Wednesday, 6 May 2026

Blog

హైదరాబాద్

హనుమాన్ ఆలయంలోకి దూసుకెళ్లిన లారీ

పున్నమి వార్తలు హైదరాబాద్: 2025 సెప్టెంబర్ 16 తెల్లవారుజామున జెన్‌ప్యాక్ట్ ఉప్పల్‌లోని శ్రీ హనుమాన్ ఆలయంలోకి ఒక నీటి ట్యాంకర్ ఆలయంలోకి దూసుకెళ్లింది., అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు, చాలా తక్కువ మంది వ్యక్తులు మరియు వారి వాహనాలు పార్క్ చేయబడ్డాయి. చాలా రోజులుగా ఆలయం ముందు స్పీడ్ బ్రేకర్లు మరియు ట్రాఫిక్ సజావుగా సాగడానికి సరైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం లారీలో జరిగిన ఈ రకమైన ప్రమాదాల వల్ల ఆలయం దాదాపు దెబ్బతింది మరియు ప్రజలు గాయపడ్డారు.

హైదరాబాద్

హనుమాన్ ఆలయంలోకి దూసుకెళ్లిన లారీ

పున్నమి వార్తలు హైదరాబాద్: 2025 సెప్టెంబర్ 16 తెల్లవారుజామున జెన్‌ప్యాక్ట్ ఉప్పల్‌లోని శ్రీ హనుమాన్ ఆలయంలోకి ఒక నీటి ట్యాంకర్ ఆలయంలోకి దూసుకెళ్లింది., అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు, చాలా తక్కువ మంది వ్యక్తులు మరియు వారి వాహనాలు పార్క్ చేయబడ్డాయి. చాలా రోజులుగా ఆలయం ముందు స్పీడ్ బ్రేకర్లు మరియు ట్రాఫిక్ సజావుగా సాగడానికి సరైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం లారీలో జరిగిన ఈ రకమైన ప్రమాదాల వల్ల ఆలయం దాదాపు దెబ్బతింది మరియు ప్రజలు గాయపడ్డారు.

తిరుపతి

పాలెంపాడులో “కిడ్ని”భూతం

పాలెంపాడులో “కిడ్ని”భూతం తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం పాలెంపాడు గ్రామం లో నిన్న సగిలాల వెంకటేశ్వర్లు S/o సుబ్రహ్మణ్యం తిరుపతి లో దయాలాసిస్ పొందుతూ మరణించిరి, వయస్సు సుమారు 32సం. లు, ఆయనకు భార్య ఇద్దరు అమ్మాయలు ముసలి వారైన తల్లిదండ్రులు వున్నారు. వీరు దిక్కులేని వారైనారు. పాలెంపాడులో సుమారు 100కు పైగా కిడ్ని వ్యాధితో బాధ పడుచు న్నారు.కిడ్నివ్యాధితో మరణింంచినవారు వున్నారు. రేపో మాపో అనేవారూవున్నారు. దిక్కు తోచక సహాయం కోసం వేంపర లా డుతున్నారు. నిరా, మధ్యమా ఇంకేయిదయనానా తెలియక భయంగుప్పిట చస్తూ బతుకు తున్నారు. చిన్నావా రు, పెద్దవారు ప్రాణాలు పిడికిట్లో పట్టులోపట్టు కొనివు న్నారు. ఎవరైనా రాక పోతార్ అని ఎదురు చూస్తున్నారు. డాక్టర్లు, అధికార్లు, ప్రభుత్వం, మరణించిన, వ్యాదినపడ్డావారి నీ వైద్యం, లేదా ఆర్ధికంగా నైనా ఆదుకోవాలని గ్రామం, కోరుకుం టూంది.విషయం తెలిసిన బందిల మోహన్.తన గ్రామ ప్రజలు అయిన అందర్ని కాపాడమని ప్రాదేయ పడు తు న్నాడు. ప్రభుత్వం స్పందించి, చేసే సహాయం కోసం పాలెంపాడు గ్రామం ఎదురుచూస్తూoది.

ఆంధ్రప్రదేశ్

రొయ్యల ఎగుమతులపై కష్టాలు – రైతుల జీవనాధారం ప్రమాదంలో

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతులు ప్రస్తుతం పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి. అమెరికా, యూరప్ దేశాలు రొయ్యలపై ఎక్కువ పన్నులు వేసేయడంతో చాలా ఆర్డర్లు రద్దయిపోయాయి. ఈ కారణంగా రాష్ట్రానికి దాదాపు రూ. 25,000 కోట్ల నష్టం జరిగిందని అంచనా. ఈ నష్టంతో ఎక్కువగా ఇబ్బంది పడేది రైతులే. రొయ్యల పెంపకానికి పెట్టే ఫీడ్, మెడిసిన్స్, కరెంట్ ఖర్చులు చాలా పెరిగాయి. కానీ అమ్మకానికి రేట్లు పడిపోవడంతో పెట్టుబడులు తిరిగి రావడం లేదు. కొంతమంది రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇక హ్యాచరీస్, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ప్రొడక్షన్ తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎగుమతులు తగ్గిపోవడంతో పోర్టు, ట్రాన్స్‌పోర్ట్ రంగాలు కూడా నష్టపోతున్నాయి. ఇప్పుడైనా ప్రభుత్వం ముందుకు రావాలి. రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలి. ఫీడ్, మెడిసిన్స్ కొంత సబ్సిడీ ఇవ్వాలి. ఎగుమతులు కేవలం అమెరికా మీద ఆధారపడకుండా జపాన్, చైనా, మధ్యప్రాచ్యం వంటి కొత్త మార్కెట్లు తెరవాలి. కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ సదుపాయాలు పెంచాలి. రైతుల శ్రమ వృథా కాకుండా, రొయ్యల ఎగుమతి రంగం మళ్లీ బలపడేందుకు ప్రభుత్వం – పరిశ్రమ – రైతులు కలిసి పనిచేయాలి.

E-పేపర్

నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె

నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె (పెన్ డౌన్)18-9-2025 తేదీ నుండి 20-9-2025 తేదీ వరకు అనగా గురు, శుక్ర, శనివారములు వరసగా (3) మూడు రోజులు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్సులు ఫరూక్, రమేష్ లు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న 2.0 విధానంలోని ఆధార్ ఓటిపి, మొబైల్ ఓటిపి, పిడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండు చేస్తూ నంద్యాల జిల్లాకు చెందిన యావత్తు దస్తావేజు లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. కావున పై సమస్యలను ప్రభుత్వం వారు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు పట్టణ, గ్రామ ప్రజలు సహకరించవలసినదిగా కోరుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాలిక్, శివరాం, సంజీవరావ్, సుబ్రహ్మణ్యం, గిరిబాబు, రామకృష్ణ, ప్రవీణ్, బాబు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

అధిక వర్షాలతో పంటలకు తీరని నష్టం

పున్నమి న్యూస్ రిపోర్టర్ నిర్మల్, జిల్లాలో గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, నిర్మల్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది ముఖ్యంగా కోత దశలో ఉన్నటువంటి మొక్కజొన్న,సోయా పెసర, మినుములు మొదలైన పంటలు నీలమట్టమైనాయి మరియు వరి,పత్తి మొదలైన పంటలు నీట మునిగాయి కొన్నిచోట్ల పంటల పైకి ఇసుక మీటలు వచ్చి చేరాయి ప్రవాహాలకు పొలంగట్లు కోతకు గురైనాయి ఎడతెరిపి లేని వర్షాల మూలంగా రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వాపోతున్నారు

తిరుపతి

PACS చైర్మన్ కి శుభాకాంక్షలు :కంఠా రమేష్

శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆశీస్సులతో నేడు తొట్టంబేడు మండలం తంగేలపాళ్లం PACS చైర్మెన్‌గా ప్రమాణస్వీకారం చేసిన భీమాల భాస్కర్ ముదిరాజ్ కి మరియు డైరెక్టర్లకు టిడిపి తిరుపతి పార్లమెంట్ కోశాధికారి కంట రమేష్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.వారితో పాటు యూనిట్ ఇంచార్జ్ అర్ముగం పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు మరువలేం – కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్కామారెడ్డి ప్రతినిధి,16 సెప్టెంబర్, పున్నమి న్యూస్. :ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారం వరద బాధితులకు ఊరటనిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గాంధారి మండల కేంద్రంలోని రైతు వేదికలో వరద బాధితులు 67 మందికి దుప్పట్లు, బెడ్షీట్లు, చీరలు, దొవతులు, టవల్స్ తో కూడిన కిట్లను ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సభ్యులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మరియు ఇతర ఆపద సమయంలో ఇండియన్ రేస్ కార్ రెడ్ క్రాస్ సొసైటీ సహాయం అందిస్తుం దని అన్నారు. జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వరదల ప్రభావానికి గురైన బాధితులను ఆదుకు నేందుకు జిల్లాకు సహకారం అందించాలని కోరగా వెంటనే స్పందించి జిల్లాకు సుమారు 8 లక్షల రూపాయల విలువైన 400 దుస్తులు మరియు దుప్పట్ల తో కూడిన కిట్లను, దెబ్బతిన్న ఇండ్లను కప్పుకోవడానికి 100 టార్పాలిన్ కవర్లను అందజేశారని సహాయ సామాగ్రిని పంపించిన రెడ్క్రా సొసైటీ రాష్ట్ర శాఖకు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న మరియు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.నిన్న రాజం పేట, బిక్నూర్, బిబిపేట, దోమకొండ మండలాల్లో సహాయ కిట్లను అందజేశామని ఈరోజు గాంధారి, ఎస్ ఎస్ నగర్, రామారెడ్డి, పల్వంచ మండలాల్లో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రాజమండ్రిలో శాశ్వత లోక్ అదాలత్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం

రాజమండ్రిలోని తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు ‘శాశ్వత లోక్ అదాలత్ – ప్రజా ఉపయోగ సేవలు’ (PLAPUS) ఉన్నత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన వివిధ ప్రభుత్వ & ప్రైవేటు సంస్థల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి & సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ విద్యుత్ సరఫరా, త్రాగు నీటి సరఫరా, పారిశుద్ధ్య, వైద్య, తపాలా, టెలిఫోన్, బ్యాంకింగ్ వంటి సేవలకు సంబంధించిన సమస్యలను PLAPUS నందు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ తరహా వివాదాలలో కోర్టు ఫీజు లేకుండా రాజీ మార్గం ద్వారా సత్వర పరిష్కారం పొందవచ్చని ఆమె అన్నారు. సంబంధిత సంస్థల వారు ఈ విధమైన వివాదాలను ‘PLAPUS’ ద్వారా దాదాపు కోటి రూపాయల వరకు పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

నిర్మల్

*గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ ఓజోన్ దినోత్సవం*

ఓజోన్ దినోత్సవం పురస్కరించుకొనికుని ప్రిన్సిపల్ శ్రీ కర్రళ్ల బుచ్చయ్య గారు మాట్లాడుతూ ఓజోన్ దినోత్సవం ప్రాముఖ్యతను తెలియజేశారు .ఓజోన్ వల్ల కలిగే లాభాలు నష్టాలు విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రఘునాథ్ సార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఓజోన్ యొక్క ప్రాముఖ్యతను దానివల్ల కలిగే లాభాలను, అది తొలగిపోవడం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు. ఈ ప్రోగ్రాంను విద్యార్థులచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ తోపాటు జువాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ సంతోష్ సార్, బాటని డిపార్ట్మెంట్ జి కిషన్ కెమిస్ట్రీడిపార్ట్మెంట్ శ్రవణ్యా మేడం లందరూ కూడా పాల్గొనడం జరిగింది .ఈ ప్రోగ్రాంను కళాశాల విద్యార్థులు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.