Tuesday, 5 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

వాహనంలో ఇంధనం ‘ఫుల్ ట్యాంక్’ కొట్టించకూడదు: పెట్రోలియం మంత్రిత్వ శాఖ

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ భద్రతా చర్యల్లో భాగంగా వాహనంలో పూర్తిగా ఇంధనం నింపకూడదని పెట్రోలియం మంత్రిత్వశాఖ చెబుతోంది. కార్ల కంపెనీల మాన్యువల్లోని ఇంధన పరిమాణం కంటే ట్యాంకు సామర్థ్యం 20% పెద్దదిగా ఉంటుంది. అంటే కంపెనీ 37లీటర్లు అని మాన్యువల్లో ఇస్తే, 42లీ. పైనే పడుతుంది. ట్యాంకులో ఖాళీ ప్రదేశం లేకుంటే ఇంజిన్ పనితీరు తగ్గుతుంది. ఇంధన ఉష్ణోగ్రత పెరిగి, ఆవిరి విస్తరించి ప్రమాదాలకు దారితీయొచ్చు. అందుకే ఫుల్ ట్యాంక్ చేయొద్దు.

ఆంధ్రప్రదేశ్

వాహనంలో ఇంధనం ‘ఫుల్ ట్యాంక్’ కొట్టించకూడదు: పెట్రోలియం మంత్రిత్వ శాఖ

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ భద్రతా చర్యల్లో భాగంగా వాహనంలో పూర్తిగా ఇంధనం నింపకూడదని పెట్రోలియం మంత్రిత్వశాఖ చెబుతోంది. కార్ల కంపెనీల మాన్యువల్లోని ఇంధన పరిమాణం కంటే ట్యాంకు సామర్థ్యం 20% పెద్దదిగా ఉంటుంది. అంటే కంపెనీ 37లీటర్లు అని మాన్యువల్లో ఇస్తే, 42లీ. పైనే పడుతుంది. ట్యాంకులో ఖాళీ ప్రదేశం లేకుంటే ఇంజిన్ పనితీరు తగ్గుతుంది. ఇంధన ఉష్ణోగ్రత పెరిగి, ఆవిరి విస్తరించి ప్రమాదాలకు దారితీయొచ్చు. అందుకే ఫుల్ ట్యాంక్ చేయొద్దు.

ఎలూరు

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఎంఈఓ-1 శిలారపు హేబేలు సూచించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఎంఈఓలు హేబేలు, ఆనంద్ కుమార్ పోటీలను ప్రారంభించారు. వాలీబాల్ బాయ్స్ అండర్ -17 విభాగంలో ఈదర జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రథమ స్థానం, ఆగిరిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ద్వితీయ స్థానం సాధించింది. బాలికల విభాగంలో అగిరిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల చెందిన విద్యార్థునులు గెలుపొందారు. అండర్ -14 కబడ్డీ బాలురు విభాగంలో ఆగిరిపల్లి పాఠశాలకు చెందిన విద్యార్థులు విజయం సాధించారు. బాలిక కబడ్డీ పోటీల్లో ఈదుల గూడెం కి చెందిన విద్యార్థులు గెలుపొందారు. విద్యార్థులను ఎంఈఓ లు హేబేలు, ఆనంద్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, పిఈటిలు శివ నాగేందర్ రావు, సుగుణ రావు, ఉమామహేశ్వరి, హర్ష పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

మండల ఉపాద్యక్షునిగా ల్యాగల ప్రసాద్ ఎన్నిక

కామారెడ్డి ప్రతినిధి, 19,సెప్టెంబర్, పున్నమి న్యూస్   కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షుడిగా ల్యాగల ప్రసాద్ ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ సభ్యులు తెలిపారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, పార్టీ కార్యకలపాలు, మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ నిక్షపాత పాతంగా సేవలు అందిస్తు ప్రజా సేవ చేయడానికి అతని ని ఎన్నుకున్న వారికీ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. అందరికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు”ప్రజాసేవలో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించిన సీఎం నారా చంద్రబాబు”

రాజకీయరంగంలో ఉన్నత శిఖరాలకు చేరాలని సురేష్‌ గారిని ఆశీర్వదించిన ముఖ్యమంత్రివర్యులు” సమాజానికి అంకితభావం తో సేవలందిస్తున్న కాకర్ల సురేష్ గారిపై సీఎం ప్రశంసలు” అమరావతి, సెప్టెంబర్ 19 :(పున్నమి న్యూస్):/// ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలసి వారి ఆశీస్సులను అందుకున్నారు,ముఖ్యమంత్రి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,“ప్రజా సేవలో అంకితభావంతో, అభివృద్ధి పట్ల కట్టుబాటుతో, సమాజంలోని ప్రతి వర్గాన్ని సమానంగా ఆదరిస్తూ, రాజకీయ రంగంలో విశేష కృషి చేస్తున్న కాకర్ల సురేష్ గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అలంకరించాలని, ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఆశీర్వదించారు.ఉదయగిరి ప్రజలకు ఎల్లప్పుడూ చేరువగా ఉండి, సేవా తత్పరతతో నిలిచిన సురేష్ గారు రాజకీయరంగంలో శిఖరాగ్ర స్థానాలను అధిరోహించాలని ముఖ్యమంత్రివర్యులు ఆకాంక్షించారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్

శ్రీకాళహస్తిలో శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద స్టాంప్ వెండర్లు,డాక్యుమెంట్ రైటర్లు,కంప్యూటర్ ఆపరేటర్లు,నిరసనగా పెన్ డౌన్ చేశారు.కార్డుప్రైమ్ 2.0విధానంలో ఎడిట్ ఆప్షన్ పునరుద్ధరించాలని,దస్తా వేజుల తయారీలో ఓటీపీ విధానం రద్దు చేయాలని,చెక్ స్లిప్ ఎడిట్ ఆప్షన్ పునరుద్ధరించి ప్రజల సమస్యలను తొలగించాలని కోరుతూ రిజిస్ట్రార్ బాలజీకి వినతి పత్రాన్ని అందజేశారు.

హెల్త్ టిప్స్

బాదం మహిమలు – ఆరోగ్యం, అందం, ఆలోచనకు అద్భుతమైన వరం

బాదం లో ఉన్న ప్రధాన పోషకాలు ప్రోటీన్ విటమిన్ E మ్యాగ్నీషియం కాల్షియం ఐరన్ ఫైబర్ ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ (Healthy Fats) 🔸 బాదం ఆరోగ్య ప్రయోజనాలు 1. మెదడు శక్తి పెంచుతుంది బాదం లోని విటమిన్ E & ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. జ్ఞాపకశక్తి, దృష్టి పెంపుదలకు ఉపయోగపడుతుంది. 2. హృదయ ఆరోగ్యానికి మంచిది బాదం లో ఉన్న మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ హృదయానికి మేలు చేస్తాయి. కోలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. 3. ఎముకలు బలంగా ఉంచుతుంది బాదం లో ఉన్న కాల్షియం & మ్యాగ్నీషియం ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతాయి. 4. బరువు నియంత్రణకు సహాయపడుతుంది బాదం తినడం వల్ల ఆకలి తగ్గుతుంది, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది. అలా ఓబేసిటీని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. 5. చర్మం & జుట్టుకు మేలు చేస్తుంది బాదం లోని విటమిన్ E చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంచుతుంది. బాదం నూనె (Almond Oil) జుట్టు పెరుగుదలకు, చర్మాన్ని పోషించడంలో సహాయపడుతుంది. 6. డయాబెటిస్ నియంత్రణ బాదం లోని మ్యాగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. 7. ఇమ్యూనిటీ పెంచుతుంది బాదం లోని ఆంటీఆక్సిడెంట్లు శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. 🔹 బాదం తినే విధానం రాత్రంతా నీళ్లలో నానబెట్టిన బాదం ఉదయాన్నే తొక్క తీసి తింటే మంచిది. రోజుకు 5–10 బాదం గింజలు తింటే సరిపోతుంది. బాదం పాలు, బాదం హల్వా, బాదం పౌడర్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం 

ఆదివారం – ఆత్మీయ కలయిక – గురువుల గౌరవం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొడూరు (2002–2003 విద్యా సంవత్సరం బ్యాచ్) పూర్వ విద్యార్థులు అక్టోబర్ 5న ఆత్మీయ కలయికకు సిద్ధమయ్యారు. 22 సంవత్సరాల తర్వాత తమ పాఠశాలలో మళ్లీ కలుసుకోవడానికి విద్యార్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు పాఠశాలలో ప్రారంభమయ్యే ఈ వేడుకలో హృదయపూర్వక ఆత్మీయ కలయిక, గురువులకు గౌరవ కార్యక్రమం, స్నేహసంధి జరుగనున్నాయి. ప్రధాన అతిథులు: పాఠశాలకు సేవలందించిన గౌరవనీయులైన అధ్యాపకులు ఈ వేడుకకు విచ్చేసి విద్యార్థులను ఆశీర్వదించనున్నారు. కార్యక్రమం: ఉదయం 8.00 గంటలకు ఆరంభం మధ్యాహ్నం 12.30 గంటల నుండి ఆత్మీయ సమ్మేళనం పూర్వవిద్యార్థుల అనుభవాలు, స్మృతులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆయోజకులు: 1998–2003 బ్యాచ్ పూర్వవిద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొడూరు🌸 ఈ ఆత్మీయ కలయిక పాఠశాల జ్ఞాపకాలను మళ్లీ సజీవం చేస్తూ, గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయనుంది.

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి

పాలకవర్గం బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలి

వెంప పిఏసిఎస్ బ్యాంక్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం భీమవరం : పిఏసిఎస్ బ్యాంక్ అభివృద్ధికి నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం మండలం వెంప గ్రామంలో పిఏసిఎస్ బ్యాంక్ నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా కె కాశీ విశ్వనాథరాజు (మేడూరు), సభ్యులుగా పి సత్యనారాయణ రాజు, కోవూరు వెంకట్ సత్యనారాయణ లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

హెల్త్ టిప్స్

పాత ఆహార అలవాట్లు – కొత్త తరానికి పాఠాలు

నేటి తరానికి ఆహార అలవాట్లు అనగానే మనసులోకి వచ్చే దృశ్యం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, హోటల్ భోజనం. కానీ కేవలం కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆ కాలంలో ప్రజల తిండి అలవాట్లు సహజసిద్ధమైనవి, సాంప్రదాయబద్ధమైనవి, ముఖ్యంగా ఆరోగ్యానికి అనుకూలమైనవి. పాత రోజుల్లో మూడు వేళల భోజనం ప్రధాన అలవాటుగా ఉండేది. ఉదయం అల్పాహారం – శక్తికి మూలం పాత కాలంలో ఉదయం లేవగానే కుటుంబ సభ్యులు క్రమపద్ధతిలో పనులు ప్రారంభించి, అనంతరం అల్పాహారం చేసేవారు. రాగి సంగటి, జొన్న రొట్టెలు, కొన్నిసార్లు గంజి – ఇవే శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేవి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి – పాడి ఉత్పత్తులు ఆహారంలో ముఖ్య భాగం. రాగి జావ, సజ్జ గంజి – పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిరోజు తీసుకునే పదార్థాలు. ఉదయం భోజనం ఎక్కువగా శక్తినిచ్చే పదార్థాలతో ఉండేది. ఎందుకంటే ఎక్కువమంది వ్యవసాయం, కూలి పని, శారీరక శ్రమ చేసే వారే. మధ్యాహ్న భోజనం – కుటుంబ సమేతంగా ఆనందం మధ్యాహ్నం అన్నం ప్రధాన ఆహారం. అన్నం, పప్పు, కూర, పెరుగు – ఇవి తప్పనిసరిగా ఉండేవి. వేపుడు, పచ్చడి, అప్పడాలు – భోజనానికి రుచిని జోడించేవి. పొలం నుంచి కూరగాయలు తీసుకువచ్చి వండడం వల్ల రసాయనాల ప్రభావం తక్కువ. మధ్యాహ్నం అందరూ కలిసి కూర్చుని తినడం ఒక సంప్రదాయం. పెద్దలు ముందుగా కూర్చుని, పిల్లలు ఆ తర్వాత తినడం. భోజనం ఒక సామాజిక క్రమశిక్షణగా ఉండేది. రాత్రి భోజనం – లేతగా, సులభంగా రాత్రి భోజనం చాలా సాధారణం. ఎక్కువగా అన్నం, పెరుగు, మజ్జిగ, పప్పు చారు లేదా లేత కూరగాయలతో భోజనం. రాత్రి ఎక్కువ తినే అలవాటు ఉండేది కాదు. సాయంత్రం చీకటి పడకముందే భోజనం చేసి, త్వరగా నిద్రపోవడం. ఆ కాలపు ఆహార ప్రత్యేకతలు సహజత్వం – అన్నీ ఇంట్లో తయారు చేసినవే. ప్యాకేజ్డ్ ఫుడ్ లేకపోవడం – కూరగాయలు, పండ్లు నేరుగా పొలాల నుంచి. మూడుసార్ల భోజనం – పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. ఋతువులకు అనుగుణంగా తినడం – వేసవిలో మజ్జిగ, పులుసులు; శీతాకాలంలో గింజలు, వడలు. ఆరోగ్యానికి ఉపయోగకరం – ఊబకాయం, షుగర్, బీపీ వంటి రోగాలు అరుదు. పాత అలవాట్లు, నేటి పరిస్థితి పోలిక అప్పుడు – రాగి, జొన్న, సజ్జలతో భోజనం. ఇప్పుడు – ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం, బేకరీ పదార్థాలు. అప్పుడు – ఇంట్లో తయారు చేసిన వంటకాలు. ఇప్పుడు – ఫాస్ట్ ఫుడ్, బయట భోజనం. అప్పుడు – శారీరక శ్రమ ఎక్కువ, ఆహారం సహజం. ఇప్పుడు – శారీరక శ్రమ తక్కువ, ఆహారం కృత్రిమం. ఆరోగ్యపరమైన లాభాలు పాత రోజుల్లో ఆహార అలవాట్ల వల్ల: జీర్ణ సమస్యలు తక్కువ. మధుమేహం, రక్తపోటు, హృదయ రోగాలు చాలా అరుదు. శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ సహజంగానే లభించేవి. వయసు పెరిగినా శక్తి, చురుకుదనం ఎక్కువ. పాత అలవాట్లలో ఉన్న విలువలు కుటుంబం అంతా కలిసి కూర్చుని తినడం – బంధాలను బలపరచేది. పెద్దలను గౌరవించడం – భోజన సమయంలో శ్రద్ధగా పాటించబడేది. ఆహారాన్ని వృథా చేయకుండా తినడం – ఒక క్రమశిక్షణ. నేటి తరానికి సందేశం పాత రోజుల్లో తిండి అలవాట్లు మనకు అనుసరణీయమైనవి. నేటి జీవనశైలిలో మార్పులు వచ్చినా, పాత ఆహార పద్ధతులలో కొన్ని అలవాట్లు తిరిగి పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాగి, జొన్న, సజ్జలు మళ్లీ వాడకం పెంచాలి. ఇంటి వంటకు ప్రాధాన్యం ఇవ్వాలి. కుటుంబం అంతా కలిసి కూర్చుని తినే అలవాటు మళ్లీ తెచ్చుకోవాలి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.