Tuesday, 5 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

వాహన మిత్ర eKYC ఎవరికి చేయాలి.!

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో వాహన మిత్ర పథకానికి సంబంధించి ఈ కేవైసీ కొరకు వచ్చిన పేర్లలో ఎవరైనా అనర్హులు ఉంటే వారికి eKC పెండింగ్ ఉంచరాదు,వారికి మొబైల్ యాప్ లో ఈ కేవైసీ పూర్తి చేసి బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్ లో అనర్హులుగా చేయాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్

మద్యానికి దూరంగా భారత్లోని 34% మంది సంపన్నులు! సర్వే…

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ భారత్లోని ధనికుల్లో మూడింట ఒకవంతు మంది మద్యానికి దూరంగా ఉన్నారని మెర్సెడెస్ బెంజ్ హురున్ ఇండియా లగ్జరీ కన్జ్యూమర్ సర్వే 2025లో తేలింది. నికర సంపద రూ.8.5 కోట్లు ఉన్న 150 మంది సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 34% మంది మద్యం అస్సలే సేవించమని చెప్పారు. మరో 32% మంది మద్యం తాగుతున్నామని అందులోనూ ‘విస్కీ’కి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. 11% రెడ్ వైన్, 9% మంది షాంపైన్ తాగేందుకు ఇష్టపడుతున్నారు.

క్రైమ్

రాజకీయ పార్టీలపై ఈసీ కొరడా- 474 పొలిటికల్ పార్టీల గుర్తింపు రద్దు

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న రాజకీయ పార్టీలపై ఈసీ కొరడ. చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కఠిన చర్యలు చేపడుతోంది. తాజాగా గుర్తింపు పొందని 474 రాజకీయ పార్టీలను ఈసీ జాబితా నుంచి తొలగించింది. 2019 నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ బరిలోకి దిగని రాజకీయ పార్టీలపై ఈసీ వేటు వేసింది. పేరుకు పార్టీలు పెట్టినప్పటికీ వీటికి భౌతికంగా ఎలాంటి కార్యలయాలు లేవని వెల్లడించింది. ఇటీవలే 334 పార్టీలను రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు మరో రౌండ్‌లో 474 పార్టీలను గుర్తించి వేటు వేసింది. గత రెండు నెలల వ్యవధిలో 808 రాజకీయ పార్టీలను ఈసీ రద్దు చేసింది. ఇప్పటి వరకు 2,520 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉండగా, తాజా తొలగింపుతో ఆ సంఖ్య 2,046కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఉన్నట్లు ఈసీ తెలిపింది

క్రైమ్

సుప్రీం కోర్ట్ లో పెండింగ్‌ కేసులు కొండలా పేరుకుపోవడం ఆందోళనకరం

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ న్యూ ఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం లో చరిత్రలోనే ఎన్నడూలేనంత అత్యధికంగా 88,417 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. న్యాయం ఆలస్యం కావడమంటే న్యాయం జరగకపోవడమే అనేది నానుడి. జాతీయ జ్యుడీషియల్‌ గ్రిడ్‌ ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం 69,605 సివిల్‌, 18,887 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2020 వేసవి సెలవుల సమయంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ప్రస్తుత సిజెఐ బిఆర్‌ గవారు వేసవి సెలవుల్లోనూ పాక్షికంగా పనిచేసే పద్ధతిని తీసుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న మనదేశంలో సుప్రీంకోర్టుకు 34 మంది న్యాయమూర్తులు సరిపోతారా? అనేది కీలక ప్రశ్న. ఇక హైకోర్టుల్లో 63 లక్షలకుపైగా, దిగువ కోర్టుల్లో దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొల్‌కతా, మహారాష్ట్ర హైకోర్టుల్లో కేసుల పెండింగ్‌ అత్యధికంగా ఉంది. జనాభాతో పోల్చితే న్యాయమూర్తుల నిష్పత్తి ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే… మనదేశంలోనే అత్యంత తక్కువగా ఉండటం కేసుల పెండింగ్‌కు కారణమవుతోంది. అమెరికాలాంటి దేశాల్లో సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 150 మంది వరకూ న్యాయమూర్తులుండగా, మన దేశంలో 21 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. కోర్టుల్లో కేసులు భారీగా పెరిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఇడి, సిబిఐ లాంటి సంస్థలు ప్రతిపక్షాలపై తరచూ అక్రమ కేసులు పెట్టడం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు బుల్‌డోజర్‌ న్యాయం పేరుతో అడ్డగోలుగా వ్యవహరించడం, కొన్నిసార్లు కావాలనే ప్రతిపక్షాలపై వేధింపులకు పాల్పడటం… లాంటి చర్యలు న్యాయస్థానాలపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దేశంలో కార్పొరేట్‌, అవినీతి, నేరగ్రస్థ రాజకీయాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. చట్టసభల సభ్యుల్లో 45 శాతం మందికిపైగా క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాధాన్యతా క్రమంలో చట్ట సభల సభ్యులు, అధికారులపై కేసులను పరిష్కరించడం కూడా అత్యవసరం. ఇక ఇతర కారణాల విషయానికి వస్తే న్యాయవాదులు తరచూ వాయిదాలు కోరడం, స్థానికంగా పరిష్కరించదగినవి కూడా కోర్టులకు తీసుకురావడం, గతంలో సివిల్‌ తగాదాగా ఉన్న చెక్‌బౌన్స్‌ను క్రిమినల్‌ కేసుగా మార్చడం తదితర కారణాల వల్ల అసంఖ్యాకంగా కేసులు పెరిగిపోతున్నాయి. రిటైర్డ్‌ న్యాయమూర్తుల సేవలు సివిల్‌ కేసుల విషయంలో వినియోగించుకుని సుదీర్ఘకాలంగా వాయిదాలున్న కేసుల సంగతి తేల్చాలనే సూచన ఉంది. కోర్టుల్లో తగినంతమంది న్యాయమూర్తులను, సిబ్బందిని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. లోక్‌ అదాలత్‌లు లాంటివి నిర్వహించి ఇరుపక్షాలు అంగీకరించిన కేసులను పరిష్కరిస్తే కోర్టులపై ఒత్తిడి తగ్గుతుంది. తీర్పులకు సమయం నిర్దేశించాలనే వాదన కూడా వుంది. న్యాయస్థానాలకు పూర్తిస్థాయిలో సహకరించాల్సిన కేంద్రం అనేక సందర్భాల్లో అడ్డుపడటం, అడ్డగోలుగా విమర్శలు చేయడం పరిపాటిగా వుంది. న్యాయమూర్తుల నియామకానికి ప్రత్యేకంగా ఒక జ్యుడీషియల్‌ కమిషన్‌ ఉండాలన్న చర్చ చాలాకాలంగా వుంది. అయితే నేడు కొలీజియం వ్యవస్థ ఆ బాధ్యత నిర్వహిస్తోంది. కాని కేంద్రప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం నియామకాలను తీవ్రంగా జాప్యం చేస్తోంది. ‘పరివార్‌’ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తారని అనుమానం వుంటే ఏవో సాకులు చూపి తిరస్కరిస్తోంది. ఇంకొన్ని సందర్భాల్లో కొలీజియం, కేంద్ర న్యాయశాఖ మధ్య వివాదాస్పదం అవుతున్నవే వున్నాయి. భారత రాజ్యాంగం, పాలన, శాసన, న్యాయవ్యవస్థల మధ్య స్పష్టమైన లక్ష్మణరేఖలను నిర్దేశించింది. పాలకులు వాటిని ఉల్లంఘించిన సందర్భాల్లోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. నాగరిక సమాజంలో సత్వర న్యాయం అందించడం వ్యవస్థ బాధ్యత. అందుకోసం సుప్రీంకోర్టు తీసుకుంటున్న చొరవకు కేంద్రం వీలైనంత తోడ్పాటును అందించాలి. అప్పుడే పెండింగ్‌కు అడ్డుకట్టపడటం తోపాటు సత్వర న్యాయం అందేందుకు అవకాశం ఉంటుంది.

తెలంగాణ

అవుట్ సోర్సింగ్ పద్ధతిన :సహాయ పౌర సంబంధాల అధికారి పోస్ట్, వీడియో గ్రాఫర్ పోస్ట్

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతి పై సహాయ పౌర సంబంధాల అధికారి, పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో గ్రాఫర్ )పోస్టులలో మార్చి 31 2026 వరకు పని చేసేందుకు ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు –1.= ఏపీఆర్ వో పోస్ట్ కు – జర్నలిజం /పబ్లిక్ రిలేషన్స్ లో డిగ్రీ లేదా డిప్లమా తో పాటు ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండి, డిజిటల్ మీడియా, ఏఐ టూల్స్ లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. జీతం నెలకి –36,750 రూపాయలు. 2. పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో గ్రాఫర్) పోస్టుకు- ఏదైనా సబ్జెక్టులో బ్యాచులర్స్ డిగ్రీ ఏపీ /టీఎస్ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు శిక్షణ సంస్థ సినీ ఫోటోగ్రఫీలో జారీ చేసిన డిప్లమా. జీతం నెలకు–27,130రూపాయలు. చివరి తేది —సెప్టెంబర్ 25. అప్లికేషన్ లను కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వాలి.

ఆంధ్రప్రదేశ్

దుర్గోత్సవం శాంతియుతంగా, భక్తి వాతావరణంలో జరుపుకుందాం

దసరా పండుగ, దుర్గోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండుగలు శాంతియుతంగా, సాంప్రదాయ భక్తి వాతావరణంలో జరగాలని పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇన్స్పెక్టర్ ఈ సందర్భంగా పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, పండుగలలో ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణ పాటిస్తూ పోలీస్ శాఖతో సహకరించాలన్నారు. పర్మిషన్ విధానం:పందిర్లు వేసుకోవడం, దుర్గా మాత విగ్రహాలు ప్రతిష్టించడం వంటి కార్యక్రమాల కోసం ప్రతీ కమిటీ, సంఘం, భక్తులు తప్పనిసరిగా సింగిల్ విండో ఆన్‌లైన్ పోర్టల్ (https://durgautsav.net/) ద్వారా ముందుగా అనుమతి పొందాలని తెలిపారు. అనుమతి లేకుండా పందిర్లు, విగ్రహాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. DJ సౌండ్స్, అసభ్యకర నృత్యాలకు నిషేధం:పండుగల సందర్భంగా DJ Sounds కు ఎటువంటి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అలాగే అసభ్యకర నృత్యాలు, అనుచిత వినోదాలు పూర్తిగా నిషేధించబడ్డాయని గుర్తుచేశారు. ప్రజా శాంతి భద్రతా చర్యలు:ప్రజలు పండుగలలో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై అడ్డంకులు సృష్టించరాదని విజ్ఞప్తి చేశారు. పందిర్లు, మండపాలు ఏర్పాటు చేసే సమయంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాత్రివేళల్లో నిర్దిష్ట సమయాల వరకు మాత్రమే సౌండ్ సిస్టమ్ వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి:భక్తులు, ప్రజలు దసరా పండుగను ఆనందంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలు గమనించిన వెంటనే Dial 112 లేదా పెందుర్తి పోలీస్ స్టేషన్ (PH: 96767973147) కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పండుగ ప్రాంతాల్లో CCTV కెమెరాలు ఏర్పాటు చేస్తే భద్రతా చర్యలు మరింత బలోపేతం అవుతాయి అని అన్నారు. సహకారం అవసరం:“ప్రతి భక్తుడు, ప్రతి కమిటీ పోలీసులకు సహకరిస్తేనే ఈ దుర్గోత్సవం శాంతియుతంగా, సాంప్రదాయ భక్తి వాతావరణంలో విజయవంతంగా జరుగుతుంది” అని ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ ఆకాంక్షించారు.

సత్యసాయి

రిటైర్డ్ ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

ఓడి చెరువు సెప్టెంబర్ 19 ప్రభ న్యూస్ :మండలంలోని గౌని పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రస్తుతం చదువుతున్న ఆరో తరగతి విద్యార్థిని, విద్యార్థులకు 60 మందికి గాను రిటైర్డ్ ఉపాధ్యాయులు నరసింహారెడ్డి,కృష్ణా రెడ్డి లు ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు ప్రధానోపాధ్యాయురా లు పి.విజయమ్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ కలిగి ఉండి ,మంచి ఫలితాల్లో సాధించాలని ఆశిస్తూ మనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు ఆదర్శ పూర్వ విద్యార్థి మల్లెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం 

ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ప్రకటించింది. దీంతో విద్యార్థులకు మొత్తం పది రోజుల విరామం లభించనుంది. మరోవైపు, అక్టోబర్ 2న దసరా పండుగ జరుపుకున్న వెంటనే అక్టోబర్ 3నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే పండుగ ముగిసిన వెంటనే తరగతులు మొదలుకావడంతో, విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు విద్యావర్గాలు భావిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పండుగ ఉత్సవాలు, బంధువుల ఇళ్ల సందర్శనలు ఎక్కువగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3వ తేదీన విద్యార్థుల రాక తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పాఠశాలలు మొదటి రోజున తేలికపాటి పాఠాలు, పండుగ అనుభవాలపై చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. దీంతో విద్యార్థులు మెల్లగా పాఠశాల వాతావరణంలో కలిసిపోతారు.

తెలంగాణ

అక్రమ గంజాయి పంటపై దాడులు ఎస్ఐ. లావణ్య

కామారెడ్డి ప్రతినిధి,  19 సెప్టెంబర్, పున్నమి న్యూస్.  కామారెడ్డి జిల్లా – రామారెడ్డి పోలీస్ స్టేషన్ ఈ రోజు 19.09.2025 ఉదయం 12:30 గంటల సమయంలో, రామారెడ్డి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్‌. లావణ్య  ఆధ్వర్యంలో సిబ్బంది, పంచులు, వ్యవసాయ అధికారులు, వీడియోగ్రాఫర్‌తో కలసి స్కూల్ తండా గ్రామంలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించగా, స్థానిక వ్యక్తి గంగవత్ రాజేందర్ తండ శంకర్, వయస్సు 44 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, కులం: లంబాడా, గ్రామం స్కూల్ తండా తన ఇంటి పెరట్లో అక్రమంగా 25 గంజాయి మొక్కలు (ఎత్తు 3–6 అడుగులు) సాగు చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు పంచుల సమక్షంలో ఆ మొక్కలను పీకివేసి, ఒక గోనె సంచిలో ప్యాక్ చేసి, సీల్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేయబడింది. వ్యవసాయ అధికారి జి. శ్రీనివాస్ పరిశీలనలో మొక్కలు నిజంగా గంజాయి మొక్కలేనని నిర్ధారించారు. నిందితుడు విచారణలో తాను వ్యక్తిగత వినియోగం మరియు అమ్మకాల కోసం గంజాయి సాగు చేస్తున్నట్లు అంగీకరించాడు.

హైదరాబాద్

బీజేపీ పార్లమెంట్ఈ సభ్యులు టెల రాజేంద్ర ప్రెస్ మీట్

పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్మీ సభ్యులు శుక్రవారం మీడియా ప్రతినిధు సమావేశం లో మాట్లాడుతూ మీడియా, వార్తాపత్రికలు ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ వారికి ఒక విజ్ఞప్తి అని బురద చల్లి కడుక్కోమనటం, బట్ట కాల్చి మీద వేయడం మంచిది కాదని తాను మాటలు మార్చే, పార్టీలు మారే వ్యక్తిని కాదని పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదని పార్టీ మారడం జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలని పార్టీ మారడానికి ఒక గొప్ప కారణం ఉండాలని తాను నాడు టిఆర్ఎస్ నుంచి కూడా బయటికి పంపిస్తే వచ్చాను తప్ప తన అంతట తాను రాలేదన్నారు. అప్పుడు నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన అన్నారు తాను పార్టీ మారుతున్నానంటూ రాస్తున్న వార్తలను, చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని పదే పదే శీల పరీక్ష చేయడం మంచిది కాదని. వ్యక్తిత్వ హననం చేయకండని ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని కొన్ని యుట్యూబ్, వార్త పత్రికల వారికి ఈటెల రాజేంద్ర విజ్ఞప్తి చేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.