Tuesday, 5 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

సొసైటీ చైర్మన్ గా బొంబోతుల స్వామి గౌడ్

కామారెడ్డి, 20 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి  : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా బొంబోతుల స్వామి గౌడ్ శనివారం పన్నెడు మంది డైరెక్టర్లతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం  పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ, యూరియా కొరతను దృష్టిలో ఉంచుకొని 20 లక్షల చెక్కుపై మొట్టమొద టి సంతకం చేయడం జరిగిందన్నారు. మండలం లో యూరియా కొరత లేకుండా చూసుకుంటామని అన్నారు, రైతులకు అందుబాటులో ఉండి సహయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

అన్నమయ్య

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర–స్వచ్చాంద్ర కార్యక్రమం

రైల్వే కోడూరు, సెప్టెంబర్ 20: రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్చాంద్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర–స్వచ్చాంద్ర కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించడం సంతోషకరం. కళాశాలను హరితంగా, స్వచ్ఛంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత. నాటిన ప్రతి చెట్టును సంరక్షించాలి” అని పేర్కొన్నారు. కోఆర్డినేటర్ డాక్టర్ కె. రమేష్ పచ్చని వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే మాట్లాడుతూ, “భవిష్యత్ తరాలకు శుభ్రమైన గాలి కావాలంటే చెట్లను కాపాడుకోవాలి” అని అన్నారు. తరువాత ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు పంపిణీ

జాతీయ నాయకుల చిత్రపటాలు *పంపిణీ* నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడి పాఠశాలకు శనివారం కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, రచయితల ఫోటోలు, విద్యార్థులకు నోటు బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ మెంబర్, మాజీ ఎంపిటిసి సుగుణమ్మ తనయుడు కంకణాల నర్సిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు రేపటి పౌరులని అన్నారు. విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించటానికి జాతీయ నాయకుల చిత్రపటాలను పాఠశాలకు అందించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందజేస్తానని నర్సిరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, రచయితల చిత్రపటాలు అందించడం మంచి కార్యక్రమం అని అభినందించారు. ఉపాధ్యాయులు వారి జీవితం గురించి విద్యార్థులకు బోధించాలని సూచించారు. పాఠశాల హెచ్ఎం బాబురావు, ఉపాధ్యాయులు శ్రీను నాయక్, సునీత, లక్ష్మీదేవి, అంగన్వాడీ టీచర్ కోట్ల లలితమ్మ, కోట్ల తనియా, గోకమోళ్ల శివశంకర్, ఆయా శాంతమ్మ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు పంపిణీ

జాతీయ నాయకుల చిత్రపటాలు *పంపిణీ* నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడి పాఠశాలకు శనివారం కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, రచయితల ఫోటోలు, విద్యార్థులకు నోటు బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ మెంబర్, మాజీ ఎంపిటిసి సుగుణమ్మ తనయుడు కంకణాల నర్సిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు రేపటి పౌరులని అన్నారు. విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించటానికి జాతీయ నాయకుల చిత్రపటాలను పాఠశాలకు అందించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందజేస్తానని నర్సిరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, రచయితల చిత్రపటాలు అందించడం మంచి కార్యక్రమం అని అభినందించారు. ఉపాధ్యాయులు వారి జీవితం గురించి విద్యార్థులకు బోధించాలని సూచించారు. పాఠశాల హెచ్ఎం బాబురావు, ఉపాధ్యాయులు శ్రీను నాయక్, సునీత, లక్ష్మీదేవి, అంగన్వాడీ టీచర్ కోట్ల లలితమ్మ, కోట్ల తనియా, గోకమోళ్ల శివశంకర్, ఆయా శాంతమ్మ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

ఇంటి స్థలాన్ని కబ్జా నుండి విడిపించండి: వృద్దతంపతుల ఆరోపణ

కామారెడ్డి ప్రతినిధి,20 సెప్టెంబర్, పున్నమి న్యూస్. : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల మండల కేంద్రంలో గల  సుప్పని చిన్న రాజయ్య తండ్రి చిన్న రాజయ్య 5-39 ఇంటి నంబర్  గ్రామం రామారెడ్డి మండల రామారెడ్డి జిల్లా కామారెడ్డి స్థలం ( ఏడు వందల ఎనబై ఒకటి తొంబై నాలుగు ఈంచులు ) ఫిట్ల స్థలం  ఉంది. ఇట్టి స్థలాన్ని ఇంజాపురం విఠల్ అనే వ్యక్తి బాత్రూమ్, బోర్ వేయించి, అరి సందిని కబ్జా చేశారు. పలు మార్లు హెచ్చరించిన వినలేదు, స్థాని క గ్రామపంచాయతీ వద్దకు వెళ్లి ఫీర్యాదు చేశాం సెక్రటరీ కాలయాపన చేస్తు వృద్ద దంపతులకు ఇంజాపురం విఠల్, జనార్దన్,  గ్రామ సెక్రెటరీ ముగ్గు రు, కలిసి ఇబ్బందు లకు గురి చేస్తున్నారు. జిల్లా అధికారులు రామారెడ్డి గ్రామానికి వచ్చి ఆరో వార్డు లోగల ఇంటి స్థలాన్ని పరిశీలించి తమకు న్యాయం చేయాలని వేడుకు న్నారు. 

ఆంధ్రప్రదేశ్

టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్.. ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్ అదే

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @ మీరు కొండల్లో ఉన్న లోయల్లో ఉన్న మీ మొబైల్ ఫోన్ ఇక పని చేస్తుంది. సిగ్నల్స్ లేవు అనే బెడద అసలే ఉండదు. మీ ఇంటర్నెట్ హై స్పీడ్‌తో పరుగెడుతుంది. ఏదో ఓ నెట్‌వర్క్ కంపెనీకి యాడ్ కాదు, వచ్చే నెలలో శ్రీహరికోట నుంచి ఓ రాకెట్ ప్రయోగం ద్వారా ఇదంతా జరగనుంది. బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM-4 రాకెట్ ద్వారా అమెరికాలో తయారైన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్దమవుతోంది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండవ లాంచ్ ప్యాడ్ నుండి అక్టోబర్ నెల రెండవ వారంలో మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో శాస్త్రవేత్తలతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సీఎంఎస్ 02 కమ్యూనికేషన్ ఉపగ్రహంను ఎల్‌వీఎం-3ఎం మార్క్-5 రాకెట్ ద్వారా ఈ సీఎంఎస్‌-02 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు. ఎల్‌వీఎం-3ఎం మార్క్-5ను వచ్చేనెల రెండో వారంలో ఈ ప్రయోగం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. షార్ లో రాకెట్ అనుసంథానం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా 6,500 కిలోల బరువైన బ్లాక్-2 బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. ఈ నెలాఖరులోగా ఉప గ్రహం భారత్‌కు చేరుకోనుంది. ఈ ప్రయోగం ద్వారా స్మార్ట్ ఫోన్ కు ప్రత్యక్ష అనుసంధానం సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ వినియోగదారులు భూమిపై ఉండే టవర్ల మీద ఆధార పడకుండా నేరుగా కాల్స్ చేసుకోవడానికి.. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. సీఎంఎస్‌-02 ఉపగ్రహం ద్వారా భారత దేశంలోని మారుమూల ప్రాంతాలకు.. కొండల్లో, కొనల్లో, దట్టమైన అడవి ప్రాంతాల్లో కూడా సరికొత్త టెక్నాలజీతో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ సీఎంఎస్‌ ఉపగ్రహం దోహదపడుతుంది. ఇప్పటికే కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోట నుండి ఎన్నో కమ్యూనికేషన్ ఉపగ్రహాలను నింగికి పంపి ఘన విజయం సాధించారు. అయితే ఈ ప్రయోగం కమ్యూనికేషన్ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశలో ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. సీఎంఎస్‌-02 ఉపగ్రహాన్ని అక్టోబర్ 15వ తారీకు నుండి 19వ తారీఖు లోపల ఈ LVM-03-M5 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు ఈ రాకెట్ అనుసంధాన పనులను షార్ లోని వెహికిల్ అసెంబ్లింగ్ భవనంలో ముమ్మరంగా చేశారు. ఈ రాకెట్ ప్రయోగం గనుక విజయవంతం అయితే భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలు మరింత విస్తృతంగా అందించేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. అయితే ఈ ఎల్‌వీఎం-3ఎం మార్క్-5 రాకెట్ ప్రయోగాన్ని అక్టోబర్ మాసంలో ఏ రోజున ప్రయోగించే తేదీని ఇస్రో శాస్త్రవేత్తలు ఖరారు చేయాల్సి ఉంది..!

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ కీలక నిర్ణయాలు!

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @ కేబినెట్ సమావేశంలో మొత్తం 13 బిల్లులను చర్చించి ఆమోదం నాలా ఫీజు రద్దుకు సంబంధించిన చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం అమరావతి పరిధిలో 343 ఎకరాల భూమి సేకరణకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఓటర్ల జాబితా సిద్ధం కోసం మూడు కొత్త తేదీలను ఖరారు చేయాలని నిర్ణయం పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, ఏపీ సీఆర్డీఏ, అమరావతి రాజధాని ఏరియా మినహా ఇతర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదన ఆమోదం

జాతీయ అంతర్జాతీయ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారి ఆశలపై ట్రంప్ నీళ్లు, H1 B లాటరీ పద్ధతి ఎత్తివేత, ఇకనుండి H1 B వీసా దరఖాస్తు దారుడు లక్ష డాలర్లు ఫీజు చెల్లించాలి, లక్ష డాలర్లు అంటే దాదాపుగా 89 లక్షలు రూపాయలు, ఈనెల 21 అర్ధరాత్రి నుండి ఆంక్షలు అమలు, ఇప్పటికే H1 B వీసా పై ఉన్నవారు అమెరికా వెలుపల ఉంటే 21 సెప్టెంబర్ 2025 00:00 గంటల కల్లా అమెరికా లోకి ప్రవేశించాలని సూచించిన IT దిగ్గజం మైక్రోసాఫ్ట్, ట్రంప్ నిర్ణయం పై రగిలిపోతున్న IT ఉద్యోగులు. న్యాయస్థానాలను ఆశ్రయించే యోచన

E-పేపర్

H1B వీసా అంటే ఏంటి?

అమెరికా ప్రభుత్వం టెక్ కంపెనీల కోసం H1B వీసాలను జారీ చేస్తుంది. విదేశాలకు చెందిన ఐటీ, ఇంజినీరింగ్, ఫైనాన్స్, ఆరోగ్య నిపుణులను అమెరికా తీసుకెళ్లేందుకు పలు కంపెనీలు H1Bని ఉపయోగిస్తాయి. ఈ వీసాలు మూడేళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ తర్వాత రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది 85వేల H1B వీసాలు జారీ చేస్తాయి. వీటి ద్వారా ఎక్కువగా భారతీయులే లబ్ధి పొందుతున్నారు.

E-పేపర్

రాయచోటిలో వర్ష బీభత్సం.. ముగ్గురి మృతి

రాయచోటిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసి పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వరదనీటిలో కొట్టుకుపోతున్న తల్లీ, బిడ్డ షేక్ మున్నీ (27), ఇలియాస్ (6)ను కాపాడబోయి మరో వ్యక్తి వంగల గణేశ్ (30) మృతి చెందాడు. రామాపురం వద్ద స్కూల్ ఆటోలో నుంచి దూకేసి మాధవరం ఆరవ వాండ్లపల్లికి చెందిన ఆరవ యామిని (8) డ్రైన్ కాలువలో కొట్టుకుపోయింది. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.