Tuesday, 5 May 2026

Blog

ఖమ్మం

ఖమ్మం నగరము లోని పలు విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబురాలు

పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర్ ము లో ని ప్రముఖ పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి . తెలంగాణ రాష్ట్ర ము లో రేపటి నుండి దసరా సెలవుల న ఖమ్మం లో ని రోటరి నగర్ లో గల ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సరిత ఆధ్వర్యంలో ఈ సంబురాలని పాఠశాల విద్యార్థి ని, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. అమ్మ వారి యొక్క దివ్యాశీసులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకున్నారు. ఖమ్మం ప్రజలకి ఖమ్మం పబ్లిక్ స్కూల్ తరుపున బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో సెప్టెంబర్ నెలలో గ్రీన్ ఆంద్రాను పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం

పత్రిక ప్రకటన రాజమహేంద్రవరం, తేది:20.9.2025 “స్వచ్చ ఆంధ్రా స్వర్ణ ఆంధ్రా” కార్యక్రమంలో సెప్టెంబర్ నెలలో గ్రీన్ ఆంధ్రా ను పురస్కరించుకుని మొక్కల నాటే కార్యక్రమం శనివారంరాజమహేంద్రవరం, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని స్థానిక వ్యవసాయ కళాశాలలో, కళాశాల అసోసియేట్ డీన్ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారము “సాసా” కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల (సెప్టెంబర్ 2025) అంశం “గ్రీన్ ఆంధ్రా” ను పురస్కరించుకుని, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది కళాశాల ఆవరణలోని పచ్చని మొక్కలను నాటడం జరిగిందిన్నారు. ఈ కార్యక్రమంలో గంగ రావి నుంచి వివిధ జాతుల మొక్కలను, ఉద్యానవన మరియు సేద్య విభాగాల మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు నాటడం జరిగిందన్నారు. ఈ సందర్భంలో జాతీయ సేవా పథకం అధికారి డా. వసంత భాను చెబుతూ, చెట్లను సంరక్షించడం వలన పర్యావరణం ఆరోగ్యంగా ఉంచబడుతుంది అని, మిద్దె తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా నగర ప్రాంతాల్లో పచ్చదనం పెరిగి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఉద్యాన శాస్త్ర విభాగాధిపతి డా. సునీత యమ్., ప్రొఫెషన్ భవానీ ప్రసాద్, డా. రమేష్ తదితర భోధక, భోధనేతర సిబ్బంది, విద్యార్థులు সক్రమంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

గూడూరు

వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర

సెప్టెంబర్ 20 2025 శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతినెల మూడో శనివారం నాడు కార్యాలయం మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేయాలని తెలిపారు అన్నారు. ఎంపీడీవో తో పాటు మండల అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది కలిసి కార్యాలయం పరిధిలో ఉండేటటువంటి అపరిశుభ్రత మొత్తం శుభ్రం చేసి మొక్కలు నాటడం జరిగింది మరియు స్థానిక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ నందు స్వచ్ఛంధ్రా స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి శాలువ తో వారిని సన్మానించారు, ఎంపీడీవో మాట్లాడుతూ వారిని ఫస్ట్ లైన్ ఆఫ్ క్క్లీన్లినెస్ గా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంఈఓ నజీం అలీ, వాకాడు గ్రామ సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, తెదేపా నాయకులు కాట్టంరెడ్డి రామలింగారెడ్డి,ఏఈ.పి.ఆర్ కిరణ్ ,ఎస్సీ రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ , ఏపిఓ విజయ లక్ష్మి,పంచాయతీ కార్యదర్శి ప్రవళిక ,మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

తెలంగాణ

రేపే సూర్యగ్రహణం.. మనకు కనిపిస్తుందా?

ఈ ఏడాదిలో చివరి గ్రహణం రేపు చోటుచేసుకోనుంది. అయితే ఇది పాక్షిక గ్రహణమే. సూర్యుడిని చందమామ కొంత భాగమే కవర్ చేయనుంది. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 10.59 గంటలకు ఇది సంభవించనుంది. సూర్యాస్తమయం తర్వాత జరుగుతున్నందున ఇండియా నుంచి చూడలేం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, పసిఫిక్ ఐలాండ్స్లో కనిపించనుంది. భారత్ నుంచి సోలార్ ఎక్లిప్స్ చూడాలంటే 2027 AUG 2 వరకు వేచి చూడాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

మాజీ జెడ్పీటీసీ మోహన్ రెడ్డికి ఘన సన్మానం

మాజీ జెడ్పీటీసీ మోహన్ రెడ్డికి ఘన సన్మానం కామారెడ్డి, 29 సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి. :  కామారెడ్డి అశోక్ నగర్: రామారెడ్డి మండల మాజీ జెడ్పీటీసీ శ్రీ నా రెడ్డి మోహన్ రెడ్డి గారు ఇటీవల అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించు కుని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా కామా రెడ్డిలోని అశోక్ నగర్ కాలనీ వాసులు ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ సభ్యులు మోహన్ రెడ్డిని శాలువాతో సత్క రించి, ఆయన విదేశీ పర్యటన విశేషాలను అడిగి తెలుసుకున్నారు. మోహన్ రెడ్డి మాట్లాడు తూ, కాలనీ వాసులు చూపించిన అభిమానానికి కృతజ్ఞ తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెంది న పలువురు ప్రముఖులు, యువకులు పాల్గొన్నా రు. మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

తిరుపతి

ఎక్త్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో మహిళ కు ఆర్థిక సహాయం

శ్రీకాళహస్తి పట్టణంలోని పిట్టల వారి వీధికి చెందిన ఒక మహిళ గుండె మరియు కిడ్నీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని యాంటీ కరప్షన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లాలు ఎక్త్ యాంటీ కరప్షన్ ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీ కె.అబ్దుల్ రహమాన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.కె.అబ్దుల్ రెహమాన్ ఆదేశాల మేరకు అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళను యాంటీ కరప్షన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లాలు పరామర్శించి,ధైర్యం చెబుతూ అవసరమైన మందులు మరియు పండ్లు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా,ఎక్త్ యాంటీ కరప్షన్ డిస్ట్రిక్ట్ మీడియా ప్రెసిడెంట్ పాపానాయుడుపేట యాసిన్,మీర్జా సాహెబ్,అన్వర్ పాల్గొన్నారు.

తెలంగాణ

పింఛన్ల హామీలు ఏమయ్యాయి? నిలదీస్తున్న వయోవృద్ధులు

పింఛన్ల హామీలు ఏమయ్యాయి? ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వృద్ధులు ​కామారెడ్డి: సెప్టెంబర్ 20 (పున్నమి ప్రతినిధి) ​ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు పింఛన్ల విషయంలో ఎన్నో హామీలు ఇచ్చాయి. కానీ, అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క పార్టీ  పింఛన్ల గురించి అసెంబ్లీలో మాట్లాడటం లేదు. ఈ సమస్యను గమనించిన పద్మశ్రీ మందకృష్ణ మాది గ  గత ఐదు నెలలుగా పింఛను దారులను ఏకం చేసి పోరాటాలు చేస్తున్నారు.ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయా లు, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ పంచాయ తీ కార్యాలయాల ముట్టడి వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో నిరసనలు తెలియజేస్తూ, పంచా యతీ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేస్తు న్నామని అన్నారు.ఈ నిరసన కార్యక్రమాల్లో ఎ మ్మార్పీస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కామారెడ్డి జిల్లా మాజీ కార్యదర్శి కొత్తోల్ల యాదగిరి మాదిగ, వి హెచ్ పి ఎస్ నాయకులు ఆకుల రాజ య్య, రాజా గౌడ్, ఆకుల చిన్న రాజయ్య,వంగ దేవయ్య, పురం నరసయ్య, నాదరి బాలయ్యతో పాటు పందుల మల్లయ్య, కాల బాలయ్య, సూరం పల్లి మొగులయ్య, ఆల నారాయణరెడ్డి, బత్తుల సాయిలు, ఆకుల లక్ష్మి, తాటికొండ లక్ష్మి, కాల మణెమ్మ వంటి వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువ

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) డైరెక్టర్‌గా నియమితులైన టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయన్ని కలసి అభినందనలు తెలియజేస్తున్నారు. గాజువాక హోల్‌సేల్ ఫ్రూట్స్ & వెజిటబుల్స్ మార్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా టిడిపి కార్యాలయానికి వచ్చి ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా సాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. ప్రసాదుల శ్రీనివాసరావు ఒక సాధారణ టీడీపీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, క్రమంగా కృషి చేస్తూ కార్పొరేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదగడం శుభపరిణామం అని అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఆయన మరిన్ని పదవులను అధిరోహించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కర్రి నాగేశ్వరరావు, విల్లూరి శ్రీనివాసరావు, మద్దాల రామారావు, ఎ. శ్రీనివాసరావు, సోమేశ్వరరావు, డి. శ్రీనివాసరావు, తాతబాబు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

జ్యుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లాకు వచ్చిన : హైకోర్టు జడ్జి

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) జ్యూడిషల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనే నిమిత్తం నల్గొండ జిల్లాకు వచ్చిన హైకోర్టు జడ్జి జస్టిస్ బి. విజయసేనారెడ్డిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం కోర్టు ఆవరణలో ఉన్న అతిథి గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.