Tuesday, 5 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

మీకు హై బీపీ ఉందా! సరే మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ హై బీపీ. అధిక శాతం మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్న వారు కూడా హైబీపీ బారిన పడుతున్నారు.అధిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్త మైన జీవన విధానం హైబీపీ వచ్చేందుకు కారణం అవుతున్నాయి. హైబీపీ ఉందని తేలితే కచ్చితంగా డాక్టర్ సూచన మేరకు జీవితాంతం మందులను వాడాల్సిందే. మందులను క్రమం తప్పకుండా వాడుతూనే మరోవైపు వ్యాయామంపై దృష్టి పెట్టాలి. బీపీని నియంత్రించడంలో ఆహారం ఎంతగానో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మంచి ఆహారంతో హైబీపీ బాధితుల గుండెకు రక్షణ కవచంగా మారుతుంది. బీపీ నియంత్రణలో బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు మేలు చేస్తాయి. ఈ బెర్రీ పండ్లలో ఆంథో సయనిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. హైబీపీ ఉన్నవారు రోజుకు ఒక అరటి పండును తింటున్నా ఉపయోగం ఉంటుంది. పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. అందువల్ల వీటి జ్యూస్‌ను రోజూ తాగుతున్నా కూడా బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. హైబీపీ తగ్గేందుకు బీట్ రూట్ సైతం మేలు చేస్తుంది. నారింజ, గ్రేప్ ఫ్రూట్‌, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ఇతర సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి కూడా రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచి బీపీ తగ్గేలా చేస్తాయి. యాపిల్‌, కివి, అవకాడోలు, డ్రై యాప్రికాట్స్ వంటి పండ్లను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఓట్స్‌, బ్రౌన్ రైస్‌, హోల్ వీట్ బ్రెడ్‌, పాస్తా, కినోవా, బార్లీ వంటి తృణ ధాన్యాలు కూడా బీపీ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి.

ఖమ్మం

ప్రారంభం అయిన బతుకమ్మ సంబురాలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర పండుగ అయినా బతుకమ్మ ఉత్సవాలు మహాలయ అమావాస్య అయినా ఆదివారం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభం ఐయ్యాయి.. ఎంగిలి పూల బతుకమ్మ తో ప్రారంభం అయినా ఉత్సవాల్లు సద్దుల బతుకమ్మ తో ముగిస్తాయి. ఈ ఉత్సవాలో ప్రదానం గా మహిళలు, ఆడపిల్లలు అట పాట లతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభం ఐయ్యాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ ఉత్సవాళ్ళో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు మహిళలకి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసారు

ఆంధ్రప్రదేశ్

జీఎస్టీ తగ్గింపు రేపే.. 375 వస్తువుల ధరలు ఫుల్ లిస్ట్ ఇదే

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచే మొదలవుతోంది. కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత మొత్తం 375 రకాల వస్తువులు, ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. డైరీ ఉత్పత్తులు, కార్ల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పటికే ఆయా కంపెనీలు ధరల తగ్గింపు ప్రకటనలు చేశాయి. మరి అందులోని ముఖ్యమైన వస్తువుల జాబితా ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) సంస్కరణలు సెప్టెంబర్ 22, 2025 నుంచే అమలులోకి వస్తున్నాయి. ఈనెల మొదటి వారంలో వస్తు సేవల పన్ను మండలి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 5, 18 శాతం పన్ను శ్లాబులను కొనసాగిస్తూ 12, 28 శ్లాబులను తొలగించింది. దీంతో సెప్టెంబర్ 22 నుంచి 5, 18 శాతం పన్ను శ్లాబులే అమలు అవుతాయి. దీంతో ఏకంగా 375 రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ జాబితాలో డైరీ ప్రొడక్ట్స్, కార్లు, ఔషధాలు, వంట సామగ్రి నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు చాలా కేటగిరీల వస్తువులు ఉన్నాయి. ఏ వస్తువుల ధరలు తగ్గుతున్నాయి? ఆహార పదార్థాలు ఆహార పదార్థాల జాబితాలో పాలతో ఉన్న పానియాలు, ఘనీభవించిన పాలు, బిస్కెట్లు, కార్న్ ఫ్లేక్స్, సీరల్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ పల్ప్, ఫ్రూట్ జూస్, నెయ్యి, ఐస్ క్రీమ్, జామ్, ఫ్రూట్ జెలీస్, కెచప్, ఉప్పు, పనీర్, పాస్ట్రీ, మాంసం, ప్యాకేజ్డ్ కొబ్బరీ నీళ్లు ఉన్నాయి. రోజు వారీ వస్తువులు.. షేవ్ లోషన్, ఫేస్ క్రీమ్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, షాంపూ, షేవింగ్ క్రీమ్, టాల్కమ్ పౌండర్, టూత్ బ్రస్, టాయిలెట్ సబ్బులు వంటివి ఉన్నాయి. ఔషధాలు.. డయాగ్నస్టిక్ కిట్లు, గ్లూకో మీటర్లు వంటి మెడికల్ డివైజులపై జీఎస్టీ 5 శాతానికి తగ్గుతుంది. దీంతో వాటి ధరలు తగ్గుతాయి. వాటిపై ఎంఆర్‌పీ ధరలను తగ్గించాలని కేంద్రం ఫార్మసీలను ఆదేశించింది. బ్యూటీ, ఫిజికల్ సర్వీసెస్‌లో బార్బెర్స్, ఫిట్‌నెస్ సెంటర్స్, హెల్త్ క్లబ్స్, సెలూన్స్, యోగా కేంద్రాల వంటి వాటిపై జీఎస్టీ తగ్గుతుంది. వాటి ధరలు దిగివస్తాయి. ఇంటి నిర్మాణ ఖర్చులు ఇంటి కొనుగోలుదారులు లేదా నిర్మాణదారులకు జీఎస్టీ ద్వారా భారీగా ప్రయోజనం కలగనుంది. సిమెంట్ ధరలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీంతో నిర్మాణ ఖర్చు భారీగా తగ్గనుంది. ఆటోమొబైల్స్ కార్లు, ఇతర వాహనాలపై జీఎస్టీ భారీగా తగ్గుతుంది. ఇంతకు ముందు పన్నులు సెస్ ‌తో కలిపి 35 శాతం నుంచి 50 శాతం వరకు ఉండేవి. ఇప్పుడు ఫ్లాట్ 40 శాతం గా మార్చారు. సెస్ ఎత్తివేశారు. దీంతో గరిష్ఠ పన్ను ఇదే. అలాగే చిన్న కార్లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు. ఇప్పటికే మారుతీ, టాటా వంటి కంపెనీలు ధరల తగ్గింపు ప్రకటనలు చేశాయి. దీంతో సెప్టెంబర్ 22, 2025 నుంచి ఆయా కంపెనీల ఉత్పత్తుల ధరలు దిగివస్తాయి. హిందుస్తాన్ యూనిలివర్ ఉత్పత్తులైన డవ్ షాంపూ బాటిల్ 340 ఎంఎల్ ధర రూ.490 నుంచి రూ.435కు తగ్గుతుంది. నాలుగు లైఫ్ బాయ్ సబ్బుల ధర రూ. 68 నుంచి రూ.60కి తగ్గుతుంది. 200 గ్రాముల హార్లిక్స్ ధర రూ.130 నుంచి రూ.110కి తగ్గుతుంది. 200 గ్రాముల కిసాన్ జామ్ ధర రూ.10 తగ్గి రూ.80కే లభిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే బోర్డ్ 1 లీటర్ రైల్ నీర్ బాటిళ్ల ధరను రూ.15 నుంచి రూ.14కు తగ్గించినట్లు తెలిపింది. 500 ఎంఎల్ బాటిల్ ధర రూ.10 నుంచి రూ.9కి తగ్గుతుంది ప్రముఖ బ్రాండ్ల కార్ల ధరలు ఎంత తగ్గుతాయంటే? మారుతీ సుజుకీ ఆల్టో కే10 కారు ధర రూ.1,07,600 మేర తగ్గుతోంది. దీంతో రూ.3.69 లక్షలు (ఎక్స్ షోరూమ్) లభిస్తోంది. ఎస్ ప్రెస్సో ధర రూ.1,29,600 తగ్గుతోంది. సెలేరియో ధర రూ.94,100 వరకు తగ్గుతోంది. వెగన్ ఆర్ ధర రూ.79,600 తగ్గుతోంది. ఇక స్విఫ్ట్, బలెనో కారు ధర రూ.84,600 తగ్గుతోంది. ఇగ్నిస్ కారు ధర రూ.71,300 వరకు తగ్గుతోంది. టాటా కంపెనీ విషయానికి వస్తే టాటా టియాగో కారు ధర రూ.75 వేలు తగ్గుతోంది. టాటా ఆల్ట్రోజ్ కారు ధర రూ.1,10,000 వరకు తగ్గుతోంది. ఇక హ్యూందాయ్ కంపెనీలో గ్రాండ్ ఐ10 కారు ధర రూ.73,800 తగ్గుతోంది. హ్యూందాయ్ ఐ20 కారు ధర రూ.86,796 వరకు తగ్గిస్తున్నారు. తగ్గిన పాల ధరలు ప్రముఖ బ్రాండ్ అముల్ పాలతో పాటు 700 ఉత్పత్తుల ధరలు తగ్గించినట్లు తెలిపింది. వెన్న, నెయ్యి, ఐసీ క్రీమ్స్, చీజ్, పనీర్, చాక్లెట్స్, బేకరీ ఉత్పత్తులు, ఫ్రోజెన్ డైరీ ఉత్పత్తులు, పొటాటో స్నాక్స్, ఘనీభవించిన పాలు వంటివి ఉన్నాయి. వెన్న ధర 100 గ్రాములకు రూ.62 నుంచి రూ.58కి తగ్గుతుంది. నెయ్యి లీటరుపై రూ.40 తగ్గుతుంది. రూ.610కే లభిస్తుంది. చీజ్ కిలో ధర రూ.30 తగ్గి రూ.545కే లభిస్తోంది. పనీర్ ధర 200 గ్రాములకు రూ.99 నుంచి రూ.95కు తగ్గుతుంది. ఐస్ క్రీమ్స్ ధరలు రూ.9 నుంచి రూ.550 మధ్య ఉంటున్నాయి. ఇప్పటి వరకు రూ.10 నుంచి రూ.600 మధ్య ఉండేవి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రౌడీ షీటర్లు సాయంత్రం ఏడు తర్వాత రోడ్డుపై కనబడితే జైలుకే

పి.గన్నవరం సీఐ హెచ్చరిక సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారు మరియు కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ గారి ఆదేశాల మేరకు ఈ ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీ.ఐ భీమరాజు. పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఎవరైనా రౌడీషీటర్ ఏడు గంటల తర్వాత రోడ్డుపై కనబడితే వాళ్లపై పిడి యాక్ట్ ఓపెన్ చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించిన సీ.ఐ. శాంతి భద్రతల విషయంలో ఒక్క పెర్సెంట్ కూడా వెను తిరిగి చూసేది లేదని మీడియా ముఖంగా తెలియచేసారు.

తిరుపతి

జిల్లా ఉత్తమ వ్యాయమ ఉపాధ్యాయ గ్రహీతకు సన్మానం

జిల్లా ఉత్తమ వ్యాయమ ఉపాధ్యాయ గ్రహీత పి.కిషోర్ తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీగా నియమితులైనందున దర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ వ్యవస్థాపకులు,విశ్రాంత ఉపాధ్యాయులు సుధాకర్ సన్మానించి కిషోర్ మరిన్ని పదవులు,అవార్డుల పొందాలన్నారు.అకాడమీ కన్వీనర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ఎంతో మంది యువకులను క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత కిషోర్ దే అన్నారు.ఈ అవార్డు ఆయనకు ఒక ఆభరణమని ఇంకా మరిన్ని అవార్డులను పొందాలన్నారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కిషోర్ మాట్లాడుతూ జిల్లా లో క్రీడల అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలోని మొగలి పూల నుంచి తీసే నూనె లీటర్ ధర రూ.9 లక్షలు

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ సుగంధాల్లో రారాణిగా పిలుచుకునే మొగలి పూల నుంచి తీసే నూనె లీటర్ ధర రూ.9 లక్షలు పలుకుతోంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం సముద్రతీరంలో 6,000 హెక్టార్లలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఒక్కో చెట్టుకు ఏడాదికి 13 వరకు పూలు వస్తాయి. ఒక్కో పువ్వు ధర రూ.30-100 వరకు ఉంటుంది. 15 వేల పూలను బట్టీల్లో వేసి మరిగిస్తే లీటరు నూనె వస్తుంది. ఈ నూనెను వ్యాపారులు.. పర్ఫ్యూమ్ల తయారీకి రష్యా, చైనా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.

తెలంగాణ

చావు బ్రతుకుల మధ్య DSP నళిని

పున్నమి ప్రతి నిధి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధాన కోసం తన ఉద్యోగం ని సైతం వదులుకున్న మహిళ డిఎస్పీ నళిని. *తన అనారోగ్యంపై ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన నళిని.* *తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ* ( వీలునామా/ మరణ వాంగ్మూలం) ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా,ఆయుర్వేద ఆరోగ్య సేవిక గా,ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది.నాఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది.ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను. మూడు(3)రోజుల నుండి నిద్ర లేదు.రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. ఎనిమిది (8)ఏండ్ల క్రితం సోకిన Ruematoid arthritis అనే విలక్షణ కీళ్ల జబ్బు(= Blood cancer+ Bone Cancer) గత రెండు నెలలుగా టైపాయిడ్,డెంగ్యూ,చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది.కనకణం పేలిపోతున్నట్లు,ఏ కీలుకా కీలు విరిచేసినట్లు నొప్పి.తట్టుకోలేక పోతున్నాను. 2018 లో ఈ జబ్బు ప్రారంభం అయినప్పుడు ఇలాంటి స్థితి యే ఏర్పడ్డపుడు,మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్ లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగుచేసుకున్నాను.కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరామయంలో చేరేంత డబ్బు లేదు. 25 ఏండ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది. నేను ఫార్మసిస్టు ను కూడా. కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు.కనుక 30 లోపు ఉండాల్సిన RA ఫ్యాక్టర్ అత్యధికంగా 900 కు చేరినా స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ, యోగ,ధ్యానం,వేదాధ్యయనం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను.కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది.దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి.వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయి కి చేర్చాయి. నా గతమంతా వ్యధ భరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి.రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహం లోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసితీరా దింపింది.సహాయం చేసేవాడు కనిపించక,నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను.మహర్షి దయానందుని దయవల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని,అందులో విశేషమైన కృషి చేస్తూ,యజ్ఞ బ్రహ్మగా VYPS ( వేద యజ్ఞ పరిరక్షణ సమితి)సంస్థాపకురాలుగా ఎదిగి,హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని,నా దారిని రహదారిగా పూల బాటగా మలచుకున్నాను. నళిని మళ్ళీ వికసించింది. ఇలాంటి తరుణంలో నేటి CM అధికారంలోకి రాగానే నా ఫైల్ ను ఎందుకో తెరిచారు.నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు.వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నెండ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అల్లోవెన్స్ లెక్క కట్టి( సుమారు 2 కోట్లు) ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ ను ఇచ్చాను.వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగాను.( రెండోది వారి పార్టీ పాలసీ కి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది).6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైంది అని తెలిసింది.నా ఆఫీస్ కాపీ ని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందన లేదు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి. *నేను చస్తే ఎవరూ సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి.రిజైన్డ్ ఆఫీసర్,కవయిత్రి ,యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంభోదించండి.* నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతుకుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్టుమస్ అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి.బ్రతుకుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే,నాకు సరైన, ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయట పడతాను. లేదంటే …జ వీఐపీ యజ్ఞాలు పూర్తి చేయాలని,ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం చేయాలని … ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు. నా పేరు పై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం vyps కు చెందుతుంది.బ్రతుకుండగా దేశ ప్రధాని ని కలవలేక పోయాను.వారు కరుణామయులు.నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్ కు ఇవ్వవలసిందిగా మనవి.నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తాను. నా మనోభావాలను పంచుకొనే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్ కు ధన్యవాదాలు. *సెలవిక మిత్రులారా 🙏*

ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర యూనివర్సిటీ జనసేన యూత్ వింగ్ సభ్యుల రక్తదానం

సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ఓజి చిత్రం విడుదల ఈ నేపథ్యంలో సామాజిక సేవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఓజి సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏయూ యూత్ వింగ్ అసోసియేషన్ సభ్యులు రక్తదానం చేశారు. మహారాణిపేట లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో ఆదివారం ఈ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి పిలుపుతో అనేక మంది రక్తదానం చేసి ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. ఇదే క్రమంలో తాము కూడా రక్తదానం చేశామని తెలిపారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఓజి చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ జనసేన యూత్ వింగ్ సభ్యులు పైడికొండ సునీల్ నాయుడు, సేనాపతి వెంకటేశ్వరరావు, గురు స్వామి, ప్రదీప్, జస్వంత్, శ్రవణ్ కుమార్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన ఏయు జనసేన యూత్ వింగ్ సభ్యులనురెడ్ క్రాస్ చైర్మన్ బాల సతీష్, రావు, కొయిలాడ శ్రీనివాసరావు అభినందించారు.

ఆంధ్రప్రదేశ్

దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని.. ఏపీలోని ఆ జిల్లాలోనే, త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్లోనే త్వరలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ఆ బంగారు గనిని నిర్వహిస్తున్న సంస్థ వెల్లడించింది. మొదట తక్కువ స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించి.. ఆ తర్వాత దాన్ని భారీగా పెంచనున్నట్లు సదరు సంస్థ తెలిపింది. ఈ బంగారు గని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. దేశ బంగారం అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం కాస్త తగ్గుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిదిరాయి గ్రామాల్లో ఉన్న ఈ బంగారు గని నుంచి బంగారాన్ని వెలికితీసే ప్రాజెక్టును డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) నిర్వహిస్తోంది. ఈ సంస్థ త్వరలోనే ఆ ప్రాంతంలో బంగారం ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ గని దేశం బంగారు ఉత్పత్తిని గణనీయంగా పెంచనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏటా భారత్ సుమారు వెయ్యి టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. చమురు తర్వాత బంగారం దేశంలో అత్యధికంగా దిగుమతి అయ్యే వస్తువు కావడం విశేషం. ప్రస్తుతం భారత్ మొత్తం బంగారు ఉత్పత్తి కేవలం 1.5 టన్నులు మాత్రమే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జొన్నగిరి బంగారు గని పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించడం భారత్‌కు బంగారం విషయంలో ఒక కీలక ముందడుగుగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌లో డెక్కన్ గోల్డ్ మైన్స్‌ సంస్థకు వాటా ఉంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు ఇప్పటికే లభించాయని.. రాష్ట్ర అనుమతులు కూడా కోరుతున్నట్లు డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఎండీ హనుమ ప్రసాద్ గురువారం వెల్లడించారు. ఇక ఈ గనిని ప్రారంభించిన తర్వాత తొలి దశలో.. ఏటా సుమారు 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత రానున్న 2, 3 ఏళ్లలో ఈ బంగారం ఉత్పత్తిని ఏటా వెయ్యి కిలోలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ఎండీ హనుమ ప్రసాద్ వెల్లడించారు. ఇక కర్నూలు జిల్లాలో ఉన్న ఈ గోల్డ్ మైన్ నుంచి ఉత్పత్తి ప్రారంభం అయిన తర్వాత.. భారత దేశీయ బంగారు ఉత్పత్తి దాదాపు ఒక టన్ను మేర పెరుగుతుందని హనుమ ప్రసాద్ వివరించారు. ఈ ప్రాజెక్ట్ దేశ బంగారు పరిశ్రమలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థకు కిర్గిస్తాన్, ఫిన్లాండ్, టాంజానియా వంటి దేశాల్లో కూడా మైనింగ్ ప్రాజెక్టులను కలిగి ఉంది.

జాతీయ అంతర్జాతీయ

తెలుగు రాష్ట్రాల నుంచే 35 వేల మంది స్టూడెంట్‌ వీసాదారులపైనా తీవ్ర ప్రభావం

సెప్టెంబర్ 21పున్నమి ప్రతినిధి @ హెచ్‌1-బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో భారతీయుల డాలర్‌ డ్రీమ్స్‌ చెదిరిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల యువతపైనే అధిక ప్రభావం ఉండనుంది. అగ్రరాజ్యం ఏటా మొత్తం 85 వేల హెచ్‌1-బీ వీసాలు జారీ చేస్తుండగా.. ఇందులో దాదాపు 73శాతం(62 వేలు) భారతీయులే దక్కించుకుంటున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి సంఖ్య దాదాపు 35వేలు. మిగతా 27 శాతంలో 12 శాతం చైనా, ఇతర దేశాల పౌరులు ఉంటున్నారు. ట్రంప్‌ నిర్ణయంతో ఈ వీసాలపై అమెరికాకు వెళ్లే ఆశలు వదులుకోవాల్సిందేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులకు హెచ్‌1-బీ వీసాలతో కొలువులు ఇస్తున్నాయి. ముందుగా మూడేళ్ల కాలానికి జారీ చేసి.. ఆ తర్వాత కొనసాగిస్తున్నాయి. స్థానికులతో పోలిస్తే తక్కువ జీతాలే వస్తున్నా.. కొలువుల కోసం విదేశీయులు భారీగా వెళ్లేవారు. అమెరికాలోని ఐటీ, వైద్య రంగాల్లో విదేశీ నిపుణుల్లో 73 శాతం భారతీయులే. గత ఐదేళ్లలో దాదాపు 4 లక్షల మంది భారతీయులు హెచ్‌1-బీపై అమెరికాలో ఉద్యోగాలు పొందారు. ఇప్పటివరకు కొత్తగా వచ్చిన హెచ్‌1-బీ వీసాదారులకు అమెరికాలోని కంపెనీలు ఏడాదికి సరాసరి లక్ష డాలర్ల జీతం ఇస్తున్నాయి. తాజా నిబంధనలతో ఏడాదికి కనీసం 1.50 లక్షల డాలర్ల వేతనం చెల్లించాలని ట్రంప్‌ ఆదేశాలిచ్చారు. లక్ష డాలర్లు వీసా ఫీజు పోతే, మిగతా 50వేల డాలర్ల కోసం వెళ్లేందుకు విదేశీ నిపుణులు ఆసక్తి చూపించరు. దీంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. సుంకాలపై భారత్‌-అమెరికా మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో భారతీయ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకునే ట్రంప్‌ పొమ్మనలేక పొగబెట్టారని అక్కడి తెలుగు సంఘాలు పేర్కొంటున్నాయి. ఉన్నత చదువులపైనా ప్రభావం ట్రంప్‌ తాజా నిర్ణయంతో హెచ్‌1-బీ వీసాదారులపైనే కాదు.. ఉన్నత విద్య కోసం వెళ్లే వారిపైనా తీవ్ర ప్రభావం పడనుంది. ప్రతి ఏటా దాదాపు లక్ష మంది విద్యార్థులు ఎంఎస్‌, ఎంబీఏ, మెడిసిన్‌ కోసం స్టూడెంట్‌ వీసా (ఎఫ్‌-1)పై అమెరికా వెళుతున్నారు. గతంలో చదువుతూ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండగా.. ట్రంప్‌ సర్కారు ఇప్పటికే అలా ఉద్యోగం చేయడంపై నిషేధం విధించింది. దీంతో ఎలాగోలా వెళ్తే చాలు.. ఏదో ఒక పనిచేసుకుంటూ చదువుకోవచ్చన్న మధ్యతరగతి విద్యార్థుల ధీమా ఇప్పటికే సడలిపోయింది. తాజా ఆదేశాలతో స్టూడెంట్‌ వీసాపై వెళ్లే వారికి అక్కడ భవిష్యత్తు ఉంటుందన్న ఆశ లేకుండా పోయిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎఫ్‌-1 వీసా తర్వాత కోర్సులను బట్టి విద్యార్థులకు 12-36 నెలల వరకు ఓపీటీ (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) గడువు ఉంటుంది. అప్పటిలోగా హెచ్‌1-బీ వీసా సాధిస్తే అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. తాజా నిబంధనలతో ఓపీటీ గడువులో ఉన్నవారు పూర్తయిన వెంటనే స్వదేశానికి రావాల్సిందే. హెచ్‌1-బీ వీసా లక్ష్యంతోనే అనేక మంది ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేవారు. ఇప్పుడా ఆశలు ఆవిరయ్యాయని అమెరికా తెలుగు అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు భువనేష్‌ ‘ఆంధ్రజ్యోతి’తో పేర్కొన్నారు. ట్రంప్‌ ఆదేశాలపై స్థానికంగా యువతలో హర్షం వ్యక్తమవుతోందని, హెచ్‌1-బీ లక్ష్యంగా పెట్టుకున్న భారతీయులు ఇక అమెరికా వచ్చే అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.