Tuesday, 5 May 2026

Blog

తెలంగాణ

బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు కొన్ని శాఖల ద్వారా జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈనెల 23న బుద్ధవనంలో ప్రత్యేకంగా బతుకమ్మ ఉత్సవాలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 23న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ,డిసీహెచ్ఎస్, యువజన సర్వీసులు, కార్మిక శాఖలు, ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలని, 24న వ్యవసాయ,ఉద్యాన, సెరికల్చర్, హ్యాండ్లూమ్స్, పశుసంవర్ధక శాఖలు, 25న మున్సిపల్, ట్రాన్స్కో ఫిషరీస్, సంక్షేమ శాఖలు, ఆధ్వర్యంలో నిర్వహించాలని,26న డిఆర్డిఓ,డిపిఓ,సిపిఓ, ఆర్టీసీ,మెప్మా శాఖలు నిర్వహించాలని, 27న అటవీశాఖ, పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ఆర్డిఓ శాఖలు నిర్వహించాలని,28న రెవెన్యూ, దేవాదాయ,సహకార, పౌర సంబంధాల, టీఎన్జీవో, సర్వే ల్యాండ్ రికార్డ్స్ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. 29న జిల్లా విద్యాశాఖ, అన్ని ఇంజనీరింగ్ శాఖలు, మెప్మా తో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈనెల 30న బార్ అసోసియేషన్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. నల్గొండ ఆర్డిఓ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, మున్సిపల్ కమిషనర్, ఎన్ జి కళాశాల మైదానంలో లైటింగ్, డయాస్, తాగునీరు, ఇతర ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖ తరపున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బుద్ధవనంలో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నందికొండ మున్సిపల్ కమిషనర్, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్, పెద్దవూర తహసిల్దార్ లు, ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ

GST బచత్ ఉత్సవ్ పై కేటీఆర్ ఫైర్ – ప్రజలకు నిజమైన ఉపశమనం ఎప్పుడు?

GST సంస్కరణలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “8 ఏళ్లుగా ప్రజల నుంచి వసూలు చేసిన భారీ GST మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారా? మీరు చెబుతున్న GST బచత్ ఉత్సవ్ అంటే ప్రజలతో ఆటలాడటమే. నిజంగా ప్రజల భారం తగ్గించాలంటే ముందుగా డీజిల్, పెట్రోల్ ధరలను రూ.50కి, గ్యాస్ సిలిండర్ ధరను రూ.350కి తగ్గించండి. GST డబ్బును తిరిగి ప్రజలకు ఇవ్వండి. అప్పుడు మాత్రమే నిజమైన ఉత్సవాలు జరుగుతాయి” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మోసపూరిత కార్యక్రమాలు కాకుండా, నిజమైన ఉపశమనం అందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బీడీఎమ్ ఏఐ నేషనల్ జాయింట్ సెక్రటరీగా రామచంద్రారెడ్డి

బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియ నా నేషనల్ జాయింట్ సెక్రెటరీ గా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలో న ప్రఖ్యాతిగాంచిన బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసి యేషన్ ఆఫ్ ఇండియా (బిడిఎమ్ఎఐ) నేషనల్ జాయింట్ సెక్రెటరీగా ఎస్ ఆర్ సి లాబొరేటరీస్ మేనేజి ంగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఏలూరి రామ చంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ అసోసి యేషన్ 34 వ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్ లోని గ్రాండ్ కాకతీయ హోటల్ జరిగింది. ఈ సమావె శానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి బిడిఎమ్ఎఐ ప్రతినిధులు హాజరు కావడం విశేషం. మన దేశానికి చెందిన బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు వున్న విషయం అందరికీ తెలిసిందే. డాక్టర్ ఏలూరి ఫార్మా రంగం ద్వారా అనేక సేవా కార్యక్ర మాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిం ది. ముఖ్యంగా కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రంతో పాటు కర్ణాటక రాష్ట్రంలో క ూడా బాధితులకు ఉచితంగా మెడిసిన్, మాస్క్ లు, శానిటైజర్ తదితర ఉచిత సేవలను అందిం చడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన చేసిన సేవలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసిం చడం విశేషం. ఈయన సేవ కార్యక్రమాలను కొన సా గిస్తూనే మరోవైపు సామాజిక ప్రజా ఉద్యవ ూలను నిర్వహించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొ న్నారు. బల్క్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ గా ఏకగ్రీ వంగా ఎన్నికైన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కి పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్బంగా డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ అం ర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు వున్న బల్క్ అసో సదస్సులో పాల్గొన్న ఏలూరి రామచంద్రారెడ్డి సియేషన్ కు జాయింట్ సెక్రెటరీగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాల ఆనందంగా ఉందన్నారు. ఫార్మార o గాన్ని అభివృద్ధి చేసేందుకు, తద్వారా దేశం మరింత వేగంగా ముందుకు వెళ్లేందుకు తన వంతు కృషిచేస్తా నని అన్నారు… జాయింట్ సెక్రెటరీ పదవికి ఎంపి క వడం పట్ల ఏలూరి అభిమానులు మిత్రులు శ్రేయో భిలాషులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెంచలకోనలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

రాపూరు మండలంలోని ప్రసిద్ధ పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సోమవారం దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తుల ఉత్సాహం మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు సౌభాగ్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కరుణ కటాక్షాలు కురిపించారు. దసరా నవరాత్రుల సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి అమ్మవారి దివ్యదర్శనం పొందారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాదాలను స్వీకరించారు. దేవస్థాన అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయగా, భక్తులంతా ఆనందభరితమైన వాతావరణంలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. దసరా ఉత్సవాలు వచ్చే రోజుల్లో కూడా వైభవంగా కొనసాగనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రజా ధరణ కలిగిన నేత నరేంద్ర మోడీ

అభినందనలు తెలిపిన నీరుకొండ వీరన్న చౌదరి జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు సరుకులు అందుబాటులో ఉండేలాగా నిత్యావసర వస్తువులు హెయిర్,ఆయిల్,టూత్ పేస్ట్, సబ్బులు ఎలక్ట్రానిక్ ఏసీ,టీవీ వాషింగ్ మిషన్ రెండు చక్రాల వాహనాలు పెట్రోల్ డీజిల్ విద్యారంగానికి విద్యార్థులకు స్టేషనరీ రైతులకు వ్యవసాయ పనిముట్లు ప్రజలకు అనారోగ్యానికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ పై భారీగా తగ్గింపు ,వైద్య రంగంలో 33 ప్రాణ రక్షక మందులు పన్ను నుంచి మినహాయింపు.సామాన్యులకు కిరాణా,175 వస్తువులపై జీఎస్టీస్ శ్లాబులను తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవటం చాలా మంచి శుభ సూచకమని రాజానగరం బీజేపీ ఇన్ ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు మధ్య తరగతి వారికి లబ్ధి చేకూర్చేందుకు, ఎంత గానో ఉప యోగ పడుతుందన్నారు,కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన వస్తు సేవల పన్ను కౌన్సిల్ 56వ సమావేశంలో ప్రతిపాదించారు కొత్త పన్ను రేట్లు ఈరోజు నుంచి అమల్లోకి వస్తాయి.ఇది ప్రజలకు దసరా,దీపావళి కానుకగా నిర్ణయించి శుభవార్త చెప్పిన ప్రదానమంత్రి నరేంద్రమోదీ కి కృతజ్ఞతలు తెలిపారు

తెలంగాణ

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్న : అదనపు కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ ఆదరణ కలెక్టర్ జె. శ్రీనివాస్ జిల్లా అధికారులను కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా అధికారులు వారికి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించాలని, అదేవిధంగా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో మండల, గ్రామస్థాయిలో పనిచేసే వారి సిబ్బందికి ఇదేవిధంగా ఆదేశించాలని చెప్పారు. ఈ సోమవారం(సెప్టెంబర్ 22) రోజున మొత్తం 72 దరఖాస్తులు రాగా, ఇందులో రెవెన్యూ శాఖకు 46, తక్కినవి వివిధ శాఖలకు సంబంధించి వచ్చాయి. ఎప్పటిలాగే వ్యక్తిగత అంశాలు, భూములకు సంబంధించిన విషయాలు,తదిత అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.

తెలంగాణ

రహదారుల నిర్మాణంలో భాగంగా భూసేకరణ త్వరగా చేయాలన్న : సీఎం

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మిగిలిపోయిన భూసేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయం నుండి జాతీయ రహదారణ నిర్మాణం,విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దసరా పండుగకు ముందే అన్ని జాతీయ రహదారుల భూ సేకరణ పనులు పూర్తి కావాలని చెప్పారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించి పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. రహదారి నిర్మాణ పనులలో జాప్యం జరగకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని, భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని ముఖ్యమంత్రి అన్నారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తూర్పు గోదావరి

కుమారదేవం లో విజయ దుర్గఅమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(సెప్టెంబర్22) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో గ్రామంలో వాటర్ ట్యాంక్ వీధిలో విజయదుర్గ అమ్మవారి 14 వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా దేవి శరన్నవరాత్రి అమ్మవారి మండపంలో విజయదుర్గ అమ్మవారిని పురోహితులు వెలవెల పల్లి ప్రకాశరావు వేదమంత్రాలతో విగ్రహాన్ని ఈరి వీర్రాజు దంపతులు మరియూ వారి కుటుంబ సభ్యులు ఎంతో వైభవంగా ప్రతిష్టా కార్యక్రమం నిర్వహింపచేశారు,ముందుగా అమ్మవారిని విగ్రహ దాత ఇంటినుండి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి మండపంలో ప్రతిష్టించారు,ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా గ్రామంలోని మహిళా భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు,మా ప్రతినిధి అమ్మవారి మండప ప్రత్యేక తలు గురించి కమిటీ వారిని అడుగగా 14 సంవత్సరాల క్రితం చిన్నపిల్లలచే చిన్నగా మొదలైన ఈ మహోత్సవాలు ఈరోజు అమ్మవారి దయవల్ల ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము ,ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది అది కమిటీ వారు అమ్మవారికి మొదటగా పెట్టిన చీరని భక్తులు వేలం పాటలో పోటీ పడి దక్కించుకుంటారు,కారణం ఏమిటి అంటే చీర పాడుకున్నవారికి వారు కోరుకున్న కోరికలు తీరుతాయి అని నమ్మకం లో పోటీ పడి పాడుకుంటారు అని అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం

హత్య కేసుల్లో నిందితులకి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులని సన్మానించిన జిల్లా ఎస్ పి. రోహిత్ రాజ్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ భద్రాద్రి కొత్త గూడెం జిల్లా హత్య కేసుల్లో నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరియు కోర్టు డ్యూటీ అధికారులను భాద్రాద్రి కొత్త గూడెం జిల్లా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం నాడు సన్మానించారు జిల్లా లోని అశ్వరావుపేట,మణుగూరు మరియు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో నమోదైన హత్య కేసు ల్లో నేరస్తులకు శిక్షలు పడే విధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరియు కోర్టు డ్యూటీ అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా లోక్ అదాలత్ ద్వారా అత్యధికంగా కేసుల పరిష్కారంలో ప్రతిభ కనబరిచిన చుంచుపల్లి మరియు సుజాత నగర్ కోర్టు డ్యూటీ అధికారులను కూడా ఈ సందర్భంగా అభినందించారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవిడి లక్ష్మీ,అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసీక్యూటర్స్ లావణ్య,విశ్వశాంతి,రాజారావు లని,మణుగూరు కోర్టు డ్యూటీ అధికారి అశోక్,కొత్తగూడెం 3టౌన్ కోర్ట్ డ్యూటీ అధికారి హేమీలాల్ మరియు అశ్వారావుపేట కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ నాగేశ్వరరావు లను మర్డర్ కేసుల్లోని నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసినందులకు గాను మరియు సుజాతనగర్ కోర్ట్ డ్యూటీ అధికారి మోహన్,కొత్తగూడెం 3టౌన్ పిఎస్ JFCM కోర్ట్ డ్యూటీ అధికారి శోభన్ లను ఇటీవల లోక్ అధాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేసినందుకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,3టౌన్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్,కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై రాఘవ మరియు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

టీఎస్ పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా శాఖ కు రిలీఫ్ ఫండ్ కు విరాళం

కామారెడ్డి, 22 సెప్టెంబర్,పున్నమి ప్రతినిధి   : ఊహించని వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న కామారెడ్డి జిల్లా ప్రజలకు సహాయం చేయడానికి,  తెలంగాణ పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ముందుకు వచ్చింది. వరద సహాయ నిధి కోసం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కు  (ఏడు లక్షల ఆరు వేల పదకొండు రూపాయ లు) విలువైన డీడీని ఈ రోజు కలెక్టరేట్‌లో అందజే శారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, తెలంగాణ పిఆర్టి సంఘ సభ్యులు, జిల్లా బాధ్యుల ను అభినందించారు. ఆపదలో ఆదుకోవడానికి ముందుకు వచ్చిన మీరు ఇతర సంఘాలకు ఆద ర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఇలాంటి సామా జిక కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి జిల్లా అభి వృద్ధికి తోడ్పడాలని సూచించారు. పీటిఆర్టి యు జిల్లా అధ్యక్షులు అల్లాపూర్ కుశాల్ మాట్లాడుతూ, తమ సంఘం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారా నికే కాకుండా, సామాజిక కార్యక్రమాలలో  ముందుంటుందని చెప్పారు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. ముఖ్యంగా 39 పాఠశాలలను దత్తత తీసుకుని మౌలిక వసతులు కల్పించడం, రెడ్ క్రాస్ సౌజన్యంతో 6 సార్లు రక్తదా న శిబిరాలు నిర్వహించి 900కు పైగా బ్లడ్ యూని ట్లు సేకరించడం, కరోనా సమయంలో 22 రోజుల పాటు నిరంతరాయంగా 200 మందికి అన్నదానం చేయడం, ప్రతి మండల శాఖ పేదలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం వంటి కార్యక్రమాల ను వివరించారు.ఈ కార్యక్రమాలకు సహకరించిన  ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర సంఘ అధ్యక్షు లు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భీష్మ గౌడ్, పెద్దలు బి. మోహన్ రెడ్డి, పి. వెంకట్ రెడ్డి, వంగ మహేందర్ రెడ్డి, గుండు లక్ష్మణ్ లకు ధన్యవా దాలు తెలిపారు. అలాగే జిల్లాలోని అన్ని మండలా ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, బాధ్యులకు, ప్రాథమిక సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోడీఈఓ రాజు, టి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సహాధ్యక్షులు జే. మధుసూదన్ రెడ్డి, సంగారెడ్డి, గోవర్ధన్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మండ్లు, రమణ, రామచం ద్ర రెడ్డి, ప్రసాద్, సంతోష్ లతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బాధ్యులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.