Tuesday, 5 May 2026

Blog

ఎలూరు

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర

రెడ్డిగూడెం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రకార్యక్రమములో భాగంగా ఈరోజు రెడ్డిగూడెం ఎం డి ఓ కార్యాలయంలో పరిశుభ్ర కార్యక్రమం మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు అధికారులు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత సమాజానికి ఎంతో అవసరమని ఒక చెట్టు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు మేలు చేయడమే అని అన్నారు అలాగే ప్రజల ఆరోగ్యం పర్యావరణ రక్షణ కోసం చేపట్టే ఈ కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రభుత్వ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

తాగునీరు, ఆల్కహాల్ లేని పానీయాలపై జీఎస్‌టీ తగ్గింపు

ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) గతంలో తాగునీరు, ఆల్కహాల్ లేని పానీయాలపై 12 నుంచి 18 శాతం జీఎస్‌టీ విధించబడింది. ఇప్పుడు ఆ పన్ను ఒక్కసారిగా 5 శాతానికి తగ్గించబడినందున, వీటి ధరలు సామాన్య ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తాయి.

యాదాద్రి భువనగిరి

శ్రీ నవభారత్ డిగ్రీ’ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

‘ భువనగిరి, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) భువనగిరి పట్టణంలోని శ్రీ నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల లో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మను రంగురంగుల పూలతో అలంకరించి, గౌరమ్మను కొల్చి ఉత్సాహంగా నృత్యాలు, బతుకమ్మ పాటలు ఆలపించారు. ప్రిన్సిపాల్ చిక్క ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక, ప్రకృతిని పూజించే పూల పండుగ అని, విద్యార్థులు ఈ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు నిలబెట్టాలి అన్నారు. బహుమతులు ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహించారు. వైస్ ప్రిన్సిపల్ ఎల్లెష్, అధ్యాపకులు పద్మ, స్పందన, ధరణి, ప్రసన్న, మౌనిక, అంబికా, రమేష్, శ్రీధర్, సంతోష్, క్రాంతి, సునిల్ తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జడ్‌పిహెచ్‌ఎస్ ఎడునూతలలో బతుకమ్మ – దసరా పండుగల సంబరాలు

జనగాం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) జడ్‌పిహెచ్‌ఎస్ ఎడునూతలలో బతుకమ్మ, దసరా పండుగలను విద్యార్థులు ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బాలికలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించగా, బాలురు రావణాసురుని విగ్రహాన్ని రూపొందించి దసరా సందేశాన్ని ప్రతిబింబించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు బతుకమ్మ పాటలు, నృత్యాలు, కథా రూపకాలు, వక్తృత్వం, కవితా పఠనం ప్రదర్శించారు.ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య మాట్లాడుతూ: “బతుకమ్మ పూల పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తే, దసరా సత్యం, న్యాయం సాధించిన విజయానికి ప్రతీక” అని అన్నారు. ఇలాంటి వేడుకలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఐక్యత పెంపొందిస్తాయని సూచించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్‌కుమార్, రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొని విద్యార్థులను అభినందించారు.

ఖమ్మం

ఖమ్మం నగరంలోని పలు విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబరాలు

ఖమ్మం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి. దసరా సెలవుల సందర్భంగా ఖమ్మం నగరంలోని పలు విద్యాసంస్థల్లో బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. రోటరీ నగర్‌లో గల ఖమ్మం పబ్లిక్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ శ్రీమతి సరిత ఆధ్వర్యంలో విద్యార్థినులు, విద్యార్థులు బతుకమ్మను అలంకరించి పాటలు పాడుతూ ఉత్సాహంగా జరుపుకున్నారు. అమ్మ వారి దివ్యాశీసులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకున్నారు. ఖమ్మం ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు పబ్లిక్ స్కూల్ తరపున తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు సక్రమంగా పాల్గొన్నారు.

వనపర్తి

ఘనంగా బతుకమ్మ సంబరాలు

వనపర్తి జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిమాడలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు డి. చెన్నప్ప ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని పూలతో బతుకమ్మను అందంగా అలంకరించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం స్థానిక సల్కలాపూర్ చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా చెన్నప్ప మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఇలాంటి పండుగలు విద్యార్థులకు సంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తాయని తెలిపారు.

మహబూబ్ నగర్

మహబూబ్‌నగర్ ఇబ్రహీం నగర్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) మహబూబ్‌నగర్ జిల్లా ఇబ్రహీం నగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు కలిసి పాఠశాల ప్రాంగణంలో ఈ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి టీ. లక్ష్మి, చైర్మన్ AAPC, సభ్యులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో, పూలతో విద్యార్థులు ఆనందంగా నృత్యాలు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. నర్సింలు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని, విద్యార్థులు సంప్రదాయాల పట్ల ఆకర్షితులు కావాలని తెలిపారు.

జనగాం

బదిలీపై వెళ్తున్న సిఐ దామోదర్ రెడ్డిని సన్మానించిన సిపిఎం నాయకులు

జనగామ, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) జనగామ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా 15 నెలలపాటు సేవలందించిన సిఐ దామోదర్ రెడ్డి బదిలీపై వెళ్తుండగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ, షాపింగ్ మాల్ అగ్నిప్రమాదం, దుర్గమ్మ పండుగ, ట్రాఫిక్ నియంత్రణ వంటి సందర్భాల్లో సిఐ సమర్థవంతంగా వ్యవహరించారని ప్రశంసించారు. గంజాయి, డ్రగ్స్‌ కార్యకలాపాలను అరికట్టి యువతను కౌన్సిలింగ్ చేయడం, వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవడం ద్వారా మార్పు తేవడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. దొంగతనాల్లో రికవరీ చేసి బాధితులకు ఆస్తులు చేరేలా కృషి చేశారని వివరించారు. కార్యక్రమంలో బొట్ల శేఖర్, బూడిది గోపి, సుంచు విజేందర్, పొత్కనూరి ఉపేందర్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు బానోతు ధర్మ బిక్షం తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

పింఛన్ల హామీలు ఏమయ్యాయి? – ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వృద్ధులు

కామారెడ్డి, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పింఛన్ల పెంపు, పింఛన్ల హామీలతో ఆకర్షించగా, అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం వాటిని మరిచిపోయాయని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను గమనించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గత ఐదు నెలలుగా పోరాటాలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. ఈ నిరసనల్లో కొత్తోల్ల యాదగిరి మాదిగ, ఆకుల రాజయ్య, రాజా గౌడ్, వంగ దేవయ్య, పురం నరసయ్య, నాదరి బాలయ్య, పందుల మల్లయ్య, కాల బాలయ్య, సూరంపల్లి మొగులయ్య, ఆల నారాయణరెడ్డి, బత్తుల సాయిలు, ఆకుల లక్ష్మి, తాటికొండ లక్ష్మి, కాల మణెమ్మ వంటి వయోవృద్ధులు పాల్గొన్నారు.

E-పేపర్

శ్రీ త్రికోటేశ్వరలో ఘనంగా ముందస్తు విజయదశమి వేడుకలు

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) విజయదశమి సందర్భంగా చేజర్ల మండలం ఆదురుపల్లిలోని శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో దశరా ముందస్తు వేడుకలు సుప్రియ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దుర్గామాత ప్రతిమ అలంకరణ, మహిషాసుర వధ, రామాయణ దృశ్యరూపం చివరగా రావణాసుర దహనం వంటి కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. విద్యార్థినులు నవ దుర్గా వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలలో మహిషాసురుని వధ మరియు రావణుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా రావణ దహనం కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీనరసారెడ్డి, డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ చెడు మీద మంచి గెలిచిన తీరుకు ప్రతీకగా విజయ దశమి పండుగ జరుపుకుంటామనీ, విద్యార్థులందరూ మంచి మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలను అందుకోవాలని అందరికీ దశరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక వేషధారణ వేసిన బాల బాలికలను బహుమతులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు బాల బాలికలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.