Tuesday, 5 May 2026

Blog

తిరుపతి

ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయండి:ఏఐఎస్ఎఫ్

శ్రీకాళహస్తి లో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి మునిచందు మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 6400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలచేయాలని,వైద్య విద్య ను ప్రయివేటీకరణ చేయడం ఆపాలని అన్నారు.అదేవిధంగా ఉన్నత విద్యకు శాపంగా మారిన జీఓ నెం.77 రద్దు చేయాలని,విద్యార్థి సంఘాల నాయకులు విద్యా సంస్థల లోనికి వెళ్లకుండా తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు.విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 3500 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్

విద్యారంగంలో ఉన్నత స్థాయిలో నిలపాలి

కామారెడ్డి 19 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థాయిలో నిలపాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉపాధ్యాయులను సూచించారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ లో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ బోధనాభ్యాసన సామాగ్రి మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి 250 మంది ఉపాధ్యాయులు బోధనాభ్యాసన సామాగ్రిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయు లను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న సాంకేతికత కు తగ్గట్టుగా విద్యార్థులలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని అన్నారు. ప్రాథమిక స్థాయిలో పునాది బలంగా ఉంటేనే ఉన్నత విద్యలో రాణించ గలుగుతారని అన్నారు. పిల్లలకు తరగతి గదిలో అభ్యసన సామగ్రి తప్పనిసరిగా వినియోగించి విద్యా పట్ల ఆకర్షితులను చేయాలని అన్నారు. విద్యార్థులు వినడం కంటే నమూనాలను ప్రత్యక్షం గా చూడడం ద్వారా అధికంగా నేర్చుకోగలుగుతా రని అన్నారు.చక్కటి ప్రదర్శనలను చేసిన ఉపా ధ్యాయులను ఈ సందర్భంగా అభినందిస్తు అ పదవ తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్తలు వేణుగోపాల్, నాగవేందర్, రమణరావు, పరీక్షల కమీషనర్ బలరాం, డీసీఈబీ కార్యదర్శి లింగం, ఎంఈవో లు ఎల్లయ్య, ఆనంద రావు, రాజులు, యూసఫ్, రామస్వామి, ఉపాధ్యా యులు తదితరులు పాల్గోనారు.జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి జిల్లా వారిచే జారీ చేయనైనది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేశరీ సంధ్య సునీత కృష్ణ సుమారుగా రెండు ఉపాధ్యాయ లు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో వర్షం – ఆనందం వెల్లివిరిసింది

నెల్లూరు పట్టణం సహా జిల్లాలో కురిసిన వర్షాలు ప్రజలకు హర్షం నింపాయి. ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ, పంటలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు. వర్షం కారణంగా కాలువలు, చెరువులు నిండిపోవడంతో నెల్లూరు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టణం వీధులన్నీ వర్షపు చినుకులతో తడిసి ముద్దయి, పిల్లలు వర్షంలో ఆడుకుంటూ మురిసిపోతున్నారు.

Blog

యంత్రాల మధ్య కాదు, మనసుల మధ్య జీవించాం

*తన తండ్రిని కొడుకు అడిగిన ఒక సందేహం*…. నాన్నా ! మీ కాలంలో 1. ఇంత టెక్నాల జీ లేదు.. 2. విమానాలు లేవు.. 3. ఇంటర్నెట్ లేదు.. 4. TV లు లేవు..5. కంప్యూటర్లు లేవు.. 6. ఏసీ లు లేవు.. 7. లగ్జరీ కార్ లు లేవు.. 8. మొబైల్ ఫోన్ లు లేవు… మీరెలా బ్ర తికేవారు? *దానికి ఆ తరము తండ్రి గారు ఇచ్చిన జవాబు అందరూ చదవవలసిందే*. మీ తరమువారు ఈ రోజుల్లో ఎలాగైతే 1. ప్రార్ధన లేకుండా.. 2. మర్యాద లేకుండా 3. ప్లానింగ్ లేకుండా 4. క్రమశిక్షణ లేకుండా.. 5. పెద్దల ఎడల గౌరవం లేకుండా.. 6. మన చరిత్ర పై అవగాహన లేకుండా.. 7. కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా. 8. ఏ Morals లేకుండా… రోజులు ఎలా గడిపేస్తున్నారో! మేము ఆ Morals అన్నీ పాటిస్తూ ఆనందముగా జీవించాము. మేము మీలాగా… 1. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు.. 2. పాఠశాల వేళలు అయిన తరువాత చీకటి పడేదాకా ఆడుకున్నాము. TV లు చూడలేదు… 3. ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితులతో గడిపాము.. 4. దాహము వేస్తే కుళాయి నీరు, బావి నీరు త్రాగాము. బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు.. 5. ఒకే గ్లాస్ లో నలుగురం జ్యూస్ త్రాగినా, కాకి ఎంగిలి చేసిన జామకాయలు తిన్నా మాకెప్పుడూ జబ్బులు రాలేదు.. 6. మూడు పూటలా అన్నమే తిన్నా మాకు ఊబకాయం రాలేదు… 7. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా మాకు కీళ్ళ నొప్పులు రాలేదు.. 8. సొంత ఆట వస్తువులు తయారు చేసికొని ఆడుకున్నాము,, అష్టా చెమ్మా, ఏడు పెంకులు, కోతి కొమ్మచ్చి, వైకుంఠ పాళీ ఆడుకున్నాము. బంధువులతో కలసి మెలసి ఆనందముగా ఉన్నాము, 9. పిలువక పోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము.. 10. మావి black and వైట్ ఫొటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు….. బహుశా మాతల్లి దండ్రులు చెప్పినది ఆచరించిన చివరి తరం మేమే. మా వారసులు శాసించినది పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు….. అయినప్పటికీ.. మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము… మేము ఒక limited ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము….. అందుకే మా విన్నపము ఏమంటే.. *భూమి పైనుండి మేము వెళ్ళిపోకముందే మా జీవితాలనుండి, ఎంతో కొంత మానుండి మీరు నేర్చుకోండి*.……. మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులకు వందనాలు, మేము అలా పెంచడం చేతకాని ఈ సమాజంలో, ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులం అవుతున్నాం.

యాదాద్రి భువనగిరి

పద్మావతి కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఈ రోజు భువనగిరి పట్టణంలోని పద్మావతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శ్రీ ఎక్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ గారు. మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలల రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి గారు. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఆర్ఎంఓ అసిస్టెంట్ కిరణ్ సార్ గారు మాట్లాడుతూ వృత్తి విద్య చేసిన విద్యార్థులు అనేక హాస్పిటల్స్ ల్యాబ్స్ లలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగినది. ప్రిన్సిపాల్ షీలా పరశురాం మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ షఫీ సార్ గారు మాట్లాడుతూ వృత్తివిద్య కోర్సులు చదవడం వలన జీవితంలో తొందరగా స్థిరపడగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, సాయిరాం సార్ గారు మరియు, శ్రీనివాస్ గారు వైస్ ప్రిన్సిపాల్ ఆడెపు మహేందర్ ,నాగరాజు, దేవేందర్, హేమలత, రాజకుమారి, పావ నీలు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి

తిరుపతి

మహిళలపై గౌరవం లేని వ్యక్తికి గుడి చైర్మన్ పదవి:వినుత కోట

శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా కొట్టె సాయి ని నియమించడం పై శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జ్ వినుత కోట వ్యతిరేకించారు.కొట్టె సాయికి మహిళల పై గౌరవం లేదని,అటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడం దారుణమన్నారు.తన అభ్యంతర పత్రాన్ని లేఖ ద్వారా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి తెలియజేసారు. తనపై జరిగిన రాజకీయ కుట్ర లో కొట్టె సాయి కూడా భాగమై ఉన్నాడని ఆధారాలను నాదెండ్ల మనోహర్ కి,హరి ప్రసాద్ కి తెలియజేసినట్లు తెలిపారు.

E-పేపర్

అంగన్వాడి కేంద్రంలో 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసంలో భాగంగా తూర్పుపల్లి సచివాలయం పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు పిల్లల యొక్క తల్లిదండ్రులను మరియు గ్రామస్తులను భాగస్వాములుగా చేసి పోషకాహారం గురించి తెలియజేశారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి తల్లులు మరియు పిల్లలు పోషకాహారం మరియు సమతుల ఆహారం తీసుకునేలా ప్రతి ఒక్కరూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజే యడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మి సిద్దుల నాయుడు, పీహెచ్ సి డాక్టర్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు, ఎం ఎల్ హెచ్ పి లు, మరియు సూపర్వైజర్ ఎం పద్మ పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్పంచ్ లపై నిందలు వద్దు” – కాకాణి

*”సర్పంచ్ లపై నిందలు వద్దు” – కాకాణి* *SPS నెల్లూరు జిల్లా:* *తేది:19-09-2025* *నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ కార్యాలయానికి సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లి, వారిపై జరుగుతున్న  వేధింపులు, ప్రోటోకాల్ ఉల్లంఘన, వివిధ అంశాలపై జిల్లా పంచాయతీ అధికారితో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.* *సర్పంచులకు జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన షోకాజులకు వివరణ అడిగిన కాకాణి* *కరెంట్ బిల్లులు చెల్లించినా, చెల్లించిన మొత్తం నిధులు దుర్వినియోగం అయ్యాయని రాయడానికి మీకు మనసు ఎలా వచ్చిందని నిలదీసిన కాకాణి.* *కాకాణి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు.* *మా పార్టీ సర్పంచులపై నిందలు వేయవద్దు, మేమే రాజీనామాలు చేస్తామని పేర్కొన్న కాకాణి.* *జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సర్పంచులు అని కూడా చూడకుండా, దారుణమైన నిందలు వేస్తున్నారు.* *సర్పంచులకు కనీసం మర్యాద ఇవ్వకుండా, ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూ, ఫిర్యాదులు చేస్తున్నా, జిల్లా అధికారులు మౌనవ్రతం పాటించడం సరికాదన్న కాకాణి.* *మీడియా సమక్షంలోనే సర్పంచులు నిబంధనల మేర ఖర్చు చేసిన వాటికి కూడా, నిధుల దుర్వినియోగం కింద, అభ్యంతర ఖర్చుల కింద ఎలా రాశారని అడగడంతో, సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయిన అధికారులు.* *కాకాణి మీడియాతో మాట్లాడుతూ..* – కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులపై కక్ష సాధింపులు ప్రారంభమయ్యాయి. – జిల్లాలో సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధుల స్థానాలను 95 శాతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల మద్దతుతో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులను తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవాలని కూటమి నేతలు బాహాటంగా వేధింపులకు పాల్పడుతున్నారు. – గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోకపోతే చెక్ పవర్ రద్దు చేయడం, తొలగిస్తామని సర్పంచ్ లను, స్థానిక ప్రజాప్రతినిధులను రకరకాల భయాందోళనలకు గురిచేస్తున్నారు. – స్థానిక సంస్థలలో ఎక్కువ శాతం మహిళలు ప్రాతినిధ్యం వహిస్తూ, అవమాన పాలవుతున్నారు. – బిల్లులు రాకపోయిన సొంత ఖర్చులతో పనులు చేస్తూ, చాలా మంది సర్పంచ్ లు అప్పులపాలవుతున్నారు. – రాజకీయ కక్షతో ప్రజా అవసరాల కోసం ఖర్చు చేసిన పనులకు బిల్లులు రాకుండా చేస్తున్నారు. – అధికారులు కూటమి నేతల కన్నుసన్నలలో మహిళా ప్రజా ప్రతినిధుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అవినీతిపరులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. – వెంకటాచలంలో సర్పంచ్ గా ఉన్న బీసీ మహిళను, వైకాపా నాయకుడు వెంకట శేషయ్యపై కక్షతో నిధులు దుర్వినియోగమయ్యాయని అభియోగం మోపి, విచారణ పేరుతో వేధిస్తున్నారు. – బిల్లులు, రుజువులు చూపిస్తే అధికారులు నీళ్లు నమిలే పరిస్థితులు ఏర్పడ్డాయి. – చదువుకున్న మహిళలు గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరితే, పొదలకూరు సర్పంచ్ గా ఎస్టీ మహిళ సర్పంచ్ గా పోటీ చేసేందుకు ముందుకు వచ్చింది. – ఎన్నో ఆశయాలతో గ్రామ అభివృద్ధి చేయాలని వచ్చిన చదువుకున్న సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయడం దౌర్భాగ్యం. – గతంలో పొదలకూరు సర్పంచ్ గా పనిచేసిన ఎస్సి మహిళను సైతం పార్టీ మారలేదని చెక్ పవర్ రద్దు చేశారు. – టిడిపి కండువా కప్పుకోకపోతే, చేసిన పనులకు బిల్లులు రావు, ఆస్తులు అమ్ముకొని గ్రామ అవసరాలు తీరుస్తున్న సర్పంచ్ లపై అవినీతిపరులుగా ముద్ర వేయడం దారుణం. – కూటమి నేతల అధికార భయంతో అధికారులకు నిజాయితీగా విచారణ చేసే ధైర్యం లేదు. – అధికార పార్టీ నేతలకు అధికారులు కొమ్ముకాస్తున్నారు. – కూటమి నేతల మాటలకు తలొగ్గి, విచారణ పూర్తి కాకమునుపే, షోకాజ్ నోటీసులో చెప్పిన సమయం గడవక ముందే, ఆఘమేఘాలపై చెక్ పవర్ రద్దు చేయవలసిన అవసరం అధికారులకు ఏముంది! – కూటమి నేతలు తమ మాట వినని అధికారులపై కూడా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. – గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అధికారులను సైతం ఇబ్బందులకు గురిచేస్తూ, వాళ్ళు చెప్పిందల్లా చేసే అధికారులను ఎంపిక చేసుకుంటున్నారు. – వీఐపీలు వస్తే ప్రోటోకాల్ పాటించాలని పెద్దల మెప్పు కోసం సర్పంచ్ లను పనులు చేయమన్న అధికారులు నేడు సర్పంచ్ లు ప్రొసీజర్ ఫాలో కావడం లేదని మాట్లాడటం హాస్యాస్పదం. – గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులకు అధ్యక్షత వహించాల్సిన సర్పంచ్ లను, స్థానిక ప్రజాప్రతినిధులను తగిన గౌరవం ఇవ్వకుండా, అవమానపరుస్తూ, అధికారులు యథేచ్ఛగా ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తున్నారు. – సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులపై జరుగుతున్న వేధింపులపై న్యాయ పోరాటం చేస్తాం. – గతంలో సర్పంచ్ ను తొలిగించారని గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే, హై కోర్టు. ఆదేశాలను చూసి జిల్లా కలెక్టర్ రాజీనామా చేసేంతవరకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఏనాడు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపులకు పాల్పడలేదు. – ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ పార్టీకి చెందిన వారికైన గౌరవం ఇచ్చాము, వారిపట్ల హుందాగా నడుచుకున్నాం. – శాసనసభ్యులు చీప్ గా ఉంటే, పాలన ఎంత చీప్ గా ఉంటుందో సర్వేపల్లి నియోజకవర్గంలో చూస్తే అర్ధమవుతుంది. – అధికారం శాశ్వతం కాదని అధికారులు గుర్తించుకోవాలి. – అధికారులు చేసే పాపాలపై పునర్విచారణ చేపడుతాం, భవిష్యత్తులో మీకు అవి శాపాలుగా చుట్టుముట్టుతాయి. – అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం, దయదాక్షణ్యాల కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, మూల్యం చెల్లించుకోకతప్పుదు. – కూటమి ప్రభుత్వంలో ఇంట్లో కూర్చున్నా కేసులు పెడుతున్నారు. – తమ ప్రమేయం లేకపోయినా సరే, సర్పంచ్ లపై, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేస్తున్నారు. – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను తొలగించాలనే ఉద్దేశ్యంతో అవినీతిపరులుగా నిందలు మోపదం మనసును కలచివేస్తుంది. – రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వైనాట్ 175 ఖచ్చితంగా గెలిచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు సర్పంచులుగా, ప్రజా ప్రతినిధులుగా ఉండటం అధికారులకు ఇష్టంలేకపోతే, అధికారులు స్పష్టం చెయ్యాలి, వారిచేత రాజీనామా చేయిస్తాం.. వారిని వేధింపులకు గురిచేయడం, అవినీతిపరులుగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదు. – అధికారుల తీరు మారకపోతే, జిలాల్లోని సర్పంచ్ లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అధికారుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ, పోరాటం చేస్తాం.

నిర్మల్

భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక

భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కె. రఘునాథ్ (రసాయన శాస్త్రం సహాయ ఆచార్యులు), ఎం. శంకర్ (ఆంగ్ల సహాయ ఆచార్యులు) గారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సందర్భంగా కళాశాలలో ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కరోల్ల బుచ్చయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, “విద్యార్థుల బాగు కోసం నిరంతరం కృషి చేస్తున్న ఈ ఉపాధ్యాయులు సర్వదా అభినందనీయులు. వీరి నిబద్ధత, కృషి ఇతర అధ్యాపకులకు ఆదర్శనీయమై నిలుస్తుంది” అని అభినందించారు. అధ్యాపకులు మరియు విద్యార్థులు కూడా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి సేవలను కొనియాడారు.

హైదరాబాద్

సిని హీరో జూనియర్ ఎన్టీఆర్ కీ ప్రమాదం

పున్నమి ప్రతినిధి టాలివుడ్ హీరో జూనియర్ ఎన్ టి ఆర్ కీ ప్రమాదం జరిగింది. ఒక యాడ్ షూటింగ్ నేపథ్యంలో ప్రమాదం జరిగిందని అయన కాలికి గాయం అవ్వగా స్వల్ప గాయాలు అయినట్లు యాడ్ షూట్ బృందం ధ్రువీకరించినది. త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్ టి ఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.