Wednesday, 6 May 2026

Blog

E-పేపర్

వరల్డ్ బాంబు (వెదురు) డే– పచ్చటి బంగారం, మన సంస్కృతి & భవిష్యత్ ఆశయం

వెదురు చెట్టు (Bamboo) అనేది ప్రకృతిచే ప్రసాదించబడిన అద్భుతమైన వనరులలో ఒకటి. “పేదవారి కలప” అని కూడా పిలవబడే వెదురు మన జీవన విధానంలో, సంస్కృతిలో, ఆర్థిక వ్యవస్థలో, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఒక గడ్డి జాతికి చెందిన మొక్క అయినప్పటికీ, పెద్ద చెట్లలా పెరుగుతుంది. వేగంగా ఎదిగే ఈ మొక్క మనిషి అవసరాలకు అనేక రూపాల్లో ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 1200కు పైగా వెదురు జాతులు ఉండగా, భారతదేశంలో సుమారు 140 జాతులు పెరుగుతున్నాయి. వీటిలో ఎక్కువగా ఈశాన్య భారతదేశం, దక్షిణ భారతదేశం, మధ్య భారతదేశం ప్రాంతాల్లో కనిపిస్తాయి. వెదురు ప్రత్యేకతలు వేగంగా ఎదగడం – బాంబూ రోజుకు 30–40 సెంటీమీటర్ల వరకు ఎదగగలదు. కొన్ని జాతులు 24 గంటల్లో ఒక మీటరు వరకూ పెరుగుతాయి. సమృద్ధి వనరు – ఒకసారి నాటితే దశాబ్దాలపాటు పంట ఇస్తుంది. క్లైమేట్ ఫ్రెండ్లీ – గాలి నుండి కార్బన్ డయాక్సైడ్‌ను అధిక మోతాదులో గ్రహించి, ఆక్సిజన్ విడుదల చేస్తుంది. బహుముఖ వినియోగం – ఇల్లు నిర్మాణం, ఫర్నిచర్, సంగీత వాద్యాలు, కాగితం తయారీ, ఆహారం, ఔషధం, ఆధ్యాత్మిక ఆచారాలు మొదలైన రంగాల్లో ఉపయోగం. భారతీయ సంస్కృతిలో వెదురు వెదురును శుభ సూచకంగా భావిస్తారు. వివాహాలు, గృహప్రవేశాలు, పండుగలలో వెదురు లేకుండా జరగవు. దక్షిణ భారతంలో కొబ్బరికాయతో పాటు వెదురు కడ్డీలు కూడా పూజలో ఉపయోగిస్తారు. పాండవులు అరణ్యంలో ఉండగా వెదురు గూటి కట్టుకుని నివసించారని పురాణాల్లో ఉంది. వెదురు బాణసంచా, వాయిద్య పరికరాల్లో (వెదురు వంశీ) కీలక భాగం. వెదురు ఆర్థిక ప్రాధాన్యం ఇళ్లు మరియు నిర్మాణం – గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టడంలో, కంచెల్లో వెదురును విస్తృతంగా వాడతారు. ఫర్నిచర్ – కుర్చీలు, మంచాలు, డైనింగ్ టేబుల్, సోఫాలు మొదలైనవి తయారు చేస్తారు. కాగితం తయారీ – పల్ప్ కోసం విస్తృతంగా వాడే వనరు. కళలు – బొమ్మలు, బుట్టలు, చేతిపనులు వెదురుతో తయారవుతాయి. ఆహారం – వెదురు కొమ్మల తొక్క (Bamboo Shoots) తూర్పు భారతదేశంలో, చైనాలో వంటల్లో వాడతారు. పర్యావరణ ప్రయోజనాలు భూమి కాపాడటం – వేర్లతో నేలను బిగించి మట్టి క్షీణత (Soil Erosion) తగ్గిస్తుంది. నీటి సంరక్షణ – వర్షపు నీటిని నేలలో నిలిపి ఉంచుతుంది. కార్బన్ క్రెడిట్ – ఇతర చెట్లకంటే 35% ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అరణ్య సంపద – జంతువులకు ఆహారం (ఉదా: పాండాలు). ఆరోగ్య & ఔషధ వినియోగం వెదురు ఆకులు, వేర్లలో ఔషధ గుణాలు ఉన్నాయి. వెదురు ఉప్పు, వెదురు సారం (bamboo extract) ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వెదురు తొక్క రసం దగ్గు, జ్వరానికి ఉపశమనంగా వాడతారు. బాంబూ షూట్స్ (తాజా తొక్కలు) – పోషకాహారం, ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియకు మంచివి. ప్రపంచ బాంబూ దినోత్సవం (World Bamboo Day) ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18న ప్రపంచ బాంబూ దినోత్సవం జరుపుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశ్యం: వెదురును “పచ్చటి బంగారం” (Green Gold)గా గుర్తించడం. బాంబూ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం. పర్యావరణ పరిరక్షణలో బాంబూ ప్రాముఖ్యతను తెలియజేయడం. ఆధునిక వినియోగాలు బాంబూ వస్త్రాలు – వెదురు నారతో షర్టులు, చీరలు, తువాలు తయారవుతున్నాయి. బాంబూ సైకిళ్లు – పర్యావరణహితమైన రవాణా సాధనాలు. బాంబూ బాటిల్ & బ్రష్‌లు – ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం. బాంబూ చార్కోల్ – నీరు శుద్ధి చేయడానికి, శరీర డిటాక్స్ కోసం వాడుతున్నారు. వెదురు పరిశ్రమలో అవకాశాలు భారతదేశం “వెదురు వనరుల రెండవ పెద్ద దేశం” అయినప్పటికీ, వాణిజ్యపరంగా ఇంకా వినియోగం తక్కువ. Handicrafts Export – వెదురు కళా వస్తువులు విదేశాల్లో అధిక డిమాండ్. Paper Mills – వెదురు పల్ప్ పరిశ్రమకు కీలకం. Green Buildings – వెదురు ఆధారిత నిర్మాణాలు భవిష్యత్తులో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. వెదురు పంటకు ఇంకా సరైన ప్రోత్సాహం లేని పరిస్థితి. కొన్నిచోట్ల ప్రభుత్వ పరిమితులు. రైతులకు సరైన మార్కెటింగ్ అవకాశాల కొరత. పరిశ్రమల్లో మెషిన్ ఆధారిత సాంకేతికత లోపం. భవిష్యత్ దృశ్యం. వెదురు ఆధారిత ఉత్పత్తులు తయారీ పెరుగుతున్నాయి. పర్యావరణ సంక్షోభానికి సమాధానంగా వెదురు వాడకం పెరుగుతోంది. బాంబూ ఆధారిత జీవనశైలి (eco-friendly lifestyle) భవిష్యత్తులో మరింత ప్రజాదరణ పొందనుంది. వెదురు ఒక సాధారణ మొక్క మాత్రమే కాదు – అది మన పూర్వీకుల సంస్కృతిలో భాగం, పర్యావరణ రక్షకుడు, ఆర్థికాభివృద్ధికి మూలం. “పచ్చటి బంగారం” అని పిలిచే ఈ అద్భుత వనరు మన భవిష్యత్ తరాలకు ఒక వరప్రసాదం.

E-పేపర్

రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రత్యేక ప్రెస్ మీట్ – కాంగ్రెస్ పార్టీ ప్రకటన

ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పార్టీ అధికారం గల వర్గాలు ప్రకటించాయి. ఇందిరా భవన్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంఫీ శ్రీ రాహుల్ గాంధీ గారు మీడియాతో మాట్లాడనున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారనే విషయాన్ని పార్టీ ఇప్పటివరకు వెల్లడించకపోయినా, రాజకీయ వర్గాల్లో కొత్తగా రెండు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే ఒక హై ప్రొఫైల్ లోక్‌సభ నియోజకవర్గంపై “ఓటు చోరీ” ఆరోపణలు బయటపెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రాహుల్ గాంధీ గారి ప్రసంగం అనంతరం తెలియజేయనున్నట్లు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్

గ్రామ ఎంట్రెన్స్ బోర్డును సరి చేయాలి!!

కామారెడ్డి, 18సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి   :  కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం,  ఇసన్నపల్లి గ్రామ ఎంట్రెన్స్ బోర్డు కిందపడి ఉన్నది నాయకు లు  గ్రామస్తులు గాని పట్టించుకునే నాథుడే కరువై నారు గ్రామ ఎంట్రన్స్ బోర్డు తుప్పుపట్టీ కిందపడి ఉన్నది. గ్రామానికి ముఖద్వారంగా ఉండాల్సిన బోర్డు కిందపడి ఉండడం చాల  బాధాకరం. ఇది గ్రామ ప్రతిష్టను తగ్గించే విషయం, నాయకులు గానీ, స్థానిక గ్రామస్తులు గానీ దీనిని పట్టించుకోవ డం లేదు, అనడం చూస్తే పట్టించుకునే నాధుడు లేని గ్రామం అనిపిస్తోంది.స్థానిక పాలక సంస్థలు లేదా, మండల అధికారులు వెంటనే దీనిని పరిశీ లించి బోర్డును సరిచేయాలి.గ్రామ ప్రజలు కలిసి బోర్డును తిరిగి నిలిపే ప్రయత్నం చేయవచ్చు, పంచాయతీ సమావేశాల్లో ఈ విషయాన్ని అధికా రులకు తెలియజేసి వెంటనే చర్యలు తీసుకునేలా చేయాలి.ప్రతి గ్రామస్తుడూ గ్రామ సమ్మర్ధత, శుభ్రత కోసం బాధ్యతగా వ్యవహరించాలి. గ్రామ ప్రవేశం లో బోర్డు సరిగా ఉండడం అనేది ఒక గుర్తింపుతో పాటు, ప్రయాణికులు, కొత్తవారికి దిశానిర్దేశం చేస్తుంది. ఈ సమస్యను గ్రామస్తులు లేవనెత్తారు. అంటే గ్రామ అభివృద్ధిలో ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవడం అవసరమేనని పలువురు చర్చించుకుంటున్నారు. 

E-పేపర్

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డిపో బస్సు కోసం

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డిపో మేనేజర్ గా అభిరామ్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్యపాటి వెంకట రాజు గారు మర్యాదపూర్వకంగా కలిసి ప్రజల సౌకర్యార్థం కొవ్వూరు టు దొండపూడి వయా భీమోలు బస్సును పునరుద్దించాలని కోరారు.

అన్నమయ్య

చిట్వేల్ జడ్పీ హైస్కూల్‌లో ఘోర ప్రమాదం తప్పింది – వర్షానికి ప్రహరీ గోడ కూలిపోవడంతో విద్యార్థులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఘటన

చిట్వేల్ జడ్పీ హైస్కూల్‌లో ఘోర ప్రమాదం తప్పింది – వర్షానికి ప్రహరీ గోడ కూలిపోవడంతో విద్యార్థులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఘటన చిట్వేలి సెప్టెంబర్ 17( పున్నమి ప్రతినిధి) చిట్వేల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం తెల్లవారుజామున పెద్ద ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి పాఠశాల ప్రహరీ గోడలో ఒక భాగం ఆకస్మికంగా కూలిపోయింది. సాధారణంగా ఆ సమయానికి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో పెద్ద శబ్దం రావటంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పాఠశాల సిబ్బందికి సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యార్థుల భద్రత కోసం వెంటనే చర్యలు తీసుకున్నారు. గ్రామస్థులు, తల్లిదండ్రులు సంఘటనను చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రహరీ గోడ మొత్తాన్ని బలపరిచేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.వర్షాలు కొనసాగుతున్న దృష్ట్యా విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. పాఠశాల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తల్లిదండ్రులు పట్టుబడుతున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం జరగకపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

భక్తి

ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకొని కొండపైన ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి అనిత అనంతరం మోడల్ గెస్డ్ హౌస్ లో అధికారులతో సమీక్ష నిర్వహించిన హోం మంత్రి అనిత సమీక్ష లో పాల్గొన్న ఎంపి కేశినేని శివనాధ్ చిన్ని, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, సిపి రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్ సీసీ కెమెరాలు,ట్రాఫిక్,క్యూ లైన్లు,Vip పాస్ లు పై అధికారులతో చర్చించిన హోం మంత్రి అనిత *హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్* దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు 15 లక్షల మంది భక్తులు ఈసారి దసరా ఉత్సవాలకు వస్తారని అంచనా వేస్తున్నాం .అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం గతంలో ఒక్క ఇన్సిడెంట్ లేకుండా దసరా ఉత్సవాలని దిగ్విజయంగా జరిపాం అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తాం మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుస్తోంది. వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం 4,500 మందితో పోలీసులతో బధ్రతా ఏర్పాట్లు చేస్తున్నాం వెయ్యి కి పైగా సిసి కెమేరాలతో పాటు ఐదు డ్రోన్లతో దసరా ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నాం.

ఖమ్మం

పాలేరు నియోజకవర్గం లో పలు అభివృద్ది పనులకి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్) పాలేరు ఖమ్మం జిల్లా పరిధిలో గల పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్శం రెడ్డి శంకుస్థాపన కుస్థాపన చేశారూ తిరుమలాయ పాలెం మండలం లో రూ.1 కోటి 50 లక్షల రూపాయలతో తిరుమలాయపాలెం నుంచి ముల్కలపల్లి బ్రిడ్జి వరకు అప్రోచ్ రోడ్డు మరమ్మతులకు, రూ. 1కోటి 34 లక్షల వ్యయంతో ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లోని రైల్వే కాలనీలో సీసీ రోడ్లు, రూ. 1కోటి 76 లక్షల వ్యయంతో కేకేఆర్ ఫంక్షన్ హాల్ రోడ్డులో అంతర్గత సీసీ రోడ్లు పనులకీ శంకుస్థాపన చేసారు. అలాగే నేలకొండపల్లి మండలం లో రూ.15 లక్షలతో ముఠాపురంలో అంతర్గత సీసీరోడ్లు రూ.20 లక్షలతో రాజేశ్వరపురంలో అంతర్గత సీసీరోడ్లు రూ.15 లక్షలతో కొత్తకొత్తూరులో అంతర్గత సీసీరోడ్లు రూ.4కోట్ల.50లక్షలతో భైరవునిపల్లి గ్రామంలో బీటీ రోడ్ల కు శంకుస్థాపన నేలకొండపల్లి పట్టణంలో రూ. 6కోట్ల50లక్షలతో జంక్షన్ అభివృద్ధి పనులు, సెంట్రల్ లైటింగ్ ని ప్రారంభం చేసారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతి నిధులు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

భక్తి

డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ భక్తి: డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్నారు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. 22న వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి దర్శన కోటా డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌. తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

ఖమ్మం

అవినీతి నిరోధక శాఖ అధికారుల అదుపులో తల్లాడ తహసీల్దార్

పున్నమి ప్రతినిధి ఖమ్మం తల్లాడ మండల కేంద్రం లో గల తహసిల్దార్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ లు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీ ల్లో తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ ఓ రైతు దగ్గర 10, వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వారిని విచారణ నిమిత్తం ఖమ్మం లో గల అవినీతి నిరోధక శాఖ జిల్లా ప్రధాన కార్యాలయం కీ తరలించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అవినీతి అధికారులని అవినీతి నిరోధక శాఖ అధికారులు వల వేసి పట్టుకుంటున్నారని ప్రజలని ఎవరు అయినా ప్రభుత్వఅధికారులు లంచం అడిగితే తమని సం ప్రదించాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు సూచించారూ.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత బకాయిలు వెంటనే చెల్లించాలి

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావలసిన పాత బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. ముఖ్యంగా CPS ఉద్యోగులకు రావలసిన బకాయిలు PRC ,DA ఏరియర్స్ మరియు EL Encashment (ELs) ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం దసరాకు పండుగకు రెండు డి.ఏ లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు ఎన్ క్యాష్మెంట్ కి అప్లై చేసుకొనిదాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే “మెరుగైన PRC తో పాటు పాత బకాయిలు కూడా చెల్లిస్తాం” అని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు ఈ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరాశ కలిగించింది. ఉద్యోగుల న్యాయబద్ధమైన హక్కులను వాయిదా వేయడం తగదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని అన్ని బకాయిలను విడుదల చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జిల్లా పక్షాన ఏపీ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ (ఆప్టా) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షబ్బీర్ హుస్సేన్, షానవాజ్ హుస్సేన్ మాజీంద్రని డిమాండ్ చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.