Tuesday, 5 May 2026

Blog

కామారెడ్డి

పింఛన్ల హామీలు ఏమయ్యాయి? – ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వృద్ధులు

కామారెడ్డి, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పింఛన్ల పెంపు, పింఛన్ల హామీలతో ఆకర్షించగా, అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం వాటిని మరిచిపోయాయని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను గమనించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గత ఐదు నెలలుగా పోరాటాలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. ఈ నిరసనల్లో కొత్తోల్ల యాదగిరి మాదిగ, ఆకుల రాజయ్య, రాజా గౌడ్, వంగ దేవయ్య, పురం నరసయ్య, నాదరి బాలయ్య, పందుల మల్లయ్య, కాల బాలయ్య, సూరంపల్లి మొగులయ్య, ఆల నారాయణరెడ్డి, బత్తుల సాయిలు, ఆకుల లక్ష్మి, తాటికొండ లక్ష్మి, కాల మణెమ్మ వంటి వయోవృద్ధులు పాల్గొన్నారు.

E-పేపర్

శ్రీ త్రికోటేశ్వరలో ఘనంగా ముందస్తు విజయదశమి వేడుకలు

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) విజయదశమి సందర్భంగా చేజర్ల మండలం ఆదురుపల్లిలోని శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో దశరా ముందస్తు వేడుకలు సుప్రియ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దుర్గామాత ప్రతిమ అలంకరణ, మహిషాసుర వధ, రామాయణ దృశ్యరూపం చివరగా రావణాసుర దహనం వంటి కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. విద్యార్థినులు నవ దుర్గా వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలలో మహిషాసురుని వధ మరియు రావణుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా రావణ దహనం కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీనరసారెడ్డి, డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ చెడు మీద మంచి గెలిచిన తీరుకు ప్రతీకగా విజయ దశమి పండుగ జరుపుకుంటామనీ, విద్యార్థులందరూ మంచి మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలను అందుకోవాలని అందరికీ దశరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక వేషధారణ వేసిన బాల బాలికలను బహుమతులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు బాల బాలికలు పాల్గొన్నారు.

కామారెడ్డి

సొసైటీ చైర్మన్ గా బొంబోతుల స్వామి గౌడ్

కామారెడ్డి,సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా బొంబోతుల స్వామి గౌడ్ శనివారం పన్నెడు మంది డైరెక్టర్లతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ, యూరియా కొరతను దృష్టిలో ఉంచుకొని 20 లక్షల చెక్కుపై మొట్టమొద టి సంతకం చేయడం జరిగిందన్నారు. మండలం లో యూరియా కొరత లేకుండా చూసుకుంటామని అన్నారు, రైతులకు అందుబాటులో ఉండి సహయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

నాగర్‌కర్నూల్

స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు, నోట్‌బుక్స్ పంపిణీ – విద్యార్థులకు స్ఫూర్తి

వంగూర్, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడి పాఠశాలలో శనివారం కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, రచయితల చిత్రపటాలు మరియు విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యుడు, మాజీ ఎంపీటీసీ సుగుణమ్మ తనయుడు కంకణాల నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు రేపటి పౌరులని, వారికి స్ఫూర్తినిచ్చేందుకు జాతీయ నాయకుల చిత్రపటాలను అందించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు భవిష్యత్తులో కూడా చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఉపాధ్యాయులు జాతీయ నాయకుల జీవితాలు విద్యార్థులకు బోధించాలని సూచించారు. హెచ్ఎం బాబురావు, ఉపాధ్యాయులు శ్రీను నాయక్, సునీత, లక్ష్మీదేవి, అంగన్వాడి టీచర్ కోట్ల లలితమ్మ, కోట్ల తనియా, జర్నలిస్టు-కవి కోట్ల గౌతమ్, గోకమోళ్ల శివశంకర్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

చేజర్ల మండల సర్వసభ్య సమావేశం

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. మండల అభివృద్ధి పై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల ప్రభావం వంటి అంశాలపై చర్చ సాగింది. మండలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచనలు చేయడంతో పాటు సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి,ఎంపీపీ తూమాటి భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి పార్థసారథి, ఎంపీడీవో అమర్ సహా మండల అధికారులు పాల్గొన్నారు.

E-పేపర్

మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి జంబూ సూర్య నారాయణ

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర గ్రీన్ డే సందర్భంగా నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని నారాయణ రాజుపేట ఎర్ర చెరువు కట్ట రహదారి పరిసరాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు ఒక్కొక్కరు ఒక మొక్క నాటడం ద్వారా మానవాళికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఈవో సురేష్ . సిబ్బంది సుధీర్.శివ గ్రామస్తులు మట్టి బాబు తుమ్మాది శివకుమార్. ఉపాధి హామీ పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

పండగ వేళలో ఊరికి వెళితే తస్మాత్ జాగ్రత్త!!

   కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర   కామారెడ్డి ప్రతినిధి 20 సెప్టెంబర్ పున్నమి న్యూస్. : దసరా పండుగ సందర్భంగా ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. పోలీసులు ప్రజలకు ప్రకటన ద్వారా ఈ క్రింది కీలక సూచనలు చేశారు. ప్రయాణాల గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి..రోడ్డు భద్రతా నియమాలను పాటించి, పరిమిత వేగంతో వాహ నాలు నడపాలి.మద్యం సేవించి డ్రైవింగ్ చేయవ ద్దు దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రజ లు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలో బంగారం, నగ దు ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవ డం మంచిది. ఇరుగుపొరుగు వారికి ఇంటిని గమ నించమని చెప్పాలి.ఇంటిలోపల, బయట ఒక లైటు వేసి ఉంచాలి.సీసీ కెమెరాలు ఏర్పాటు చేసు కోవడం వల్ల మొబైల్ నుంచే ఇంటిని చూసుకునే వీలుం టుంది. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు కాల్ చేయాలి.శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలి.

విద్య విజ్ఞానం

పేదింటి బడి పిల్లలకు ఎస్‌బీఐ ‘ఆశా స్కాలర్‌షిప్‌ 2025’ ఛాన్స్‌.. ఎంపికైతే రూ.20 లక్షల లబ్ధి

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @ దేశ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులు, అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్స్‌, వైద్య విద్యార్థులు, ఐఐటీ, ఐఐఎం విద్యార్థులతో పాటు ఓవర్సీస్ విద్యార్థుల కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌ల కోసం ప్రకటన వెలువరించింది 2025-26 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా మొత్తం 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ స్కాలర్‌షిప్‌ల కోసం మొత్తం రూ.90 కోట్లు కేటాయించింది. 2022 నుంచి ఆశా స్కాలర్‌షిప్‌లను వెనుకబడిన విద్యార్థుల కోసం ఎస్‌బీఐ ఫౌండేషన్‌ అందిస్తుంది. ఈ మేరకు ఈ ఏడాదికి కూడా స్కాలర్‌షిప్‌ అందించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఎస్‌బీఐ ఛైర్మన్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు. స్కాలర్‌షిప్‌కు 9వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకు చదివే పేదింటి విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు 2024-25 విద్యా సంవత్సరంలో 75 శాతం మార్కులు లేదా 7 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు 10 శాతం అంటే 67.5 శాతం మార్కులు లేదా సీజీపీఏ 6.30 సాధించాల్సి ఉంటుంది. ఇక విద్యార్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మించకుండా ఉండాలి. అర్హత కలిగిన విద్యార్థులు ఎవరైనా నవంబర్‌ 15, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధులు తాము ఎంపిక చేసుకున్న కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.15 వేలు నుంచి రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనుంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధులు ఏటా రెన్యువల్‌ కావాలంటే.. చదివే కోర్సుల్లో కనీస అర్హత ప్రమాణాలు అంటే అటెండెన్స్, ఉత్తీర్ణత మార్కులు వంటివి పాటించాల్సి ఉంటుంది.

కామారెడ్డి

ఇంటి స్థలాన్ని కబ్జా నుండి విడిపించండి: వృద్దతంపతుల ఆరోపణ

కామారెడ్డి,సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల మండల కేంద్రంలో గల సుప్పని చిన్న రాజయ్య తండ్రి చిన్న రాజయ్య 5-39 ఇంటి నంబర్ గ్రామం రామారెడ్డి మండల రామారెడ్డి జిల్లా కామారెడ్డి స్థలం ( ఏడు వందల ఎనబై ఒకటి తొంబై నాలుగు ఈంచులు ) ఫిట్ల స్థలం ఉంది. ఇట్టి స్థలాన్ని ఇంజాపురం విఠల్ అనే వ్యక్తి బాత్రూమ్, బోర్ వేయించి, అరి సందిని కబ్జా చేశారు. పలు మార్లు హెచ్చరించిన వినలేదు, స్థాని క గ్రామపంచాయతీ వద్దకు వెళ్లి ఫీర్యాదు చేశాం సెక్రటరీ కాలయాపన చేస్తు వృద్ద దంపతులకు ఇంజాపురం విఠల్, జనార్దన్, గ్రామ సెక్రెటరీ ముగ్గు రు, కలిసి ఇబ్బందు లకు గురి చేస్తున్నారు. జిల్లా అధికారులు రామారెడ్డి గ్రామానికి వచ్చి ఆరో వార్డు లోగల ఇంటి స్థలాన్ని పరిశీలించి తమకు న్యాయం చేయాలని వేడుకు న్నారు.

మహబూబ్ నగర్

విజన్ ఇండ్ ఫౌండేషన్ కు చిన్నవెళ్లి రాఘవేందర్ చేయూత – సేవా దృక్పథం అభినందనీయం

మహబూబ్ నగర్ జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన చిన్నవెళ్లి రాఘవేందర్ విజన్ ఇండ్ ఫౌండేషన్ అనాథ వృద్ధాశ్రమానికి ఆర్థిక సహాయం అందించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఈ ఆశ్రమం అనాథలు, వృద్ధుల కోసం సేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ నాగరాజు, సోషల్ మీడియా అధ్యక్షులు దూపం అంజనేయులు, హాలెంటర్ గగనం నరేష్ సమక్షంలో రాఘవేందర్ తన వంతు సహాయం అందజేశారు. ఎల్లప్పుడూ ఈ ఆశ్రమానికి చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. చిన్నవెళ్లి రాఘవేందర్ సేవా దృక్పథం అభినందనీయమని విజన్ ఇండ్ ఫౌండేషన్ సభ్యులు ప్రశంసించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.