అంబేద్కర్ కోనసీమ జిల్లా
సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మెన్ గా ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్ ) ని నియమించిన ప్రభుత్వం..
సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మెన్ గా ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్ ) ని నియమించిన ప్రభుత్వం..
సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన ఎస్పి శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ గారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఎస్పీ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు చట్టాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై చర్చించుకున్నారు.
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) చదువు ద్వారానే అన్ని సాధ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం పెద్దవూర మండలంలోని గిరిజన బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. తల్లిదండ్రుల కష్టానికి తగ్గట్టుగా చదివి భవిష్యత్తులో సమాజంలో మంచి స్థానంలో నిలవాలని సూచించారు.ఇంగ్లీష్ పై పట్టు సాధించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని,గుడ్లు తప్పని సరిగా తినాలని అన్నారు. మినీ గురుకులానికి రోడ్డు ఆటవస్తులను మంజూరు చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ పెద్దవూర ఎంపీడీవో కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన గృహ నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు శనివారం నాటికి పీఎం ఆవాస్ యోజన కింద 30% గ్రౌండింగ్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం చలకుర్తి నవోదయ విద్యాలయాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో రాణించేలా కృషి చేయాలని సూచించారు.
సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ ఉగ్రవాది డానిష్ రహస్య స్థావరం గుర్తింపు.. రహస్య స్థావరంలో పొటాషియం నైట్రేట్ స్వాధీనం.. ఢిల్లీలో వరుస పేలుళ్లకు కుట్ర.. కొద్దిరోజుల క్రితం జార్ఖండ్‌లో డానిష్ అరెస్ట్.. బోధన్‌లో హుజైఫా యమన్ అరెస్ట్.. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ఢిల్లీ పోలీసులు..
సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సచివాలయంలో బీసీ మంత్రుల సమావేశం స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల కల్పనపైనా చర్చ సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి అనిత, న్యాయ శాఖ మంత్రి ఫరూక్ *అమరావతి* : వెనుకబడిన తరగతుల ఆత్మాభిమానం నిలిపేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో బీసీ రక్షణకు తుది రూపం తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నేతృత్వంలో బీసీ మంత్రులు, హోం మంత్రి అనిత, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మంత్రి సవిత విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి పాటు పడుతోందన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు బీసీలను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 2025-26 బడ్జెట్ లో రూ.47 వేల కోట్లకుపైగా కేటాయించారన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం రూప కల్పనకు నిర్ణయించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం మేర బీసీ రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. బీసీలు ఆత్మగౌరవంతో జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం బీసీ మంత్రులు రెండు పర్యాయాలు సమావేశమయ్యామని, త్వరలో మరో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో బీసీలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారన్నారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీలోని బీసీ నాయకులను అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారన్నారు. బీసీలకు గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నామన్నారు. సుదీర్ఘంగా సాగిన సమావేశం అంతకుముందు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ మంత్రుల సమావేశం సుదీర్ఘంగా సాగింది. గత ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం రూపకల్పన, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనపై సమావేశంలో చర్చించారు. చట్టపరంగా, న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా బీసీ రక్షణ చట్టం రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బీసీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ సహా హోం మంత్రి అనిత, న్యాయ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, బీసీ సంక్షేమ శాఖాధికారులు పాల్గొన్నారు.
నకిరేకల్ :సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి ) పెండింగ్ లో ఉన్న సదరం కేసులను వచ్చే నెలలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డిని ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నిర్వహించే సదరం శిబిరాన్ని సందర్శించారు. సదరం క్యాంపులను ఆసుపత్రిలోని పాత భవనంలో నిర్వహిస్తుండగా, నూతన భవనంలోకి మార్చాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కొత్త భవనానికి సంబంధించిన పార్టీషన్, ఎలివేషన్ పనుల వల్ల శిబిరం మార్చడం సాధ్యం కాలేదని డి ఆర్ డి ఓ కలెక్టర్ దృష్టికి తెచ్చారు.పాత భవనంలోని ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని సదరం క్యాంపుల నిర్వహణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అంతేగాక పెండింగ్ లో ఉన్న 2564 సదరం దరఖాస్తులను పరిశీలించి వచ్చే నెల నాటికి క్యాంపుల నిర్వహణ,పరిష్కారం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ స్టోరీ : ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందొం పుల్లలు అని కూడా అనే వారు. కొంతమంది కచ్చిక, (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు. మగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే, నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి. ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు. కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు. బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది వత్తుల స్టౌ, పంపు స్టౌ వాడేవారు కిరసనాయిలు ది. అదే విధంగా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు. ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ రాచ్చిప్పలు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు, ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే. అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి. అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు. బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసన్నాలు, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు. సీతారామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్లి పోయేవారు. వెళ్లిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసే వారు. ఒక వేళ, రాలేకపోతే, అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం. రాత్రిపూట7, 8 గంటలకు మాదాకవళం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే మాదాకవళం అబ్బాయికిచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు. టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి – ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేవి. పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు. ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు. డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు. గదులు కూడా చాలా పెద్దవి. 3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి – 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది. వైద్యం కి డాక్టర్స్ చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత బన్ను, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్ భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది. అదే ప్రభుత్వాసుపత్రికి పోతే రంగు రంగుల ఔషథాలిచ్చేవారు. ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు అంతే. ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు. పుస్తకాలు ఎప్పుడు, వేరే వాళ్ళు వాడినవే. పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. క్రితం ఏడు నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు. రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం. అర్థం అయినా కాకపోయినా, రాత్రి పెందలాడే, నిద్ర. వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసనకర్రే. ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది. రెండు రూపాయలు పెట్టి, ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు. అదీ ఆరోజుల్లో జీవన శైలి. ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు నిర్వహించేవారు. అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలుండేవి వారాలబ్బాయిలు వీథి దీపాల చదువులు… మనుషులంత ఒక్కటిగా ఉండే వాళ్ళు. ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు. కక్షలూ కార్పణ్యాలు. కోప తాపాలు కుళ్ళూ కపటం. ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళకుంది మాకులేదని ఏనాడూ అనుకునే వారే లేరు. అహంకారం ప్రతీకారం అనేవే తెలీదు అప్పటి జనాలకి. వెనక్కి తిరిగి చూచుకుంటే ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది. ఇప్పుడున్నన్ని సౌకర్యాలు, విలాసాలు లేకపోయినా, ప్రకృతికి దగ్గరగా, ఆరోగ్యంగా గడచిన రోజులు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 18: జీవీఎంసీ పరిధిలో రెండవ దశ బార్ నోటిఫికేషన్ కు ఈరోజు నగరంలో డ్రా జరిగింది. జాయింట్ కలెక్టర్ శ్రీ మయూరి అశోక్ గారు 11 బార్లకు డ్రా తీసి అర్హులను నిర్ణయించారు. 2025 – 2028 సంవత్సరాల కు గాను విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వం 121 బార్లకు ఓపెన్ క్యాటగిరిలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వీటిలో గత నెల 30 న జరిగిన డ్రాలో 58 బార్లకు లైసెన్స్ జారీ చేయడం జరిగింది. మిగిలిన 63 బార్లకు రెండవ దశలో నోటిఫికేషన్ జారీ చేయగా 11 బార్లకు 44 అప్లికేషన్ రావడం జరిగింది. అభ్యర్థుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ లాటరీ నిర్వహించి సెలెక్ట్ అయిన అభ్యర్థులను ప్రకటించారు. వారు ప్రభుత్వ నిర్ణయించిన రిటైల్ ఎక్సైజ్ టాక్స్ కట్టిన తర్వాత బార్లు ప్రారంభించుకోవచ్చని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ రామచంద్ర మూర్తి గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్. ప్రసాద్ తెలిపారు.
పేద విద్యార్థులు డాక్టర్లు కాకూడదా! చంద్రబాబు పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి జననేత జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడాన్నీ వ్యతిరేకిస్తూ పాడేరులో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆశీలమెట్ట కార్యాలయంలో గురువారం దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ జిల్లా నాయకత్వంలో నేడు 19వ తేదీన పాడేరు మెడికల్ కాలేజీ వద్ద జరగనున్న ధర్నా దద్దరిల్లనున్నదని హెచ్చరించారు. 28 కార్లు,ఒక బస్సుతో దక్షణ స్టూడెంట్ యూత్ నాయకులు పాడేరు కార్యక్రమంకి వెళ్తున్నట్లు తెలిపారు. వైసీపీ హయంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో పది కళాశాలల నిర్మాణానికి 4,500 కోట్లు అవసరం అన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ఇందుకు నిధులు లేవని పేద విద్యార్థులు డాక్టర్లు కాకూడదనే చంద్రబాబు ఈ దుర్మార్గపు ఆలోచనకు తెర తీశారని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేద, మధ్య తరగతి విద్యార్ధులకు సీట్లు రావని ఆందోళన వ్యక్తం చేశారు. మేనజేమెంట్ కోటలో యాజమాన్యం సీట్లు అమ్మేసుకుంటారని విమర్శించారు. అల్లూరి జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ వస్తే గిరిజనులు అత్యవసర సమయాల్లో KGH వచ్చే దుస్థితి తప్పుతుందన్న ముందు చూపుతోనే జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టరన్నారు. కాగా, వైసీపీ యువజన, విద్యార్ధి సంఘాల అధ్వర్యంలో ఈనెల 19 న జరిగే చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం విజయవంతానికి పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాలు, ప్రజలు , విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలి రావాలని వాసుపల్లి పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్” నీ విజయవంతం చేయండి! జననేత జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడాన్నీ వ్యతిరేకిస్తూ పాడేరులో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆశీలమెట్ట కార్యాలయంలో గురువారం దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ జిల్లా నాయకత్వంలో నేడు 19వ తేదీన పాడేరు మెడికల్ కాలేజీ వద్ద జరగనున్న ధర్నా దద్దరిల్లనున్నదని హెచ్చరించారు. 28 కార్లు,ఒక బస్సుతో దక్షణ స్టూడెంట్ యూత్ నాయకులు పాడేరు కార్యక్రమంకి వెళ్తున్నట్లు తెలిపారు. వైసీపీ హయంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో పది కళాశాలల నిర్మాణానికి 4,500 కోట్లు అవసరం అన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ఇందుకు నిధులు లేవని పేద విద్యార్థులు డాక్టర్లు కాకూడదనే చంద్రబాబు ఈ దుర్మార్గపు ఆలోచనకు తెర తీశారని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేద, మధ్య తరగతి విద్యార్ధులకు సీట్లు రావని ఆందోళన వ్యక్తం చేశారు. మేనజేమెంట్ కోటలో యాజమాన్యం సీట్లు అమ్మేసుకుంటారని విమర్శించారు. అల్లూరి జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ వస్తే గిరిజనులు అత్యవసర సమయాల్లో KGH వచ్చే దుస్థితి తప్పుతుందన్న ముందు చూపుతోనే జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టరన్నారు. కాగా, వైసీపీ యువజన, విద్యార్ధి సంఘాల అధ్వర్యంలో ఈనెల 19 న జరిగే చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం విజయవంతానికి పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాలు, ప్రజలు , విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలి రావాలని వాసుపల్లి పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు నెలకొల్పిన ‘మహావతార్ నరసింహ’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. తెలుగు సహా పలు భాషల్లో ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది.