Wednesday, 6 May 2026

Blog

తెలంగాణ

ప్రజా సంక్షేమమే ధ్యేయమన్న : మంత్రి

నకిరేకల్ :సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 17 న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి అన్నారు.

E-పేపర్

అధిక యూరియా వాడకంపై అవగాహన

చేజర్ల సెప్టెంబరు పున్నమి ప్రతినిధి చేజర్ల మండలం చిత్తలూరు, నేర్నూరు గ్రామాలలో అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మండల వ్యవసాయ అధికారి హిమ బిందు మాట్లాడుతూ అధికంగా యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా పోతాయి. నీటి మరియు నేల కాలుష్యం అధికమవుతుంది. పైరు ఎపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు, తెగులు మందులు అధికంగా వాడవలసి వస్తుందని తెలియజేశారు.అంతే కాకుండా వేసిన పంట పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడుతూ భూమి లేని కౌలు రైతులు సిసిఎస్ కార్డు పొందడం వలన ప్రభుత్వ పథకాల రాయితీని పొందవచ్చునని తెలిపారు. అందువలన కౌలు రైతులు తప్పనిసరిగా సిసిఆర్సి కార్డు పొందాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమం లో విఎఎలు నాగభూషణం, ఝాన్సీ మరియు రైతులు పాల్గొన్నారు

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం దర్శన వేళల్లో మార్పులు

శ్రీకాళహస్తి ముక్కంటి దేవస్థానంలో ఈఓ బాపిరెడ్డి దళారుల ప్రమేయాన్ని తగ్గించడానికి అంతరాలయం దర్శనానికి గతంలో 500 రూపాయల టిక్కెట్ వెల నిర్ణయించారు.ఉదయం 6 నుండి రాత్రి 8గంటల వరకు ఉన్న సమయ వెళలను స్పల్ప మార్పులు చేశారు.అవి మంగళవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 6 నుండి రాత్రి 8 వరకు, సోమ శని వారాలలో మధ్యాహ్నం 1 నుండి రాత్రి 8 గంటల వరకు వుంటాయని,అయితే ఆదివారం మాత్రం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతరాలయం దర్శనానికి అనుమతి ఉంటుందన్నారు.

తిరుపతి

మోడీ జన్మదినాన అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ అమరజ్యోతి కళ్యాణమండపం వద్ద బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బిజెపి తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా ఉపాధ్యక్షురాలు ఉమా సింగ్,గరికపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం నుద్దేశించి డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ,నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది.ప్రధాని చేపట్టిన సంక్షేమ పథకాలు కోట్లాది ప్రజల జీవితాలను మార్చాయి అని కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్

ఉన్నత విద్యకు వడ్డీలేని రుణం.. అన్ని వర్గాల వారికీ వర్తింపు

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీలేని రుణాలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు. దీనిని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పావలా వడ్డీ ఋణ పథకానికి అనుసంధానం చేస్తామన్న చంద్రబాబు గారు. ఈ లోన్ కు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదన్న చంద్రబాబు గారు. 14 సంవత్సరాల కాలపరిమితి లో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్న CM చంద్రబాబు గారు. విద్యార్థుల పై వడ్డీ భారం పడకుండా పావలా వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్న CM చంద్రబాబు గార

ఆంధ్రప్రదేశ్

RERA’ చైర్మన్ గా శివారెడ్డి నియామకం

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి@అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రెరా చైర్మన్ గా అమరావతి పరిరక్షణా సమితి కన్వీనర్గా పని చేసిన ఏ.శివారెడ్డిని నియమించారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి మరో ముగ్గురు సభ్యులను కూడా త్వరలోనే ఎన్నుకోనున్నారు.

యాదాద్రి భువనగిరి

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా (పున్నమి ప్రతినిధి) భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య గారు విద్యార్థులను ఉద్దేశించి 1947 ఆగస్టు 15 న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతట స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు అదృష్టం లేకుండా పోయింది తర్వాత 1948 సెప్టెంబర్ 17 న నిజాం నవాబు లొంగి పోవడం వల్ల హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం వచ్చిందని తెలియజేశారు. విద్యార్థుల వ్యాసరచన పోటీలు, ఉపన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి…

ఆంధ్రప్రదేశ్

పీఎం ఆవాస్‌ యోజన అర్బన్‌ 2.0 కింద 40,410 గృహాలు మంజూరు

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ రూ.2.50 లక్షల చొప్పున యూనిట్‌ వ్యయంతో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు గృహాలు నిర్మించాలని ఆదేశాలు. రూ.1,010 కోట్ల వ్యయంతో PMAY ఇళ్లు నిర్మించాలని ఆదేశం. తదుపరి చర్యలు తీసుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి ఆదేశాలు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో “దీపం-2” పథకంతో పెరిగిన సిలిండర్ల వినియోగం

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి@ ఏపీలో ‘దీపం-2′ పథకాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సగటు వినియోగం పెరిగిందని పౌరసరఫరాల శాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. రూ.1,554 కోట్ల వ్యయంతో 1.4 కోట్ల మందికి ఉచితంగా సిలిండర్లు ఇచ్చామన్నారు. మూడో విడత కింద 65 లక్షల మందికి ఇప్పటివరకు సిలిండర్లు అందజేశామన్నారు. మొదటి విడతలో 2 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ కాని సమస్య ఉత్పన్నమైందని, ఆ సమస్యను మూడో విడతలో 35 వేలకే పరిమితం చేశామని సౌరబ్ గౌర్ తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ: నివేదిక

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ: నివేదిక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71% జనామోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచినట్లు మార్నింగ్ కన్సల్ట్ సర్వే నివేదిక పేర్కొంది. ఆయన తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ (59%), ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ అల్బనీస్ (55%) ఉన్నారు. టాప్-10లో కెనడా, అర్జెంటీనా, మెక్సికో, స్విట్జర్లాండ్, అమెరికా (డోనాల్డ్ ట్రంప్), పోలాండ్, బ్రెజిల్ దేశాల నాయకులు స్థానాన్ని దక్కించుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.