Tuesday, 5 May 2026

Blog

సినిమా

నటుడు మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @సినిమా నటుడు మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు 2023 సంవత్సరానికి అవార్డు ప్రకటించిన కేంద్రం ఈ నెల 23న మోహన్‌లాల్‌కు అవార్డు ప్రదానం గతంలో మోహన్‌లాల్‌కు పద్మశ్రీ, పద్మభూషన్‌ అవార్డులు మలయాళం సహా 5 భాషల చిత్రాల్లో నటించిన మోహన్‌లాల్‌

ఖమ్మం

గ్రామంలోని ప్రతి రైతు పొలానికి వెళ్లేలా దారులు ఏర్పాటు చెయ్యాలి : దొనూరి రాము

పున్నమి ప్రతినిధి ఖమ్మం భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా స్థాయి సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిధి గా దక్షిణ భారత ప్రాంతీయ సంఘటన మంత్రి దొనూరి రాము విచ్చేసి మాట్లాడుతూ జిల్లాలోని చాలా గ్రామాల్లోని పొలాలకు వెళ్ళడానికి సరైన దారులు లేకపోవడం వలన, అలాగే ఆక్రమణలో ఉన్న డొంకలను కూడా సరిచేసి మా రైతులకు దారుల కల్పించాలి అని డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్ సంఘ్ 45 సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం రైతుల సమస్యల పోరాడుతుందని, పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే అన్న ఏకైక నినాదంతో బీకేయస్ పని చేస్తుంది అని తెలిపారు… బీకేయస్ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి రాజి రెడ్డి మాట్లాడుతూ రైతులందరికీ సకాలంలో సరైన, నాణ్యమైన విత్తనాలతో పాటు , ఎరువులను అందించి రైతులకు సరైన న్యాయం చేయాలని, జిల్లాలోని వేసంగి పంటలకు అవసరమైన సాగునీటిని అందించేందుకు అన్ని కాలువలకు సరైన మరమత్తులు చేసి ప్రతి ఎకరానికి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు పగడవరపు శ్రీనివాస రావు మాట్లాడుతూ రైతులందరికీ విద్యుత్ సమస్య చాలా తివ్రమైనది ఉంది అని , చాలా పొలాలో లూజ్ వైర్లు,స్తంభాల సమస్యలు అలాగే సకాలంలో పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్లను మరమ్మత్తులు చేసి ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యుత్ ను అందించాలని , రైతులను కరెంట్ కోతల నుంచి కాపాడాలి అని డిమాండ్ చేశారు… ప్రతీ గ్రామంలో పొలాల్లోకి వెళ్ళే ప్రతి దారిని బీటి రోడ్లుగా అభివృద్ధి చేసి రైతుల సాగుకు అవసరమైన ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళటానికి అవసరమైన వెడల్పుగా ప్రతీ దారిని అభివృద్ధి చేయాలని జిల్లా సమావేశంలో తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో బీకేయస్ జోనల్ అధ్యక్షులు మల్లెంపాటి రమేష్, జోనల్ కార్యదర్శి మందనపు రామారావు జిల్లా కార్యదర్శి తాళ్లూరి శ్రీనివాస రావు రైతులు పాల్గొన్నారు.

క్రైమ్

నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @మంచిర్యాల: నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది నేరస్థులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో మంచిర్యాల జోన్‌లో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. నేరస్థులకు శిక్షపడే విధంగా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు.

ఆంధ్రప్రదేశ్

ప్రతి మహిళా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి: గనిశెట్టి వెంకటేశ్వరరావు

పున్నమి న్యూస్ (కోనసీమ), జర్నలిస్ట్ రమణ: అయినవిల్లి మండలం మాగాం గ్రామం విశ్వనాథరాజు కాలనీ స్కూల్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా వీరవల్లిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ విజయ్ నేతృత్వంలో గ్రామ సర్పంచ్ కాశీ వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షతన స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు సందర్శించారు. మొదటగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు, సేవా పక్వాడ జిల్లా కో కన్వీనర్ లు గనిశెట్టి వెంకటేశ్వరరావు, సలాది వీరబాబు పాల్గొని మాట్లాడుతూ ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటాదనే మోడీ ఉద్దేశంతో స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ పేరుతో ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించి మహిళలకు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ వైద్య శిబిరాలు మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అంగనవాడి సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి వారు చేసిన పౌష్టికాహార పిండి వంటలు రుచి చూశారు. అనంతరం పేషెంట్ లకు బ్రెడ్ లు, రస్క్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ముద్రగడ నరసింహారావు(చంటి), ఎం.ఎల్.హెచ్.పీ టి.షారోన్, సేవా పక్వాడ్ మండల ఇంచార్జిలు మోకా ఆదిలక్ష్మి, మిద్దె రవి రాజ్, రాష్ట్ర నాయకులు కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి, యనమదల రాజ్యలక్ష్మి, మేకల వీర వెంకట సత్యనారాయణ, కూటమి నేతలు కొమ్మిరెడ్డి శివ, తాడినాటి రామకృష్ణ, అత్తిలి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : క్లస్టర్ మీటింగ్

ప్రతినెల మూడవ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే క్లస్టర్ సమావేశాల భాగంగా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేల్ పరిధిలోని ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల సమావేశం నేడు జరిగింది. మండల విద్యాశాఖ అధికారి : 1 కోదండ నాయుడు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు ఆధ్వర్యంలో 19 పాఠశాలల ఉపాధ్యాయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కోదండ నాయుడు మాట్లాడుతూ, పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఎస్ ఏ ఎం పి : 1 ( ఎఫ్ ఏ :1) పరీక్షలలో సి , డి గ్రేడ్ పొందిన విద్యార్థులు ఏ అంశాలలో వెనుకబడి ఉన్నారో తెలుసుకొని, వారిని పై గ్రేడ్‌కు తీసుకెళ్లేలా ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత వహించాలని ఆయన కోరారు. క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ, సమావేశంలో చర్చించిన అంశాలను ప్రతి పాఠశాలలో కచ్చితంగా అమలు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఉపాధ్యాయులను పిలుపునిచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఆయన లక్ష్యాలు నెరవేర్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. సీనియర్ ఉపాధ్యాయులు కామాటం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు సమయపాలన పాటించి ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తున్న నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని అన్నారు. చివరిగా మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలకు అకాడమిక్ క్యాలెండర్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, సోఫియా, కామాటం వెంకటేశ్వర్లు, బాలసుబ్రమణ్యం, సతీష్, సి.ఆర్.ఎం.టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

స్వచ్ఛ ఆంధ్ర : స్వర్ణాంధ్రలో చిట్వేల్ విద్యార్థుల సేవా స్పూర్తి …..పరిశుభ్రతను పాటిద్దాం : ఆరోగ్యంగా జీవిద్దాం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “స్వచ్ఛ ఆంధ్ర : స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు, స్కౌట్స్ & గైడ్స్ పాఠశాల ప్రాంగణంలోని పిచ్చిమొక్కలు, చెత్త తొలగించి, తడి ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు వర్షాకాలంలో నిల్వ నీరు వలన దోమల పెరుగుదల ఎక్కువై మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, అపరిశుభ్రమైన నీరు, ఆహారం వలన టైఫాయిడ్, పచ్చకామెర్లు వచ్చే అవకాశం ఉందని, పరిశుభ్రమైన ఆహారం, నీటిని మరిగించి తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. విద్యార్థులు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివ నారాయణ, నవీన్ కుమార్, వెంకటరమణ, మహమ్మద్ రఫీ, సుభాష్ చంద్రబోస్, చెన్నయ్య, గీతారాణి, హాసిని, కళావతి, శిల్పకళ, సుజాత, సోఫియా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

విద్యార్ధుల ఆత్మహత్యలన్నీ వ్యవస్థాగత హత్యలే

పిడిఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్.భాను అధ్యక్షతన జరిగిన సెమినార్ లో ప్రధాన వక్తగా విచ్చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తెలుగు ఆచార్యులు పిల్లి వాసు గారు మాట్లాడుతూ “ఎన్సీఆర్బి (నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో) నివేదికల ప్రకారం 2024లో 13,044 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారిలో 2,248 మంది పరీక్షల్లో ఫెయిల్ అయిన కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని, సాధారణ ఆత్మహత్యల రేటు కంటే విద్యార్థుల ఆత్మహత్యల రేటు 2 శాతం అధికంగా నమోదు అయిందని పేర్కొంది. ఆనందంగా, నవ్వుతూ, తుళ్ళుతూ, స్వేచ్ఛగా, ఇష్టంగా చదువు నేర్చుకుని, సమాజానికి, దేశానికి సరికొత్త ఆవిష్కరణలు అందించాల్సిన విద్యార్థులు మార్కులు, ర్యాంకుల కోసం జరుగుతున్న పోటీలో నిలబడలేక, అవమానాలను తట్టుకోలేక, బయటకు చెప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. సమాజాన్ని తీర్చిదిద్ది, దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన విద్యార్థి, యువతరం పాల్పడుతున్న ఆత్మహత్యలను వ్యవస్థీకృత హత్యలుగా భావించి, వాటికి గల మూల కారణాలను పరిష్కరించుకోవాలన్నారు.పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ భాస్కర్ మాట్లాడుతూ “విద్యను అత్యంత ఖరీదైన సరుకుగా మార్చి,కార్పొరేట్, విదేశీ శక్తులకు అప్పజెప్పుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. విద్యార్థుల్లో కుల,మత, ప్రాంతీయ విద్వేషాలను పెంచే విధంగా పాఠ్యాంశాలను మారుస్తున్నారు. దీంతో విద్యార్థులు అధైర్యంగా, అనైతికంగా, ఎటువంటి విలువలు లేకుండా దేశం పట్ల, సమాజం పట్ల, కనీసం తమ సమస్యల పట్ల కూడా స్పందించలేని స్థితిలోకి నెట్టవేయబడుతున్నారు. మరోవైపు ఉద్యోగాలు కల్పించకుండా విద్యార్థుల మధ్య సంక్లిష్టమైన పోటీని సృష్టిస్తున్నారు. ఈ పోటీలో నెగ్గడం కోసం విద్యార్థులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా బట్టీపట్టి చదువుతూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా విద్యార్థులు పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెబుతూ ప్రభుత్వాలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయన్నారు.ఏపిటిఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు నేతాజీ గారు మాట్లాడుతూ “పిల్లల ఊహాశక్తికి రెక్కలు తొడిగి, సృజనాత్మకతను వెలికి తీసి ఆవిష్కరణలు సృష్టించేందుకు విద్యా బోధనలో అనేక ప్రయోగాలను చేస్తున్న, ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యను బోధిస్తున్న ఫిన్లాండ్ ను మన దేశం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రాపంచిక విషయాలు, సామాజిక స్పృహను కలిగిన ఆచరణాత్మకతతో కూడిన, పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించాలన్నారు. అలాగే విద్యలో శారీరక శ్రమకు, ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.అప్పుడే విద్యార్థుల ఆత్మహత్యలను నియంత్రించగలమన్నారుఈ కార్యక్రమంలో PDSO రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్.మోహన్, జిల్లా కమిటీ సభ్యులు మరియు వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి స్వర్ణముఖిలో ఈతకు వెళ్లి బాలుడు మృతి

నదిలో ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది.స్థానికుల వివరాల మేరకు ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన హారుణ్ అతని స్నేహితుల తో కలిసి శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో హారుణ్ తో పాటు మరొక బాలుడు నీటిలో కొట్టుకెళ్లాడు.ఆ సమయానికి అటుగా వెళ్లిన మున్సిపల్ వర్కర్ అరుణ్ గమనించి కాపాడుటకు ప్రయత్నించగా ఫలితం లేకపోయింది.అయితే హారుణ్ మృత దేహాన్ని తీసారు,మరొక బాలుడి ఆచూకీ తెలియరాలేదు.

తూర్పు గోదావరి

ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమం

సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సంతకాల సే కరణ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పిలవదాలికాస్తు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ ప్రజల ఓట్లను దోచుకుని మూడోసారి గద్దెనెక్కింది ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలను పాల్పడి లేని ఓట్ల ఉన్నట్లుగా చూపించి ఉన్న ఓట్లను తొలగించి బిజెపి ఓట్ చోరీకి పాల్పడింది దీనివల్ల నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా వారికి నచ్చిన నాయకులను ఎన్నుకునే అధికారాన్ని కోల్పోయారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు తమ ఓటును హక్కుగా పొందాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా మరియు ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లను కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు పెడుతున్నాం. 1) ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. 2) ఎన్నికల ముందు ఓటర్ల జాబితాతో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి. 3) తొలగించిన ఓట్లలో తప్పులు దొరికే సమస్య పరిష్కారానికి ఫిర్యాదుల వ్యవస్థ అందుబాటులో ఉంచాలి. 4) ఎన్నికలకు చివరి నిమిషంలో ఓట్ల తొలగింపు లేదా చేర్పులను నివారించాలి స్పష్టమైన కటాఫ్ తేదీని ముందుగానే ప్రకటించాలి. 5) ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపుకు పాల్పడిన అధికారులు ఏజెంట్ల మీద చర్యలు తీసుకోవాలి. అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి అరిగెల అరుణకుమారి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లక్ష సంతకాల సేకరణలో ముందు సంతకం టీ కె విశ్వేశ్వర్ రెడ్డి పెట్టి మొదలు పెట్టారు.

తూర్పు గోదావరి

ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమం

సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సంతకాల సే కరణ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పిలవదాలికాస్తు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ ప్రజల ఓట్లను దోచుకుని మూడోసారి గద్దెనెక్కింది ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలను పాల్పడి లేని ఓట్ల ఉన్నట్లుగా చూపించి ఉన్న ఓట్లను తొలగించి బిజెపి ఓట్ చోరీకి పాల్పడింది దీనివల్ల నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా వారికి నచ్చిన నాయకులను ఎన్నుకునే అధికారాన్ని కోల్పోయారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు తమ ఓటును హక్కుగా పొందాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా మరియు ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లను కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు పెడుతున్నాం. 1) ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. 2) ఎన్నికల ముందు ఓటర్ల జాబితాతో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి. 3) తొలగించిన ఓట్లలో తప్పులు దొరికే సమస్య పరిష్కారానికి ఫిర్యాదుల వ్యవస్థ అందుబాటులో ఉంచాలి. 4) ఎన్నికలకు చివరి నిమిషంలో ఓట్ల తొలగింపు లేదా చేర్పులను నివారించాలి స్పష్టమైన కటాఫ్ తేదీని ముందుగానే ప్రకటించాలి. 5) ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపుకు పాల్పడిన అధికారులు ఏజెంట్ల మీద చర్యలు తీసుకోవాలి. అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి అరిగెల అరుణకుమారి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లక్ష సంతకాల సేకరణలో ముందు సంతకం టీ కె విశ్వేశ్వర్ రెడ్డి పెట్టి మొదలు పెట్టారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.