Tuesday, 5 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పున్నమి జాతీయ వార్తలు

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ కు అరుదైన గౌరవం 2023 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం ఈనెల 23న అవార్డు కార్యక్రమం జరుగుతుంది ఇప్పటివరకు 360కి పైగా సినిమాల్లో నటించారు ప్రధానోత్సవంలో 71 నేషనల్ అవార్డులు ప్రదానం కానున్నాయి భారత్‌కి రెండు పాలీమెటాలిక్ సల్ఫైడ్ (PMS) అన్వేషణ ఒప్పందాలు అంతర్జాతీయ సముద్ర మట్ట అధికారం (ISA)తో ఇలాంటి రెండు ఒప్పందాలు కలిగిన తొలి దేశంగా భారత్ నిలిచింది అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ H-1B వీసా ఫీజు పెంపు కొత్త వీసా దరఖాస్తులపై $100,000 ఫీజు విధింపు ఇది ఒకసారి మాత్రమే చెల్లించవలసినది ప్రస్తుత వీసా హోల్డర్లకు, రీన్యువల్స్‌కి వర్తించదు భారత ప్రభుత్వం – “కొత్త నిబంధనలపై అమెరికా పునరాలోచించాలి” అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై స్పందనలు అమితాబ్ కాంత్: “ఈ నిర్ణయం అమెరికాకే దెబ్బ” స్టార్టప్‌లు, ల్యాబ్స్ భారత్‌కి వస్తాయని అభిప్రాయం ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నిటికన్నా పెద్ద శత్రువు

విద్య విజ్ఞానం

అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థుల నుంచి ఈ నెల 24 నుంచి అక్టోబరు 6 వరకూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలుగా శిక్షణ ఉంటుందని, శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని శనివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. “ఐబీపీఎస్, ఆర్.ఆర్.బి, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తాం. ఆసక్తిగల అభ్య ర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వీరికి ఆయా జిల్లా కేంద్రాల్లో అక్టో బరు 12న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మరిన్ని వివరాలకు 99496 86306 నంబరులో సంప్రదించాలి” అని ఆయన సూచించారు. ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించినట్లు వెల్లడించారు.

E-పేపర్

*రూ. 5 కే షర్ట్ అంటూ సోషల్ మీడియా లో రీల్*

రాజంపేట పట్టణంలో ఆర్ఎస్ రోడ్డులో ఉన్నటువంటి స్టైల్ వరల్డ్ (style world) బట్టల షాపు యజమాని తన షాపు వార్షికోత్సవ సందర్బముగా చేసిన రీల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన ఇంస్టాగ్రామ్ ఐడిని ఫాలో అయిన అభిమానులకు కేవలం ఐదు రూపాయలకే షర్ట్ అంటూ అనే ప్రత్యేక ఆఫర్ను ఇంస్టాగ్రామ్ ద్వారా శనివారం ప్రచారం చేశారు. ఆదివారం ఉదయం 8:30 నుంచి 10:30 వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుందని రీల్ లో పేర్కొన్నాడు. తక్కువ ధరలో మంచి వస్త్రాలు దక్కుతాయన ఆశతో యువత భారీగా షాపు వద్దకు చేరుకున్నారు. దీంతో ఆర్ఎస్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలగడంతో షాపు యజమాని పోలీసుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడంతో షాపు యజమానిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

E-పేపర్

*రూ. 5 కే షర్ట్ అంటూ సోషల్ మీడియా లో రీల్*

రాజంపేట పట్టణంలో ఆర్ఎస్ రోడ్డులో ఉన్నటువంటి స్టైల్ వరల్డ్ (style world) బట్టల షాపు యజమాని తన షాపు వార్షికోత్సవ సందర్బముగా చేసిన రీల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన ఇంస్టాగ్రామ్ ఐడిని ఫాలో అయిన అభిమానులకు కేవలం ఐదు రూపాయలకే షర్ట్ అంటూ అనే ప్రత్యేక ఆఫర్ను ఇంస్టాగ్రామ్ ద్వారా శనివారం ప్రచారం చేశారు. ఆదివారం ఉదయం 8:30 నుంచి 10:30 వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుందని రీల్ లో పేర్కొన్నాడు. తక్కువ ధరలో మంచి వస్త్రాలు దక్కుతాయన ఆశతో యువత భారీగా షాపు వద్దకు చేరుకున్నారు. దీంతో ఆర్ఎస్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలగడంతో షాపు యజమాని పోలీసుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడంతో షాపు యజమానిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఆంధ్రప్రదేశ్ నిర్మల్

ప్రభుత్వ గోపాల్ రావు పటేల్ డిగ్రీ కళాశాల బైంసాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

బైంసా పట్టణంలోని ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ పథకం మరియు మహిళా సాధికారత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోళ్ల బుచ్చయ్య సార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం పువ్వులను హారంగా మరిచి దేవతలకు అర్పిస్తుంటే ఆ పువ్వులని దేవతగా చేసి ఆరాధించే సంస్కృతి తెలంగాణ దాని పూల లోని స్వచ్ఛతకు సుకుమారత్వం సౌందర్యం గుబాలింపు మానవ జీవితంలో రావాలని అన్నారు అలాగే ఈ కార్యక్రమంలో సిపిడిసి అధ్యక్షులు శ్రీ డాక్టర్ నగేష్ సార్ గారు మాట్లాడుతూ ప్రకృతి తత్వంగా పువ్వులలో ఆరోగ్యపరమైన అనేక అంశాలు ఉంటాయని తంగేడు పువ్వులో అనేక రకాలుగా ఆరోగ్యకరమైనటువంటి కారకాలు ఉండడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చిన్నంగా తంగేడు పువ్వులు ఎన్నుకోవడం జరిగింది అని అని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారిలో మంచి సాంప్రదాయ వస్త్రధారణ కలిగిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ శ్రీ కరోల బుచ్చయ్య గారు ప్రైజ్ మనీ రూపంలో వివిధ రకాల బహుమతులను కళాశాల తెలుగు విభాగం శ్రీ ఆరే రాజుగారు మరియు వైస్ ప్రిన్సిపాల్ శ్రీ రఘునాథ్ సార్ గారు మరియు మహిళా సాధికారత విభాగం శ్రీమతి డాక్టర్ కల్పనా మేడం గారు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆరే రాజుగారు మరియు ఓ ప్రకాష్ సార్ గారు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ భీమ్రావు సార్ గారు డాక్టర్ రవి సార్ గారు డాక్టర్ పి జి రెడ్డి సార్ గారు డాక్టర్ పవన్ సార్ గారు డాక్టర్ శంకర్ సార్ గారు డాక్టర్ సంతోష్ రాజు గారు డాక్టర్ నహీదా మేడం గారు దివ్య గారు సురేందర్ గారు రాజయ్య గారు రామ్మోహర్ గారు కిషన్ గారు శ్రవణ్యా గారు అర్సియా, ఉజుమా, అబ్దుల్లా ,మదర్, ఇర్ఫాన్, వాహీద్ అధ్యాపకులు మరియు ఈ కార్యక్రమంలో సిపిడిసి కార్యదర్శి మనోజ్ ,బాజీరావు బోస్లే ,అనిల్ చంద్ర ,మోహన్ సింగ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి ప్రభుత్వ హాస్పిటల్ లో గోరం సోటు చేసుకుంది… వైద్యుల నిర్లక్ష్యం వల్ల పసి ప్రాణి బలి…..

పున్నమి న్యూస్ నెల్లూరు జిల్లా ఉదయగిరి : సెప్టెంబర్ 21:// ఉదయగిరి మండల కేంద్రమైన ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించక ఓ పేదింటి తల్లి తన పండింటి మొగ బిడ్డని కోల్పోయినది. హాస్పిటల్ సిబ్బంది సరిగా విడుదల నిర్వహించి ఉంటే నా బిడ్డ చనిపోయేవాడు కాదని తల్లిదండ్రులు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అని ఓ తల్లి ఆవేదన, నా బిడ్డ చావుకు కారణమైన డాక్టర్ను సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని వాపోతున్నారు.కన్నీరు మున్నీరు అవ్వుతున్న ఆ తల్లి, తండ్రి,లు. అనంతరం వారి కుటుంబ సభ్యులు ధర్నాకి దిగారు. మా బిడ్డకు జరిగినట్టుగా ఇంకో తల్లి ఇంకో బిడ్డను పోగొట్టుకోకుండా ఉండేలా ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని బాధితులు,, కుటుంబ సభ్యులు దుఃఖం తో మునిగిపోతున్నారు. అనంతరం ఉదయగిరి పోలీస్ స్టేటస్ కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్

ఫ్లాష్… ఏకలవ్య పాఠశాలలో టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఫ్లాష్… ఏకలవ్య పాఠశాలలో టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఖాళీల వివరాలు: ప్రిన్సిపల్: 225 పీజీటీ:1460 టీజీటీ: 3962 హాస్టల్ వార్డెన్ (పురుషులు):346 హాస్టల్ వార్డెన్ (మహిళలు): 289 స్టాఫ్ నర్స్ (మహిళలు):550 అకౌంటెంట్:61 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 228 ల్యాబ్ అటెండెంట్:146 మొత్తం పోస్టుల సంఖ్య:7267 ఆన్లైన్ అప్లై చివరి తేదీ: 23.10.2025 నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అర్హతలు, సిలబస్, ఫీజు, ఆన్లైన్ అప్లై లింక్స్ క్రింది సైట్ లో కలవు. లింక్ : https://nests.tribal.gov.in

తిరుపతి

పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీకాళహస్తీశ్వరుడు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో అమావాస్య సందర్భంగా శనివారం శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళస్తీశ్వరుడు పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు.ముందుగా స్వామి అమ్మవార్లను ఆలయ అలంకార మండపంలో వివిధ రకాల పుష్పాలు,ఆభరణాలతో అలంకరించి ధూప దీప,నైవేద్యాలు సమర్పించారు.అనంతరం నంది వాహనం పై స్వామివారు,సింహ వాహనంపై అమ్మవారిని ఉంచి మేళతాళాలు,మంగళ వాయిద్యాల నడుమ పట్టణంలో ఊరేగించారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో మహిళ అదృశ్యం

శ్రీకాళహస్తి టూ టౌన్ పరిధిలో నివాసముంటున్న సజ్జ లక్ష్మమ్మ w/o.లేట్ వీరయ్య గురువారం ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు.కుటుంబ సభ్యుల సమాచారం మేరకు తన తల్లి ఇంటి నుండి గురువారం వెళ్లి తిరిరి రాలేదని,అప్పుడప్పుడు మనస్తాపం తో వెళ్లి వచ్చేసేదని,శనివారం వరకు ఇంటికి రాకపోవడంతో బంధువులు చుట్టుపక్కల వెతికి సమాచారం లేకపోవడంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో,ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి తెలిపారు.

తెలంగాణ

విద్యా వ్యవస్థ ని భ్రష్టు పట్టించిన రేవంత్ సర్కార్

ABVP ఆధ్వర్యంలో మంచిర్యాల లో ప్రెస్ మీట్… విద్యారంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మంచిర్యాల కేంద్రంలో సెప్టెంబర్ 18 19 తేదీలలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాల్లో రాష్ట్ర నలుమూలల నుండి విద్యార్థి నాయకులు పాల్గొని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించడం జరిగింది అని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగిందని ఇందులో రాష్ట్ర స్థితి విద్యారంగ స్థితిపై రెండు తీర్మానాలు ప్రవేశ పెట్టడం జరిగిందని ఈ తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామని అన్నారు రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైందని విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాఫ్ అయ్యారని అన్నారు. విద్యార్థులకు హక్కుగా రావాల్సిన స్కాలర్షిప్ లో రియంబర్స్మెంట్ ను విడుదల చేయకుండా విద్యార్థుల్లోకాన్ని మానసిక వేదన గురి చేస్తున్నారని సర్టిఫికెట్లు తీసుకోలేక ఉన్నత చదువులకు పోలేక విద్యార్థులు రోడ్డు ఎక్కుతుంటే బారిపైన అక్రమ కేసులు బనాయించి జైల్లో పంపించే కార్యక్రమం పెడుతున్నారని అన్నారు.ఈ రాష్ట్రం లోపల రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రైవేట్ కాలేజీలు నిరవధిక బంద్ కే పిలుపునివ్వడం.రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అన్నారు ఈ మధ్యకాలంలో కొన్ని పృథ్విద్యా కళాశాలలో నిర్భయ పిలుపునిస్తున్నామని చెప్పి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ చర్చలు సఫలమయ్యాయని బందు ను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటన చేయడం జరిగింది. కావున ఇకనుండి ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ఫీజుల కోసం వేధించి సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కాలేజీల అంతు చూస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్రం లోపల పేద పిల్లలు చదువుకునే గురుకుల సంక్షేమ హాస్టల్లో పరిస్థితి దారుణంగా తయారయిందని ఫుడ్ పాయిజన్ తో చనిపోతున్నారని సరైన బడ్జెట్ లేక పక్కా భవనాలు లేక గురుకులాల అల్లాడుతున్నాయన్నారు. ఈ రాష్ట్రంలో వెంటనే జాతీయ విద్యా విధానం (NEP 2020) ని అమలు పరచాలని అర్బన్ నక్సలైట్లతో కమ్యూనిస్టు భావజాలంతో నిండి ఉన్న విద్యా కమిషన్ దీన్ని అడ్డుకోవాలని చూస్తే విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీలను బడ్జెట్ కి సరిపడా బ్లాక్ గ్రాండ్ కేటాయించకుండా పాలక మండలాన్ని నియమించకుండా కావాలనే నిర్వీర్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన ఇప్పటివరకు యూనివర్సిటీలలో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ను రిక్రూట్ చేయకపోవడం దారుణమని ప్రైవేట్ యూనివర్సిటీల కంటే దారుణంగా ప్రభుత్వ యూనివర్సిటీ విద్యార్థులను ముక్కు పిండి వసూలు చేయడానికి ఎబివిపి ఖండిస్తున్నామని అన్నారు.ఈ రాష్ట్రంలో రైతాంగం యొక్క దుస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్య లా తయారు అయిందని వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని దోక చేస్తుందని అన్నారు .ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు ఒకవైపు రైతులు యూరియా కోసం కొట్లాడుతుంటే నిరుద్యోగులు మీరు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాల మాటేమిటని రోడ్లెక్కుతుంటే ఈ ప్రభుత్వం చోద్యం చూసిన తప్పిస్తే ఏ యొక్క వర్గానికి న్యాయం చేయడం ఈ రాష్ట్రంలో అక్రమాలకు వేదికైనను బట్టి టీజీపీఎస్ అని వెంటనే రద్దు చేయాలని దాని స్థానంలో కొత్త బోర్డును నియమించి వెంటనే గ్రూప్ వన్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల మాఫియా ఈ రాష్ట్రంలో చెలరేగిపోతున్నాయని విద్యార్థుల నుండి నిబంధన విరుద్ధంగా ఫీజులు దండుకుంటూ విద్యార్థులను నానా హింసలు పెడుతున్నాయని డ్రగ్స్ కు గంజాయికి వేదికగా మారిన ప్రైవేటు యూనివర్సిటీలపై ఎందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు విద్యార్థి సమాజానికి చెప్పాలన్నారు ఈ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పై పూర్తిగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఎంఈఓ డిఓ పోస్టులను భర్తీ చేయకపోవడం మూలంగా పర్యవేక్షణ కరువై విద్యా ప్రమాణాలు పడిపోయి విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్లలో చేరడం ఆపేసారన్న స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు విద్యారంగానికి అధిక నీళ్లు కేటాయించి విద్యారంగాన్ని దాడిలో పెట్టాలని విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపెట్టాలన్నారు లేకపోతే విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడతామని సాయంత్రం జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్, విభాగ్ కన్వీనర్ అజయ్ ,జిల్లా కన్వీనర్ అనిల్ పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.