Wednesday, 6 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన సత్కారం

అప్పన్న చందన ప్రసాదం.. కర్పూర చందనపుమాలతో సన్మానం జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం అప్పన్న భూ సమస్యను పరిష్కరించండి నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుధవారం విశాఖ విమానాశ్రయంలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,డాక్ యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు ఘనంగా సత్కరించారు. సింహాద్రి నాథుడు చందన ప్రసాదంతో పాటు చందనకర్పూర మాలను అందించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న 11 సమస్యలపై ముఖ్యమంత్రి కి వినతిపత్రం సమర్పించారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రిడేషన్ జీవోలో సడలింపులు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని ఇలా 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గంట్ల శ్రీనుబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆయా వినతలను స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు గంట్ల శ్రీను బాబు చెప్పారు.. వీలైనంత త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అవకాశం ఉందని అందుకు తగ్గ చర్యలు వేగవంతం చేయాలని కోరినట్లు శ్రీను బాబు తెలియజేశారు. అలాగే అప్పన్న భూ సమస్యను పరిష్కరించాలని కూడా వినతిపత్రం అందజేశారు

E-పేపర్

జమ్మలమడుగు: శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

జమ్మలమడుగు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం దసరా శరన్నవరాత్రుల సంబంధించి ఆహ్వాన పత్రికను ఆర్యవైశ్యసభఅధ్యక్షుడు మల్లెంకొండు సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రులు ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి వెంగయ్య వాసవి క్లబ్ అధ్యక్షులు శరణా వెంకట కిషోర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన దిగుబడులు రావేపూ విద్యార్థులు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 17 బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఆయా సీజన్లో రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించినట్లయితే పంటల నాణ్యత అధిక దిగుబడులను పొందవచ్చని రావే విద్యార్థులు సూచించారు. సేంద్రియ వ్యవసాయంతో వేప నూనె కషాయంతో పంటలపై ఆశించే తెగుళ్లు కీటకాలను నిర్మూలించే వేలింటుందని ఈ విధానంతో రైతుల ఆర్థిక భారం కాకుండా తగ్గుతుందని అందుబాటులో లభించే వేపాకులతో వేప కషాయాన్ని కృత్రిమంగా తయారు చేసుకొని పంటలపై పిచికారి చేసుకునే విధానం గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో కీర్తి మానస స్వాతి మంజుల శ్రీజ పూజిత అంకిత గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.సం కృష్ణారెడ్డి మేకల మాసయ్య కథలు పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

అధ్యాయన యాత్రకు వెళ్లిన కార్పొరేటర్ల బృందం వివరాలు రోజు మీడియాకి విడుదల చెయ్యాలి : ప్రియాంక దండి

ప్రజా ధనంతో జీవీఎంసీ కార్పొరేటర్ల బృందం అధ్యాయన యాత్రకు జైపూర్ మరియు ఇతర ప్రాంతాలకు వెళ్లారని ఇంకో 6,7 నెలల్లో జీవీఎంసీ పాలన సమయం ముగుస్తున్న తరుణంలో ఇప్పుడు అధ్యాయన యాత్ర చేపట్టడంలో అర్ధం లేదని, నగరంలో చాలా సమస్యలకు ఈ 6,7 నెలల్లో కృషి చేయవచ్చని ప్రజా ధనం దుర్వినియోగం చేయడానికి తప్పా ఈ యాత్ర వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి విమర్శించారు. కొద్ది నెలల క్రితం ఇదే కార్పొరేటర్ల బృందం అధ్యాయన యాత్రకు వెళ్లారని కాని ఏం అధ్యాయనం చేసారు, ఏం అమలు చేసారో చెప్పలేదు, కాని కొందరు కార్పొరేటర్లు మద్యం తాగుతూ నృత్యం చేసిన వీడియోలు భయటకి వచ్చాయని, ప్రజా ధనంతో జల్సాలు చేయడానికి సిగ్గుగా లేదా అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ అధ్యాయన యాత్రకు వెళ్లారు, మీరు ఏం అధ్యాయనం చేస్తున్నారో ప్రతి రోజు ఫోటోలు, వివరాలు మీడియాకు విడుదల చేయాలని ప్రియాంక డిమాండ్ చేసారు.

తిరుపతి

విద్యార్థుల అవస్థలు

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో RTC బస్సులు సమయానికి రాక వచ్చిన ఫ్రీ బస్సు ఎఫెక్ట వలననో బస్సులు ఆపకుండా వెళ్ళిపోతున్నాయి. దీంతో విద్యార్థిని విద్యార్థులు సమయానికి స్కూల్ కి, కాలేజీలకు వెళ్లలేక చాలా అవస్థలు పడుతున్నారు.దీనిపై సంబంధిత అధికారులు నాయకులు చోరవ తీసుకుని విద్యార్థిని విద్యార్థులకు సమయానికి బస్సులు నిలిపేలా,లేక విద్యార్థులకు అదనపు బస్సులు వేయించడం కొరకు చోరవ తీసుకోవాలని విద్యార్థులు మరియు విద్యార్థిని తల్లిదండ్రులు,ప్రయాణికులు కోరుతున్నారు.

తిరుపతి

విధ్యార్ధుల అవస్థలు

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో RTC బస్సులు సమయానికి రాక వచ్చిన ఫ్రీ బస్సు ఎఫెక్ట వలననో బస్సులు ఆపకుండా వెళ్ళిపోతున్నాయి. దీంతో విద్యార్థిని విద్యార్థులు సమయానికి స్కూల్ కి, కాలేజీలకు వెళ్లలేక చాలా అవస్థలు పడుతున్నారు.దీనిపై సంబంధిత అధికారులు నాయకులు చోరవ తీసుకుని విద్యార్థిని విద్యార్థులకు సమయానికి బస్సులు నిలిపేలా,లేక విద్యార్థులకు అదనపు బస్సులు వేయించడం కొరకు చోరవ తీసుకోవాలని విద్యార్థులు మరియు విద్యార్థిని తల్లిదండ్రులు,ప్రయాణికులు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

విశాఖకు సీఎం చంద్రబాబు

స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్, జీసీసీ బిజినెస్ సమ్మిట్ కార్యక్రమాల్లో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం 11.35 గంటలకు విశాఖ చేరుకుంటారు. మహిళా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ పేరుతో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆంధ్రా యూనివర్శిటీలోని సాగరికా ఫంక్షన్ హాల్లో హెల్త్ క్యాంపులను సీఎం సందర్శించనున్నారు. ఆ తర్వాత 12 గంటలకు ఆంధ్రా యూనివర్శిటీ కన్వెన్షన్ సెంటర్లో ప్రధాని మోదీ వర్చువలుగా ప్రారంభించే స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ సభలో సీఎం పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు రాడిసన్ బ్లూ హోటల్లో గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బిజినెస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అక్కడే నెదర్లాండ్స్, ఫ్రెంచ్ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందంతో చంద్రబాబు విడివిడిగా భేటీ అవుతారు. రాత్రి 07.40 గంటలకు విశాఖ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి బయలుదేరతారు.

ఆంధ్రప్రదేశ్

జీవీఎంసీలో ఘనంగా దుర్గమ్మ వార్షిక వేడుకలు

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కొలువైన శ్రీశ్రీశ్రీ దుర్గా అమ్మవారి వార్షిక మహోత్సవ వేడుకలు జీవీఎంసీ ఉద్యోగులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో బాణాసంచాలు, గరిడీ, వాయిద్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు, ఉద్యోగులు అమ్మవారికి ధూప దీపాలతో పాటు నైవేద్యం సమర్పించి వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో జీవీఎంసీ ఆలయ కమిటీ సభ్యులైన ఓమ్మి సురేష్, జగన్, రాజేష్, ప్రకాష్, భాస్కర్, అప్పలరాజు, వాసు, రాజ్ గణేష్, ప్రశాంతి తదితర ఇతర జీవీఎంసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

గవర్నమెంట్ విజువల్య్ హ్యాండీక్యాప్డ్ స్కూల్ విద్యార్థిని పి కరుణ ప్రపంచ క్రికెట్ కప్‌లో ఎంపిక!

సాగర్ నగర్‌లోని గవర్నమెంట్ విజువల్య్ హ్యాండీక్యాప్డ్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కుమారి పి.కరుణ భారతదేశం నుండి మొదటిసారిగా ప్రపంచ క్రికెట్ జట్టులోకి ఎంపికైంది. ప్రపంచంలోనే తొలిసారిగా బాలికల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ఆడబోతోంది. గతంలో, బ్లైండ్ బాలుర క్రికెట్ జట్టు ఉండేది, కానీ ఇప్పుడు మహిళా బ్లైండ్ గర్ల్స్ క్రికెట్ జట్టు మొదటిసారి క్రికెట్ ఆడనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన కుమారి కరుణ భారతదేశం నుండి పదహారు మంది బాలికల జట్టులో ఎంపికైనందుకు నగరంలోని వేలాది మంది ఆమెను అభినందించారు.  గత ముప్పై ఐదు సం.లు గా, నగర పారిశ్రామికవేత్త మరియు సామాజిక కార్యకర్త శ్రీ కమల్ బైద్ సహకారం పాఠశాల అభివృద్ధిలో కొనసాగుతోంది. రాబోయే నవంబర్‌లో నేపాల్‌లో జరగనున్న ప్రపంచ కప్‌లో, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్ మరియు నేపాల్ నుండి మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. మంగళవారం, సాగర్ నగర్ గవర్నమెంట్ విజువల్య్ హ్యాండీక్యాప్డ్ స్కూల్లో కమల్ బైద్ కుమారి కరుణను హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా, రోటేరియన్లు జిఎస్ రాజు, రామకృష్ణ, ప్రిన్సిపాల్ విజయ, మాజీ ప్రిన్సిపాల్ ప్రకాష్ రావు తదితర ప్రముఖులు పాల్గొనికరుణకు శుభాభినందనలనుతెలియజేసారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.