Tuesday, 5 May 2026

Blog

అన్నమయ్య

బలిజ సేన ఆధ్వర్యంలో అతికారి కృష్ణకు ఘన సత్కారం అందరూ ఐక్యమత్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం – అతికారి కృష్ణ

రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి కృష్ణకు బలిజ సేన ఆధ్వర్యంలో ఘన సత్కారం లభించింది. గురువారం చిట్వేల్ మండలంలో బలిజ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి మస్తాన్ రాయులు ఆహ్వానం మేరకు, అన్నమయ్య జిల్లా బలిజ సేన అధ్యక్షులు కే.ఎస్. నరసింహ, బలిజ సేన చిట్వేల్ కార్యాలయంలో అతికారి కృష్ణకు శాలువాలు కప్పి, మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అతికారి కృష్ణ, “ఒకరికొకరు తోడుగా నిలిచి ఐక్యతగా ముందుకు నడిస్తేనే నిజమైన బలం ఉంటుంది. వ్యక్తిగత స్థాయిలో ఉన్న శక్తి కంటే కలిసినప్పుడు వచ్చే శక్తే అభివృద్ధికి మార్గం చూపుతుంది” అని తెలిపారు. చిట్వేల్ మండల ప్రజల ఆదరాభిమానాన్ని మరువలేనని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అబ్బిగారి గోపాల్, మాదాసు శివ, మైనార్టీ నాయకుడు రియాజ్, మద్దూరి మన్మధ, మిత్రబృందం జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రాయలసీమ జిల్లాలకు తీవ్ర పిడుగుల హెచ్చరిక

రాబోయే రెండు రోజులు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా, భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, తిరుపతి (పశ్చిమ), అనంతపురం (తూర్పు), సత్యసాయి (తూర్పు) జిల్లాల్లో రాత్రి, అర్థరాత్రి వేళల్లో వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఈ వర్షాలు తెల్లవారుజాము వరకు కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. అదనంగా, కర్నూలు, నంద్యాల సహా రాయలసీమ ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, పశువులను రక్షించుకోవడంతో పాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పిడుగులు, వర్షాల సమయంలో ఇంట్లో ఎలక్ట్రిక్ పరికరాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని విద్యుత్ శాఖ హెచ్చరించింది. ఇంట్లో ఉండే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

జోగులాంబ గద్వాల

పంట పొలంలో గాయంతో నెమలి.

అలంపూర్ : సెప్టెంబర్ 18 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండల కేంద్రం ఉండవెల్లి శివారులో గురువారం మధ్యాహ్నం ఉండవల్లికి చెందిన మద్దిలేటి పంట పొలంలో ఒక నెమలికి కాలికి గాయమై లేవలేని స్థితిలో పడి ఉండగా మద్దిలేటి ఆ నెమలిని ఉండవల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు, ఉండవెల్లి పోలీసు వారు ఆ నెమలికి ప్రధమ చికిత్స చేయించి, ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

ఎలూరు

విద్యార్థులు తప్పిన ప్రమాదం

విద్యార్థులు తప్పిన ప్రమాదం ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి ప్రైవేట్ పాఠశాల బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం ఈదర నుండి విద్యార్థులు ఎక్కించుకుని ఆగిరిపల్లి వస్తున్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్ బస్సు ఈదర అడ్డరోడ్డు వద్దకు రాగానే డ్రైవర్ కు ఉన్నట్టుండి ఫిట్స్ రావడంతో బస్సును అదుపు చేయలేక పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకుపోయింది. గ్రామస్తులు హుటా హుటీనా వచ్చి విద్యార్థులు బయటకు తీశారు. బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది విద్యార్థులు కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు. నెల రోజుల్లోపు ఇదే పాఠశాలకు చెందిన బస్సులు రెండుసార్లు ప్రమాదాలకు గురికావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంఈఓ-1 హేబేలు మాట్లాడుతూ స్కూల్ బస్ ప్రమాదానికి గల కారణాలను విచారించి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.

E-పేపర్

పాతపాడులో స్వస్థ నారీ – స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం

చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం పాతపాడు గ్రామంలో గురువారం స్వస్థనారి సొసైటీ పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య అధికారి డా టి అంశుధర్ మాట్లాడుతూ మహిళలు, పిల్లలు శ్రేయస్సు కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పలు వ్యాధులకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవచ్చన్నారు. మహిళలు ఆరోగ్య సంరక్షణను మెరుగుపర్చడం, మరింత మెరుగైన వైద్య సేవలు అందించి వారి కుటుంబాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.అదేవిధంగా మహిళలు ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత సేవలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, పి.హెచ్.యన్. జి. నవమణి,హెచ్.వి. యశోద మరియు ఎంపి హెచ్ ఎ(యం/యఫ్) మరియు ఆశాలు,104. సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీస్త్రీలు కిశోర బాలికలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

తిరుపతి

భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులచే ర్యాలీ

శ్రీకాళహస్తి మండలం తొండమనాడు నందు గల జెడ్పి హైస్కూల్ లో భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నో డ్రగ్స్-నో స్మోకింగ్ అనే నినాదంతో గ్రామము నందు ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం డ్రగ్స్ వాడకం,పొగ త్రాగడం వలన మనకు కలిగే అనర్థాలు,ఆరోగ్య సమస్యలను నాటిక రపంలో విద్యార్థులు ప్రదర్శన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రదానాచార్యులు కృష్ణయ్య,స్కౌట్ మాస్టర్ జయసింహ,ఉపాధ్యాయులు కుప్పయ్య,గుణశేఖర్ రెడ్డి,గైడ్ కెప్టెన్ పద్మావతి పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం ప్రిన్సిపల్ డాక్టర్ పి రాములు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబరు 18 బిజినపల్లి మండలం,పాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాలలో డైరీ సైన్స్ విభాగంలో ఒక అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రాములు ఒక ప్రకటనలో తెలిపారు. పిజీలో డైరీ సైన్స్ లేదా జువాలజీ పూర్తి చేసిన వారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 19 శుక్రవారం సాయంత్రం 4గంటల లోపు కళాశాలలో సమర్పించాలని,దరఖాస్తుతో పాటు ఒక జత జిరాక్సు పత్రాలను అందజేయాలని కోరారు. ఈనెల 20 శనివారం ఉదయం 10గంటలకు కళాశాలలోనే ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు.డైరీ సైన్స్ అర్హత కలిగిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. పీజీలో 55 శాతం మార్కులు సాధించినవారు అర్హులని తెలిపారు.నెట్,సెట్ లేదా పిహెచ్ డి అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

నాగర్‌కర్నూల్

సైబర్ మోసాలతో జాగ్రత్త లు పాటించాలి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా September 18 మండల కేంద్రంలో ని ఎస్బిఐ బిజినపల్లి శాఖ ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై కళాజాత బృందం చే అవగాహన కల్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రజలను ఉద్దేశించి ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలతోపాటు ఫైబర్ మోసాలు బాగా పెరిగాయి. వీటిని నివారించడానికి తక్షణమే బ్యాంక్ అధికారులను సంప్రదించాలి. అలాగే మీ వ్యక్తిగత వివరాలు తెలియని వక్తులతో పంచుకుంటే…తర్వాత వారు బ్యాంకు అధికారులవలె నమ్మించి ఫోన్లో ‘OTP’ లు తెలుసుకొని మీ బ్యాంకు ఖాతాను కాలి చేసే అవకాశం ఉంటుంది అని చెప్పారు.అలాగే ATM లలో కొందరు మోసగాళ్లు కార్డు సైపింగ్ మిషన్ లో పెట్టి చూసి మీ కార్డు ను మార్పు చేసే అవకాశాలు ఉంటాయి కావున అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం జరిగింది.ఖాతాదరులు అప్పటికప్పుడు KYC అప్డేట్ చేసుకోవాలి. వివిధ రకాల బ్యాంకు ఇన్సూరెన్స్లు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన. అటల్ పెన్షన్ యోజన యోజన. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి ఇన్సూరెన్స్ పథకాలపై కూడా కళాజాత బృందం వారు వివరంగా జానపద పాటల రూపంలో అలరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ ఎం. నవీన్ కుమార్ గారు ఫీల్డ్ ఆఫిసర్ ఫారుక్ బాషా బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు

తిరుపతి

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం!

ప్లాస్టిక్ నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించాలని నిర్ణయించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో చెత్తను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతి సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పది ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న నటి మంచు లక్ష్మీ.

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ ఈ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, కంప్యూటర్లు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి. టీజ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన మంచు లక్ష్మీ. గతంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆమె ఈ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్న లక్ష్మీ.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.