Tuesday, 5 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విశ్వవిద్యాలయం విజయం: సమన్వయంతో సాధించిన జాతీయ, రాష్ట్ర అవార్డులు…

నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో సోమవారం వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ యం. పృథ్వీరాజ్ రాష్ట్రపతి అవార్డు అందుకోవడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ అవార్డును పృథ్వీరాజ్ ఈ నెల 29వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించనున్నారు. వైస్ ఛాన్సలర్ తెలిపారు, గత మూడు సంవత్సరాలుగా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వరుసగా రాష్ట్రపతి అవార్డులు లభించడం విశేషం. 2020–21లో చుక్కల పార్ధసారధి, 2021–22లో సాత్విక, 2022–23లో పృథ్వీరాజ్ రాష్ట్రపతి అవార్డులు పొందారు. అలాగే, రాష్ట్ర స్థాయిలో బెస్ట్ టీచర్ అవార్డులు కూడా విశ్వవిద్యాలయానికి లభించాయని ఆయన తెలిపారు. 2022లో ఆచార్య సిహెచ్ విజయ, 2024లో డాక్టర్ కె.వి. ప్రభాకర్, 2025లో ఆచార్య సుజా ఎస్. నాయర్ ఈ అవార్డులు పొందారు. వైస్ ఛాన్సలర్ ప్రత్యేకంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ అల్లం ఉదయశంకర్ ను అభినందించారు. ఆయన కృషి, మార్గదర్శకత వల్లే విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందుతున్నారని తెలిపారు. ఆచార్య అల్లం శ్రీనివాసరావు అన్నారు, విశ్వవిద్యాలయం పొందుతున్న అవార్డులు కేవలం వ్యక్తిగత కృషి ఫలితం మాత్రమే కాక, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మధ్య సమన్వయం ఫలితమని, ఎన్ఎస్ఎస్ విభాగం ద్వారా సమాజ సేవలో నిరంతర ప్రేరణను ఇవ్వడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు ఆయన వివరించారు: రాష్ట్రపతి అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులు, విద్యార్థుల స్వతంత్రత, సృజనాత్మకత మరియు సమూహ సహకారంను స్పష్టంగా చూపిస్తున్నాయని. అవార్డులు ద్వారా విశ్వవిద్యాలయం శిక్షణా విధానాలు, విద్యార్థుల సామాజిక చైతన్యం, అధ్యాపకుల నైపుణ్యం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయని. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా, విద్యా, పరిశోధనా కార్యక్రమాలను విస్తరిస్తూ, విశ్వవిద్యాలయం నైపుణ్యం, సృజనాత్మకత మరియు సామాజిక బాధ్యతా రంగంలో నాయకత్వం కొనసాగిస్తుందని. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత తెలిపారు, “విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు విద్యార్థులు, అధ్యాపకుల కృషికి ప్రతిఫలమే.” కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ విజయ మాట్లాడుతూ, “విశ్వవిద్యాలయం తరఫున విద్యార్థులు, అధ్యాపకులు పొందే అవార్డులు మనందరికీ గర్వకారణం. ఇలాంటి విజయాలు మరిన్ని విద్యార్థులను సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడానికి ప్రేరేపిస్తాయి” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ యస్ బి సాయినాథ్, డాక్టర్ శంకర్ ,డాక్టర్ సుచరిత, పి ఆర్ ఓ డాక్టర్ నీల మణికంఠ మరియు విశ్వవిద్యాలయ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొనారు.

తిరుపతి

శ్రీకాళహస్తి యంగ్ ఎంప్లాయిస్ సోషల్ సర్వీస్ వారిచే పోలీసులకు రైన్ కోట్స్ వితరణ

శ్రీకాళహస్తి యంగ్ ఎంప్లాయిస్ సోషల్ సర్వీస్ (YESS) వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందికి వర్షాకాలంలో ట్రాఫిక్ విధులను సమర్థవంతంగా నిర్వహించుటకు అవసరమైన రైన్ కోట్స్ ను(జర్కిని)మరియు 30 లాఠీలను వితరణ చేయడం జరిగినది.వీరు శ్రీకాళహస్తి పట్టణ నందు చాలా ఏళ్లుగా పోలీస్ వారికి కి వివిధ రకాలుగా సహాయం చేస్తూ వారి యొక్క ఘనతను చాటుకుంటున్నారు.గతంలో కూడా ట్రాఫిక్ సిబ్బందికి హెల్మెట్లు,రేడియం జాకెట్స్, లైటింగ్ బాటెన్సు ఇవ్వడం జరిగినదని,ఈ సందర్భంగా ఆ సంస్థ వారు గుర్తు చేసుకున్నారు.ఇలా నిరంతరం పోలీస్ వారికి సహకారం అందిస్తున్న స్వచ్ఛంద సేవ సంస్థ యంగ్ ఎంప్లాయ్ సోషల్ సర్వీస్ (YESS)వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒకటో పట్టణ సిఐ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నాగర్‌కర్నూల్

సీఎం రేవంత్ పింఛన్లు పెంచుతాడా… రాజీనామా చేస్తాడా..? మందకృష్ణ మాదిగ డిమాండ్

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22 కొల్లాపూర్ టౌన్ అసెంబ్లీ ఎన్నికల ముందు వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పింఛన్ డబ్బులను పెంచుతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకునేందుకే ఉద్యమం ప్రారంభించామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. సోమవారం కొల్లాపూర్ నియోజక వర్గ స్థాయి వృద్ధుల వికలాంగుల ఒంటరి మహిళల సన్నాహక సభ పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కిరణ్ చారి అధ్యక్షతన జరిగిన సభ లో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ నిరుపేదల పింఛన్ డబ్బులు పెంచుతారో లేక రాజీనామా చేస్తాడో రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బడుగు బలహీనులు కేవలం పింఛన్ డబ్బులతోనే జీవనం గడుపుతున్న వారి సాధక బాలకాలను గురించి పట్టించుకోవడం పట్ల మందకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 21 నెలలు పూర్తయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడానికి రాష్ట్రవ్యాప్తంగా తాను పేద బిడ్డల తరఫున పర్యటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నీ వర్గాల ప్రజల పెన్షన్ డబ్బులు పెంచాలని కోరుతూ జూలై 15వ తేదీన తాను మొదలుపెట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఎప్పటికీ 109 అసెంబ్లీ నియోజకవర్గల లో పర్యటించినట్లు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.పట్టణంలో మందకృష్ణ పై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పుల్ల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కాటం జమ్ములయ్య, పుట్టపాక రాముడు, నాగులపల్లి లక్ష్మయ్య, కొండూరు రాముడు తదితరులు నాయకులు పాల్గొన్నారు

కాకినాడ

కార్మికులపై అదనపు పనిభారం తగదు.. ఏపి నిర్ణయం ఉపసంహరించాలి

కనీస వేతనాలు పెంచకుండా కార్మికులపై శ్రమభారం మోపేలా రోజుకు రెండు పని గంటలు అదనంగా పెంచడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ప్రభుత్వం వహించిన ఆమోదం ప్రజా వ్యతిరేక విథానమని పౌర సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కార్మికులకు రక్షణ కరువైన రోజుల్లో రాత్రి షిఫ్టుల్లో పని చేయాలనడం మహిళల భద్రతకు పెను ముప్పుగా ఉంటుందన్నారు. కార్మిక శ్రేయస్సు కోసం విధానాలు మార్పు చేయాలన్నారు.8 గంటల పని విధానం ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పోరాడి సాథించుకున్న హక్కు కాగా ఏపి లో 10గంటల పని వేళలు పెంపు చేయడం మంచి పరిణామం కాదన్నారు. కార్మిక వ్యతిరేకత వలన ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతుందన్నారు. మూడుపార్టీల కూటమి లో ముప్పు వాటిల్లే నిర్ణయాలు వహించడం ముదావహం కాదన్నారు.

తూర్పు గోదావరి

టిడిపి సిటీ అధ్యక్షుడిగా మజ్జి రాంబాబు నూతన కమిటీని ప్రకటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

టీడీపీ సిటీ అధ్యక్షుడుగా మజ్జి రాంబాబు నూతన కమిటీని ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులు పార్టీ అధిష్టానం నుంచి నగర టీడీపీ కార్యాలయానికి రాగా మన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాన్ పార్టీ కార్యాలయంలో వెల్లడించారు. నగర టీడీపీ అధ్యక్షుడిగా మజ్జి రాంబాబు, జనరల్ సెక్రటరీ బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకీ రామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులు కంటిపూడి శ్రీనివాస్, కరగాని వేణు, మొకమాటి సత్యనారాయణ, కార్యదర్శులు కడలి రామకృష్ణ, ద్వారా పార్వతి సుందరి, మహ్మద్ అస్లం, కోశాధికారి శెట్టి జగదీష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది పార్టీ కోసం కష్టపడిన వారికి దక్కిన గౌరవమన్నారు. త్వరలోనే భారీ జననందోహంతో ప్రమాణస్వీకార చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం ఆనవాయితీగా జరిగే ప్రక్రియలో భాగమన్నారు. కమిటీ సభ్యులుగా నియమించాలని తాను ఏదో పేరు ఇచ్చేస్తే వారిని ఆమోదించేసే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదన్నారు. అందరి ఆమోదంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి పేర్లను అధిష్టానానికి పంపిన తరువాత వారి నియామకం కోసం ఐవిఆర్ఎన్ కాల్స్ చేయడం జరిగిందన్నారు. అందరి ఆమోదంతోనే ఈ కమిటీ నియామకం జరిగిందని వెల్లడిరచారు. కాగా నూతన కమిటీ సభ్యులను నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శాలువాలతో సత్కరించారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ అధినాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమకు పదవు వచ్చేందుకు అనునిత్యం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిక్కి నాగేంద్ర, యిన్నమూరి దీపు, నక్కా దేవివరప్రసాద్, కోసూరి చండిప్రియ, దాస్యం ప్రసాద్, కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

టిడిపి సిటీ అధ్యక్షుడిగా మజ్జి రాంబాబు నూతన కమిటీని ప్రకటించి

టీడీపీ సిటీ అధ్యక్షుడుగా మజ్జి రాంబాబు నూతన కమిటీని ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులు పార్టీ అధిష్టానం నుంచి నగర టీడీపీ కార్యాలయానికి రాగా మన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాన్ పార్టీ కార్యాలయంలో వెల్లడించారు. నగర టీడీపీ అధ్యక్షుడిగా మజ్జి రాంబాబు, జనరల్ సెక్రటరీ బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకీ రామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులు కంటిపూడి శ్రీనివాస్, కరగాని వేణు, మొకమాటి సత్యనారాయణ, కార్యదర్శులు కడలి రామకృష్ణ, ద్వారా పార్వతి సుందరి, మహ్మద్ అస్లం, కోశాధికారి శెట్టి జగదీష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది పార్టీ కోసం కష్టపడిన వారికి దక్కిన గౌరవమన్నారు. త్వరలోనే భారీ జననందోహంతో ప్రమాణస్వీకార చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం ఆనవాయితీగా జరిగే ప్రక్రియలో భాగమన్నారు. కమిటీ సభ్యులుగా నియమించాలని తాను ఏదో పేరు ఇచ్చేస్తే వారిని ఆమోదించేసే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదన్నారు. అందరి ఆమోదంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి పేర్లను అధిష్టానానికి పంపిన తరువాత వారి నియామకం కోసం ఐవిఆర్ఎన్ కాల్స్ చేయడం జరిగిందన్నారు. అందరి ఆమోదంతోనే ఈ కమిటీ నియామకం జరిగిందని వెల్లడిరచారు. కాగా నూతన కమిటీ సభ్యులను నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శాలువాలతో సత్కరించారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ అధినాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమకు పదవు వచ్చేందుకు అనునిత్యం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిక్కి నాగేంద్ర, యిన్నమూరి దీపు, నక్కా దేవివరప్రసాద్, కోసూరి చండిప్రియ, దాస్యం ప్రసాద్, కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారి కల -కోలా ఆనంద్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సేవ పక్షోత్సవాల్లో భాగంగా ఆరోవ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగ కాలనీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ నేతృతంలో బిజెపి యువమోర్చా,పట్టణ కమిటీ కూటమి నాయకులు కలిసి స్వచ్ఛ భారత్ లో భాగంగా పాఠశాల పరిసరాలను శుభ్రపరచడం జరిగినది.

ఖమ్మం

*బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మహిళ మృతి?*

*బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మహిళ మృతి?* పున్నమి: ప్రతినిథి ఖమ్మం T.Ravinder ఖమ్మం. తెలంగాణలో ఆదివారం నుండి బతుకమ్మ సంబ రాలు మొదలు అయిన నేపథ్యంలో బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూసింది. విషాదకరమైన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. వివాహిత శెట్టి మౌనిక(32) ఉదయం నుండి ఇద్దరు కూతుర్లు, కొడుకుతో కలిసి ఎంతో ఆనందంతో తీరొక పూలను తెంపుకొచ్చి ఆ పూలతో బతుకమ్మను పేర్చింది. సాయంకాలం సమయంలో స్థానిక దేవాలయంలో కుటుంబ సభ్యులతో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయింది. దీంతో పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. దీంతో పండగ పూట ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది,

తూర్పు గోదావరి

పేద మధ్యతరగతి ప్రజలకు వరం జిఎస్టి సంస్కరణలపై ఎంపీ పురందేశ్వరి హర్షం

పేద,మధ్య తరగతి ప్రజలకు వరం జీఎస్టీ సంస్కరణలపై ఎంపీ పురందేశ్వరి హర్షం -ప్రధాని మోదీకి, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు రాజమహేంద్రవరం, సెప్టెంబరు 22: జీఎస్టీ సంస్కరణలు పేద మధ్య తరగతి ప్రజలకు నిజంగా ఒక వరమని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. స్థానిక దేవీచౌక్ లో శ్రీశ్రీశ్రీ బాల త్రిపుర సుందరీ దేవి 92వ దేవీ నవరాత్రి మహోత్సవాల ప్రారంభం సందర్బంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు చెప్పారు. ఒకపక్క దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమైన వేళ, మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలు తీసుకు రావడం ఆనంద దాయకమన్నారు. శరన్నవరాత్రుల సమయంలో జీఎస్టీ తగ్గించి, ప్రజలకు మంచి చేసిన ప్రధాని మోదీ నిండు నూరేళ్లు అయోరారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు ఆమె తెలిపారు. గతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్ను విధానం ఉండేదని ఎంపీ పురందేశ్వరి గుర్తుచేసారు. అయితే దీనివలన పెట్టుబడులు పెట్టేవారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం గమనించి, ఒకే దేశం, ఒకే పన్ను విధానం కింద జిఎస్టీని 2017లో జులై 1న ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దీనివలన ఎంతో ప్రయాజనం చేకూరిందన్నారు. ఇప్పుడు జీఎస్టీ 2.0 ద్వారా నాలుగు స్లాబులున్న జిఎస్టీని రెండు స్లాబుల్లోకి తెచ్చారని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం గా జిఎస్టీని దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 5శాతం, 18శాతంగా రెండు స్లాబుల్లో పెట్టారని ఆమె తెలిపారు. దీనివలన ధరల పెరుగుదలను నియంత్రించుకునే అవకాశం కలిగిందని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయం కోసం వాడే పరికరాలు జీఎస్టీ సరళీకృతం వలన ధరలు తగ్గి, రైతులకు రాబడి పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే పురుగు మందులు, ఎరువుల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఆరోజు నందమూరి తారకరామారావు మిల్లు ధరలకే నూలుని చేనేత వర్గాలకు అందించి, జనతా వస్త్రాలను ప్రవేశపెడితే, ప్రస్తుతం ప్రధాని మోదీ నూలుపై 18శాతం పన్నుని 5శాతానికి తగ్గించి, చేనేత రంగానికి సానుకూల ఫలాలు అందేలా చేశారని ఎంపీ పురందేశ్వరి అన్నారు. తినుబండారాలపై చాలావరకు జీఎస్టీ ఎత్తివేయడం వలన ఆహారం పేదలందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటికే జనఔషధి కేంద్రాలను ప్రవేశ పెట్టి మందులను పేదలకు అందుబాటులోకి తెచ్చారని, ఇప్పుడు కొన్ని మందులపై జీఎస్టీ ఎత్తివేసి మరింత చేరువ చేసారని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన చర్యల వలన 11వ ఆర్ధిక శక్తిగా ఉన్న భారత్ 4వ స్థానానికి వచ్చిందని, ఇప్పుడు మూడవ స్థానానికి రావడానికి ఈ సంస్కరణలు దోహదం చేస్తాయని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగంలో కూడా జీఎస్టీ తగ్గించారని, దీనివలన చిన్న కార్లు తగ్గే అవకాశం ఉందన్నారు. పెద్ద కార్లకు 40శాతం డ్యూటీ తగ్గించడం వలన అవి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన ప్రధాని మోదీకి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్లెక్షీతో ప్రదర్శన చేసారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, పార్టీ నాయకులుఎపిఆర్ చౌదరి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, హీరాచంద్ జైన్, యానపు ఏసు, కాలెపు సత్యసాయి రామ్, పడాల శివ నాగరాజు, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు

కాకినాడ

కాకినాడ ఐడిఎ ఆధ్వర్యాన ప్రపంచ క్యాన్సర్ రోగుల సంక్షేమ దినోత్సవం ( ప్రపంచ గులాబీ దినోత్సవం )

స్థానిక రమణయ్య పేట లో కేన్సర్ ని జయించిన మహిళల కు కాకినాడ ఐడిఎ సభ్యులు వారికి పండ్లు మరియు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ ఐడిఎ కార్యదర్శి డా అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22న క్యాన్సర్ రోగులకు ఆశ, ధైర్యం మరియు ఓదార్పును తెలియజేయడానికి అంకితం చేయబడిన ఈ దినోత్సవం క్యాన్సర్ రోగుల సంరక్షణ, మద్దతు మరియు మానసిక స్థైర్యాన్ని పెంచడానికి అంకితం చేయబడిందని తెలిపారు. ఈ దినోత్సవం క్యాన్సర్ తో పోరాడుతున్న వారికి ఆశ, సంకల్పం మరియు ధైర్యం యొక్క చిహ్నంగా గులాబీ పువ్వులను ఉపయోగించుకుంటుందని, క్యాన్సర్ రోగులకు మెరుగైన సంరక్షణ, మద్దతు మరియు వనరుల అవసరాన్ని నొక్కి చెప్పడానికి ఈ రోజు ఉద్దేశించబడిందని, క్యాన్సర్ నివారణ, చికిత్సల గురించి అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం దోహదపడుతుందనీ,రోగులు, వారి కుటుంబాలకు మద్దతుగా నిలవడం, వారి చికిత్సా విధానంలో వారికి ఊరట కలిగించడం, క్యాన్సర్ రోగులకు సహాయం అందించే సంస్థలకు విరాళం ఇవ్వడం, క్యాన్సర్ రోగులతో మాట్లాడటం, వారికి మానసిక ధైర్యం చెప్పడం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వేంకటేశ్వర రావు, కాకినాడ ఐడిఎ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు .

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.