Tuesday, 5 May 2026

Blog

క్రైమ్

శబరిమల ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయం

ద్వారపాలకుల విగ్రహాల తాపడం రేకుల్లో భారీ తేడా విజిలెన్స్ విచారణకు ఆదేశించిన కేరళ హైకోర్టు 2019లో మరమ్మతుల సమయంలో వెలుగులోకి ఘటన ఇది తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించిన న్యాయస్థానం ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు తీరుపై అనుమానాలు సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు చెందిన బంగారు తాపడంలో భారీగా బంగారం గల్లంతైన ఘటనపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సుమారు 4.54 కిలోల బంగారం మాయం కావడంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారు తాపడం చేయించేందుకు పాత రాగి రేకులను తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా నమోదైంది. అయితే, పనుల నిమిత్తం చెన్నైలోని ఓ సంస్థకు వాటిని అప్పగించేసరికి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. ఈ రెండు లెక్కల మధ్య దాదాపు 4.54 కిలోల తేడా ఉండటంపై న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. “ఇది చాలా తీవ్రమైన, వివరణ లేని వ్యత్యాసం. దీనిపై కచ్చితంగా లోతైన విచారణ జరగాలి” అని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారంటీతో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, కేవలం ఆరేళ్లకే తాపడంలో లోపాలు తలెత్తడంతో మరమ్మతులు చేపట్టాల్సి వచ్చింది. ఈ వివాదం 2019లో ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు చర్యలతో మొదలైంది. స్పెషల్ కమిషనర్‌కు గానీ, కోర్టుకు గానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వారు ఈ బంగారు రేకులను తొలగించారు. ఓ భక్తుడి ద్వారా వాటిని చెన్నైకి పంపడం కూడా వివాదానికి దారితీసింది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విజిలెన్స్ పరిధిలోకి వెళ్లడంతో, దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

ఖమ్మం

దసరా ఉత్సవాలు ని జయ ప్రదం చేయండి

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరము లొని ద్వారాక నగర్ NST రోడ్డు నందు ఈ నెల 22 నుండి శ్రీ దేవి నవరాత్రులు ప్రారంభం అవుతాయి అని విజయ దుర్గ ఉత్సవ కమిటీ భాద్యులు తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్

గంగమ్మ బ్రిడ్జిని పూర్తి నిర్మాణం చేపట్టాలి

కామారెడ్డి ప్రతినిధి, 18 సెప్టెంబర్, పున్నమి న్యూస్ : గంగామ్మ బ్రిడ్జి సైడ్ వాల్ వద్ద  పక్క గోతి ఏర్పడడం  వల్ల ప్రజలకు ఇబ్బందులు ఉన్నట్లు బీఆర్ఎస్ నాయకులు పత్రిక ముఖంగా మాట్లాడు తూ, కామారెడ్డి జిల్లాలో అనేక బ్రిడ్జిలు, ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, వర్షాలకు, పనుల ఆలస్యం లేదా నాణ్యత లోపాలకు గురవు తూ, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయ ని అన్నారు.రామారెడ్డి ప్రధాన రహాదారి గంగమ్మ బ్రిడ్జి సైడ్ వాల్ కూలడం, ఇది పాదచారులు, ద్విచ క్ర వాహనదారులకు రక్షణ లోపించి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. దీని మూలంగా ప్రజలు అసౌకర్యాన్ని చవిచూస్తున్నారని ఆరోపిం చారు. బ్రిడ్జి వాల్ మట్టి కూలడం వల్ల చిక్కులు, ప్రమాద భయం పెరిగిందన్నారు. వాహన దారులు, కాలిన డక ప్రయాణికులకు రహదారి పొడవునా ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు.వర్షాకాలంలో బ్రిడ్జి ప్రాంతంలో నీటి ప్రవాహం పెరగడం, మరింత ప్రమాదాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఇటువంటి సమస్యలకు సంబంధించి సాధారణంగా గ్రామ పంచాయతీ  అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రహదారి ప్రమా దాలను నివారించేందుకు తాత్కాలిక నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.  తాత్కాలికంగా కనీసం రక్షణ బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పూర్తిగా వాల్ మరమ్మతులు పునర్నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని అన్నారు.  అనుకోని ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల ని అన్నారు. ప్రస్తుతం గంగామ్మ బ్రిడ్జి వంటి వరదనష్టం, వాల్ పెగడం వంటి అసౌకర్యాలు ప్రజ జీవనంపై తక్షణ ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అధికారులు ఎమ్మెల్యే చొరువ తీసుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గంగమ్మ బ్రిడ్జి పూర్తి నిర్మాణం చేపట్టా లని కోరారు. ఈకార్యక్రమంలో నర్సారెడ్డి, ల్యాగల మహిపాల్, తదితరులు పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్

గంగమ్మ బ్రిడ్జిని పూర్తి నిర్మానం చేపట్టాలి

గంగామ్మ బ్రిడ్జి సైడ్ వాల్ వద్ద  పక్క గోతి ఏర్పడడం  వల్ల ప్రజలకు ఇబ్బందులు ఉన్నట్లు బీఆర్ఎస్ నాయకులు పత్రిక ముఖంగా మాట్లాడు తూ, కామారెడ్డి జిల్లాలో అనేక బ్రిడ్జిలు, ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, వర్షాలకు, పనుల ఆలస్యం లేదా నాణ్యత లోపాలకు గురవు తూ, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయ ని అన్నారు.రామారెడ్డి ప్రధాన రహాదారి గంగమ్మ బ్రిడ్జి సైడ్ వాల్ కూలడం, ఇది పాదచారులు, ద్విచ క్ర వాహనదారులకు రక్షణ లోపించి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. దీని మూలంగా ప్రజలు అసౌకర్యాన్ని చవిచూస్తున్నారని ఆరోపిం చారు. బ్రిడ్జి వాల్ మట్టి కూలడం వల్ల చిక్కులు, ప్రమాద భయం పెరిగిందన్నారు. వాహన దారులు, కాలిన డక ప్రయాణికులకు రహదారి పొడవునా ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు.వర్షాకాలంలో బ్రిడ్జి ప్రాంతంలో నీటి ప్రవాహం పెరగడం, మరింత ప్రమాదాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఇటువంటి సమస్యలకు సంబంధించి సాధారణంగా గ్రామ పంచాయతీ  అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రహదారి ప్రమా దాలను నివారించేందుకు తాత్కాలిక నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.  తాత్కాలికంగా కనీసం రక్షణ బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పూర్తిగా వాల్ మరమ్మతులు పునర్నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని అన్నారు.  అనుకోని ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల ని అన్నారు. ప్రస్తుతం గంగామ్మ బ్రిడ్జి వంటి వరదనష్టం, వాల్ పెగడం వంటి అసౌకర్యాలు ప్రజ జీవనంపై తక్షణ ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అధికారులు ఎమ్మెల్యే చొరువ తీసుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గంగమ్మ బ్రిడ్జి పూర్తి నిర్మాణం చేపట్టా లని కోరారు. ఈకార్యక్రమంలో నర్సారెడ్డి, ల్యాగల మహిపాల్, తదితరులు పాల్గొన్నారు. 

తిరుపతి

నారా లోకేష్ ని కలిసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి

అసెంబ్లీ విరామ సమయంలో మంత్రివర్యులు నారా లోకేష్ ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కలిశారు.అనంతరం భారతదేశంలో తొలి శివాలయమైన గుడిమల్లం ఆలయం చరిత్ర గురించి బుక్ లెట్ ను నారా లోకేష్ కి అందించిన ఎమ్మెల్యే బొజ్జల. ఆలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న నారా లోకేష్ తెలిపారు.

E-పేపర్

RTCలో డ్రైవర్ పోస్టులు.. అర్హతలు ఇవే

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి 2 ໕໐໖. ລໍ 5.20,960-60,080円 ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

E-పేపర్

ప్రొద్దుటూరు: CI, SI కొట్టారని డీఎస్పీకి ఫిర్యాదు

ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ వివేకానందనగర్ కాలనీకి చెందిన రామసుబ్బయ్య తనను స్థానిక 2వ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ కొట్టారని ఆరోపించారు. ఈ మేరకు రామసుబ్బయ్య బుధవారం డీఎస్పీ భావనకు పిర్యాదు చేశారు. ఇంటి స్థలం తగాదా విషయంపై తనను స్టేషన్కు పిలిపించి కొట్టారని బాధితుడు ఆరోపించారు. విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్

DSC: అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వాయిదా

AP: DSC అభ్యర్థులకు రేపు అమరావతిలో చేపట్టే నియామకపత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఎందుకు వాయిదా పడిందనే కారణాలను చెప్పలేదు. మరోవైపు జిల్లాల నుంచి అభ్యర్థులు అమరావతికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన బస్సులను అధికారులు క్యాన్సిల్ చేస్తున్నారు. అయితే వర్షాల వల్లే ఆ ప్రోగ్రామ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్

సర్వధర్మాల అవతార పురుషులను పరస్పరం గౌరవించలి కె.తారిఖ్ అహ్మద్

  డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా,పున్నమి న్యూస్,రిపోర్టర్ కిరణ్:ప్రపంచ శాంతి స్థాపన కొరకు అందరిని ప్రేమించు–ఎవ్వరినీ ద్వేషించకు అనే నినాదం ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ నూరుల్ ఇస్లాం శాఖ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా వారు డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పర్యటించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ నూరుల్ ఇస్లాం శాఖ డైరెక్టర్,జాతీయ ప్రెస్ & మీడియా ఇన్చార్జ్ కె.తారిఖ్ అహ్మద్ మాట్లాడుతూ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీని హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ (అ.స) 1889 సంత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని ఖాదియాన్ పట్టణంలో స్థాపించి నేడు ఈ కమ్యూనిటీ 200కు పైగా దేశాలలో వ్యాపించి ధార్మిక యుద్ధాలకు ముగింపు పలికి,రక్తపాతాన్ని ఆపి,సమానత్వం,న్యాయం మరియు మత సామరస్యంతో కూడిన నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తోందన్నారు.ప్రపంచం నేడు చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించడం మన అందరి బాధ్యతన్నారు.అందుకోసం మేధావులు, విద్యావేత్తల సలహాలను తీసుకుని శాంతి, సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు,శాంతి సమ్మేళనాలు,సెమినార్లు,చర్చాగోష్టులు నిర్వహిస్తునన్నారు.సర్వధర్మాల అవతార పురుషులను పరస్పరం గౌరవించినప్పుడే ప్రపంచంలో శాంతి స్థాపించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాలలో జిల్లా ఇన్ఛార్జి ముహమ్మద్ సిరాజ్ అహ్మద్,నూరుల్ ఇస్లాం ప్రజా సంబంధాల ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ముహమ్మద్ జావిద్ అహ్మద్ పాషా, ముహమ్మద్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.  

హెల్త్ టిప్స్

ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీర్ఘకాలంలో దాని వల్ల లాభాలు, నష్టాలు ఏమైనా ఉంటాయా?

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ సమాధానం: బాదం, కాజూ, వాల్‌నట్, పిస్తా, అంజీర్, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ కొద్దిపాటి డ్రై ఫ్రూట్స్ తినడం గుండె ఆరోగ్యానికి మంచిది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియ బాగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాదం, వాల్‌నట్ మెదడు జ్ఞాపకశక్తికి, పిస్తా గుండె ఆరోగ్యానికి, కిస్మిస్ రక్తహీనతకు మేలు చేస్తాయి. కానీ డ్రై ఫ్రూట్స్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా తింటే బరువు పెరుగుదల, కడుపు మంట, జీర్ణక్రియలో ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా కాజూలను అధికంగా తింటే కొవ్వు పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్‌ను పరిమితంగా మాత్రమే వాడాలి. మొత్తానికి రోజుకు 5–7 బాదం, 1–2 వాల్‌నట్స్, 4–5 కిస్మిస్ వంటి పరిమిత మోతాదు సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ శరీరానికి శక్తి, పోషణ ఇస్తాయి కానీ మితిమీరితే సమస్యలు కలిగిస్తాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.