Tuesday, 5 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాజీ మంత్రి పర్యటన

*”పొదలకూరు మండలంలో కాకాణి పర్యటన”* *SPS నెల్లూరు జిల్లా:* *తేది:17-09-2025* *సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, మహమ్మదాపురం గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.* *గ్రామాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, యూరియా అందక, గిట్టుబాటు ధర లేక రైతులకు ఎదురవుతున్న గడ్డు పరిస్థితులు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించిన కాకాణి.* *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోగిరెడ్డి గోపాల్ రెడ్డి గారి తల్లి పెంచలమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న కాకాణి.* *స్క్రోలింగ్ పాయింట్స్:* – గ్రామాల్లో ప్రజలు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. – చంద్రబాబు సూపర్ సిక్స్ లో భాగంగా తాను ఇచ్చిన హామీలను కొన్నింటిని అసలు అమలు చేయకుండానే, మరికొన్నింటిని అరకొరగా అమలు చేస్తూ, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ సభలు, సమావేశాలు నిర్వహించడం హాస్యాస్పదం. – చంద్రబాబు మాటల ముఖ్యమంత్రి కానీ, చేతల ముఖ్యమంత్రి కాదని రుజువు చేసుకున్నాడు. – వరి పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక నెల్లూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోతున్నారు. – ధాన్యం రేట్లు రోజురోజుకి దిగజారి పోతున్నా, రైతుకు కనీస మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. – రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉల్లి ధర క్వింటాలు రూ౹౹3500/-లు ఉంటే, నేడు క్వింటాలు ధర 600/- రూపాయలకు దిగజారడం దౌర్భాగ్యం. – రైతులు యూరియా అందక నానా అవస్థలు పడుతుంటే, చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతూ, కాలక్షేపం చేస్తున్నాడు. – జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించి, నిర్మిస్తే, చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచి వేస్తుంది. – చంద్రబాబు తన అనుకూల పత్రికల్లో ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినా, పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం లేకుండా, వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లాడు. – అనుభవజ్ఞుడు అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైంది. – చంద్రబాబు లక్షల కోట్లు అప్పు తెచ్చి అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చేశాడు. – చంద్రబాబు పాలన ప్రచార ఆర్భాటంలో *”మిన్న”* , కార్యరూపంలో *”సున్న”* అన్నట్లు తయారైంది. – కూటమిపాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. – ప్రతిపక్షంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, అన్ని విధాలా అండగా నిలుస్తాం.

జాతీయ అంతర్జాతీయ

హెలికాప్టర్! ట్యాక్సీ.. ఏకంగా గాల్లోనే ప్రయాణం!

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ రోజురోజుకీ ట్రాఫిక్ పెరుగుతున్న కారణంగా ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ట్యాక్సీ కంపెనీలు కొత్తగా ఆలోచిస్తున్నాయి. రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ ను ఓవర్కమ్ చేసేలా గాల్లో ప్రయాణాలను ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉబర్ హెలికాప్టర్ ట్యాక్సీ సర్వీస్ గురించి ఆలోచిస్తోంది. హెలికాప్టర్ రైడ్స్ ప్రముఖ ట్యాక్సీ బుకింగ్ కంపెనీ ఉబర్.. తమ యాప్లో హెలికాప్టర్ రైడ్స్ కూడా బుక్ చేసుకునేలా కొత్త సర్వీస్ ను తీసుకురానుంది. అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో హెలికాప్టర్ రైడ్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉబర్ కంపెనీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ పోర్ట్ నుంచి సిటీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా వీటిని ఉపయోగించొచ్చు. దానికై ప్రత్యేకంగా సిటీలో పలు చోట్ల ఎయిర్ ట్యాక్సీ స్టేషన్లు నిర్మిస్తారు. మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు హెలికాప్టర్ అంటే మనం చూసే పెద్ద పెద్ద చాపర్ లు కావు. ట్యాక్సీ సర్వీస్ కోసం ప్రత్యేకంగా మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు తయారు చేస్తున్నారు. వచ్చే ఏడాది 2026 కల్లా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఉబర్ ప్లాన్ చేస్తుంది. ఈ ఎయిర్ ట్యాక్సీలను జాబీ ఏవియేషన్ అనే కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీతో ఉబెర్ ఒప్పందం కుదుర్చుకుంంది. అయితే ఉబర్ ఇప్పటికే ఇటలీ, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లో హెలికాప్టర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించింది. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సర్వీసుని పలు నగరాల్లో ప్రారంభించే ప్లాన్ లో ఉంది. ఒకవేళ ఇండియాలో అందుబాటులోకి వస్తే.. బెంగళూరు వంటి నగరాల్లో బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

తిరుపతి

శ్రీకాళహస్తి లో గుర్తు తెలియని మృతదేహం

శ్రీకాళహస్తి లోని భక్త కన్నప్ప వంతెన మీద గురువారం గుర్తు తెలియని వ్యక్తి మరణించడం జరిగింది.మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు తెలియజేశారు.మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లేవు.అతని వయసు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చు.

ఆంధ్రప్రదేశ్

ఆకట్టుకునేలా అమరావతి ప్రభుత్వ సముదాయ సూక్ష్మ నమూనా

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ సముదాయ (గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌) సూక్ష్మ నమూనాను ప్రభుత్వం తయారు చేయించింది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వాన కురిసి ఉపశమనం కలిగించిన నెల్లూరు

నెల్లూరులో వర్షాలు కురుస్తుండటంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఇటీవల తాపం పెరిగి, ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. రైతులు సైతం ఈ వర్షాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు ఉపయోగకరంగా మారే ఈ వానలు రైతు బాటను మరింత సులభతరం చేస్తాయని భావిస్తున్నారు. నెల్లూరులోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతోంది. వర్షాల కారణంగా కొన్ని తక్కువ ఎత్తు ప్రాంతాల్లో నీరు నిలిచినప్పటికీ, పెద్దగా అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. ప్రజలు వర్షాలతో ఆనందోత్సాహాలతో హర్షం వ్యక్తం చేస్తూ, ఈ సీజన్‌లో మరింత వానలు పడాలని కోరుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఆటో, టాక్సీ డ్రైవర్లకు శుభవార్త, వాహన మిత్ర రూ.15000 సాయం కోసం eKYC ప్రారంభం

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా శుభవార్త అందించింది. ఈ పథకం ద్వారా ప్రతీ సంవత్సరం ₹15,000 ఆర్థిక సహాయం నేరుగా డ్రైవర్ల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేసిన తర్వాత ఆటో డ్రైవర్లపై ప్రభావం పడింది. ఈ దసరా నుంచి ప్రభుత్వం వాహన మిత్ర అమలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈసారి కొత్త దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నమోదు చేయబడిన లబ్ధిదారులకు eKYC వెరిఫికేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిపుచ్చుకోవచ్చు. గ్రామ లేదా వార్డు సచివాలయంలో eKYC వెరిఫికేషన్ పూర్తి చేస్తే, ఈ సాయం నిర్ధారితంగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ప్రస్తుతం, లబ్ధిదారుల జాబితా GSWS యాప్ లో అందుబాటులో ఉంది. సచివాలయ సిబ్బంది OTP, బయోమెట్రిక్ లేదా Face Authentication ద్వారా eKYC పూర్తి చేస్తారు. eKYC కోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) డ్రైవింగ్ లైసెన్స్ వాహన ఇన్సూరెన్స్ కాపీ బ్యాంక్ పాస్‌బుక్ రేషన్ కార్డు లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే, వారి కుటుంబ సభ్యులు ఈ పత్రాలతో వెళ్లి OTP ద్వారా eKYC పూర్తి చేయవచ్చు. సమస్యలు, పరిష్కారం eKYC ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఏర్పడితే, Logout చేసి మళ్లీ Login కావాల్సి ఉంటుంది. OTP రాకపోతే, ఆధార్ మొబైల్ నంబర్ లింక్ అయిందో చెక్ చేసుకోవాలి. అలాగే, పేర్లలో తేడాలు ఉన్నప్పుడు అదనపు గుర్తింపు పత్రాలు సమర్పించాలి. స్టేటస్ చెక్ చేయడం ఈ పథకం యొక్క స్టేటస్‌ను గ్రామ/వార్డు సచివాలయం లేదా GSWS యాప్ ద్వారా చెక్ చేయవచ్చు. వారు మాత్రమే అర్హులు వాహన మిత్ర పథకం కింద సొంత వాహనం కలిగి, స్వయంగా డ్రైవింగ్ చేస్తున్న వారు మాత్రమే అర్హులు. అంటే, అర్హతను పొందడానికి, వ్యక్తి ఆ వాహనాన్ని స్వయంగా నడపాలి. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు (ఆటోలు లేదా క్యాబ్‌లు) ఉన్నా, కేవలం ఒక వాహనానికి మాత్రమే వర్తిస్తుంది. వాహన యజమాని లేదా డ్రైవర్ వాహనాలు కలిగినప్పుడు, ఈ ఆర్థిక సహాయం ఒక వాహనానికి మాత్రమే లభిస్తుంది. eKYC కోసం ఆధార్ కార్డు, వాహనం RC, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాపీ, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలు అవసరం. లబ్ధిదారు అందుబాటులో లేకపోయినా కుటుంబ సభ్యులు పత్రాలతో వెళ్లి OTP ద్వారా eKYC పూర్తిచేయవచ్చు

ఆంధ్రప్రదేశ్

ఎంత బిజీగా ఉన్నా .. చాన్స్ మాత్రం వదలరు నారా లోకేష్ !

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ నారా లోకేష్ లండన్ లో బిజీగా ఉన్నారు. నవంబర్ లో విశాఖలో నిర్వహించబోయే పార్టనర్ షిప్ సమ్మిట్ కు .. దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు వెళ్లారు. వారితో చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన నుంచి అనూహ్యంగా ఓ ట్వీట్ వచ్చింది. ఓ కంపెనీ ఈ సీఈవోకి.. విశాఖలో ఉన్న వనరులు, మౌలిక సదుపాయాల గురించి వివరిస్తూ.. చేసిన ట్వీట్ అది. లోకేష్ ఉన్న బిజీలో ఆ ట్వీట్ ను అంతగా పట్టించుకోవాల్సిన వాతావరణం ఉండదు. కానీ చిన్న చాన్స్ వదులుకోవడం కూడా లోకేష్ కు ఇష్టం ఉండదు. అందుకే స్పందించారు. బ్లాక్ బక్ అనే కంపెనీ సీఈవో.. బెంగళూరులోని బెల్లందూరులో తమ ఆఫీసు, ఇల్లు ఉందని.. రోడ్లు, ట్రాఫిక్ సమస్యల కారణం ఇక ఎంత మాత్రామూ బెంగళూరు నుంచి ఆపరేట్ చేయలేమని అనుకున్నారు. అదే విషయాన్ని ట్విట్టర్ లో చెప్పారు. నారా లోకేష్ ఈ అవకాశాన్ని వదులుకోవాలనుకోవడం లేదు. బ్లాక్ బక్ యూనికార్న్ స్టార్టప్. యూనికార్న్ విశాఖకు తరలి వస్తే.. స్టార్టప్‌లకు మరింత ఉత్సాహం వస్తుంది. అందుకే.. బ్లాక్ బక్ సీఈవోకు.. ఆహ్వానం ఇచ్చేశారు. విశాఖను సాఫ్ట్ వేర్ సిటీగా మార్చాలనుకుంటున్న లోకేష్.. అక్కడి మౌలికసదుపాయాల్ని , ప్రభుత్వ సహకారాన్ని చూపిస్తూ విస్తృతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. ఆయా కంపెనీలు వస్తాయా రావా అన్న సంగతి పక్కన పెడితే ఇలా మార్కెట్ చేసుకోవడం ద్వారా ఏపీపై పారిశ్రామికవేత్తలలో ఓ మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఎప్పుడైనా తమ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ ఉంటే.. ముందుగా ఏపీనే గుర్తుకు తెచ్చుకుంటారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమము

పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 61 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్,పేట చిరంజీవి,తొట్టంబేడు మండలం ఉపాధ్యక్షులు,తేజ,దినేష్,గంధం శ్రీను,మనీ,నవీన్, కల్లిపూడి వెంకటేష్, చంద్ర,రాజా,కత్తిమని, సుబ్రహ్మణ్యం,కన్నలీ చందు,వీర మహిళలు బత్తెమ్మ,పద్మ, తదితరులు పాల్గొన్నారు.

క్రైమ్

లిక్కర్ స్కామ్‌ మనీ లాండరర్లపై దేశ్యాప్తంగా ED సోదాలు

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ బ్రేకింగ్ : ఏపీ లిక్కర్ స్కామ్‌పై బ్యాక్ గ్రౌండ్‌లో విచారణ చేస్తున్న ఈడీ మనీ లాండరర్లపై ఒక్క సారిగా దాడి చేసింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీలాండరింగ్ మధ్యవర్తులకు సంబంధించిన ఆఫీసులు , ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దాడులు చేశారు. గురువారం హైదరాబాద్, ఢిల్లీ NCR, తమిళనాడు , కర్ణాటకతో సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బినామీ సంస్థలు, షెల్ సంస్థలు, హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా దాదాపు రూ.3,500 కోట్లను మళ్లించారు. ఈ తరలింపుల్లో కీలకంగా వ్యవహరించిన మనీ లాండరర్లను , మధ్యవర్తులను ఈ సోదాలు లక్ష్యంగా చేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న డిస్టిలరీల నుండి ED వాంగ్మూలాలను నమోదు చేసింది. ప్రస్తుతం జైలులో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్ కాసిరెడ్డిని కూడా ప్రశ్నించింది. అక్రమ నిధుల ప్రవాహం , అనుమానిత నేర ఆదాయాన్ని మళ్లించడానికి ఉపయోగించే లాండరింగ్ మార్గాలను ఈడీ గుర్తించింది. 2019 మరియు 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి సరఫరా ఆర్డర్‌లను పొందడానికి 16 మద్యం కంపెనీలు లంచం ఇచ్చాయని సిట్ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీలు రూ. 10,835 కోట్ల విలువైన కాంట్రాక్టులను పొంది కమిషన్లు ఇచ్చాయి. గత YSRCP ప్రభుత్వ హయాంలో, APSBCL రూ. 23,000 కోట్ల విలువైన సరఫరా ఆర్డర్‌లను జారీ చేసింది. వాటిలో 90 శాతం కంటే ఎక్కువ 111 రిజిస్టర్డ్ మద్యం కంపెనీలలో కేవలం 40 కంపెనీలకు మాత్రమే వెళ్ళాయని SIT తెలిపింది. రూ. 3,500 కోట్లకు పైగా లంచాలు బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు , హవాలా ఆపరేటర్ల ద్వారా లంచాలుగా లిక్కర్ స్కామ్ చేసిన వారికి చేరాయి. APSBCL చెల్లింపులు విడుదల చేసిన తర్వాత, డిస్టిలరీలు ముడి పదార్థాల కొనుగోళ్లు , బ్రాండ్ ప్రమోషన్ల ముసుగులో పెద్ద మొత్తాలను మళ్లించాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నిధులను నగదు రూపంలో ఉపసంహరించుకుని కిక్‌బ్యాక్‌లుగా అప్పగించారని ఇప్పటికే ఆధారాలతో సహా వెల్లడించారు. ఇప్పుడు ఈడీ వీటన్నింటినీ ధృవీకరించుకుని సోదాలు నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం!

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ ప్లాస్టిక్ నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించాలని నిర్ణయించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో చెత్తను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతి సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.