Tuesday, 5 May 2026

Blog

E-పేపర్

ఏపీలో గోల్డ్ మైన్.. త్వరలో పసిడి ఉత్పత్తి!

AP: కర్నూల్ (D) జొన్నగిరి వద్ద తాము అభివృద్ధి చేస్తున్న గనిలో త్వరలో పసిడి ఉత్పత్తిని ప్రారంభిస్తామని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ MD హనుమప్రసాద్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇదే జరిగితే దేశంలో గనుల నుంచి బంగారాన్ని తీసే తొలి ప్రైవేట్ కంపెనీగా DGML నిలవనుంది. ఏటా 750-1000kgs గోల్డ్ ఉత్పత్తి అవుతుందని అంచనా.

ఆంధ్రప్రదేశ్

దేశాన్ని తాకిన ఐ-ఫోన్ ఫీవర్

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి@ఐ-ఫోన్ ఫీవర్ ఇవాళ్టి నుంచి భారత్‌ లో అందుబాటులోకి ఐఫోన్-17 సిరీస్ యాపిల్‌ స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన జనాలు ఢిల్లీ, ముంబైలో యాపిల్‌ స్టోర్స్‌ ముందు కస్టమర్ల పడిగాపులు తెల్లవారుజామునుంచే భారీ క్యూలైన్లు. ముందు సిరీస్ లతో పోల్చితే ఈ సిరీస్ అంతగా ఆకట్టుకోలేదని టెక్ నిపుణుల కామెంట్స్. ఆశ్చర్యంగా ఈ సిరీస్ తరువాత పడిపోయిన యాపిల్ షేర్ వాల్యూ.

ఆంధ్రప్రదేశ్

అదరహో అమరావతి!

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ అదరహో అమరావతి! రాజధాని అమరావతి వైభవాన్ని కళ్లకు కట్టేలా ప్రభుత్వం పలు సూక్ష్మ నమూనాలను రూపొందించింది.

E-పేపర్

ఎరువుల పంపిణీపై కడప కలెక్టర్ ఆరా

దువ్వూరు మండలం చింతకుంటలోని రైతు సేవా కేంద్రంలో గురువారం జరిగిన యూరియా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్ పరిశీలించారు. రైతులు యూరియా వినియోగాన్ని క్రమేనా తగ్గించాలని, దీని స్థానంలో నానో యూనియన్ వాడాలని సూచించారు. ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

E-పేపర్

కడప: అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష

బాలికను అత్యాచారం చేసిన కేసులో వేంపల్లెకు చెందిన తమ్మిశెట్టి రామాంజనేయులుకు కడప పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి యామిని 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధించారు. 15 ఏళ్ల బాలికను రామాంజనేయులు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి 2019లో వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. DSP వాసుదేవన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.

జాతీయ అంతర్జాతీయ

చంద్రునిపై నమూనాలు తీసుకొచ్చేందుకు ఏఐ టెక్నాలజీ

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ చంద్రయాన్-4 ద్వారా చంద్రుని పై నమూనాల కోసం ఏఐ సాంకేతికత ఉపయోగించనున్నట్టు ఇస్రో వెల్లడి ఈ ఏడాది డిసెంబర్ నాటికి మానవరహిత అంతరిక్ష యాత్ర – ఇస్రో చైర్మన్ నారాయణన్ వయోమిత్ర అనే రోబోను పంపుతాం – ఇస్రో చైర్మన్ గగన్‌యాన్ ప్రాజెక్టులో 85శాతం పరీక్షలు పూర్తయ్యాయి,రాకెట్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా ఎలా తీసుకురావాలో అధ్యయనం చేస్తున్నాం -ఇస్రో చైర్మన్ నారాయణన్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు ఆటో, మ్యాక్సీ డ్రైవర్లకు వాహనమిత్ర కింద రూ.15వేలు సాయం – నేడు చివరి తేదీ

డ్రైవర్లకు రూ.15,000 సాయం అందజేయనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 2023 వరకు ఈ పథకం కింద సాయం పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అయితే, మిగిలిన అర్హులు ఎవరు ఉన్నా, వారు తప్పనిసరిగా ఈ రోజు సాయంత్రం లోపే దరఖాస్తు చేసుకోవాలి. 2023 వరకు సాయం పొందిన వారు కూడా సచివాలయంలో తమ పేర్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం మంచిది. అందరు అర్హులైన ఆటో, మ్యాక్సీ డ్రైవర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, తమకు రావలసిన ప్రయోజనం పొందాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.

E-పేపర్

ఆసియాలో తొలి మహిళా లోకోపైలట్ సురేఖా యాదవ్ పదవీ విరమణ

భారతీయ రైల్వే చరిత్రలో మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచిన మహారాష్ట్రకు చెందిన సురేఖా యాదవ్ గారు పదవీ విరమణ పొందారు. 1988లో అసిస్టెంట్ లోకోపైలట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సురేఖా యాదవ్, అనేక అడ్డంకులను అధిగమించి ఆసియా ఖండంలో తొలి మహిళా లోకోపైలట్గా రైలు నడిపిన సాహస స్వరూపిణి. డెక్కన్ క్వీన్ సహా ప్రముఖ రైళ్లను నడిపిన ఆమె, నాలుగు దశాబ్దాల ఉద్యోగ జీవితం ద్వారా రైల్వేలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పారు. తన కష్టసాధ్యమైన కృషి, పట్టుదల, అంకితభావం ద్వారా అణచివేతల ఉక్కుపాదాలను అధిగమించి ఒక కొత్త మార్గాన్ని చూపిన ఆమె, అనేకమంది మహిళలకు జీవన మార్గదర్శకురాలిగా నిలిచారు. సురేఖా యాదవ్ గారి విశిష్టమైన సేవలు భారతీయ రైల్వే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి.

తిరుపతి

నాటి చేపదెబ్బకు ఫలితం నేడు చైర్మన్ పదవి

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలకమండలి చైర్మెన్ పదవి తనుకు ఇవ్వడం పట్ల జనసేన నాయకుడు కొట్టేసాయి ఆనందాన్ని వ్యక్తం చేశాడు.నాడు సిఐ చెంపదెబ్బ కొట్టినప్పుడు ఒక సామాన్య కార్యకర్త కు తోడుగా నిలబడి నేడు ఇంతటి భాధ్యతను తనకు ఇవ్వడం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కే చెల్లిద్దని,వారికి ఆజన్మాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు.దేవస్థానం చైర్మన్ గా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేసారు.ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

పులస కోసం కర్ణాటక నుంచి వచ్చిన ఈ పెద్దాయన

*పులస కోసం కర్ణాటక నుంచి కడియం వచ్చిన* *ఈ పెద్దాయన ఎవరో తెలుసాండీ..?* ఏడేళ్ల క్రితం ఇదే రోజు కడియం వెళుతూ పల్ల వెంకన్న గారి నర్సరీ వద్ద ఆగాను. అక్కడ ఎవరున్నా లేకపోయినా వెంకన్న గారి పెద్దబ్బాయి సత్తిబాబు గారు ఉంటారు. ఆయనతో కలసి గ్రీన్ టీ లేదా కొబ్బరి బొండం తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుకోవడం అలవాటు. ఆరోజు ఆ నర్సరీలో ఓ పక్కన మొక్కలు చూస్తున్న ఓ వ్యక్తిని చూపించి ఆయనెవరో తెలుసా అని సత్తిబాబు గారు అడిగారు. ఆయన్ని ఎక్కడా చూసినా సందర్భం లేదన్నాను. ఆయన కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ అన్నారు. బహుశా మాజీ అనుకున్నాను. ఎందుకంటే ఆ చుట్టుపక్కల పోలీసులు, అధికారులు వంటి వారు ఎవరూ లేరు. కూడా వచ్చిన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు.కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరని ఉంచాలని పెద్ద రాద్దాంతాం జరుగుతున్న రోజులవి.ప్రస్తుత స్వీకర్ ఆయనేని చెప్పడంతో ఆశ్చర్యం కలిగి తాగుతున్న టీ కప్పును పక్కనపెట్టి ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూసాను. ఆయనే….స్పీకర్ కుర్చీలో ఉండి మాట్లాడడం చూసి మతిపోయింది. కర్ణాటక అంతటి పెద్ద రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అంత సింపుల్ గా ఉన్నారేటని ఆశ్చర్యపోయాను.ఆయన వస్తున్నట్లు సమాచారం ఇస్తే మన ప్రభుత్వం ప్రోటోకాల్ ఏర్పాటు చేస్తుంది. సత్తిబాబు గారు ఆయన వద్దకు తీసుకెళ్లి నన్ను పరిచయం చేశారు. ఆయన అచ్చ తెలుగులో మాట్లాడుతున్నారు.పేరు కాళ్లకూర రమేచ్ కుమార్. 1978 నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు వివరించారు. రెండుసార్లు అసెంబ్లీ స్పీకర్ గా, మరో రెండు సార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసినట్లు తెలిపారు. కన్నడ బ్రాహ్మణులు. ఆయన సామాజిక వర్గం ఓట్లు అయిదు శాతం కూడా ఉండని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నట్లు తెలిపారు. అంటే ప్రజల్లో ఆయనకున్న గుర్తింపు స్పష్టమవుతుంది. ఇన్ని పదవులు చేపడుతున్న మీరు ఇలా సెక్యూరిటీ లేకుండా రావడం ఏమటని అడగ్గా నాకు శత్రువులు ఎవరూ లేరని అయినా నా వ్యక్తిగత పనిమీద ఇక్కడికి వచ్చినప్పుడు సెక్యూరిటీలు వినియోగించుకోవడం ఇష్టం లేదని చెప్పారు. ప్రశాంతత కోసం అప్పుడప్పుడు ఇలాంటి ప్రదేశాలకి వెళ్తుంటానని వివరించారు.పల్ల వెంకన్న గారితో తనకు ఎప్పుటి నుంచో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయనపై ఉన్న అభిమానంతో ఇక్కడికి తరుచూ వస్తుంటానని తెలిపారు.చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతలో నర్సరీకి కారు వచ్చి ఆగింది. ఆ కారు శబ్దం కంటే అందులో ఉన్న వ్యక్తి మాటల శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది. అంటే పల్ల ఎంకన్న గారు వచ్చారన్నమాట.అక్కడ పనిచేసే వారంతా అటెక్షన్ లోకి వెళ్ళిపోయారు. ఆయనతో మామూలుగా ఉండేది కాదు. ఆయన్ని చూడగానే స్పీకర్ గారు ఆయన వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. నేను మాత్రం కొంచెం దూరంగానే ఉన్నాను. ఎందుకంటే వెంకన్న గారితో పడలేను. రాజకీయాలు ఎలా ఉన్నాయి అబ్బాయి అంటారు. కాంగ్రెస్ పార్టీ బాగుంది అంటేనే ఒప్పుకుంటారు. లేకపోతే చివాట్లు పెడతారు. అందుకనే ఆయనతో రాజకీయం చర్చించడం చాలా కష్టం.నికార్సైన కాంగ్రెస్ వాది. స్పీకర్ గారితో ఓ సెల్పీ తీసుకుని వచ్చేస్తూ సత్తిబాబు గారితో అన్నాను గట్టిగానే ఆయన మొక్కలు కొని ఉంటారని.అప్పుడు చెప్పారు అసలు విషయం. ఆయన మొక్కలు కోసం రాలేదు పులస భోజనం కోసం వచ్చారని.ఇంటి దగ్గర వండించి తీసుకొస్తున్నట్లు తెలిపారు. అదేంటి ఆయన బ్రాహ్మణులు అన్నారు కదా అన్నాను.అవును కాని పులస చేప అంటే ఇష్టం అని చెప్పారు.చూసారా…గోదావరి పులస మహత్యం.ఇప్పుడు పులసలూ లేవు పల్ల వెంకన్న గారూ లేరు. మరో విశేషం ఏంటంటే ఇటువంటి ప్రముఖులు చాలా మంది కడియం నర్సరీలకు వస్తుంటారు. కొందరు మాత్రమే తాము వచ్చినట్లు తెలియజేయడానికి అంగీకరిస్తారు.అప్పుడు కూడా ఆయన వచ్చినట్లు పేపర్లో రాయవద్దని చెప్పారు. ప్రస్తుతం ఆయన పదవిలో లేనందున ఆనాటి జ్ఞాపకాలు ఇలా మీ ముందుంచాను

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.