Wednesday, 6 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన శుభలేఖనే అందజేసిన ఆల్ఫా కృష్ణ

మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కుటుంబ సమేతంగా కలిసి తమ కుమారుని వివాహ ఆహ్వాన శుభలేఖని అందజేసిన ఆల్ఫా కృష్ణ దంపతులు మరియు వరుడు కార్తీక్ ఈ సందర్భంగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నూతనంగా వివాహానికి సిద్ధమవుతున్న వధూవరులను ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూదీవెనలను అందజేశారు

తెలంగాణ

తెలంగాణ లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రావాణా సంస్థ లో ఉద్యోగాల భర్తీకీ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1000 మంది డ్రైవర్లు, 743 మంది శ్రామిక్ ల భర్తీకి సంబందించి పోస్టు లు ఉన్నట్లు, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం కోసం అక్టోబర్ 8 నుండి 28 వరకు గడువు విధించారు. మరిన్ని వివరాలు RTC వెబ్ సైట్ లో ఉంటాయి అని నియామక మండలి తెలియజేసింది.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో క్వాంటమ్‌ భవనం.. ఆకృతి సిద్ధం

సెప్టెంబర్ 17 పున్నమి @అమరావతి : అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ఐకానిక్‌ భవనం నమూనా ఖరారైంది. వ్యాలీలోకి ప్రవేశించే ప్రధాన భవనాన్ని ‘అమరావతి ఆకృతి’ని తలపించేలా.. దీనికి ఇరువైపులా నాలుగేసి భారీ టవర్లను ఏర్పాటు చేసేలా ఆకృతులను తీర్చిదిద్దారు.

సత్యసాయి

18 న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి బర్త్ డే సందర్భంగా టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదానం

ఓడి చెరువు సెప్టెంబర్ 17 పున్నమి న్యూస్ : మండలంలో తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీసులో రేపుమాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఓడి చెరువు టిడిపి కార్యాలయం వద్ద గురువారం కేక్ కట్ చేసి ఓడి చెరువు మండల చౌక ధాన్యపు డీలర్లు మరియు టీడీపీ అభిమానుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునుమండలంలోని డీలర్లు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుతున్నాము.

ఆంధ్రప్రదేశ్

మాదాల మంగమ్మ పెదకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

మాదాల కుటుంబానికి సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! దుత్తలూరు సెప్టెంబర్ 17 : (పున్నమి న్యూస్):/// దుత్తలూరు మండలము నర్రవాడ పంచాయతీ ఉలవవారిపాలెం గ్రామంలో మాదాల మంగమ్మ పెదకర్మ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు.మాదాల కుటుంబ సభ్యులతో కలిసి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సంతాపం వ్యక్తం చేసి, మంగమ్మ చిత్రపటమునకు పుష్పాంజలి ఘటించి, వారి మరణం కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు.మంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు,స్థానిక ప్రజలు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం 

స్వచ్ఛతాహి సేవ ఉత్సవ్ లో అందరూ భాగం కావాలి

ప్లాస్టిక్ రహిత జిల్లాగా శ్రీకాకుళం ముందుండాలని, జాయింట్ కలక్టర్ ఫర్మన్ అహమ్మద్ ఖాన్ అన్నారు. మున్సిపల్ కమీషనర్ ప్రసాద్ ఆధ్వర్యంలో మన ఊరు, మన బాధ్యత అనే నినాదంతో స్వచ్ఛతాహి సేవా ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించి, మున్సిపల్ కార్యాలయం నుండి సూర్యమహాల్ కూడలి వరకు ర్యాలీతో కదలి వెళ్లారు. ఇందులో భాగముగా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవా ఉత్సవ్ లో అందరూ భాగం కావాలని, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీ నుండి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత ఉత్సవ్ జరుగుతాయన్నారు. కార్యక్రమంలో భాగముగా ఇటీవలే జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ గా బాధ్యతలందుకున్న లయన్ పొన్నాడ. రవి కుమార్ ను అభినందించి శుభాకాంక్షలని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా.పైడి.సింధూర ఆధ్వర్యంలో జూట్ సంచులను, గుడ్డ సంచులు ను పారిశుధ్య కార్మికులకు అందించి పర్యావరణ పరిరక్షణలో అందరం బాగమవ్వాలని పిలుపునిచ్చారు. స్థానిక శాసనసభ్యులు గొండు.శంకర్ మాట్లాడుతూ కాలుష్యంతో నిండిపోయిన వాతావరణంతో రోగాల బారిన పడుతున్నామన్నామని, ప్రతీ ఒక్కరూ బాధ్యతతో ఆలోచించి ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి చెప్పి, గుడ్డ సంచులను వాడాలని, అవి తొందరగా భూగర్భంలో కలిసిపోతాయని, వీలైనంతవరకు మొక్కలని, వాటి పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ. రవి కుమార్ కు, పలు సూచనలు, సలహాలు అందించి, జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ ప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణంలో మార్పు రావాలంటే, ముందుగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని,అక్టోబర్ 2వ తేదీ నుండి ప్లాస్టిక్ పూర్తిగా వాడకాన్ని నిషేధం చేస్తూ నిర్ణయం తీసున్నామని చెప్పారు.లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ గతంలో కూడా జూట్ సంచులను ప్రజలకు అందించి అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించారని గుర్తుచేశారు. ముఖ్యంగా నగరంలో గల స్వచ్ఛంద సంస్థలు ఒక తాటి పై నడుస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ.రవి కుమార్ కు పూర్తి సహాయ, సహకారాలను అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుదీర్ కుమార్, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు, యువత పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ

ఈవీఎంలపై ఈసీ కీలక నిర్ణయం

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @దిల్లీ ఇక నుంచి ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్‌ ఫొటోలను ఏర్పాటు చేయనుంది. దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (EVM)కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్‌ ఫొటోలను ఏర్పాటు చేయనుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్

ఏపీ లో రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి@ రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం. రేపు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష. సమీక్షకు హాజరైన సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులు.. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట భద్రతపై భేటీలో చర్చ. రేపు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఉభయసభలు.. ప్రశ్నోత్తరాల తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ. శాసనసభ సమావేశాల నిర్వహణపై బీఏసీలో నిర్ణయం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి.

ఐ పోలవరం మండలం కేశనకుర్రు పాలెం గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ గాదిరాజు విశ్వనాథరాజు ఆధ్వర్యంలో విశ్వకర్మ దేవతలకు శిల్పి అయిన విశ్వకర్మ జయంతి నిర్వహించి ఈ సందర్భంగా చేతివృత్తుల వారిని సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు మాట్లాడుతూ విశ్వకర్మ దేవగురువు బృహస్పతి మేనల్లుడు మరియు దేవతలకు శిల్పి చతుర్ముకుడైన విశ్వకర్మ కిరీటాన్ని సువర్ణాభరణాలతో ఎనిమిది చేతులు ఒక చేతిలో నీటి బిందె ఒక చేతిలో పుస్తకం ఒక చేత ఉచ్చు మిగిలిన చేతులలో వివిధ ఆయుధాలను పనిముట్లను కలిగి ఉంటాడు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని బ్రహ్మకు ఘంటాన్ని దేవతలకు పుష్పక విమానాన్ని మహా శక్తికి దివ్య ప్రధాని యమరాజు చేతిలో ఉండే పాశం కర్ణుని కవచకుండలాలు తయారు చేసి ఇచ్చారు విశ్వకర్మ ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించారు ఈరోజు సమాజంలో మనం నిర్వహిస్తున్న ఈ వృత్తులన్నీ విశ్వకర్మ ద్వారా మనకు సంక్రమించినవి చేతి వృత్తుల వలన సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుంది కావున మనమందరం చేతి వృత్తులను ప్రోత్సహించడం వలన మన నాగరికత ప్రతిబింబిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ పెద్దలు సలాది శ్రీనివాసరావు పేరాబత్తుల రామకృష్ణారావు తోటకూర బాబులు రాజు పొత్తూరి సూరిబాబురాజు గుబ్బల సూర్య సత్యనారాయణ రాచకొండ అచ్చిబాబు మామిడాల బాబులు పరమట త్రిమూర్తులు గుర్రాల దనకాసులు నరహరిశెట్టి రాంబాబు సకిరెడ్డి శ్రీనివాసరావు పితాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజేశ్వరి వృద్ధాశ్రమంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..*

* *ఉచితంగా ఔషధాలు పంపిణీ చేసిన బీజేపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.* *హైదరాబాద్:* భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లీ ఫార్మా సహకారంతో ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలోని రాజేశ్వరి వృద్ధాశ్రమంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి గారు వృద్ధులకు ఉచితంగా అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ.. “చంటి పిల్లల నుండి పండు ముసలి వరకు అందరికీ సంక్షేమ పథకాలను అందించిన గొప్పనేత శ్రీ నరేంద్ర మోదీ గారు. ఆయన ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా నిలబెట్టాయి. మోదీ జీవితం మనందరికీ ఆదర్శం. దేశం కోసం ఆయన చేసిన త్యాగం భరతమాతకే గర్వకారణం. మోదీ గారి ముందుచూపు వల్లే ఆపరేషన్ సింధూరం వంటి సైనిక యుద్ధాల్లో ఘన విజయాన్ని సాధించగలిగాము. అదే ముందుచూపుతో కరోనా సమయంలో ప్రపంచానికి భారతదేశమే ఔషధాలను సరఫరా చేసింది” అని అన్నారు. ఆయన పుట్టినరోజును ఆడంబరాలకు కాకుండా, ప్రజా సేవకు అంకితం చేస్తున్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కు శ్రీకారం చుట్టారని.. అంతటి గొప్పనేత మనకు ప్రధానిగా ఉండటం మన అదృష్టం అన్నారు ఏలూరి.. కాగా ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులతోపాటుగా ఐస్‌క్రీం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.