Wednesday, 6 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

పర్యావరణ శాస్త్ర విభాగంలో అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం

ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యావరణ శాస్త్ర విభాగంలో అక్టోబర్ 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, పర్యావరణ శాస్త్ర విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఎంపవరింగ్ ఎన్విరాన్మెంటల్ స్టీవార్డ్ షిప్ (ఇఇఎస్-2025) అంశంపై నిర్వహిస్తున్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, పర్యావరణ శాస్త్ర విభాగాధిపతి ఆచార్య పి. సుభాషిని దేవి, బిఓఎస్ చైర్మన్ ఆచార్య కె. వీరభద్రం, విభాగ విశ్రాంత ఆచార్యులు ఏ.జె సాల్మన్ రాజు, ఆచార్య బి. హేమ శైలజ, ఆచార్య డి. విజయ్ కుమార్, సి. హెచ్.వి రమణ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విశాఖలో ఘన స్వాగతం

పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, నేతలు, అధికారులు విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు స్థానిక నేతలు, అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. విమానంలో మంగళవారం రాత్రి 9.00 గంటలకు ఆమె విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పి.వి. ఎన్. మాధవ్, విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహం, జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ఇతర నేతలు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గం ద్వారా స్థానిక ర్యాడిసన్ బ్లూ రిసార్ట్ కు చేరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్

చింతలమోరి లో ప్రధాని మోడీ పుట్టిన రోజు వేడుకలు

పున్నమి న్యూస్…జర్నలిస్ట్ రమణ: మలికిపురం మండలం చింతలమోరి గ్రామంలో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ కుమార్ పాల్గొన్నారు. వారు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి, నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం, పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు.

తిరుపతి

PACS కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారమహోత్సవంలో కోలా ఆనంద్

మంగళవారం శ్రీకాళహస్తి మండలం కాపు గున్నేరి PACS చైర్మన్ వంకాయల పాటి బత్తిరెడ్డి,డైరెక్టర్ కూనాటి నాగరాజు,సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నారు.అనంతరం చైర్మన్ మరియు సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలంగాణ

భూ సమస్యలకు పరిష్కారాలు చూపాలన్న :మంత్రి

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) తిరుమలగిరి మండలం లో కొత్తగా 4000 మందికి, భూపట్టాల సర్వేలో 3000 మంది అనర్హులు గుర్తింపు. పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్నా భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలని రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం నాడు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భూ సమస్యలపై అటవీశాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖతో కలిసి మంత్రి గారు సమావేశం నిర్వహించారు.

తిరుపతి

మనసుకు దాసుడు మానవుడు మనసును జయించేవాడు మాధవడు.

శ్రీకాళహస్తిలో శుక బ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాశీ వన క్షేత్రం పీఠాధిపతి శ్రీ యోగిని చంద్రకాళీ ప్రసాద మాతాజీ అనంఘబాషణం చేస్తూ గురువు దైవంతో సమానమని,గురు సారధ్యంలో సాధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో సన్మార్గం లో సాగి మోక్షమార్గాన్ని పొందాలన్నారు.మనసుకు దాసోహం అయ్యేవాడు మానవుడు,మనస్సు ను జయించే వాడే మాధవుడని, మనస్సును జయించిన మహాత్ములే గురువులని, గురువులే మాధవుల ప్రతిరూపమని గురువు ఎడల భక్తి భయంతో ఉంటూ భక్తి యోగం సాధన ద్వారా ముక్తి యోగం పొందాలని మాతాజీ సూచించారు.ప్రవచనాలు ముగింపు సందర్భంగా శుక బ్రహ్మ ఆశ్రమం తరఫున ఆశ్రమ పీఠాధిపతులు శ్రీవిద్యా స్వరూపానందగిరి స్వామి యోగిని చంద్రకాళీ ప్రసాద మాతాజీని ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు అందజేశారు.

తిరుపతి

దేవాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి:బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న దేవాలయమును శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సందర్శించారు.అంతరరం ఆమె అధికారులతో మాట్లాడి త్వరగా పనులు పూర్తి చేసి ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని సూచించిన బొజ్జల బృందమ్మ మరియు బొజ్జల రిషిత రెడ్డి .

ఆంధ్రప్రదేశ్ కామారెడ్డి తెలంగాణ

విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి

మంగళవారం జిల్లా కలెక్టర్ గాంధారి మండలంలోని గర్గుల్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి వంటగదిలో మధ్యాహ్నం భోజనం కోసం వండుతున్న ఆహారాన్ని పరిశీలించారు.అనంతరం ఐదో తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా నైపుణ్యాలను పరిశీలించి నోట్ బుక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు ఇంకా కురుస్తున్నందున పాఠశాల పరిసరాలు మరియు వంటగదిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ మెనూ ప్రకారం వండి వేడివేడి ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు జీవితంలో ఉపయోగపడేలా ఇప్పటి నుండే విద్య నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఈవో రాజు, స్థానిక ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పిన్నింటిపేటలో ఉచిత కంటి శిబిరం

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా, శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారి సహకారంతో, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జోన్ శ్రీ సత్యసాయి సేవా సమితి – పిన్నింటిపేట ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి శిబిరం నిర్వహించబడింది. 200 మందికి కంటి పరీక్షలు జరగగా, 90 మందిని ఆపరేషన్‌కు రిఫర్ చేశారు.ఈ సేవా కార్యక్రమంలో సమితి కన్వీనర్ పొట్నూరు రత్నాకర్ రావు గారు, సభ్యులు, బాల వికాస్ గురువులు, సాయి భక్తులు పాల్గొన్నారు. సమితి తరపున భవిష్యత్తులో జరిగే ఉచిత వైద్య శిబిరాలకు ప్రజలు మరింతగా పాల్గొని లబ్ధి పొందాలని కోరారు.#ఉచితకంటిశిబిరం #శ్రీసత్యసాయిసేవాసమితి #Srikakulam #Narasannapeta

తెలంగాణ

హైదరాబాద్ కీ చేరుకున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్

పున్నమి ప్రతి నిధి హైదరాబాద్ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం లో పాల్గొనేందు కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానం లో బేగం పేట విమానాశ్రయం లో దిగిన ఆయనకి బీజేపీ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రేపు ఉదయం 8.30 నిముషాలకీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అయన పాల్గొంటారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.