Wednesday, 6 May 2026

Blog

అన్నమయ్య

కొత్తపల్లి శ్రీ మాతమ్మ గుడి విగ్రహం–పిల్లర్స్ నిర్మాణానికి ₹50,000 విరాళం అందించిన ముక్కా వరలక్ష్మి

-కొత్తపల్లి శ్రీ మాతమ్మ తల్లి గుడి అమ్మవారి విగ్రహానికి మరియు పిల్లర్స్ నిర్మాణానికి 50 వేల రూపాయల విరాళాన్ని అందించిన ముక్కా వరలక్ష్మి -శ్రీ మాతమ్మ అమ్మవారి విగ్రహ మరియు గుడి పిల్లర్స్ నిర్మాణానికి ₹50,000/- ఇచ్చిన ముక్కా వరలక్ష్మి ఓబులువారిపల్లి సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి) ఓబులువారిపల్లి మండలం, కొత్తపల్లి అరుంధతి వాడకు చెందిన శ్రీ మాతమ్మ తల్లి విగ్రహం మరియు గుడి ఫిల్లర్స్ కోసం ₹50,000/- రూపాయల తన సొంత నిధుల నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి అందించారు.ముక్కా వరలక్ష్మి గారు మాట్లాడుతూ –“ప్రతి గ్రామంలోని సాంప్రదాయ, ఆధ్యాత్మిక విలువలను కాపాడడం, సమర్థంగా ఎదుగుటలో సహాయం చేయడం ముఖ్యమైన కర్తవ్యం. ఈ సహాయం ద్వారా గుడి మరింత అద్భుతంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నేతలు,స్థానికులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

అన్నమయ్య

కొత్తపల్లి శ్రీ మాతమ్మ గుడి విగ్రహం–పిల్లర్స్ నిర్మాణానికి ₹50,000 విరాళం అందించిన ముక్కా వరలక్ష్మి

-కొత్తపల్లి శ్రీ మాతమ్మ తల్లి గుడి అమ్మవారి విగ్రహానికి మరియు పిల్లర్స్ నిర్మాణానికి 50 వేల రూపాయల విరాళాన్ని అందించిన ముక్కా వరలక్ష్మి -శ్రీ మాతమ్మ అమ్మవారి విగ్రహ మరియు గుడి పిల్లర్స్ నిర్మాణానికి ₹50,000/- ఇచ్చిన ముక్కా వరలక్ష్మి ఓబులువారిపల్లి సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి) ఓబులువారిపల్లి మండలం, కొత్తపల్లి అరుంధతి వాడకు చెందిన శ్రీ మాతమ్మ తల్లి విగ్రహం మరియు గుడి ఫిల్లర్స్ కోసం ₹50,000/- రూపాయల తన సొంత నిధుల నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి అందించారు.ముక్కా వరలక్ష్మి గారు మాట్లాడుతూ –“ప్రతి గ్రామంలోని సాంప్రదాయ, ఆధ్యాత్మిక విలువలను కాపాడడం, సమర్థంగా ఎదుగుటలో సహాయం చేయడం ముఖ్యమైన కర్తవ్యం. ఈ సహాయం ద్వారా గుడి మరింత అద్భుతంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నేతలు,స్థానికులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

అన్నమయ్య

మహిళను మోసం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష

ఓబులవారిపల్లి సెప్టెంబర్ 16(పున్నమి ప్రతినిధి) ఓబులవారిపల్లె మండలం కొత్తపల్లెకి చెందిన ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసిన ముద్దాయి విజయ్ కుమార్ కు మంగళవారం కడప కోర్టు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. 80,000 జరిమానా విధించింది. నిందితుడు ఇప్పటికే వివాహితుడై ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టు తీర్పు నిందితుడికి గుణపాఠం అని, మహిళల రక్షణకు కఠిన చర్యలు, వేగవంతమైన విచారణ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

అన్నమయ్య

చెత్త నుంచి సంపద కేంద్రాలు నిరుపయోగం

చిట్వేలు సెప్టెంబర్ 16(పున్నమి ప్రతినిధి) చిట్వేలు మండలంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద కేంద్రాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. ఈ కేంద్రాల ద్వారా చెత్తను ఎరువుగా మార్చి పంచాయతీలకు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో వీటిని ప్రారంభించారు. అయితే, అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడంతో అవి మూతపడ్డాయి. స్థానిక ప్రజలు మంగళవారం ఈ కేంద్రాలను పునరుద్ధరించి, తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

నిర్మల్

జి.ఆర్.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ… విద్యార్థులకు ఘన స్వాగతం

ముక్య అతిథిత పాల్గొన్న ప్రముఖ మోటివేషన్ స్పీకర్ వాడేకర్ లక్ష్మణ్…. బైంసా, సెప్టెంబర్ 16, 2025: బైంసాలోని జి.ఆర్.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థులకు ఘన స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ పార్టీ మరియు ఓజోన్ డే కార్యక్రమాలను అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోళ్ల బుచ్చయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మరియు ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వాడేకర్ లక్ష్మణ్ హాజరై విద్యార్థులను ఉత్తేజపరిచారు. కార్యక్రమం ప్రారంభంలో ఓజోన్ డే సందర్భంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రెజెంటేషన్లు ఇచ్చారు. ఓజోన్ పొర రక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమం పర్యావరణ సంరక్షణ పట్ల విద్యార్థులలో బాధ్యతను పెంపొందించేలా రూపొందించబడింది. తదనంతరం జరిగిన ఫ్రెషర్స్ పార్టీలో విద్యార్థులు ఆటపాటలు, నృత్య ప్రదర్శనలతో సందడి చేశారు. వారి ప్రదర్శనలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉత్సాహభరితమైన పాల్గొనడం కార్యక్రమానికి మరింత రంగును జోడించింది. ముఖ్య అతిథి శ్రీ వాడేకర్ లక్ష్మణ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “ప్రస్తుత సమాజంలో చదువుతో పాటు నైపుణ్యాల అభివృద్ధి చాలా ముఖ్యం. భవిష్యత్తులో నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకొని, పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని, క్రమశిక్షణతో ముందుకు సాగాలి. తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం చూపాలి. డ్రగ్స్ వంటి హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండి, జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించాలి” అని ప్రేరణాత్మకంగా మాట్లాడారు. యువత డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవడం ద్వారా తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోళ్ల బుచ్చయ్య మాట్లాడుతూ, “కష్టపడి చదివితేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. విద్యార్థులు తమ భవిష్యత్తును స్వయంగా నిర్మించుకోవాలి. ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు” అని విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్, ప్రొఫెసర్లు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు విస్తృతంగా పాల్గొన్నారు. కళాశాల ఆవరణ ఉత్సవ వాతావరణంతో కళకళలాడింది. విద్యార్థులు, అధ్యాపకుల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేకాట స్ధావరంపై కండలేరు డ్యామ్ పోలీసులు దాడులు*

*పేకాట స్ధావరంపై కండలేరు డ్యామ్ పోలీసులు దాడులు* *ఏడుగురు అరెస్టు , రూ.3160 నగదు స్వాధీనం* పొదలకూరు మండలం వావింటపర్తి గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న కొంత మంది వ్యక్తులను కండలేరు డ్యామ్ పోలీసులు మంగళవాం పట్టుకున్నారు. కండలేరు డ్యామ్ ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు వావింటపర్తి గ్రామ శివారులో కొంత మంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండ పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ డి.రామకృష్ణ తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు.ఈ దాడిలో ఏడుగురు పేకాటరాయుళ్ళను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.3160 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఖమ్మం

నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ తరలి వెళ్లిన జిల్లా బీజేపీ శ్రేణులు

పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర బీజేపీ కమిటీ ని ఇటీవల రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు ప్రకటించారు. కమిటీ లో ఖమ్మం జిల్లా కీ చెందిన ప్రముఖులు దేవకీ వాసు దేవరావ్ కీ కోశాధికారి పదవి లభించింది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ రాష్ట్ర కార్యలయం లో వాసుదేవ రావ్ పదవి భాద్యత లు స్వీకరణ సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నుండి బీజేపీ శ్రేణులు హైదరాబాద్ తరలివెళ్లారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యలయం లో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తల సమావేశం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ చంద్ర రావు మాట్లాడుతు ఖమ్మం జిల్లా లో అందరు కలసి కట్టు గా పని చెయ్యాలి అని, రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి అని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమం లో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా మాజీ అధ్యక్షులు రంగా కిరణ్, ఖమ్మం జిల్లా నాయకులు నున్న రవికుమార్, మండదపు సుబ్బారావు, నంబూరి రామలింగేశ్వరావ్, సుదర్శన్ మిశ్ర, పడిగల మధు, నాయుడు రాఘవ, వీరపనేని అప్పారావు, వల్లల రమేష్, పిల్లలమర్రి వెంకట్నారాయణ, కొణతము లక్ష్మి నారాయణ లతో పాటు ఖమ్మం జిల్లా కీ చెందిన పలువురు మండల అధ్యక్షులు, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుపాల్గొన్నారు

తిరుపతి

మనసా…! -నామనసా…!”

మనసా…! నా మనసా…! మనసా… నా మనసా…! ఒక్కింత… నీలో… ఒంటరి తనమా… మనసా…! నా మనసా…! ఎటుచూసి నా… ఊరిస్తుంది! ఊహకందదు… కానరాదు! భయం కాదు కదా… మనసా…! నా మనసా…! తనలో… ఏదో తపన… అది సైయంటుoది సైగచేస్తుంది… మనసా…! నా మనసా…! చిటుకేస్తుంది చిటుకుల చిన్నది చీరకట్టు తెలియదు చింగారించుకుంది చిరునవ్వలచిన్నది… మనసా…! నా మనసా…! వెనుక… ముందు ఆలోచించదు… అలంకరణే…తెలియనిది అట,పాటల గారాలది నడక మాత్రం…నేర్చింది… మనసా…! నా మనసా…! మనసు…కోరింది… మది…మురిసింది ఎందరినో పరికింది ఎద నిన్నే ఉరికింది ముసి… ముసి నవ్వలది… మనసా…! నా మనసా…! నిలో వున్నది నే నైతే… నాకోసమే నీవైతే… మొగ మిస్తే… మురుపించే ముద్దిస్తా… మనసా…! నా మనసా…! ***** బందిల మోహన్, Msc.,MEd. బిరుదు : కవి మిత్ర నాయుడుపేట, తిరుపతి మొ: 949046361.

తిరుపతి

అవార్డు గ్రహీతకు డి.ఇ.ఓ.అభినందన*

* శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం ను తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.యన్. కుమార్ అభినందించి భవిష్యత్తులో విద్యార్థుల సమగ్రాభివృద్ధి కి మరింత కృషి చేయాలని,జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకుని రావాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్

యూరియా తగ్గిస్తే రాయితీ! సీఎం చంద్రబాబునాయుడు కీలక ప్రకటన

బస్తాకు రూ.800 ఇస్తామన్న సిఎం త్వరలో విధివిధానాలు రూపకల్పన జిల్లాల అభివృద్ధిలో కలెక్టర్లదే కీలకపాత్ర కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వెల్లడి సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @అమరావతి రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. సోమవారం ప్రారంభమైన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. “యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకం ఇద్దాం. బస్తాకు 800 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేద్దాం” అని సిఎం అన్నారు. రెండు రోజుల పాటు రాష్ట్ర సచివాలయంలో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సోమవారం ప్రారంభమైంది. సిఎస్‌ విజయానంద్‌ ఈ సమావేశానికి అధ్యక్షతన వహించారు.సిసిఎల్ఎ కమిషనరు జయలక్ష్మీ స్వాగతోపన్యాసం చేశారు. తొలిరోజు ,ప్రాధమిక, పరిశ్రమలు, సేవారంగాలు, సూపర్‌6, పి4, సర్క్యులర్‌ ఎకానమీ, లాజిస్టిక్స్‌, సంక్షేమం, అభివృద్ది తదితర రంగాలపై సిఎం సమీక్షించారు. వ్యవసాయశాఖపై జరిగిన సమీక్షలో సిఎం యూరియా కొరత అంశాన్ని ప్రస్తావించారు. యూరియా వినియోగం పెరిగితే క్యాన్సర్‌ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా వినియోగం ఎక్కువైతే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందనేదానికి పంజాబ్‌ రాష్ట్రం ఓ కేస్‌స్టడీ అని సిఎం పేర్కిన్నారు. ప్రన్తుతం రాష్ట్రం క్యాన్సర్‌ కేసుల్లో టాప్‌-5లో ఉందని, యూరియా వినియోగం మరింతగా పెరిగితే టాప్‌-1కు వెళ్లిపోతుందన్నారు. ఈ క్రమంలో యూరియా వాడకం తగ్గించే అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇదే సందర్భంలో యూరియా వినియోగం తగ్గించిన రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధానం తీసుకురావాలని సిఎం చంద్రబాబు చెప్పారు. పిఎం ప్రణామ్‌ కింద బస్తాకు రూ.800లను ప్రోత్సాహకంగా కేంద్రం రాష్ట్రానికి ఇస్తుందని ఆ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కంటే రైతులకు ఇవ్వడం ముఖ్యమన్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలో రూపొందించాలని సిఎం కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. మానవీయ కోణంలో ఆలోచించండి అంతకుమందు ప్రారంభోపన్యాసంలో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఆఫీసులో కూర్చొని పేపర్‌మీద చూస్తే అంతా చక్కగా ఉంటుందని, క్షేత్రస్ధాయిలో పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్రధాని, సిఎం తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తులు కలెక్టర్లని, జిల్లాలను అభివృద్ధి చేయడంలో అత్యంత కీలకమైన బాధ్యత వారిదేనని చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రమంగా అమలు చేసేది కలెక్టర్లేనని, సిఎస్‌, డిజిపిల నుంచి క్షేత్ర స్దాయి వరకు సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియామకాలు చేశామన్నారు. సమర్ధులైన వారికే కలెక్టర్ల పోస్టింగ్‌లిచ్చామని సిఎం స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు. సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తారో శాంతి భద్రతల విషయంలో కూడా అంతే ప్రాధాన్యతనివ్వాలన్నారు. తాను అధికారులకు సపోర్టుగా ఉంటానని, కానీ విఫలమైతే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటానని, కలెక్టర్ల సదస్సు కొత్త ట్రెండ్‌ను సృష్టించాలన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు. సమర్ధ నీటి నిర్వహణతో రిజర్వాయర్లు నింపామని, వాణిజ్యపంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని సిఎం కలెక్టర్లకు సూచించారు. గతంలో భూ వివాదాలను సృష్టించారని రెవెన్యూ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారన్నారు. దీన్ని సరిచేయాలని, రిజిస్ట్రేషన్‌ పత్రాలను ట్యాంపర్‌ చేయకుండా ఉండేలా రూపొందించే విధానం ఉండాలన్నారు. ఇక జిఎస్‌టి రెండో దశ సంస్కరణల ఫలాలు ప్రజలందరికీ అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవడంతో పాటు ఒక నెల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సిఎం పేర్కొన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీతో పాటు ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ముఖ్యమైన అంశం కావాలని సిఎం అన్నారు. సిఎస్‌ విజయానంద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీలు, అభివృద్ది , ఎదురయ్యేసవాళ్లపై .అందరూ దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర అభివృద్దికి పెట్టుబడులకు 23 పాలసీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జిఎస్‌డిపి అభివృద్దితో పాటు విజన్‌ తదితర అంశాలపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. ఆర్ధికాభివృద్ది, ఉపాధి, ఉద్యోగాల కల్పనతో పాటు సమగ్రాభివృద్దిపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.