Tuesday, 5 May 2026

Blog

తెలంగాణ

రామారెడ్డి మండల కమిటీ ఎన్నిక

రామారెడ్డి మండల కమిటీ ఎన్నిక   కామారెడ్డి ప్రతినిధి 19 సెప్టెంబర్ పున్నమి న్యూస్ :   రామారెడ్డి మండల కమిటీ మీ ఎన్నుకున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదనన్న ఆదేశాల మేరకు శుక్రవారం రామారెడ్డి మండల అధ్యక్షుడు మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్ అధ్యక్షతన  గ్రామ అధ్యక్షులు సీనియర్ నాయకుల  ఆధ్వర్యం లో మండల కమిటీ ఎన్నుకోవడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా  మండల  ఉపాధ్యక్షు లు గా శ్రీనివాస్ రెడ్డి నారెడ్డి,  ల్యాగల ప్రసాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. మండల ప్రధాన కార్యదర్శి ఎం డి రావుఫ్ కార్యదర్శి అటికె ల కిషన్ యాదవ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు లక్కాకుల రాజశేఖర్,ముఖ్య సలహాదారులుగాతూర్పు రాజు, రంగు రవీందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి నా రెడ్డి,  పిప్పరి లింగం,వెంకట్ స్వామి, అరవింద్ గౌడ్, కిషన్ గౌడ్, ఠాగూర్, విజయ్ సింగ్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.

ఖమ్మం

కొద్దిపాటి వర్షానికే రోడ్డు మీద ప్రవహిస్తున్న మురుగు నీరు.. అభవృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించిన ధనియాకుల

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరం లో శుక్రవారం సాయంత్రం 4.30 నిముషాలు నుండి 5 గంటలవరకు కురసిన వర్షానికి రోడ్డు మీద మురుగు నీరు తీవ్ర స్థాయి లో ప్రవహించినది. ఈ నేపథ్యంలో లో ఖమ్మం రెండవ పట్టణ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ గట్టయ్య సెంటర్ కవిత కాలేజ్ దగ్గర నుండి స్థానిక కొత్త కార్పొరేషన్ కార్యాలయం వరకు పరీశీలించి మాట్లాడుతూ ముగ్గురు మంత్రుల ముద్దుల నగరం ఖమ్మం అని అభివృద్ధి లో మాత్రం ఖమ్మం నగరం ని పట్టించు కునే నాదుడే లేడని విమర్శలు చేసారు. ఎన్నికల ప్పుడు ఓట్లు కోసం హామీల కీ అమలు కానీ ఉచిత హామీలు గుప్పిస్తారని అయన అన్నారు. ప్రజలు ఇప్పటి కీ అయినా మార్పు కోరుకోవాలని అని అన్నారు. ముగ్గురు మంత్రుల్లో ఏ మంత్రి ఖమ్మం నగరము ని మారుస్తారో చూడాలన్నారు. నగర అభివృద్ధి కీ కేంద్ర ప్రభుత్వం నిధులు పంపితే వాటి ఎంత వరకు సద్వినియోగం చేసారో ప్రజలకు తెలియా జేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో దసరా మహోత్సవాలకు విశాఖ కలెక్టర్‌కు ఆహ్వానం

రాంనగర్‌లో వెలసిన శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఆలయ అధ్యక్షులు మార్గాన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మార్గాన వెంకటేశ్వరరావు ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు గౌడ్ యాత తో కలిసి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ని ఆహ్వానించారు. 22వ తేదీ నాడు అమ్మవారి ఉత్సవ విగ్రహం విశేష ఊరేగింపుతో ప్రారంభమై, అమ్మవారు బాలత్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆపై ప్రతి రోజూ అమ్మవారు విభిన్న రూపాలలో అలంకరించబడతారు: 23వ తేదీ – గాయత్రి దేవి 24వ తేదీ – అన్నపూర్ణ దేవి 25వ తేదీ – కాత్యాయనీ దేవి 26వ తేదీ – లలితా త్రిపుర సుందరీ దేవి 27వ తేదీ – మహా చండీ దేవి 28వ తేదీ – మహాలక్ష్మీ దేవి 29వ తేదీ – సరస్వతి దేవి 30వ తేదీ – శ్రీ కనకదుర్గ దేవి అక్టోబర్ 1వ తేదీ – మహిషాసురమర్ధిని దేవి అక్టోబర్ 2వ తేదీ – రాజరాజేశ్వరి దేవి శరన్నవరాత్రి పర్వదినాల్లో జరిగే ఈ పూజా కార్యక్రమాలు అభ్యుదయానికి, ఆధ్యాత్మికోత్సాహానికి ప్రతీకగా ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో మహేష్, కృష్ణ, బేకరీ రవి, పల్లా దుర్గ, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం

ముత్తుకూరు :-పున్నమి సెప్టెంబర్ 19):-సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలానికి చెందిన జనసేన సైనికుడు తండ్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి “మేము సైతం” అంటూ రూ.10,000లను ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు, పొదలకూరు మండల నాయకులు నారదాసు రవి, యనమల మధు, వెంకటాచల మండల నాయకుడు పినిశెట్టి మహేష్, ముత్తుకూరు మండల సీనియర్ నాయకుడు రహీం పాల్గొన్నారు. జనసేన జెండా ఎగరేస్తూ ధైర్యంగా పార్టీ కార్యక్రమాల్లో ముందుండే ప్రతి సైనికుడికి అండగా నిలబడతామని వారు హామీ ఇచ్చారు.

నాగర్‌కర్నూల్

ప్రణాళికతో ప్రయత్నిస్తేనే ఏదైనా సాధించగలుగుతారు

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 19 విద్యార్థులు ప్రణాళికతో ప్రయత్నిస్తేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారని కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ దేవరకొండ ప్రభుత్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమావత్ రవి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం బిజినపల్లి మండలం పాలెం లోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు కెరీర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాములు అద్యక్షతన జరిగిన ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ గా దేవరకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమావత్ రవి అదే కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు జి లింగారెడ్డి,డాక్టర్ ఎం ప్రభాకర్ దీంతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ డాక్టర్ రమావత్ రవి విద్యార్థులకు వారి జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి కావాలసిన పలు సూచనలు అందించారు.విద్యార్థులు ముందు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటే దానికి తగ్గట్టు ప్రణాళికతో చదివితేనే భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడవచ్చు అని సూచించారు.తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుంటూ శ్రద్ధగా చదివితేనే ఫలితం లభిస్తుందని చెడు మార్గాలకు అలవాటు పడొద్దని ఈ సందర్భంగా తెలిపారు.మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటే ఆ విధంగానే అవుతామని కావున మనసులో మంచి ఆలోచనలు చేయాలని అన్నారు. విద్యార్థులు ఎప్పుడు కూడా నేనే టాప్ లో ఉండాలని కసితో చదవాలని అప్పుడే అనుకున్నది సాధించ గలుగుతారని వివరించారు.అనంతరం ఎస్ వి జి ఎ&ఎస్(ఎ)కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు అతిథులను శాలువాలతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ వర్కాల శ్రీనివాసులు,కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుష్మ, అధ్యాపకులు డాక్టర్ నాగరాజు, శివ,ప్రవలిత, జూనియర్ అసిస్టెంట్ కురుమయ్య,విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రామారెడ్డి లో పోషణ మాస వారోత్సవాలు

 కామారెడ్డి ప్రతినిధి 19 సెప్టెంబర్ పున్నమి న్యూస్  కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో పోషణ మాస వార చాలు నిర్వహించినట్లు అంగన్వాడి కార్యకర్తలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోషణ మాసాన్ని ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను విజయవం తం చేయాలని అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబరు నెలలో ‘పోషణ మాస వారోత్సవాలు’ నిర్వహిస్తుంది. పోషకాహార లోపం లేని సమాజం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు.  అంగన్వాడీ కేంద్రాలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది గర్భిణులు, బాలింత లు, కిశోర బాలికలు, పిల్లలకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించామన్నారు.. ఇందులో భాగంగా, ఆరోగ్యానికి అవసరమైన ఆహారపు అలవాట్లు, పోషక విలువల గురించి వివరించామని చెప్పారు. గర్భిణులకు సీమంతా లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో పోషకాహార లోపాన్ని తగ్గించి, ఆరోగ్య వంతంగా తయారు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ జ్యోతి, అంగన్వాడి కార్యకర్తలు ఇంద్ర శోభ, సుజాత, విద్యార్థులు, గర్భిణి స్త్రీలు తదితరులు పాల్గొన్నారు 

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి పై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదుఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు గౌడ్ యాత

ఫుడ్ కోర్ట్ తొలగింపు హేయమైన చర్య స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా షాపులు తొలగించడం చాలా బాధాకరం అన్యాయం నిరంతరం ప్రజల్లో ఉండి పేద ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్ కు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ఎమ్మెల్యే శాసనసభలో ఉండగా దక్షిణ నియోజకవర్గం లో మేయర్ మున్సిపల్ కమిషనర్ చేపట్టినటువంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నాం. అదును చూసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,పేద ప్రజల పక్షపాతి ఎమ్మెల్యే వంశీ విశాఖపట్నంలో లేని సందర్భంలో శాసనసభలో దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడుతున్న సమయంలో ఇటువంటి హేయమైన చర్యలు తీసుకున్న వారిని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం వెనివెంటనే క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు గౌడ్ యాత్ర తెలియజేశారు మేయర్ , కమిషనర్ ఒకరిపై ఒకరు నెపం వేసుకొని, పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి పేద ప్రజలకు అన్యాయం జరిగితే సహించేదే లేదు

తిరుపతి

గుడిమల్లం అంగన్వాడీ లో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం నిర్వహణ

శ్రీకాళహస్తి:రేణిగుంట ఐసీడీఎస్ ప్రాజెక్టు గుడిమల్లం పాఠశాల మరియు గుడిమల్లం అంగన్వాడీ కేంద్రం నందు శుక్రవారం పౌష్టిక ఆహార ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ అనిత వాణి మాట్లాడుతూ మనకు అందుబాటులో దొరికే పాలు ఆకుకూరలు,కూరగాయలు, చిరుధాన్యాలు,కోడిగుడ్లు,తినడం వలన మహిళలు,కిశోర బాలికలు,గర్భవతులు, బాలింతలు రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉంటారని,ప్రతి గ్రామాన్ని రక్తహీనతరహిత గ్రామంగా చేయాలని తెలియజేశారు.హెల్త్ సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బరువు తక్కువ ఉన్న పిల్లలు అంగన్వాడి పరిధిలో గుర్తించి గృహ సందర్శన చేసి పౌష్టికాహారం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ,ఆ పిల్లలు వెయిట్ పెరిగే విధంగా చూడాలని,బరువు పెరగని పిల్లలను తిరుపతిలో ఉన్న ఎన్ ఆర్ సి కి రెఫర్ చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో స్వచ్ భారత్. ముఖ్య అతిధి గా హాజరై న బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు

ఖమ్మం పున్నమి ప్రతినిధి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు, సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరికోటేశ్వరరావు ముఖ్య అతిధి గా ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ అధ్యక్షతన ఖమ్మం టూ టౌన్ పరిధిలో ఉన్న 50వ డివిజన్ లో గల మామిళ్ల గూడెం ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం స్వచ్ఛభారత్ ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ రాజపుత్ మహేంద్ర సింగ్ ఆధ్వర్యంలో జరిగింది, ముఖ్యఅతిథిగా విచ్చేసి సిన ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు , మాట్లాడుతూ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా సేవా పక్షం స్వచ్ఛభారత్ కార్యక్రమం లో భాగంగా మున్సిపాలిటీ కార్మికులను శాలువతో సత్కరించి, స్కూలు పిల్లలకు స్వీట్ ప్యాకెట్స్ పంచి, శ్రీ నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు , ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గెంటేలవిద్యాసాగర్ ఒక్కలంకసుబ్రహ్మణ్యం, మందరపు సుబ్బారావు, మేకలనాగేందర్, నెల్లూరు బెనర్జీ చౌదరి, సుదర్శన్మిశ్రా, స్వచ్ఛభారత్ ఖమ్మం జిల్లా కన్వీనర్, రేఖసత్యనారాయణ, కృష్ణచారి,రుద్రగానిమాధవ్, బుఖ్యవెంకట్, దాసరిమధు, దాసరివీరభద్రం, (రిటైర్డ్ సి ఐ) జిల్లా సోషల్యు మీడియా కన్వీనర్ యుగంధర్ నాయుడు, సురేష్ గౌడ్, మహిళా నేతలు, శ్రీమతి మందసరస్వతి, శ్రీమతి ఈశ్వరప్రగడ లలిత, శ్రీమతి రజిని రెడ్డి, శ్రీమతి I’ll,స్వర్ణ,మేఘన, తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి నారా లోకేష్ ..!

దేవుని ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశీర్వాదం..! విజయవాడ సెప్టెంబర్ 19 :(పున్నమి న్యూస్ ప్రతినిధి, నాగరాజు ):/// ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ ఛాంబర్ లో శుక్రవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంత్రి నారా లోకేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కేక్ తినిపించారు. నారా లోకేష్ మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళల అండగా ఉంటుందని, ఉదయగిరిని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. ప్రజాసేవలో ముందుకు నడవాలని, దేవుని ఆశీస్సులతోపాటు నా ఆశీస్సులు ఉంటాయని, ప్రజల ఆశీస్సులు పొందాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.