Tuesday, 5 May 2026

Blog

సినిమా

అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ఆయన నటించిన సినిమా పేర్లుతో చిత్రం

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @సినిమా అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ఆయన నటించిన సినిమా పేర్లు, ముఖ్య పాత్రల పేర్లతో డ్రాయింగ్ చార్ట్ మీద నాగేశ్వరరావు చిత్రాన్ని గీసిన నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీ ఆది గణపతి స్వామి వారి అన్న సమారాధన.

కాట్రేనికోన గ్రామ దేవత శక్తి స్వరూపిణి శ్రీ మావులమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీ ఆది గణపతి స్వామి నవరాత్రులు ముగింపు సందర్భంగా శ్రీ ఆణి విళ్ళ వెంకటరమణ శాస్త్రి సేవా ట్రస్ట్ తరుపున మరియు గ్రామ ప్రజలు, వర్తక సంఘాలు, జాతరలు చేయించే భక్త బృందాలు వారి సౌజన్యంతో ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి అన్న ప్రసాదములు స్వీకరించారు. స్వామివారి సేవా కార్యక్రమంలో భాగంగా ఆలయ అధ్యక్షులు ఆణి విళ్ళ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆకొండిఉమామహేష్, రాష్ట్ర బిజెపి కోశాధికారి గ్రంధి నానాజీ, ఆణి విళ్ళ ఫణి కాంత్ శాస్త్రి,చెరుకు బాపిరాజు, తాతపూడి గోపి, యల్లమిల్లి రమేష్ ,చెరుకుకృష్ణ, గ్రంధి రాంప్రసాద్, సంసాని పాండురంగారావు,సంసాని సత్య నారాయణ,గ్రంధి సత్తిబాబు, శ్రీరామ్,పండు,పవన్,,గ్రంధి,రాముడు వేదు ల శ్రీను, ఆకొండి రాధ, మంత్రి ప్రగడ శ్రీనివాస్, ఆణి విళ్ళ వాసు, తాతపూడి బుల్లి, మరియు పలువురు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు.

తెలంగాణ

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు తప్పనిసరిగా అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాలలు, హాస్టళ్ళను సందర్శించాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు తప్పనిసరిగా వారి పరిధిలోని అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వేములపల్లి కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఆదివారం నుండి పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చినందున విద్యార్థులను తీసుకు వెళ్ళేందుకు వారి తల్లిదండ్రులు పాఠశాలలకు రాగా జిల్లా కలెక్టర్ విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఎస్ఓ కు సూచించారు.

తిరుపతి

పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే మా ఆశయాలు పేట బ్రదర్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో మన పర్యావరణం మన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా నెలలో మొదటి శనివారం మరియు మూడవ శనివారం రోజున మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా ఈరోజు మూడవ శనివారం అయినందున తొట్టంబేడు మండలం,పొయ్యి పంచాయతీ సచివాలయం నందు మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి,ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, లక్ష్మణ్,దినేష్,గంధం శ్రీను,నవీన్,మనీ,కల్లిపూడి వెంకటేష్,మునిచంద్ర,భాను ప్రకాష్,చంబేటి జానీ,తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జడ్‌పిహెచ్‌ఎస్ ఏడునూతులలో 💐 బతుకమ్మ – దసరా పండుగల సంబరాలు

Sep 20, పున్నమి ప్రతినిధి, జనగాం: జడ్‌పిహెచ్‌ఎస్ ఏడునూతులలో బతుకమ్మ, దసరా పండుగలను విద్యార్థులు ఆనందోత్సాహాలతో, సంప్రదాయ శైలిలో ఘనంగా జరుపుకున్నారు. బాలికలు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను సృజనాత్మకంగా అలంకరించగా, విద్యార్థులందరూ పాటలు పాడుతూ చీరకట్టులో గుమ్మడిగా ఆడారు. అటు బాలురు రావణాసురుని విగ్రహాన్ని తయారు చేసి, దసరా పండుగలో ధర్మం అధర్మంపై సాధించిన విజయాన్ని ప్రతిబింబించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు బతుకమ్మ పాటలు, నృత్యాలు, దసరా కథా రూపకాలు, వక్తృత్వం, కవితా పఠనం ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభను చూసి అందరూ మెచ్చుకున్నారు. ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య గారు మాట్లాడుతూ: “బతుకమ్మ పూల పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తే, దసరా పండుగ సత్యం, న్యాయం, ధర్మం సాధించిన విజయాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఇలాంటి వేడుకలు విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను, సృజనాత్మకతను, ఐక్యతను పెంపొందిస్తాయి” అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొని విద్యార్థులను అభినందించారు.

జాతీయ అంతర్జాతీయ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 12 కోట్లు విలువ చేసే హైడ్రోపోనిక్ గాంజా పట్టివేత

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 12 కోట్లు విలువ చేసే హైడ్రోపోనిక్ గాంజా పట్టివేత దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రయాణికుని లగేజీ బ్యాగేజ్ లో గుర్తింపు ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం నిందితునిపై కేసు నమోదు చేసిన డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

రాజ్ భవన్లో గవర్నర్ ని కలిసిన టీఎజేఎ-ఎన్ యు జే (ఐ) ప్రతినిదులు

రాజ్ భవన్లో గవర్నర్ ని కలిసిన టీఎజేఎ-ఎన్ యు జే (ఐ) ప్రతినిదులు హైదరాబాద్, సెప్టెంబర్ 20:-హైదరాబాద్లోని రాజ్ భవన్లో శనివారం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్(టీజేఎ), నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా(ఎన్యూజే (ఐ) ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా గవర్నర్ ను వారు శాలువాతో సత్కరించారు. జర్నలిస్టుల సమస్యలపై గవర్నర్తో కాసేపు చర్చించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారు. గనర్నర్ ను కలిసిన వారిలో ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా మాజీ సభ్యులు, ఎన్ యు జే (ఐ )మాజీ చైర్మెన్, టీ జే ఎ, జాప్ అడ్వయిజరి కమిటీ చైర్మెన్ ఉప్పల లక్ష్మణ్, ఎన్ యుజే(ఐ)ఉపాధ్యక్షులు, టీ జే ఎ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉక్కల్ కార్ రాజేందర్ నాథ్, టిజేఎ అధ్యక్షులు కదిరి వెంకట రమణ రావు, ప్రధానకార్యదర్శి ఎం.ఆర్ గౌరీ వున్నారు.

ఖమ్మం

ఖమ్మం నగరము లో పలు విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబురాలు

ఖమ్మం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర్ ము లో ని ప్రముఖ పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి . తెలంగాణ రాష్ట్ర ము లో రేపటి నుండి దసరా సెలవుల నేపథ్యంలో ఖమ్మం లో ని రోటరి నగర్ లో గల ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సరిత ఆధ్వర్యంలో ఈ సంబురాలని పాఠశాల విద్యార్థి ని, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. అమ్మ వారి యొక్క దివ్యాశీసులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకున్నారు. ఖమ్మం ప్రజలకి ఖమ్మం పబ్లిక్ స్కూల్ తరుపున బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.