అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరపాలని బీఏసీలో నిర్ణయం
సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ సెలవు రోజులు, పనిదినాలపై బీఏసీలో కొనసాగుతున్న కసరత్తు.. సభలో చర్చించేందుకు 18 అంశాలు ప్రతిపాదించిన తెలుగుదేశం
సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ సెలవు రోజులు, పనిదినాలపై బీఏసీలో కొనసాగుతున్న కసరత్తు.. సభలో చర్చించేందుకు 18 అంశాలు ప్రతిపాదించిన తెలుగుదేశం
సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ సినిమా మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెంపు 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు సర్కార్ అనుమతి ఈ నెల 25 తెల్లవారుజామున ఒంటిగంటకు బెనిఫిట్‌షో బెనిఫిట్‌షో టికెట్ ధర రూ.1000
పెద్ద బజార్‌లో గోడ చెక్కేసి వివాదం పెద్ద బజార్, సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి): పెద్ద బజార్‌లో పోర్టు కూల్చే క్రమంలో గోడకు సంబంధించిన వివాదం చోటుచేసుకుంది. వాకాటి వసంతకుమార్ కుమారుడు సురేష్ ఇటీవల ఒక పోర్టును ₹1 కోటి 25 లక్షలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కొనుగోలు చేసిన ఆస్తిని కూల్చివేయడం జరుగుతున్న సమయంలో పక్కింటి గోడ సమస్య తలెత్తింది. స్థానికుల సమాచారం ప్రకారం, సురేష్ వారు కూల్చుతున్న పోర్టు పక్కన ఉన్న ఇంటి యజమానుల గోడ 18 అంగుళాల మందంగా ఉండగా, పనివారు పొరపాటున 16 అంగుళాల మేర గోడ చెక్కేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. పక్కింటి వారు ప్రశ్నించగా, సురేష్ వైపు నుండి “ఏం పీకుతావో పీక్కో, కోర్టుకెళ్తే పో, చూసుకుంటాం” అనే విధంగా మాటల తూటాలు ఎగిరాయి. ఈ మాటలతో పరిస్థితి మరింత వేడెక్కింది. వివాదం తీవ్రమవుతుండడంతో అక్కడికక్కడే పెద్ద ఎత్తున స్థానికులు గుమికూడారు. ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ, పోలీసుల జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇప్పటికే పక్కింటి వారు కోర్టుకు వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించగా, ప్రస్తుతం కోర్టులో కూడా ఈ కేసు నడుస్తోంది. పెద్ద బజార్‌లో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాలు మేరకు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు గురువారం స్టెప్స్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు డ్రగ్స్ వాడకం వలన కలిగే ఇబ్బందులు గురించి IEC ప్రచార రథం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ,స్టెప్స్ ప్రాజెక్ట్ మేనేజర్ భాస్కర్ మరియు హాస్పిటల్ సిబ్బంది మరియు స్టెప్స్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు దీపావళి వేళ డబుల్ బొనాంజో తగలబోతోంది. ఆగస్టులో వచ్చినట్టుగానే ఈ అక్టోబర్‌లో కూడా ఇటు పీఎం కిసాన నిధులు, మరోవైపు కొత్తగా అమలులోకి వచ్చిన అన్నదాత సుఖీభవ నిధులు ఖాతాల్లో జమ కాబోతున్నాయని తెలుస్తోంది. జులైలో ఇవ్వాల్సిన పీఎం కిసాన్ నిధులు నెల ఆలస్యంగా ఆగస్టులో విడుదల చేశారు. అయితే ఈసారి మాత్రం ఆలస్యం చేయకూడదని కేంద్రం భావిస్తోంది. అందుకే అక్టోబర్‌లోనే 21వ విడత పీఎం కిసాన్ స్కీమ్ నిధులు రైతుల ఖాతాల్లో వేయనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పని చేయనుందని తెలుస్తోంది. ఇటు కేంద్రం పీఎం కిసాన్ నిధులతోపాటు, అటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ నిధులు కలుపుకొని ఈ దీపావళి సందర్భంగా ఒక్కో రైతు అకౌంట్‌లో 7వేల రూపాయలు జమ కానున్నాయి. పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ పథకం కలిపి యేటా ఇరవై వేల రూపాయలు రైతులకు లబ్ధి కలగనుంది. రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తే కేంద్రం ఆరు వేలు జమ చేస్తోంది. మొదటి విడతలో ఏడు వేలు జమ చేశారు. ఇప్పుడు రెండో విడతలో మరో ఏడు వేలు జమ చేయనున్నారు. మూడో విడతను ఫిబ్రవరిలో వేసే అవకాశం ఉంది. అప్పుడు ఆరువేల రూపాయలు వేస్తారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన కనకాచలంపై వెలసిన శ్రీ కనక దుర్గాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22 నుండి అక్టోబర్ 1వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా EO అమ్మవారి అలంకరణ రూపాలు ఇలా వుంటాయని వివరించారు. ◆22 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం ◆23న శ్రీ మీనాక్షి దేవి◆24న శ్రీ వైష్ణవి దేవి◆25న శ్రీమహాలక్ష్మి దేవి◆26న శ్రీ అన్నపూర్ణాదేవి◆27న శ్రీ కాత్యాయనీ దేవి◆28న శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి◆29న శ్రీ సరస్వతి దేవి◆30న శ్రీదుర్గాదేవి◆01న శ్రీ మహిషాసుర మర్దిని అలంకారములలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు సర్వీసుల సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రాఘవరావు బుధవారం తెలిపారు. ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు వెళ్లే బస్సు సర్వీసును ఏడు గంటల 30 నిమిషాలకు, ఉదయం ఏడు గంటలకు వెళ్లే బస్సును అర్ధరాత్రి 12 30 నిమిషాలకు హైదరాబాద్కు బయలుదేరేలా మార్పులు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని ఆయన కోరారు.
కర్నూలు జిల్లా MRPS నాయకులు జిల్లా ఇంచార్జ్ సూరి బాబు గారు sc కార్పొరేషన్ నిధులను విడుదల చేయాలని కోడుమూరు మండల తహసిల్దార్ గారికి అర్జీ ఇవడం జరిగిందీ అలాగే MRPS నాయకులు ప్రకాష్ రాజ్ గారు తదితరులు పాల్గొనారు
కర్నూలు జిల్లా MRPS నాయకులు జిల్లా ఇంచార్జ్ సూరి బాబు గారు sc కార్పొరేషన్ నిధులను విడుదల చేయాలని కోడుమూరు మండల తహసిల్దార్ గారికి అర్జీ ఇవడం జరిగిందీ అలాగే MRPS నాయకులు ప్రకాష్ రాజ్ గారు తదితరులు పాల్గొనారు
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు మరియు PDFRDA ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం మరియు పాపా నాయుడు పేట నందు 100 యూనిట్ల పెరటి కోళ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో PDFRDA మాట్లాడుతూ పెరటికోళ్లు అంటే నాటుకోళ్లు,వనరాజ వంటి కోళ్లు అని తక్కువ పెట్టుబడితో కోళ్లను పెంచడం సాంప్రదాయ వ్యవసాయపద్ధతి అన్నారు.పెట్టుబడి పెట్టిన కొద్దికాలంలోనే లాభాలు వస్తాయన్నారు.ఈ కోళ్లు గుడ్లు వల్ల వచ్చే ఆదాయం మనకు చాలా లాభదాయకమన్నార.ఈ కోళ్ల పెంట విలువైన ఎరువుగా మనకు ఉపయోగపడుతుందన్నారు.