమెట్రిక్ అప్డేట్ కోసం రూ. 100 ఉండగా రూ.125కు పెంచుతున్నట్లు UIDIA తెలిపింది. పోర్టల్ ద్వారా నేరుగా పొందే సేవలకు ఛార్జీలను రూ.50 నుంచి రూ.75కు పెంచినట్లు పేర్కొంది. పోయిన ఆధార్ స్థానంలో కొత్తది కావాలంటే రూ.40 అప్లికేషన్ ఫీజు చెల్లించాలని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం కాంట్రాక్ట్‌పై మంత్రి లోకేష్

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ యూనిఫాం కాంట్రాక్ట్ చేనేతలకు ఇవ్వాలని గతంలో ప్రయత్నాలు చేశాం. చేనేత ద్వారా పూర్తిస్థాయిలో యూనిఫాంలు ఇవ్వడం వీలు కావడం లేదు. ఆప్కో వంటి సంస్థ కూడా యూనిఫాం విషయంలో చేతులెత్తేసింది. గతంలో కంటే నాణ్యమైన వస్త్రాన్ని యూనిఫాం కోసం వాడుతున్నాం. చేనేతల ఆదాయం పెంచేందుకు మంగళగిరిలో వీవర్స్ శాల ఏర్పాటు. కొత్త డిజైన్లు, బ్రాండింగ్, ప్రమోషన్ దిశగా చర్యలు చేపట్టాం: మంత్రి లోకేష్‌. ఎమ్మెల్యేలతో బృందం ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేలా చర్యలు: లోకేష్‌.

E-పేపర్

రైల్వే కోడూరులో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం – వికసిత భారత్ 2047 కార్యక్రమం ఘనంగా

రైల్వే కోడూరు లో బుధవారం 24 వ తారీకు నా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, వికసిత భారత్ 2047 కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు సేవా భావన పెంపొందించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే మాట్లాడుతూ 1969 సెప్టెంబర్ 24న విద్యార్థుల్లో సేవా స్పూర్తి కలిగించేందుకు ఏర్పడిన ఎన్ఎస్ఎస్ నేడు అన్ని కళాశాలల్లో ప్రజలకు ప్రయోజనకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి అవసరమని పేర్కొన్నారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ శ్రీ జి. దయానందం మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ప్రజలతో దగ్గరగా మెలగడానికి అవకాశం దొరుకుతుందని చెప్పారు. వికసిత భారత్ కోఆర్డినేటర్ శ్రీ కె. పి. కృష్ణమూర్తి మాట్లాడుతూ వికసిత భారత్ 2047 సాధనలో ఎన్ఎస్ఎస్ కీలకమని వివరించారు. విద్యార్థులు రూపొందించిన పోస్టర్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

చేనేతలకు ప్రోత్సహంపై ఎమ్మెల్యేలతో వర్కింగ్ గ్రూప్

అవినీతిని అరికట్టడం ద్వారా రూ.200కోట్లు ఆదాచేశాం శాసనసభ్యలంతా వీవర్స్ శాలను అధ్యయనం చేయండి అసెంబ్లీలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @అమరావతి: చేనేత సొసైటీలకు కొంతశాతం యూనిఫాం తయారీ ఆర్డర్ ఇచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు శాసనసభ్యులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. 5వరోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో భాగంగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ… గతంలో ఆప్కోకు ఆర్డర్ ఇస్తే సొసైటీలు సకాలంలో యూనిఫాం సరఫరా చేయలేకపోయారు. చేనేతలను ప్రోత్సహించే అంశంపై గతంలో కూడా పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే ఇందుకోసం స్ట్రక్చరల్ చేంజ్ రావాలి. ప్రభుత్వ టెండరులో సొసైటీలు ఎలా పోటీపడాలనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. దాదాపు 50 నియోజకవర్గాల్లో చేనేతలు ఉన్నారు. యూనిఫామ్ విషయంలో మార్కెట్ ధరల పోటీని ఎలా ఎదుర్కోవాలనే విషయమై సభ్యులందరం కూర్చుని మాట్లాడాలి. ఇందుకోసం నలుగురైదురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం. చేనేత వృత్తిని అందరం కలసికట్టుగా కాపాడాలి, అదే సమయంలో సరైన విధంగా సరఫరా జరిగేలా కూడా చూడాలి. అందరం కలసి చర్చిస్తే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. కమిట్ మెంట్ తో చేనేతలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన బాధ్యత ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వదేశీ గురించి చెప్పారు. ఇందులో చేనేత కీలకమైన పాత్ర పోషిస్తుందని మంత్రి చెప్పారు. 2019-24 నడుమ స్కూలు విద్యార్థులకు యూనిఫాం కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు కొన్ని ఫిర్యాదులు అందాయి. దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాం, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెస్ట్ క్వాలిటీతో మంచి ఫ్యాబ్రిక్, డిజైన్ తో విద్యార్థులకు అత్యుత్తమమైన కొత్త యూనిఫాం ఇచ్చాం. గతంలో కంటే డ్యూరబిలిటీ, బ్రీతబిలిటీ ఎక్కువ ఉండే దుస్తులు ఇచ్చాం, బాయ్స్, గర్ల్ కు ఒకే విధమైన యూనిఫాం ఇచ్చాం. పాఠశాల విద్యశాఖలో అయిదేళ్లలో వెయ్యికోట్లు ఆదాచేయాలని అధికారులను ఆదేశించాం. టెండరు విధానం పారదర్శకంగా నడిపించాలని చెప్పాం. దీంతో గతఏడాది సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట విద్యార్థులకు అందించే కిట్స్, గుడ్లు, చిక్కీలలో రూ.200 కోట్లు ఆదా చేశాం. ఇదే విధానాన్ని అమలుచేసి అయిదేళ్లలో రూ. వెయ్యికోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా చేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. చేనేతలను ప్రోత్సహించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్నాం. మంగళగిరిలో వీవర్స్ శాల ద్వారా చేనేత కార్మికులకు 40నుంచి 50శాతం ఆదాయం పెంచామని మంత్రి లోకేష్ చెప్పారు. డిజైన్లు, మార్కెటింగ్ పై టాటా టనేరాతో ఒప్పందం చేసుకున్నాం. మా వంతుగా చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తున్నాం. గౌరవ సభ్యులు సమయం ఉన్నపుడు వీవర్స్ శాలను సందర్శించాలి. చేనేతలకు మెరుగైన ఉపాధి, ఆదాయం వచ్చేలా మార్కెట్ లింక్ చేసే అంశాన్ని అధ్యయనం చేయాలి. మేం మూడున్నరేళ్లుగా వీవర్స్ శాల ద్వారా చేనేతల ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ వ్యవస్థలో ఇంకా దళారులు ఉన్నారు, చేనేతలను కాపాడుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అమలుచేయాల్సి ఉంది. చేనేతలు వృత్తిపరంగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భక్త సమాజానికి ఆహ్వానం – కార్తిక మాస మహారుద్రాభిషేకం

నెల్లూరు బాలాజీనగర్‌లోని సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో కార్తిక మాస మహారుద్రాభిషేకం 2025 నవంబర్ 2వ తేదీ, ఆదివారం ఉదయం 8 గంటలకు త్యాగరాజ కళ్యాణ మండపంలో నిర్వహించబడుతుంది.భక్తుల భాగ్యవృద్ధికి మహారుద్రాభిషేకం, పుష్పాభిషేకం జరపబడనున్నాయి.ఈ కార్యక్రమం NUDA ఛైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగనుంది.భక్తులందరూ స్వాగతించబడుతున్నారు అని ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్ గారు (డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బ్రాహ్మణ కార్పొరేషన్, మాజీ మునిసిపల్ కార్పొరేటర్) తెలియజేశారు.

జాతీయ అంతర్జాతీయ

ICC సంచలన నిర్ణయం.. యూఎస్ఏ క్రికెట్‌పై వేటు

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ యూఎస్ఏ క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన ఐసీసీ పాలనాపరమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనే ప్రధాన కారణం గతేడాది హెచ్చరించినా మార్పు రాకపోవడంతో కఠిన చర్యలు ఐసీసీ ఈవెంట్లలో అమెరికా జాతీయ జట్లు యధావిధిగా పాల్గొనే అవకాశం లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లకు మినహాయింపు

క్రైమ్

స్మిత సబర్వాల్ సంచలన నిర్ణయం

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో పిటిషన్ కమిషన్ రిపోర్టులో తన పేరు తొలగించాలని స్మిత పిటిషన్ వివరణ ఇచ్చేందుకు తనకు టైమివ్వలేదని స్మిత వాదన ఘోష్ కమిటీ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్

బిజినెస్

రూ.12వేల కోట్లతో ఫోన్‌పే మెగా ఐపీఓ..!

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ ముంబయి: రూ.12వేల కోట్లతో ఫోన్‌పే మెగా ఐపీఓ రానున్నట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యేందుకు వాల్‌మార్ట్‌కు చెందిన ఈ ఫిన్‌టెక్‌ సంస్థ చర్యలు ప్రారంభించింది. రూ.12వేల కోట్ల విలువైన మెగా ఐపీఓ కోసం సెబీ వద్ద డ్రాఫ్ట్‌ పేపర్లు దాఖలు చేసినట్లు సమాచారం. విశ్వసనీయ ప్రీ-ఫైలింగ్‌ రూట్‌లో ఈ ఐపీఓ కోసం దాఖలు చేసినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్

మాయా బియ్యం! ఈ బియ్యాన్ని నీళ్లలో వేస్తేసరి

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ స్టవ్ వెలిగించాల్సిన పనిలేదు. పొయ్యి మీద ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ బియ్యాన్ని కేవలం నీళ్లలో వేసి కొంచెం సేపు పక్కన పెడితే చాలు. అన్నం రెడీ. ఇటువంటి మాయ బియ్యం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే అటువంటి బియ్యం గురించి ఇప్పుడు నేను చెప్తాను మీరు వినండి. ఆ బియ్యం పేరు బొకాసాలు. ఈ బియ్యాన్ని అస్సాం రాష్ట్రంలోని గిరిజన తెగ ప్రజలు ఎక్కువగా వాడుతుంటారు. సైనికులు కూడా వాడుతూ ఉంటారు. ఇటువంటి బియ్యం మాకు కూడా దొరికితే బాగుండు అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం వినండి వివరాలు చెప్తాను. కరీంనగర్ జిల్లా శ్రీరాములు పల్లికి చెందినటువంటి శ్రీకాంత్ అనే రైతు అస్సాం తో పాటు తొమ్మిది రాష్ట్రాలు తిరిగి ఈ ధాన్యం గురించి తెలుసుకున్నాడు. అతడు ఇప్పుడు తన ఊరిలో ఈ ధాన్యాన్ని సాగు చేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న అనేకమంది రైతులు అతని దగ్గరకు వెళ్లి, ఈ బొకాసాలు అనేటువంటి వరి ధాన్యం విత్తనాలు తెచ్చుకుంటున్నారు. ఈ బియ్యం వండుకోవడానికి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు. పోయ్యి మండించవలసిన అవసరం లేదు. ఈ బియ్యాన్ని చన్నీళ్లలో వేస్తే చల్లని అన్నం, వేడి నీళ్లలో వేస్తే వేడి అన్నం వెంటనే రెడీ అయిపోతుంది. ఇంకో కొసమెరుపేంటో తెలుసా అండి….. ఈ అన్నంలో కూర కూడా వేసుకోవలసిన అవసరం లేదు. వట్టి అన్నమే తినొచ్చు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.