Wednesday, 6 May 2026

Blog

తెలంగాణ

కేజీబీవీలు, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాల మెరుగుదలపై దృష్టి పెట్టిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని కేజీబీవీ, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాలను పెంచడంపై ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రవేశాలు, అప్లికేషన్లు, ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టం, అమలు వంటి అంశాలను పరిశీలించారు. గత మూడు సంవత్సరాలుగా ప్రవేశాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్చరర్ల కొరతను తీర్చడమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, అందువల్ల అడ్మిషన్ల పెంపుపై ప్రిన్సిపాల్స్ దృష్టి పెట్టాలని సూచించారు. కొన్ని కళాశాలలో ఫలితాలు తక్కువగా ఉన్నాయని గుర్తించిన కలెక్టర్ వాటిని మెరుగుపరచడానికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి బోధించాలన్నారు . విద్యార్థుల హాజరు శాతం పెంపు, అభ్యసన సామర్థ్యల అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యు డైస్ పూర్తి స్థాయిలో నమోదు చేసి,అన్ని ఇంటర్ కళాశాలలో ఫేస్ రికగ్నేషన్ సిస్టం 100% అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ వైద్యాధికారి దశ్రు నాయక్, డీఈవో బిక్షపతి ఆర్సిఓ స్వప్న, బలరాం తదితరులు మాట్లాడారు. వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

తిరుపతి

శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, చోడవరం గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు

సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు. ముందుగా గ్రామస్తులు మాజీ శాసనసభ్యులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉన్నం నిర్మలమ్మ,మండల అధ్యక్షుడు కోగిలి సుబ్రహ్మణ్యం, సర్పంచి ఎం వెంకటరమణారెడ్డి,n రవీంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,ఢిల్లీ బాబు, మణి నాయుడు,s రవీంద్రారెడ్డి,శివారెడ్డి, వంశి, భాను,జగదీష్,సాయి తదితరులు పాల్గొన్నారు.

క్రైమ్

భూ భారతి కాదు! భూ హారతి

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ తన పేరు మీద భూమి పట్టా చేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖమ్మం జిల్లా తల్లాడ మండల ఆఫీసులో కొన్న భూమిని పట్టా చేసేందుకు వ్యక్తి దగ్గర రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మాలోత్ భాస్కర్ రావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్.

క్రైమ్

భూ భారతి కాదు! భూ హారతి

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ తన పేరు మీద భూమి పట్టా చేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖమ్మం జిల్లా తల్లాడ మండల ఆఫీసులో కొన్న భూమిని పట్టా చేసేందుకు వ్యక్తి దగ్గర రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మాలోత్ భాస్కర్ రావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్.

క్రైమ్

వామ్మో సంధ్యారాణి… మామూలు లేడీ కాదు సుమీ… వడ్డీల పేరుతో రూ.300 కోట్లకు కుచ్చుటోపి.. బాధితులంతా పెద్దోళ్లే

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ మోసగాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు..! పావలా ఆశ చూపి పది రూపాయలు టోపీ పెడుతున్నారు..! ఒకడేమో ప్రీలాంచ్ పేరుతో కోట్లు కొల్లగొడతాడు..! ఇంకొకడు పెట్టుబడుల పేరుతో సాంతం దోచేస్తాడు..! ఇలాంటి మోసాలు ప్రతిరోజూ వినిస్తూనే ఉన్నా.. బీ అలర్ట్‌ అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా అత్యాశతో బొక్కాబోర్లా పడుతున్నారు కొందరు. ఇప్పుడు అలాంటి మోసమే మరోటి వెలుగులోకొచ్చింది. సింగిల్‌ లేడీ 300 కోట్లు కొల్లగొట్టడం షాక్‌కు గురిచేస్తోంది. ఈమె పేరు.. సంధ్యారాణి. ప్రముఖులు, అధికారులే ఈమె టార్గెట్. గార్మెంట్‌ కంపెనీలో డబ్బులు పెడితే అధిక వడ్డీలొస్తాయని ఎంతో మందిని బురిడీ కొట్టించింది. దాదాపు 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈమె చేతిలో మోసపోయిన వైజాగ్‌కు చెందిన దొరైరాజు అనే వ్యక్తి.. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘరానా మోసం బయటపడింది. సంధ్యారాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. సంధ్యారాణి బాధితుల లిస్ట్‌లో ప్రముఖులతో పాటు IASలు, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్లు, ఎంతోమంది వస్త్ర వ్యాపారులున్నట్లు తేల్చారు. ఒకే గేటెడ్‌ కమ్యూనిటీలో సంధ్యారాణి 180 కోట్లు కలెక్ట్‌ చేయడం చూసి అధికారులే అవాక్కవుతున్నారు. అంతేకాదు.. GST, TDS ఇన్‌వాయిస్‌లు మార్చి కస్టమర్లను బురిడీ కొట్టించినట్లు తెలిపారు. మోసం బయటకు రాగానే దుబాయ్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేసినట్లు వెల్లడించారు. ఇంటిపేరు మార్చి దుబాయ్‌ రెసిడెంట్‌ కార్డు కూడా పొందినట్లు పోలీసులు తేల్చారు.

సక్సెస్ స్టోరీస్

1948 సెప్టెంబర్ 17.. నిజాం పాలన ముగింపు.. అసలు ఏం జరిగిందో పూసగుచ్చినట్టు

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో విలీనం కాలేదు. 1948, సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ద్వారా హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్లో విలీనం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశంలో 562 సంస్థానాలు ఉండగా, ట్రావెన్కోర్(కేరళ), జునాగఢ్(గుజరాత్), కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు మినహాయించి మిగతావన్నీ భారత యూనియన్లో విలీనం అయ్యాయి. పై సంస్థాలన్నింటిలో హైదరాబాద్ సంస్థానం పెద్దది. 1947, జూన్ 12న నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను సర్వస్వతంత్రుడినని ప్రకటించుకున్నాడు. 1947, ఆగస్టు 13న మరోసారి ప్రకటన చేస్తూ హైదరాబాద్ స్వతంత్ర రాజ్యమని పేర్కొన్నాడు. 1947, నవంబర్ 29న భారత ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం మధ్య ఒక సంవత్సరానికి స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందాన్ని నిజాం ప్రభుత్వం ఉల్లంఘించడంతో భారత ప్రభుత్వం సైనిక చర్యకు ఉపక్రమించింది. ఆనాటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్పై సైనిక దాడి చేయడానికి ఒక వ్యూహాన్ని రచించమని అప్పటి సదరన్ కమాండర్ ఇన్ చీఫ్ ఈఎన్ గొడార్డ్ను ఆదేశించాడు. ఆయన దాడి ప్రణాళికను రూపొందించి పటేల్కు ఇచ్చాడు. ఈ విషయాన్ని పసిగట్టిన నిజాం, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేయడానికి ఒక బృందాన్ని పంపాడు. ఈ బృందానికి అప్పటి హైదరాబాద్ విదేశాంగ మంత్రి మొయిన్ నవాజ్ జంగ్ నాయకత్వం వహించాడు. అంతకుముందు 1948, ఆగస్టు 21న నిజాం ప్రభుత్వం కేబుల్ గ్రామ్ ద్వారా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టికల్ 35 (2) ప్రకారం భద్రతా మండలికి ఫిర్యాదు చేసింది. ఐక్యరాజ్యసమితిలో నిజాం ప్రభుత్వానికి సహకరించడానికి సర్ వాల్టర్ మోంక్టన్ను నియమించారు. భారత ప్రభుత్వం కూడా మద్రాసుకు చెందిన రామస్వామి మొదలియార్ నేతృత్వంలో ఒక ప్రతినిధి వర్గాన్ని పంపించింది. హైదరాబాద్ రాజ్య విలీనాన్ని ఆపడానికి నిజాం వివిధ దేశాల మద్దతు కోరుతూ లేఖలు రాశాడు. బ్రిటీష్ చక్రవర్తి ఆరో జార్జ్, ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీ, ప్రతిపక్ష నాయకుడు విన్స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ట్రూమన్కు నిజాం వ్యక్తిగతంగా లేఖలు రాసి సహాయం అభ్యర్థించాడు. నిజాం చర్యలతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భారతప్రభుత్వం సైనిక చర్యకు ఆదేశాలు ఇచ్చింది. నిజాంకు మద్దతుగా నిలిచే మహమ్మద్ అలీజిన్నా 1948, సెప్టెంబర్ 11న మృతిచెందిన రెండు రోజులకే నిజాం రాజ్యంపైన సైనిక చర్య చేపట్టారు. 1948, సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య కొనసాగిని సైనిక చర్యను ఆపరేషన్ పోలో, ఆపరేషన్ కాటర్ పిల్లర్, గొడార్డ్ ప్లాన్ అని పిలిచారు. ఆపరేషన్ పోలో హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులు, రజాకార్లు కొనసాగిస్తున్న హింస ప్రతిహింసలకు వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో నిర్వహించబోతోందని పాకిస్తాన్ హైకమిషనర్కు, అమెరికా ప్రభుత్వానికి భారత ప్రభుత్వం తెలిపింది. అయితే, హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం సైనిక చర్యను చేపట్టినా దానికి పోలీసు చర్య అని పేరు పెట్టడానికి కారణం ఒక స్వతంత్ర రాజ్యంపై మరో స్వతంత్ర రాజ్యం సైనిక చర్య చేపట్టడం ఐక్యరాజ్యసమితి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. కాబట్టి ఇందుకు సాక్ష్యాలు లేకుండా ఉండటానికి ఆపరేషన్ పోలో సమయంలో సైన్యానికి అయ్యే ఖర్చును విద్యాశాఖ ఖజానాలో జమ చేశారు. ఈ సైనిక చర్యకు పోలీసు చర్య అని సి.రాజగోపాలాచారి పేరు పెట్టారు. దీనినే మిలటరీ భాషలో ఆపరేషన్ పోలో అని పేర్కొన్నారు. ఈ పోలీస్ చర్య సంపూర్ణంగా సదరన్ కమాండ్(దక్షిణ కమాండ్)కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ మహరాజ రాజేంద్రసింగ్ నేతృత్వంలో జరిగింది. నలువైపుల నుంచి దాడి మహరాజ రాజేంద్రసింగ్ సైన్యాన్ని షోలాపూర్- జేఎన్ చౌదరి, విజయవాడ-ఏఏ రుద్ర, బేరార్/ హోస్పేట- శివదత్తుసింగ్, బొంబాయి – డి.ఎస్.ధార్ యూనిట్లుగా విభజించాడు. పుణె ఎయిర్ బేస్ను యుద్ధ విమానాల ద్వారా దాడి చేయడానికి ఉపయోగించారు. ఈ వైమానిక దళానికి ముఖర్జీ నాయకత్వం వహించాడు. 1948, సెప్టెంబర్ 13 తెల్లవారుజామున హైదరాబాద్కు అన్ని వైపుల నుంచి సైనిక దాడులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 13న జె.ఎన్.చౌదరి నాయకత్వంలోని స్ట్రయిక్ ఫోర్స్ లెఫ్టినెంట్ కర్నల్ రామ్ సింగ్ మహారాష్ట్రలోని నల్ దుర్గ్, షోలాపూర్, తామల్వాడి, తుల్జాపూర్లను ఆక్రమించాడు. సెప్టెంబర్ 13న రుద్ర నాయకత్వంలో బోనకల్లును ఆక్రమించారు. సెప్టెంబర్ 14న భారత సైన్యం దౌలతాబాద్, జాల్నా, మనిక్ఖేడ్, కన్నెగావ్లను ఆక్రమించాయి. సెప్టెంబర్ 15న మేజర్ జనరల్ రుద్ర నాయకత్వంలోని సైన్యాలు పాత సూర్యాపేట గ్రామంలోకి ప్రవేశించాయి. సెప్టెంబర్ 16 నాటికి జహీరాబాద్, హింగోలీ, రాయ్చూర్, పర్బనీ, కొప్పల్, మునీరాబాద్ తదితర పట్టణాలన్నీ భారత సేనల వశమయ్యాయి. భారత్కు సహకరించిన ఎడ్రూస్ భారత సైన్యానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించిన నిజాం రాజ్య మిలటరీ కమాండర్ సయ్యద్ అహ్మద్ ఎల్ ఎడ్రూస్ భారత సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయకుండా హైదరాబాద్ నగరానికి తిరిగి రావాలని కింది స్థాయి సైనికాధికారులకు రహస్యంగా ఆదేశాలు పంపించాడు. దీంతో స్వల్ప సమయంలోనే హైదరాబాద్ నగరంలోకి మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలోని సేనలు ప్రవేశించాయి. ఒకవేళ ఎడ్రూస్ అలాంటి పనిచేయకపోతే భారత సైన్యం సెప్టెంబర్ 17లోగా హైదరాబాద్ నగరంలోకి రాలేకపోయేది. దాంతో సెప్టెంబర్ 17 సాయంత్రం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో హైదరాబాద్ అంశం చర్చకు వచ్చి నిజాం రాజ్యం స్వతంత్ర రాజ్యంగా లేదా ఒకప్పటి జమ్మూకాశ్మీర్ లాగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండేది. తన పదవికి రాజీనామా చేసిన నిజాం రాజ్య ప్రధాని మీర్ లాయక్ అలీ సలహా ప్రకారం నిజాం, ప్రధాని కార్యాలయాల్లోని రహస్య పత్రాలన్నింటిని ధ్వంసం చేయించారు. పాకిస్తాన్ లో హైదరాబాద్ ఏజెంట్ జనరల్ ముష్తాఖ్ అహ్మద్ ఖాన్ కు ఆయన ఆఫీసుకు చెందిన మొత్తం డబ్బును తన అకౌంట్ లో జమ చేసుకోమని, లండన్ లోని ఏజెంట్ జనరల్ మీర్ నవాబ్ జంగ్ కు 5000 పౌండ్లు తన అకౌంటులో జమ చేసుకోమని టెలిగ్రామం ద్వారా లాయక్ అలీ వర్తమానం పంపాడు. ఆ తర్వాత వారిద్దరి అకౌంట్ల నుంచి డబ్బును తన పేర జమ చేయాలని కూడా లాయక్ అలీ ఆదేశించాడు. ఆ డబ్బు భవిష్యత్తులో స్వాత్రంత్ర్య పోరాటానికి అవసరమవుతుందని కూడా తెలిపాడు. సెప్టెంబర్ 13న దాడులు ప్రారంభించిన భారత సైన్యం సెప్టెంబర్ 17 నాటికి హైదరాబాద్లోకి ప్రవేశించాయి. దీంతో ఉస్మాన్ అలీఖాన్ 1948, సెప్టెంబర్ 17న సాయంత్రం 5 గంటలకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఉన్న కె.ఎం.మున్షీని కలిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్కు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. సాయంత్రం 7 గంటలకు దక్కన్ రేడియో నుంచి భారత గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి పేరు మీద ప్రకటన చేస్తూ హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగమైందని ప్రకటించాడు. అంతేకాకుండా భారత సైన్యాలను బొల్లారం, సికింద్రాబాద్ లోని సైనిక స్థావరాల్లో ఉండటానికి అనుమతి ఇస్తున్నానని పేర్కొన్నాడు. నిజాం రేడియో ప్రకటనతో సైనిక దాడి నిలిచిపోయి 1948, సెప్టెంబర్ 17న నిజాం పాలన అంతమైంది. సెప్టెంబర్ 18న హైదరాబాద్ సైన్యాధిపతి ఎడ్రూస్ తన మొత్తం సైన్యంతో భారత మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి ఎదుట లొంగిపోయాడు. మిలటరీ నియమాల ప్రకారం హైదరాబాద్ను మొదట చేరుకున్న జనరల్ జె.ఎన్.చౌదరిని హైదరాబాద్ మిలటరీ గవర్నర్గా నియమించారు. సెప్టెంబర్ 18న రజాకార్ల నాయకు డు ఖాసీం రజ్వీని అరెస్టు చేసి తిరుమలగిరిలోని సైనిక కారాగారంలో నిర్బంధించారు. మీర్ లాయక్ అలీని గృహ నిర్బంధం చేశారు. సెప్టెంబర్ 18న హైదరాబాద్ సంస్థానానికి వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికాడు.

జాతీయ అంతర్జాతీయ

ప్రధాని మోదీ బయోపిక్ ప్రకటన

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ “మా వందే” పేరుతో ప్రధాని మోదీ బయోపిక్.. మోదీ పాత్రలో నటించనున్న ఉన్నిముకుందన్.. నిర్మాతగా వీర్ రెడ్డి, దర్శకుడిగా క్రాంతికుమార్.. పలు భాషల్లో విడుదల కానున్న మోదీ బయోపిక్..

జాతీయ అంతర్జాతీయ

నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దారుణాలు: మోదీ

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేశారు. దీంతో నిజాం అకృత్యాల నుంచి సంస్థానానికి విముక్తి లభించింది. దీనికి గుర్తుగా హైదరాబాద్‌ విమోచన దినం నిర్వహిస్తున్నాం. దేశ ఐక్యత కోసం మన సైనికులు అనేక త్యాగాలు చేశారు. అణు ముప్పులకు నవ భారతం భయపడదు అని మోదీ తెలిపారు.

తిరుపతి

వైశ్య కుల గురువులు శ్రీ శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ శ్రీకాళహస్తికి రాక

వైశ్య కుల గురువులు పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ ఫలదీపూర్ (కర్ణాటక) మరియు వారణాసి, వారు బుధవారం శ్రీ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునను సందర్శించారు.వారు బజారు వీధి లోని శ్రీ ఓరుగంటి చెంగయ్య శెట్టి సత్రం నందు అనుగ్రహ భాషణమును ఇచ్చారు.ఈ కార్యక్రమం నందు యావన్మంది శ్రీకాళహస్తి వైశ్యులు పాల్గొన్నారు.అలాగే బజారు వీధి వాసవి ఆలయం దసరా కరపత్రికలను స్వామీజీ వారి అమూల్య హస్తాలతో విడుదల చేయడమైనది.

బిజినెస్

డాలర్‌పై రూపాయి హవా.. భారీ లాభంతో ట్రేడింగ్

డాలర్‌తో పోలిస్తే 23 పైసలు లాభపడిన రూపాయి రెండు వారాల్లో తొలిసారి 88 మార్క్ దిగువన ట్రేడింగ్ భారత్-అమెరికా వాణిజ్య చర్చల సానుకూల ప్రభావం అమెరికాలో మాంద్యం భయాలతో డాలర్ బలహీనం సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై మార్కెట్ దృష్టి అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బుధవారం ట్రేడింగ్‌లో భారీ లాభాలను నమోదు చేసింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానుండటంతో మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొంది. దీనికి తోడు అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటంతో, రూపాయి మారకం విలువ రెండు వారాల్లో తొలిసారిగా 88 మార్కు కంటే దిగువకు చేరింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 23 పైసలు బలపడి 87.82 వద్ద కొనసాగింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి 7 పైసలు లాభపడి 88.09 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు అంతకంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రూపాయి బలపడటానికి అంతర్జాతీయ పరిణామాలు కూడా తోడయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచున ఉందని వస్తున్న వార్తలతో డాలర్ ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడికి గురైంది. ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రధాన ఆర్థికవేత్త మార్క్ జాండీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికాలో ఉద్యోగాలు, ఉత్పాదకత, వ్యయాలకు సంబంధించిన డేటాను బట్టి చూస్తే దేశం మాంద్యం ముంగిట ఉందని ఆయన విశ్లేషించారు. ఈ సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయం కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విశ్లేషకుల అంచనా ప్రకారం, రూపాయికి 88.20 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఒకవేళ రూపాయి 87.90 స్థాయిని దాటి మరింత బలపడితే, 87.50 లేదా 87.20 స్థాయులకు కూడా చేరే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, డాలర్ ఇండెక్స్ 0.11 శాతం పెరిగి 96.73 వద్ద ఉండగా, బ్రెంట్ ముడిచమురు ఫ్యూచర్స్ ట్రేడ్‌లో 0.20 శాతం తగ్గి బ్యారెల్‌కు 68.33 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.