Tuesday, 5 May 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తి లో ఆరు లైన్ల రోడ్డు వద్దంటూ నిరసన

చెన్నై-నాయుడుపేట రోడ్లు కలుపుతూ ఆరు లైన్ల రోడ్డు వేయాలనే ప్రతిపాదన ను పునరాలోచించాలి అని శ్రీకాళహస్తి లోని స్థానికులు ఆందోళన చేశారు.అందులో భాగంగా శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఊరి లోపల ఆరు లైన్ల రోడ్డు వద్దు ఊరి బయట ముద్దు అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు.ఈ ఆరు లైన్ల రోడ్డు వేయడం వలన తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం ఏవో శాంతి కి వినతిపత్రం అందజేశారు.

ఆంధ్రప్రదేశ్

పశువులకు గాలి కుంటి వ్యాధి టీకా ఎంతో కీలకం

జిల్లా పశుసంవర్థక అధికారి డా. వి. జయరాజ పశువులకు గాలి కుంటి వ్యాధి టీకా ఎంతో కీలకం అనిజిల్లా పశుసంవర్థక అధికారి డా. వి. జయరాజు అన్నారు. సెప్టెంబర్ 19వ తేదీ శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని గీడిగపుట్టు, పతిమామిడి గ్రామాలలో గాలి కుంటి వ్యాధి (ఎఫ్ ఎం డి) టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ వి. జయరాజు ప్రత్యక్షంగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, పశువుల ఆరోగ్యం కాపాడటంలో ఎఫ్ ఎం డి టీకా ఎంతో కీలకమని, ప్రతి రైతు తన పశువులకు తప్పనిసరిగా ఈ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పశువులకు సమయానికి టీకాలు వేయడం వల్ల వ్యాధులు రాకుండా నిరోధించగలమని, అలాగే పశుసంవర్దక రంగంలో రైతులు నష్టాలను తప్పించుకోవచ్చని ఆయన వివరించారు. డాక్టర్ వి. జయరాజు స్థానిక పశువైద్య సిబ్బందిని అభినందిస్తూ, ప్రతి గ్రామంలోనూ ఈ టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. రైతులు కూడా సక్రమంగా స్పందించి తమ పశువులను టీకా కోసం తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు చురుకుగా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

HPCLలో భారీ పేలుడు

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ లైవ్ విశాఖ గాజువాకలో ఘోరం జరిగింది. HPCL ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆరాయుఎఫ్ సైట్లో కంప్రెసర్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో ఉలిక్కిపడ్డ కార్మికులు షేడ్ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

హడావుడి లేకుండా లిక్కర్ కేసు తేల్చేస్తున్న ఈడీ!

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ఒక్క సారిగా పలు రాష్ట్రాల్లో సోదాలు చేయడంతో వైసీపీ పెద్దలు ఉలిక్కి పడ్డారు. ఇంత కాలం సిట్ మాత్రమే విచారణ జరుపుతోందని.. తమ స్కామ్ ఇంటర్నేషనల్ కాబట్టి భయం లేదని.. ఎక్కడో చోట తీగ తెగిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈడీ పూర్తి స్థాయిలో హడావుడి లేకుండా చేయాలనుకున్న పనులన్నీ చేస్తోందని క్లారిటీ వచ్చాక.. వారంతా కంగారు పడిపోతున్నారు. తమ దాకా ఎప్పుడు వస్తారా అని బితుకుబితుకు మంటున్నారు. ఈడీ టార్గెటెడ్‌గా సోదాలు చేసింది. అంటే పక్కా సమాచారంతోనే సోదాలు చేసింది. లిక్కర్ స్కాముల్లో డబ్బులు ఎవరెవరి దగ్గరకు చేరాయి.. వారు ఎలా వైట్ చేశారు.. దానికి ఎన్ని షెల్ కంపెనీలు పెట్టారు..ఇలా మొత్తం సమాచారం ఉండటంతో.. ఆయా చోట్ల సోదాలు చేశారు. పక్కా ఆధారాలతో చేసిన సోదాల్లో.. ఆ లావాదేవీల సమాచారం అంతా వారికి లభించింది. ఈడీ ఇప్పటికే చాలా సైలెంటుగా విచారణ చేస్తూ.. అన్ని డీటెయిల్స్ తెలుసుకుంది. ఒక్క లక్ష రూపాయలు అక్రమంగా చేతులు మారినా ఈడీ సులువుగా గుర్తించగలదు. అలాంటిది వేల కోట్లు వైట్ చేసుకుంటే గుర్తించలేరా? నేక్ట్స్ వైట్ రిసీవర్లపై గురి ఈడీ అధికారులు మొత్తం సూత్రధారికి నగదు ఎలా చేరిందన్నది కూడా గుర్తించారు. హవాలా చేసిన నగదు ఎలా విదేశాలకు వెళ్లింది అన్నది ఇప్పుడు సోదాల్లో తేల్చారు. మళ్లీ తిరిగి ఏ రూపంలో వచ్చింది.. ఎవరి దగ్గరకు చేరిందన్నది కూడా ఇప్పటికే లెక్కలు తీశారు. తదుపరి రౌండ్ ఇదే అంశంపై సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. సిట్ విచారణ కీలక దశకు చేరనుంది. సూత్రధారి వద్దకు కేసు చేరినప్పుడు ఈడీ కూడా ఒకే సారి ఎటాక్ చేసి.. పని పూర్తి చేసే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ సూత్రధారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు పక్కా స్కెచ్ వేసినట్లుగా కనిపిస్తోంది. తాడేపల్లిలో లాయర్ల హడావుడి లిక్కర్ స్కామ్ కంగారు పెడుతోంది. జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ .. లాయర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా బెంగళూరులోనే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇవి తాడేపల్లికి చేరాయి. రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డిని ఈ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించినట్లుగా చెబుతున్నారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా వైసీపీ పెద్దలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో మారిన దసరా సెలవుల తేదీలు.. మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

ఈ నెల‌ 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం రెండు రోజుల ముందుగానే ప్రారంభం కానున్న సెలవులు ఎక్స్ వేదిక‌గా మంత్రి నారా లోకేశ్ ప్ర‌క‌ట‌న‌ సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ ఏపీలోని పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దసరా సెలవుల తేదీలలో మార్పు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే, అంటే ఈ నెల‌ 22 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన వెల్లడించారు. “పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం” అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి, విద్యాశాఖ ముందుగా జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల‌ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉన్నాయి. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అదనంగా రెండు రోజులు సెలవులు లభించనున్నాయి. అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

E-పేపర్

ఉత్తరాఖండ్ వరదల మధ్య సేవా కార్యక్రమాల్లో ముందున్న యువకాంగ్రెస్..

ఇటీవలి వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాల సహాయార్థం యువకాంగ్రెస్ (#SOSIYC) కార్యకర్తలు ముందుండి సేవలు అందిస్తున్నారు. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారు, తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన సహాయం అందించడానికి యువకాంగ్రెస్ కృషి కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో వందలాది కుటుంబాలకు బియ్యం, మందులు, శానిటరీ ప్యాడ్లు, తాగునీటి సీసాలు మరియు ఇతర అవసరమైన సామగ్రి అందజేశారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు కష్టాల్లో ఉన్న పరిస్థితిని గుర్తించి వారికి అవసరమైన సదుపాయాలు అందించడం జరుగుతోంది. “ప్రజాసేవే మా ధర్మం. సహాయం కావలసిన ప్రతి ఒక్కరికీ చేయూత అందించడం మా సంకల్పం. ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం యువకాంగ్రెస్ బాధ్యతగా భావిస్తోంది” అని యువకాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. సహాయం అవసరమైన ప్రతి ప్రాంతానికి చేరుకునేందుకు యువకాంగ్రెస్ వాలంటీర్లు 24 గంటలు కృషి చేస్తున్నారు. బాధితులు కష్టాలను అధిగమించి మళ్లీ సాధారణ జీవితం సాగించేందుకు అన్నివిధాల సహాయం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.

తిరుపతి

జనసేన నేతకు పదవి -టిడిపి నాయకుల అసంతృప్తి

శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవి జనసేన నేత కొట్టె సాయి కి కేటాయించడం పట్ల పలువురు టిడిపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.పార్టీ జెండా మోసి ఎన్నికల్లో పార్టీకోసం కష్టపడి,ఉద్యమాలు చేసి,జైళ్ల కి వెళ్లి పార్టీ గెలుపే ధ్యేయంగా పని చేసాము మాకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కాసరం రమేష్ ప్రశ్నించారు.చైర్మన్ పదవి పై అధిష్టానం పునరాలోచన చేయాలని వారు అన్నారు.అసంతృప్తి వర్గంలో ఉమేష్,అక్షింతల కృష్ణ యాదవ్ తదితరులు ఉన్నారు.

E-పేపర్

దసరా శుభవార్త: సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు పాఠశాలలకు సెలవులు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారు ఉపాధ్యాయుల కోరిక మేరకు దసరా పండుగ సెలవులను ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం విద్యాశాఖ అధికారులతో జరిగిన చర్చల అనంతరం తీసుకున్నామని మంత్రి గారు ట్వీట్ ద్వారా వెల్లడించారు. అసలు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే సెలవులు ఉండగా, తాజా మార్పుతో అదనంగా రెండు రోజులు పండుగ సెలవులు లభించనున్నాయి.

E-పేపర్

శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్ ని నియమించడం ఒక జనసైనికుడికి గర్వ కారణం-కొట్టే శ్రీహరి

జనసేన సిద్ధంతాలకు కట్టుబడి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బాటలో నడిచిన శ్రీ కాళహస్తి నియోజకవర్గ జనసైనికుడు మా అన్న కొట్టే సాయి ప్రసాద్ కి శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ పదవి రావడం ఒక జనసైనికుడిగా కొట్టే కుంటుంబ సభ్యుడిగా మాటల్లో చెప్పలేని సంతోషంగా వుంది.శ్రీ కొట్టే సాయి ప్రసాద్ ను జనసేన పార్టీ అధ్యక్షులు,మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్ కి ప్రతిపాదించడంతో ఇందుకు అనుగుణంగా NDA కూటమి ప్రభుత్వం శ్రీ కొట్టే సాయి ప్రసాద్ పేరును నిన్న ప్రకటించడంతో జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు.జనసేన పార్టీ బలోపేతం కోసం అంకిత బావంతో నిజాయితీగా తన కుంటుంబాని సైతం పక్కన పెట్టి పనిచేసిన జనసైనికుడు కొట్టే సాయి,కూటమి అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన కొట్టే వారి ప్రచార రథలలో కొట్టే ఉదయ్ భాస్కర్,కొట్టే వెంకట్రావు,కొట్టే వెంకట నారయణ,కొట్టే సాయి ప్రసాద్ లది కీలక పాత్ర,అప్పటి CI అంజు యాదవ్ అకారణంగా దాడి చేసిన ప్రజాస్వామ్యయుతంగా,జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన మా అన్న శ్రీ కొట్టే సాయిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నేడు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం ఇది నిజమైన జనసైనికుడు దక్కిన గౌరవంగా ప్రతి జనసైనికుడు బావిస్తున్నాడు.ఒక సామన్య కార్యకర్తకు అండగా వుండటంలో వాలకు తగిన బాధ్యతలు ఇవ్వడంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరువాతే ఎవరైన అని మరోసారి నిరుపించారు అని జనసేన నాయకులు కొట్టే శ్రీహరి తెలిపారు.

E-పేపర్

శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్ ని నియమించడం ఒక జనసైనికుడికి గర్వ కారణం-కొట్టే శ్రీహరి

జనసేన సిద్ధంతాలకు కట్టుబడి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బాటలో నడిచిన శ్రీ కాళహస్తి నియోజకవర్గ జనసైనికుడు మా అన్న కొట్టే సాయి ప్రసాద్ కి శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ పదవి రావడం ఒక జనసైనికుడిగా కొట్టే కుంటుంబ సభ్యుడిగా మాటల్లో చెప్పలేని సంతోషంగా వుంది.శ్రీ కొట్టే సాయి ప్రసాద్ ను జనసేన పార్టీ అధ్యక్షులు,మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్ కి ప్రతిపాదించడంతో ఇందుకు అనుగుణంగా NDA కూటమి ప్రభుత్వం శ్రీ కొట్టే సాయి ప్రసాద్ పేరును నిన్న ప్రకటించడంతో జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు.జనసేన పార్టీ బలోపేతం కోసం అంకిత బావంతో నిజాయితీగా తన కుంటుంబాని సైతం పక్కన పెట్టి పనిచేసిన జనసైనికుడు కొట్టే సాయి,కూటమి అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన కొట్టే వారి ప్రచార రథలలో కొట్టే ఉదయ్ భాస్కర్,కొట్టే వెంకట్రావు,కొట్టే వెంకట నారయణ,కొట్టే సాయి ప్రసాద్ లది కీలక పాత్ర,అప్పటి CI అంజు యాదవ్ అకారణంగా దాడి చేసిన ప్రజాస్వామ్యయుతంగా,జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన మా అన్న శ్రీ కొట్టే సాయిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నేడు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం ఇది నిజమైన జనసైనికుడు దక్కిన గౌరవంగా ప్రతి జనసైనికుడు బావిస్తున్నాడు.ఒక సామన్య కార్యకర్తకు అండగా వుండటంలో వాలకు తగిన బాధ్యతలు ఇవ్వడంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరువాతే ఎవరైన అని మరోసారి నిరుపించారు అని జనసేన నాయకులు కొట్టే శ్రీహరి తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.