Tuesday, 5 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

నమః సుమాంజలి 🙏

మా తల్లి గారైనశ్రీమతి అయినింటి ఆదిలక్ష్మి గారుఇటీవల స్వర్గస్తులైనారు. ఆమె ఆత్మ శాంతి కోసంఉత్తర క్రియ (పెద్ద కర్మ)తేదీ : 22-09-2025, సోమవారంమధ్యాహ్నం, మా స్వగృహమందునిర్వహించబడును. అందుకు బంధువులు, ఆప్తులు, స్నేహితులు,శ్రేయోభిలాషులు, సహచరులు అందరూవిచ్చేసి ఆమెకు నివాళులర్పించిఆత్మ శాంతి కోసం ప్రార్థించవలసిందిగామనవి. ఇట్లుఅయినింటి రవికుమార్ కుటుంబ సభ్యులు 🙏

తిరుపతి

కోలా ఆనంద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ ఆదేశాలతో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న పక్షోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంట నందు గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జి పాల్గొని ప్రధాని జన్మదినం సందర్భాగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోలా ఆనంద్ ని వారు అభినందించారు.ప్రతి ఒక్కరు తమ తల్లి పేరుతో ఒక చెట్టును నాటాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ,ప్రాణవాయువు-ఆరోగ్య రక్షణ కోసం విస్తారంగా చెట్లు నాటడం జరగాలని కోలా ఆనంద్ బీజేపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నిర్మల్

ఆలయ ధ్వంసానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి

ముధోల్ సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి నిర్మల్ : లోకేశ్వరం మండలంలోని రాయపూర్ కాండ్లి గ్రామంలో బీరప్ప ఆలయ శిఖర ధ్వంసానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ముధోల్ కురుమ సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ముధోల్ లోని దన్గర్ గల్లీ లోని పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కురుమ సంఘ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, దుండగులను తక్షణమే పట్టుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కురుమ సంఘ సభ్యులు మైత్రి సాయినాథ్,దేవోజీ భూమేష్,విట్టల్, శంకర్,నరేష్, మరోతి, శ్రీనివాస్, రాజేందర్, కామాజీ, బీరన్న, పిరజీ, సాయినాథ్, సాయన్న, నగేష్ తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

వైజాగ్ లో జీవీఎంసీ చేపట్టిన ఆపరేషన్ లంగ్ వెనక అసలు రహస్యం ఏంటో తెలుసా? : ప్రియాంక దండి

విశాఖ నగరంలో ఉపాధి లేక చాలా మంది స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు చేపట్టిన ఆపరేషన్ లంగ్ కి ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తోంది, కొంతమంది జీవీఎంసీ చర్యను సమర్థిస్తున్నారు, మరి కొందరు పేద ప్రజలను రోడ్డున పడేస్తున్నారు అని విమర్శస్తున్నారని, దీని వెనుక ఒక రహస్యం దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి తెలిపారు. ఫుట్ కోర్టులు, వీధి వ్యాపారుల కారణంగా విశాఖలో ట్రాఫిక్ కష్టాలు చాలా ఎక్కువగా పెరిగిపోయింది, ఫుట్ పాత్ వ్యాపారులకు జీవీఎంసీ ప్రత్యేక జోన్లు కేటాయించకపోవడంతో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టుకొని వారు జీవనం సాగిస్తున్నారు, దీనికి కారణం జీవీఎంసీ అధికారుల పని తీరు సరిగ్గా లేకపోవడం. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ప్రకారం, ఫుట్ పాత్ వ్యాపారులకు ప్రత్యేక స్థలం కేటాయించి వారికి రక్షణ కల్పించాలి, జీవీఎంసీ అధికారులు ప్రత్యేక జోన్లు కేటాయించలేదు,కాని స్ట్రీట్ వెండర్ల దగ్గర పన్ను కట్టించుకున్నారు, ఆశీలు తీసుకున్నారు. జీవీఎంసీ అధికారులు ప్రజలకు, ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతోందన్న సాకుతో ముందోస్తూ సమాచారం లేకుండ ప్రత్యామయ ఏర్పాట్లు చేయకుండా బడ్డీలు, స్ట్రీట్ ఫుడ్ కోర్టులు ఆగ మేఘాల మీద తొలగిస్తున్నారు, జీవీఎంసీ అధికారులు చేపడుతున్న చర్యల వల్ల వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయాని ఆర్థికంగా చితికి పోతారని ఆమె అన్నారు. నగరాన్ని శుభ్రం చేయడానికి ఆపరేషన్ లంగ్ అని పైకి చెప్తున్న నగరానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి, ముఖ్యమంత్రి బంధువు తన సామాజికవర్గానికి చెందిన వారి హోటల్స్ కి ఈ ఫుడ్ కోర్ట్ ల వల్ల వ్యాపారం తగ్గిపోతోందని వారికి మేలు చేయడానికి ప్రజలకు అనుమానం రాకుండా ఆపరేషన్ లంగ్ పేరుతో ఫుడ్ కోర్టులతో పాటు నగరంలో అన్ని పాన్ షాపులను కూడ తొలగిస్తున్నారని ప్రియాంక విమర్శించారు. ఆ ప్రజా ప్రతినిధికి సామాన్యులన్న, పేద ప్రజలన్న పడదని గతంలో ఒక కార్యక్రమంలో మా సంస్థలో అందరు డబ్బు ఉన్నవారే చదువుతారని,ఇక్కడ పేదవాళ్లు ఎవరు లేరని, పేద వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతారని ఆయన వ్యాఖ్యలు చేసారు, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని ప్రియాంక విజ్ఞప్తి చేసారు.

ఆంధ్రప్రదేశ్

కష్టాలను జయించి విజయాన్ని అందుకున్న చీపురుపల్లి యువకుడు

చీపురుపల్లి పంచాయతీ డైలీ మార్కెట్ వీధికి చెందిన పెద్దింటి ధనుంజయ 2025 DSC ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) — స్కూల్ PD ఉద్యోగానికి అర్హత సాధించి జిల్లా స్థాయిలో 58వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ధనుంజయ తల్లి ఒప్పంద పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని నడిపించారు. ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల మధ్య చదువులో, క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచి ఉద్యోగ అర్హత సాధించడం ధనుంజయ పట్టుదలకు నిదర్శనం. ఈ విజయాన్ని గుర్తించిన రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ PAC కమిటీ సభ్యులు, విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), యువజన కాంగ్రెస్ పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. పేదరికం మధ్య పట్టుదలతో ముందుకు సాగిన ధనుంజయ విజయం స్థానిక యువతకు స్ఫూర్తిదాయకమని, కష్టపడి చదివితే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

తిరుపతి

నమో యువ 3k రన్ లో పాల్గొన్న కోలా ఆనంద్

ప్రధానమంత్రి పిలుపు మేరకు డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నమో యువ 3Kరన్ లో భాగంగా నేడు తిరుపతి పట్టణంలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నుండి ఇందిరా మైదానం వరకు నిర్వహించిన 3K రన్ లో జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్,తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, బిజెపి సంఘటనా మంత్రి మధుకర్ జీ,బిజెపి రాష్ట్ర యువమోర్చ అధ్యక్షుడు సునీల్,శాప్ ఛైర్మన్ అనిమిని రవి,మరియు ఇతర బిజెపి నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నడం జరిగింది.యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని,వివిధ రంగాలలో రాణించి దేశాభివృద్ధికి తోడ్పడాలి అని నాయకులు యువతకు పిలుపునిచ్చారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పున్నమి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంసలు

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ ఏపీ సీఎం చంద్రబాబు – స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడ్చారు ఏపీ ప్రభుత్వం జీఎస్టీ 2.0లో తొలిసారిగా జీవోలు తెలుగు + ఇంగ్లీష్‌లో విడుదల బాపట్లలో రోడ్డు ప్రమాదం అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొని ముగ్గురు మృతి

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పున్నమి అంతర్జాతీయ వార్తలు

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ భారత్ దెబ్బతో పీవోకే టెర్రరిస్టులు పారిపోవడం పాక్ రక్షణ మంత్రి “భారత్ దాడి చేస్తే సౌదీ మాకు తోడుంటుంది” ఇజ్రాయెల్ – లెబనాన్ ఘర్షణ బీరూట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్‌బుల్లా సభ్యులు సహా డజన్ల కొద్దీ మృతి సరిహద్దు వద్ద భారీ దాడులు గినియాలో కొత్త రాజ్యాంగంపై రిఫరెండం తిరుగుబాటు నాయకుడు మమాడీ డూంబుయా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం పొందవచ్చు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ – UN సదస్సులో ట్రంప్‌తో సమావేశం రష్యాపై కఠిన ఆంక్షలు విధించమని విజ్ఞప్తి చేయనున్నారు అమెరికాలో అక్రమ వలసలపై కీలక నిర్ణయం సిరియన్లకు ఉన్న తాత్కాలిక రక్షణ హోదా రద్దు

తెలంగాణ

K. A. పాల్ మీద కేసు నమోదు

పున్నమి ప్రతినిధి. ప్రజా శాంతి పార్టీ జాతీయ అధ్యక్షులు కే. ఏ. పాల్ మీద పంజా గుట్ట పోలీస్ లు కేసు నమోదు చేశారు. ఒక మహిళా కే ఏ పాల్ తనను వేడిస్తున్నాడు అని పిర్యాదు చెయ్యడం తో కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీస్ లు తెలియజేశారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పున్నమి జాతీయ వార్తలు

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ కు అరుదైన గౌరవం 2023 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం ఈనెల 23న అవార్డు కార్యక్రమం జరుగుతుంది ఇప్పటివరకు 360కి పైగా సినిమాల్లో నటించారు ప్రధానోత్సవంలో 71 నేషనల్ అవార్డులు ప్రదానం కానున్నాయి భారత్‌కి రెండు పాలీమెటాలిక్ సల్ఫైడ్ (PMS) అన్వేషణ ఒప్పందాలు అంతర్జాతీయ సముద్ర మట్ట అధికారం (ISA)తో ఇలాంటి రెండు ఒప్పందాలు కలిగిన తొలి దేశంగా భారత్ నిలిచింది అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ H-1B వీసా ఫీజు పెంపు కొత్త వీసా దరఖాస్తులపై $100,000 ఫీజు విధింపు ఇది ఒకసారి మాత్రమే చెల్లించవలసినది ప్రస్తుత వీసా హోల్డర్లకు, రీన్యువల్స్‌కి వర్తించదు భారత ప్రభుత్వం – “కొత్త నిబంధనలపై అమెరికా పునరాలోచించాలి” అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై స్పందనలు అమితాబ్ కాంత్: “ఈ నిర్ణయం అమెరికాకే దెబ్బ” స్టార్టప్‌లు, ల్యాబ్స్ భారత్‌కి వస్తాయని అభిప్రాయం ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నిటికన్నా పెద్ద శత్రువు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.