Wednesday, 6 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

మోడీ గారి నాయకత్వంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జలదంకి, సెప్టెంబర్ 17 (పున్నమి న్యూస్) :// జలదంకి మండల కేంద్రంలో భారత ప్రధానమంత్రి గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకలకు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ –మోదీ గారు ఒక దూరదృష్టి గల మహానాయకుడు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలో సత్తా చాటుతూ, శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. ఆర్థిక, సాంకేతిక, రక్షణ, వ్యవసాయం, సంక్షేమం ప్రతి రంగంలో ఆయన చేసిన కృషి అప్రతిహతం” అని అన్నారు.మోడీ గారి ప్రగతిశీల దృక్పథంతో దేశవ్యాప్తంగా అనేక చారిత్రాత్మక పథకాలు అమలవుతున్నాయని ఆయన వివరించారు. వాటిలో ముఖ్యంగా:స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత విప్లవం,ఉజ్వల యోజన ద్వారా కోట్లాది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు,మేక్ ఇన్ ఇండియా ద్వారా పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగావకాశాల సృష్టి,డిజిటల్ ఇండియా ద్వారా సాంకేతికత ప్రతి ఇంటికి చేరవేయడం,జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించడం,ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఉచిత ఆరోగ్య సేవలు,ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఆర్థిక సాయం వంటి అనేక పథకాలు ప్రజలకు నేరుగా మేలు చేకూరుస్తున్నాయని వివరించారు.ఇక రాష్ట్ర అభివృద్ధి పట్ల గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చాతుర్యమైన పాలన, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సహకారం, యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధునిక ఆలోచనలు కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అమూల్యమని తెలిపారు.ఈ జన్మదిన వేడుకలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించగా, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు స్వయంగా పాల్గొని యువతను రక్తదానానికి ప్రోత్సహించారు. అనంతరం మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

జనగాం

చీటీకోడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో గురుపూజోత్సవం

జనగామ, సెప్టెంబరు16,పున్నమి న్యూస్: నేడు గురు శిష్య సంబంధం ఎంతో పవిత్రమైంది, విలువైంది. అనాదిగా భారతీయ సాంస్కృతిక వారసత్వం మనకు విద్య ద్వారానే భావి తరాలకు అందించబడుతున్నది. విద్యను పిల్లలకు అందించే గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు జ్ఞాన స్వరూపునిగా నిత్య విద్యార్థిగా పరిశోధకునిగా విశిష్టతలు మూర్తీభవించిన వ్యక్తి. అట్టి గురువులకు విద్యార్థులు సన్మానం జరుపడం ఈ గురుపూజోత్సవ ప్రత్యేకత అని ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆలేటి రాజారెడ్డి తమ అధ్యక్ష ఉపన్యాసంలో వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయ బృందం శ్రీమతి సుశీల శ్రీ సుందర్ రాజ్ సింగ్, పానుగంటి రామమూర్తి, శ్రీ జి శ్రీనివాస్, శ్రీ నరసింహులు గారలతోపాటు విద్యార్థులు మరియు పేరెంట్స్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్…

మోడీ గారి నాయకత్వంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జలదంకి, సెప్టెంబర్ 17 (పున్నమి న్యూస్) :// జలదంకి మండల కేంద్రంలో భారత ప్రధానమంత్రి గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకలకు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ సురేష్ గారు మాట్లాడుతూ –“మోడీ గారు ఒక దూరదృష్టి గల మహానాయకుడు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలో సత్తా చాటుతూ, శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. ఆర్థిక, సాంకేతిక, రక్షణ, వ్యవసాయం, సంక్షేమం ప్రతి రంగంలో ఆయన చేసిన కృషి అప్రతిహతం” అని అన్నారు.మోడీ గారి ప్రగతిశీల దృక్పథంతో దేశవ్యాప్తంగా అనేక చారిత్రాత్మక పథకాలు అమలవుతున్నాయని ఆయన వివరించారు. వాటిలో ముఖ్యంగా:స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత విప్లవం,ఉజ్వల యోజన ద్వారా కోట్లాది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు,మేక్ ఇన్ ఇండియా ద్వారా పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగావకాశాల సృష్టి,డిజిటల్ ఇండియా ద్వారా సాంకేతికత ప్రతి ఇంటికి చేరవేయడం,జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించడం,ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఉచిత ఆరోగ్య సేవలు,ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఆర్థిక సాయం వంటి అనేక పథకాలు ప్రజలకు నేరుగా మేలు చేకూరుస్తున్నాయని వివరించారు.ఇక రాష్ట్ర అభివృద్ధి పట్ల గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చాతుర్యమైన పాలన, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సహకారం, యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధునిక ఆలోచనలు కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అమూల్యమని తెలిపారు.ఈ జన్మదిన వేడుకలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించగా, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు స్వయంగా పాల్గొని యువతను రక్తదానానికి ప్రోత్సహించారు. అనంతరం మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

ఆంధ్రప్రదేశ్

మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు*

దుత్తలూరు, సెప్టెంబర్ 17:(పున్నమి న్యూస్) :/// దుత్తలూరు మండలం నర్రవాడ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదాల తిమ్మయ్య గారి తల్లి శ్రీమతి మంగమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు,పాల్గొన్నారు.మంగమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వెంకట రామారావు గారు, కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

జనగాం

జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన సీనయర్ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్‌ లో చేరిక

జనగామ, సెప్టెంబరు 17,పున్నమి న్యూస్: ఈరోజు జనగామ మండలం మరిగడి గ్రామంలోని కూరాకుల రమేష్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూరాకుల అబ్బ సాయిలు, కూరాకుల పరుశరాములు, కూరాకుల కృష్ణమూర్తి, కూరాకుల నాగరాజు, కూరాకుల కనకరాజు గార్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన ప్రియతమ నేత జనగామ శాసన సభ్యులు డాక్టర్. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరి గారు,బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఇట్టబోయిన రజిత & శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూరాకుల పెద్దులు, సాంబ రాజ్ శివయ్య, నాగరాజు స్వామి, యార మల్లేష్, ఉత్తేపు అశోకు, పొన్నగంటి చిరంజీవి, ఇట్టబోయిన అశోక్, కూరాకుల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

తొట్టంబేడు మండలం చియ్యవరం గ్రామంలో వేమాలమ్మ అమ్మవారికి మహా కుంభాభిషేకం ముఖ్యఅతిథిగా వత్సల బృందం గారు

*ఈరోజు తొట్టంబేడు మండలంలోని చియ్యవరం గ్రామంలో గ్రామ దేవత వేమలమ్మ తల్లి ఆలయ కుంబాభిషేకంలో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించిన బొజ్జల బృందమ్మ గారు* *తొట్టంబేడు మండలం చోడవరం గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని సారే సమర్పించి గ్రామస్తులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్న బొజ్జల బృందమ్మ గారు*

తిరుపతి

చోడవరం గ్రామ దేవత జాతర వేడుకలో బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం చోడవరం గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ జాతర వేడుకల్లో పాల్గొన్నారు.అనంతరం అమ్మవారికి సారెను సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ మేరకు గ్రామస్తులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు బొజ్జల బృందమ్మ తెలిపారు.

తిరుపతి

సత్యవేడులో ప్రధాని మోడీ 75వ ఘనంగా జన్మదిన వేడుకలు

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలను సత్యవేడు పట్టణంలో మండల అధ్యక్షుడు బాలాజీ ఆధ్వర్యంలో మూడు రోడ్ల కూడలి వద్ద భారీ కేకును ఏర్పాటు చేసి బిజెపి పార్టీ మండల నాయకులు కార్యకర్తలు మధ్యన నరేంద్ర మోడీని కొనియాడుతూ టపాసులు పేల్చి కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ భారత దేశ భవితను మార్చిన ఘనత మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కె దక్కుతుందని భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రపంచంలోనే జిడిపి మూడవ స్థానాన్ని చేరుకునే విధంగా ఆయన కృషి చేస్తున్నారని తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధిలో ముందుకు దూసుకెళుతున్నదని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గించడం, భారతదేశ మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం, చిన్న మధ్యతరగతి పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు యువతను ప్రోత్సహించడం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో సుమారు 21 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఇది ఏ ఒక్క రాష్ట్రానికి కాదు మొత్తం 29 రాష్ట్రాలకు సంక్షేమ పథకాలు అమలయ్యేలా చేస్తున్న ఈ ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కె ఘనత దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు బండారు మోహన్ బాబు నెల్లూరు వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి నరేంద్ర రెడ్డి శ్రీకాంత్ కుమార్, కార్యదర్శులు రవి, రాజా శెట్టి, యువ మోర్చా పార్థసారథి, గిరిధర్, సోషల్ మీడియా భువనేష్ తదితరులు ఉన్నారు

తెలంగాణ

గ్రంథాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన : గ్రంథపాలకుడు

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా నకిరేకల్ శాఖ గ్రంథాలయంలో సెప్టెంబర్ 17న నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన సందర్భంగా జాతీయ పతాకాన్ని గ్రంథపాలకుడు రవికుమార్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లైబ్రేరియన్ కాటేపల్లి శ్రీరాములు, రిటైర్డ్ ఆఫీస్ సబార్డినేట్ వంటపాక నర్సయ్య , ఊట్కూరి బిక్షం, రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టుమాన్ గణేష్, గ్రంధాలయ సిబ్బంది మరియు గ్రంథపాఠకులు పాల్గొని విజయవంతం చేశారు.

తూర్పు గోదావరి

కుమారదేవం లో దేవి నవరాత్రి మహోత్సవ మండపానికి అంకురార్పణ ..

పున్నమి ప్రతినిధి ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్17) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం గ్రామంలో వాటర్ ట్యాంక్ వీధిలో విజయదుర్గ అమ్మవారి 14వ వార్షికోత్సవ మహోత్సవానికి మండపం వేయుటకు పందిరి రాట పాతి అంకురార్పణ గావించారు, ఈకార్యక్రమానికి కులమతాలకు అతీతంగా పాల్గొని అమావారి శరన్నవరాత్రి కార్యక్రమాలను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.