Tuesday, 5 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

అవకాశాలను అందిపుచ్చుకోవాలి – డా.రజనీ

అవకాశాలను అందిపుచ్చు కోవాలి ‘యువత ముందున్న అవకాశాలను అందిపుచ్చు కోవాలని’డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వావిద్యాలయం ఉపకులపతి డా. రజని అన్నారు. గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ కళాశాల లో గురజాడ విద్యా సంస్థలు, విశ్వ సాహితీ కళావేదిక సంయుక్తoగా నిర్వహించిన యువ కవితా మహోత్చవం లో ఆమె ముఖ్య అతిధి గా పాల్గొని ‘దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. యువత మేధను మనదేశ అభివృద్ధికి దోహదపడాలని, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుచొబెట్టే బాధ్యత యువతదేన’ని అన్నారు.విద్యా సంస్థ ల అధినేత జి. వి. స్వామి నాయుడు విద్యార్థులు తమ సమయం లో కొంత బాగాన్ని కళలు కోసం కేటాయించుకోవాలన్నారు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.వి.జి.డి. బాలాజీ,’విద్యార్థులు తరగతి నాలుగు గోడల మధ్య నుంచి భవిష్యత్ కు పునాదులు వేసుకోవాలని’కోరారు.విశ్వ సాహితీ కళాసమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కె. రమావతి ‘యువత కు నాటి, నేటి సాహిత్యం ను పరిచయం చేసి, వారితో రచనలు చేయించి వాటిని విశ్వ వేదికలపైన పరిచయం చేయాలనే తళంపుతో సంస్థ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం జరిగిన సమావేశం లో గజల్ శ్రీనివాస్ పాల్గొని తన ప్రసంగం తో, పాటతో యువత కు స్ఫూర్తినిచ్చారు.ఈ కార్యక్రమం లో జంద్యాల శరత్ బాబు, గౌరిశంకర్, ఈ వేమన, ముకుందరావు, తదితరులు పాల్గొన్నారు.

భక్తి

దుర్గమ్మకు ప్రత్యేక మంగళసూత్రాలతో అలంకారం

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ విజయవాడ కనకదుర్గమ్మకు 12 రకాల మంగళసూత్రాలు ఉన్నాయి. దసరా సహా ప్రత్యేక ఉత్సవాల్లో వీటిని అమ్మవారికి అలంకరిస్తారు. మూల విరాట్తో పాటు కల్యాణమూర్తులకు కూడా వీటితోనే అలంకరిస్తారు. సాధారణంగా బ్యాంకు లాకరులో భద్రపరిచే ఈ మంగళసూత్రాలను ఉత్సవాల్లో మాత్రమే బయటకు తీస్తారు. దసరా సందర్భంగా దుర్గమ్మ 11 రోజుల్లో 11 రూపాల్లో దర్శనమివ్వగా, ఒక్కో అలంకారానికి అనుగుణంగా ప్రత్యేక ఆభరణాలు, మంగళసూత్రాలు ధరిస్తారు.

ఆంధ్రప్రదేశ్

ఇష్టపడి, కష్టపడేతత్వంతో చదివితే ఉన్నతశిఖరాలను చేరుకోవచ్చు- గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న సిహెచ్.మహేష్(నరసన్నపేట)

విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరంలో ఉత్తమ ప్రతిభకనబరిచి పిన్నింటిపేట గ్రామానికి చెందిన సిహెచ్.మహేష్ గ్రాడ్యుయేట్ పట్టాను, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్ చేతులమీదుగా సోమవారం అందుకున్నారు. ఈ సందర్భంగా సిహెచ్.మహేష్ తల్లితండ్రులు సిహెచ్. వల్లభ రావు, రాజేశ్వరిలు ఒక ప్రకటనలో మాట్లాడుతూ మహేష్ చిన్ననాటి నుండే కష్టపడే తత్వమని, చదువులో ఎప్పుడూ ముందుండేవాడన్నారు. ఈ రోజు కంప్యూటర్ సైన్స్ లో, అత్యుత్తమ ప్రతిభకనబరిచి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకొని కళాశాలకు, తల్లితండ్రులకు మంచి పేరు తెచ్చాడని, ఇష్టపడి, కష్టపడే తత్వంతో చదివితే ఉన్నతశిఖరాలను చేరుకోవచ్చని బాగోద్వేగంతో తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

దేశమంతటా బీహార్ తరహా “ఓటర్ల జాబితా సవరణ” !

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ బీహార్ లో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటర్ల జాబితాలోని లోపాలను చూపించి ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం.. పోల్ బాడీ మీద ప్రజల్లో నమ్మకం తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నింటికీ చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది . బీహార్ లో చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో .. తీసేసిన ఓట్లను ఎందుకు తీసేశారో కారణం కూడా స్పష్టంగా చెప్పారు. ఆ తరహాలో ఇప్పుడు .. ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలన్నింటినీ సరిదిద్దాలని నిర్ణయించారు. బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) 2025లో ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన పెద్ద కసరత్తు. గత 20 సంవత్సరాల్లో పట్టణీకరణ, కార్మికుల వలసల వల్ల వచ్చిన డూప్లికేట్ ఎంట్రీలు, దొంగ ఓట్లను తొలగించడానికి; కేవలం పౌరులు మాత్రమే జాబితాలో ఉండాలన్న లక్ష్యంగా చేపట్టారు. మొత్తం 8 కోట్ల ఓటర్లకు ఫారమ్‌లు పంపిణీ చేశారు. 2003 జనవరి 1 నాటి ఓటర్లకు అదనపు డాక్యుమెంట్లు అవసరం లేదు. 2003 తర్వాత రిజిస్టర్ అయిన 3 కోట్ల మంది ధృవీకరణ చూపించాల్సి ఉంటుంది. దేశమంతటా ఇవే రూల్స్ అమలు చేసే అవకాశం ఉంది. ఓటర్ల జాబితాల అంశం ప్రతి సారి వివాదాస్పదమవుతోంది. అధికారంలో ఉన్న రాజకీయపార్టీలు.. కుట్రపూరితంగా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తప్పుడు మార్గాల్లో ప్రయత్నించడం వల్ల సమస్యలు వస్తున్నాయి. గత వైసీపీ హయాంలో అధికారుల్ని సైతం బెదిరించి వేల దొంగ ఓట్లు చేర్పించడం.. అసలైన ఓటర్లను తొలగించడం వంటివి ఏపీలో జరిగాయి. ఇవి అత్యంత ప్రమాదకరంగా మారాయి. చాలా చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి. SIR ప్రక్రియతో అన్ని లోపాలను తొలగించే అవకాశం ఉంది.

జాతీయ అంతర్జాతీయ

సంక్షోభం కాదు.. భారత్‌కు మంచి అవకాశం !

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ చైనా కన్నా ఎక్కువగా భారత్ ను లక్ష్యంగా చేసుకున్నారు ట్రంప్. అందులో సందేహం లేదు. బయటకు చెబుతోంది ఒకటి..చేస్తోంది ఒకటి. తీసుకుంటున్న నిర్ణయాలన్నీ భారత్ ను గురి పెట్టేవే. భారతీయుల్ని లక్ష్యంగా చేసుకునేవే. అందుకే ఇది సంక్షోభం అని కొంత మంది అంటున్నారు. కానీ అమితాబ్ కాంత్ లాంటి నిపుణులు మాత్రం ఇది సంక్షోభం కాదు గొప్ప అవకాశం అంటున్నారు. పాజిటివ్ గా ఆలోచిస్తే ఇదే నిజం. ఈ అవకాశాన్ని అంది పుచ్చుకోవడం మాత్రం మన చేతుల్లో అంటే మన ప్రభుత్వాలు, యువత చేతుల్లోనే ఉంది. మేథో వలసే మన దేశానికి అతి పెద్దశాపం అమెరికాలో ఉన్న నిపుణుల్లో అత్యధిక మంది భారతీయులే. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఫేస్‌బుక్ ఆలోచన వచ్చింది దాన్ని ప్రాథమికంగా వృద్ధి చేసింది భారతీయ మూలాలున్న వ్యక్తే. ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న టెక్నాలజీలు.. ఫార్మా ఆవిష్కరణల్లో భారతీయుల పాత్ర కీలకం. కానీ వారంతా అమెరికా నుంచే ఆ పని చేశారు కాబట్టి ఆ దేశానికి మేలు జరిగింది. అక్కడ ఆ ఎకోసిస్టమ్ ఉండబట్టి వారు వెళ్లారు. వైద్యులు, ఇంజినీర్లు సహా అన్ని వర్గాల మేథోవలస అమెరికాకు జరిగింది. ఆ మేరకు అమెరికా లాభం.. మనకు అతి పెద్దశాపంగా మారింది. ఇప్పుడు అవకాశాలను అందిపుచుకునే చాన్స్ ఒకప్పుడు ప్రతిభావంతులంతా అమెరికాకు వెళ్లడానికి క్యూ కట్టారు అంటే.. వారి ఆలోచనలకు తగ్గట్లుగా ఇక్కడ అవకాశాలు లేవని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొత్తగా యువతరం ఏం చేయాలనుకున్నా.. చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అమెరికాతో పోలిస్తే తక్కువ పెట్టుబడితోనే పనైపోతుంది. ఓ గూగుల్ ని.. మరో చాట్ జీపీటీని సృష్టించడానికి కూడా అవకాశం ఉంది. చాట్ జీపీటీ సృష్టిలోనూ సుచిర్ బాలాజీ అనే ఇండియన్‌దే కీలక పాత్ర. తర్వాత అతను అనుమానాస్పదంగా చనిపోయాడు. అందుకే ఇప్పుడు.. ఏం చేయాలనుకున్నా.. ఇండియా నుంచే చేయడానికి అవకాశం. ఇబ్బందులు ఉంటాయి.. అధిగమించి సక్సెస్ సాధిస్తేనే కిక్ ! అమెరికా టార్గెట్ చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. సాఫీగా సాగిపోతున్న జీవితానికి ఒడిదుడుకులు వస్తాయి. కానీ వాటిని అధిగమించి విజయం సాధించినప్పుడే అసలు కిక్ వస్తుంది. అలాంటి విజయమే మధురంగా ఉంటుంది. ఇప్పుడు భారత్ ట్రంప్ పెడుతున్న ఇబ్బందుల్ని అధిగమించి.. అమెరికాను దాటేలా .. విజయాలు సాధిస్తే.. అదే అసలైన కిక్ వస్తుంది. అప్పుడు అమెరికన్లలో భారత వీసాల కోసం..ఇక్కడ పని చేయడానికి క్యూ కట్టాల్సి రావొచ్చు. ప్రయత్నిస్తే ఇది అసాధ్యమైన విషయమేం కాదు.

ఆంధ్రప్రదేశ్

సిఎం రమేష్ కు వేసిన ఓటు ఈ జిల్లా అభివృద్ధికి చేటు

అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సిఎం రమేష్ కు వేసిన ఓటు జిల్లా అభివృద్ధికి చేటు కలిగి స్తుందని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పేర్కొన్నారు సోమవారం అయిన ఓప్రకటన విడుదల చేసి అనంతరం. మాట్లాడారు రాష్ట్రంలో సహకార రంగంలో ఎంతో పేరుగాంచిన.(చోడవరం) గోవాడ సుగర్స్ చరిత్ర కూటమి ప్రభుత్వ దయవల్ల ఈ ఏడాదితో ముగి సిట్లేనని తెలిపారు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సిఎం రమేష్ కు వేసిన ఓటు ఈ జిల్లాకు చేటు తేస్తుందని ముందుగానే చేప్పామని తెలిపారు ఎన్నికలకు ముందు ఫ్యాక్టరీని ఆదు కుంటానని ప్రగల్బాలు పలికిన సీఎం రమేష్ స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పుడు,పట్టించుకోకుండా పోయారని తెలిపారు రైతులకు సమాధానం చెప్పాల్సి వస్తుందని ఏకంగా మహాజన సభను కూడా మంగళం పాడేశారని తెలిపారు చెరకు రైతులు,కార్మికులకు ఇవ్వాల్సిన రూ.30 కోట్లు భకాయిలు విషయాన్ని కూడా ఎంపి ఎమ్మెల్యేలు పట్టించు కోవడం లేదన్నారు తన పోరాటాలు వల్లనే ఘగర్ ప్యాక్టరికి నడుస్తున్నట్లు పోజులు కోట్టిన చోవవరం నియోజకవర్గం జనసేన అదినేత పివియస్ఎన్ రాజు మటు మాయం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటువంటి నాయకులు నమ్ముకోని మూడు నియోకవర్గాలు రైతు మోస పోయారని తెలిపారు,గతంలో ఏడాదికి ఐదు లక్షల టన్నులకు పైగా చెరకు క్రషింగ్ జరిగేదని.పది శాతానికి పైగా రికవరీ సాధించి సహకార రంగంలో అగ్రస్థానం లో నిలిచిన గోవాడ చక్కెర ఫ్యాక్టరీ, గత రెండేళ్లుగా ఇబ్బందుల్లో చిక్కుకుందన్నారు.క్రషింగ్లో తరుచూ,అంతరాయాలు,మరామత్తులు, చెరకు రైతులకు పేమెంట్లు సకాలంలోచేల్లించక పోవడంతో క్రషింగ్ పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు చేసారు సీజన్లో కేవలం 1.90 లక్షల టన్నులు మాత్రమే చెరకు క్రషింగ్ చేసి, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐదు శాతానికి రికవరీ పడి పోయిందన్నారు.దీంతో పంచదార దిగుబడి తగ్గిందన్నారు ఫలితంగా రైతులకు పూర్తి స్థాయిలో పేమెంట్లు చేయలేని స్థితిలోకి ప్యాక్టరీ యాజమాన్యం వెళ్ళిపోయిందని పేర్కొన్నారు రైతులకు సుమారు రూ.30 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని వీటికి తోడు కార్మికుల జీతాలు, చెరకు సరఫరా దారులకు, కాంట్రా క్టుర్లుకు పేమెంట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.కూటమి ప్రభుత్వం వస్తే ఫాక్టరీని ఆధుని కరణ చేసి ఆదుకుంటుందని యధావిధిగా క్రషింగ్ చేస్తారని రైతులు కార్మికులు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మోసపోయారని తెలిపారు ఈనెల వరకు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం రైతుల నుంచి ఎటువంటి అగ్రిమెంట్ తీసు కోకపోవడం, ఓవరాయిలింగ్ లాంటి పనులు చేపట్టకపోవడం రైతు కార్మికుల్లో పూర్తి నిరాశతో ఉన్నారని తెలిపారు,ఫాక్టరీలో పర్మినెంట్, ఎన్ఎంఆర్, ఓచర్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే కార్మికులను జులై నెలలో, లేదంటే ఆగష్టు నెలలో రీకాల్ చేసి పనిలో పెట్టుకునే వారని అయితే సెప్టెంబర్ నెల ముగుస్తున్నా అటువంటి చర్యలు కానరావడం లేదన్నారు. ప్రస్తుతం ఫాక్టరీలో పర్మినెంట్ కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది తప్ప మిగతా వారు ఎవరూ లేరని తెలిపారు.దీంతో దాదాపు ఫాక్టరీ చరిత్ర దాదాపు ముగిసి నట్లేనని తెలిపారు ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో ఫాక్టరీ సర్వసభ్య సమావేశం నిర్వహించి జమా,ఖర్చులు చెప్పడంతో పాటు రైతులు సలహాలు సూచనలు ఇవ్వడం, భవిష్యత్తు ప్రణాళిక ప్రకటించి తీర్మానం చేసేవారని తెలిపారు అయితే సభ్య రైతులు సమావేశంలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడవలసివస్తుందని,పూర్తిగా మహాజనసభ జరపకుండా ఉంటే మంచి దని,కూటమి నాయకులు బావిస్తున్నారని తెలిపారు రైతులు తమ సందేహాలను నివృత్తి చేసు కోవడానికి ప్రధాన వేదిక మహజన సభేనని అదే లేకపోతే అడగడానికి అవకాశం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు ఏది ఏమైనా! దశాబ్ధాల చరిత్ర కలిగిన గోవాడ సుగర్స్ ఇక నుంచి సిఎం రమేష్ కూటమి ప్రభుత్వ దయవల్ల చరిత్రలో చేప్పు కోవాడానికి తప్ప క్రషర్ ఆడి రైతు కార్మికులను ఆదుకోనె పరిస్థితి లెదన్నారు నిసిగ్గుగా వ్యవ హరిస్తున్న ఈ ప్రాంతం కూటమి ప్రజా ప్రతినిధులు చోరవ చూపి ప్యాక్టరిని కాపాడాలని వెంకన్న డిమాండ్ చేసారు,

పశ్చిమ గోదావరి

మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం : బాడీ బిల్డింగ్ అంటే కండల ప్రదర్శన కాదని, ఫిట్నెస్ ప్రక్రియ అని, చురుగ్గా ఉంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం కృష్ణదేవరాయ కళ్యాణ మండలంలో ఆదివారం మిస్టర్ ఆంధ్ర ఓపెన్ స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీలను విజేతలకు ట్రోఫీ తోపాటు మూడు మోటార్ సైకిల్స్, టీవీ లను అందించడం గొప్ప విశేషమని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులఖండం కోటేశ్వరరావు, వబిలిశెట్టి రామకృష్ణ, సతివాడ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

దసరా సెలవుల్లో క్లాసులు

శ్రీకాళహస్తి పట్టణంలో దసరా సెలవుల్లో కూడా పాఠశాలలు నడుపుతున్న ప్రయివేట్ యాజమాన్యాలు.ప్రభుత్వ ఆదేశాలు లెక్క చేయకుండా శ్రీకాళహస్తిలో ని ప్రయివేట్ పాఠశాలలు దసరా కూడా నడపడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.ప్రభుత్వ ఉత్తర్వులు భేఖాతారు చేస్తూ పాఠశాలలు నడుపుతున్న ప్రయివేట్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పారెంట్స్ కోరుతున్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి

శ్రీకాళహస్తి శ్రీరామనగర్ కాలనీ సమీపంలో ఆదివారం రాత్రి 10.45 నుంచి 11.00 గంటల మధ్య RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.స్థానికుల సమాచారం మేరకు పెళ్లకూరు మండలం పుల్లూరు గ్రామానికి చెందిన పుల్లూరు.మునిరెడ్డి.అతను వ్యవసాయ పనులు చేసుకుంటూ అతని ఆర్థిక పరిస్థితులు సరిలేక పోవడం వల్ల పార్ట్ టైం గా స్విగ్గి లో డెలివరీ బాయ్ గా పని చేస్తూ ఇంటికి వెళుతుండగా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వస్తున్న బస్సు అతివేగంగా వచ్చి గుద్దడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లగా డాక్టర్లు చూసి చనిపోయినట్లుగా గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్

నాకు ప్రాణహాని ఉందని అంటున్న రావూరి రమణ రెడ్డి…!!

(పున్నమి,న్యూస్)వింజమూరు సెప్టెంబర్ 21://// ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండల బంగ్లా సెంటర్ దగ్గర ఉన్న హెచ్ పి పెట్రోల్ బంకు ఎదురుగా సుజాతనగర్ లో రావూరి రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నేను గత కొంతకాలం క్రితం మాకినేని మాల్యాద్రి భార్య అరుణమ్మల దగ్గర రావూరి రమణారెడ్డి ఒక్క లక్ష యాబై ఎనిమిది వేల రూపాయలకు 36 సంవత్సరాల క్రితం వారి దగ్గర సర్వే నెంబర్ 20061 బారు ఒకటి లో 33 సెంట్లు కొనుగోలు చేశాను అని ఆయన అన్నారు. 33 సెంట్లలో 29 సెంట్లు నా ఇంటి స్థలానికి ఉంచుకొని మూడు సెంట్లు స్థలాన్ని నేషనల్ రోడ్డు దగ్గర నుండి మా స్థలం చివరివరకు 19 అడుగుల వెడల్పుతో కూడిన దారి వదిలిపెట్టడం జరిగింది. సర్వేనెంబర్ 261-1లో నేను నా కుటుంబ సభ్యులు 30 సంవత్సరాలుగా ఈ స్థలంలో నివాసం ఉంటున్నాం కానీ ఇటీవల కాలంలో గత మూడు నాలుగు నెలలుగా వనిపెంట సుబ్బారెడ్డి మా స్థలమునకు ముందు ఉన్న స్థలం కొందూరి రత్నం అనే కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర నేను కొన్నానని ఆయన చెబుతూ మేము దారి కొరకు విడిచిపెట్టిన దారి స్థలాన్ని వనిపెంట సుబ్బారెడ్డి ఆక్రమించి మేము ఇంట్లో నుంచి బయటకు రాకుండా ముళ్ళకంచ నాటించారు. నేను వెళ్లి మా స్థానంలో మీరెందుకు కంచి వేశారు నాటాల్సిన అవసరమేంటి ఈ స్థలం మాది నేను కొన్న స్థలం మా ఇంటికి దారి కొరకు వదులుకున్న స్థలాన్ని నువ్వు ఆక్రమించి అక్రమంగా ముళ్లకంచి వేయించడం ఏంటి అని నేను అడిగాను అడిగి వనిపెంట సుబ్బారెడ్డి నా దారిలో నాటిన ముళ్లకంచెను మా కుటుంబ సభ్యులతో కలసి వాటిని తొలగించే ప్రయత్నం చేయడం జరిగింది. అందుకు నామీదకు దాడికి దిగి అసభ్యకరమైన పదజాలంతో నన్ను దూషిస్తూ నేను కంచి వేసేది వేసేదే వేస్తాను కూడా నీ దిక్కున చోట చెప్పుకోమని ఆయనతోపాటు మరికొందరు నామీదకి దౌర్జన్యంగా దాడికి దిగి నన్ను కొట్టడం జరిగింది. ఇదిలా ఉండగా నేను రెండు రోజులు క్రితం వింజమూరు బంగ్లా సెంటర్లో టీ తాగడానికి వెళ్ళినప్పుడు వలిపెంట సుబ్బారెడ్డి వనిపెంట మాధవరెడ్డి వనిపెంట సురేష్ సాహిత్ అనే నలుగురు వారితో కూడా మరికొందరు కలిసి బంగ్లా సెంటర్లో టీ తాగుతున్న సమయంలో ఒక్కసారిగా నా మీద పడి దాడి చేసి నా చొక్కా చించి నన్ను కొట్టడం జరిగింది. ఈ విషయమై వింజమూరు పోలీసు వారికి నేను ఫిర్యాదు చేశాను పోలీసు వారు కేసు నమోదు చేశాము అని చెప్పారు. కానీ వారిని పిలిపించి మాట్లాడింది కానీ వారి వారిని అరెస్టు చేసినట్లుగాని ఎలాంటి దాఖలాలు లేవు మా మీదనే కేసు పెడతావా మాకు ఎదురు తిరుగుతావా నువ్వు ఎంత నీ బ్రతుకంతా నిన్ను చంపేస్తామంటూ వాళ్లు పబ్లిక్ గా మాట్లాడుతూ నన్ను నా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వనిపెంట సుబ్బారెడ్డి వనిపెంట మాధవరెడ్డి వనిపెట్టా సురేష్ రెడ్డి సాహిత్ వీరి వలన నాకు ప్రాణహాని ఉందని నన్ను చంపేస్తాము అని వాళ్ళు తిరుగుతున్నారని రావూరి రమణారెడ్డి అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని వారి చేతిలో నుండి నన్ను నా కుటుంబాన్ని కాపాడాలని ఆయన కోరారు ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న నాకు న్యాయం చేయాలని నా కుటుంబానికి అండగా ఆయన ఉంటారని నేను ఆశిస్తున్నాను ఆయన సహాయం కోసం ఎదురుచూస్తున్నాను అధికారులు స్పందించి నాకు న్యాయం జరిగేలా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్న చేస్తారని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఆయన సహాయం కోసం ఎదురుచూస్తున్నానని రావూరి రమణ రెడ్డి అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.