Wednesday, 6 May 2026

Blog

నిర్మల్

*గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ ఓజోన్ దినోత్సవం*

ఓజోన్ దినోత్సవం పురస్కరించుకొనికుని ప్రిన్సిపల్ శ్రీ కర్రళ్ల బుచ్చయ్య గారు మాట్లాడుతూ ఓజోన్ దినోత్సవం ప్రాముఖ్యతను తెలియజేశారు .ఓజోన్ వల్ల కలిగే లాభాలు నష్టాలు విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రఘునాథ్ సార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఓజోన్ యొక్క ప్రాముఖ్యతను దానివల్ల కలిగే లాభాలను, అది తొలగిపోవడం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు. ఈ ప్రోగ్రాంను విద్యార్థులచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ తోపాటు జువాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ సంతోష్ సార్, బాటని డిపార్ట్మెంట్ జి కిషన్ కెమిస్ట్రీడిపార్ట్మెంట్ శ్రవణ్యా మేడం లందరూ కూడా పాల్గొనడం జరిగింది .ఈ ప్రోగ్రాంను కళాశాల విద్యార్థులు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్

బస్సు కోసం ఇంటికి ఒకరు బయలుదేరిన మహిళలు.కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామం నుండి ఆర్టీసీ బస్సు కావాలని మహిళలు పెద్ద ఎత్తున కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోకు బయలుదేరి వెళ్లారు. డిపో మేనేజర్ కరుణశ్రీ అందుబాటులో లేనందువల్ల అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి గారికి మోషంపూర్ గ్రామానికి గతంలో బస్సు వచ్చేదని ఇప్పుడు రావడం లేదని మా గ్రామానికి ఉదయం రెండు ట్రిప్పులు సాయంత్రం రెండు ట్రిప్పులు బస్సు నడపాలని ప్రైవేట్ వాహనాలు అధిక డబ్బులు వాసులు చేస్తున్నారని ప్రమాదాలు జరుగుతుంన్నాయిని ఆర్టీసీ బస్సు అయితే సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తుందని బస్సు సౌకర్యం తప్పకుండ వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భూపల్లీ ఉమాదేవి,తెరాస అధ్యక్షులు వంగ సంతోష్ రెడ్డి,నవీన్ రెడ్డి, పొన్నాల, రాజమణి,తోకల రాధ,మెరుగు సులోచన, లక్ష్మి,మొరికల బుమవ్వ,మొరికల రేణుక, భారతి, మల్లవ్వ,మొరికల బలవ, గార్థస్ వెంకటలక్ష్మి,గున్నాల సరస్వతి, మెరుగు లక్ష్మి, జోరిగేలా వెంకటలక్ష్మి ఇంకా చాలా మంది మహిళలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కొవ్వూరు మెడికల్ అసెస్మెంట్ క్యాంపు లో పాల్గొన్న యం.ఎల్. ఏ ముప్పిడి వెంకటేశ్వరరావు ..

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(సెప్టెంబర్ 16) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గవర్నమెంట్ హైస్కూల్ నందు సహిత విద్య విభాగం కార్యక్రమంలో భాగంగా మెడికల్ అసెస్మెంట్ క్యాంపు లో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు మండలంలో గల అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న మరియు ఇంటి వద్దనే ఉంటున్నా విద్యార్థులకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో, ఆలింకో సంస్థ ద్వారా అర్హులైన పిల్లలకు ఉచితంగా ఇవ్వడానికి, ఉపకరణల నిద్దారణ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా వారికి ఉపకరణాలు 1. వీల్ చైర్లు, 2. రోలెటర్లు, 3. వినికిడి యంత్రాలు, 4. మూడు చక్రాల కుర్చీలు, 5. సి.పి చైర్లు, 6. యం.ఆర్ కిట్లు, 7. చంక కర్రలు, 8. బ్రెయిలి కీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో సమగ్ర శిక్షణాఏ. ఎం.సి, మున్సిపల్ చైర్ పర్సన్ , ఏ. యం.సి చైర్మన్ ,కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వచ్ఛత పక్వాడాలో నైనాల రఘురామయ్య విద్యార్థులకు స్వచ్ఛత శపథం!

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో మామిడికుదురు మండలం అప్పనపల్లి లోని మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు నైనాల రఘురామయ్య విద్యార్థులకు విద్య తో పాటు తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్వచ్ఛత పక్వాడాలో భాగంగా మంగళవారం విద్యార్థులతో స్వచ్ఛత శపథం చేయించారు. పాఠశాలతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే మహా బలం తో ఉండాలి అని సూచించారు.

తూర్పు గోదావరి

కొవ్వూరు మెడికల్ అసెస్మెంట్ క్యాంపు లో పాల్గొన్న యం.ఎల్. ఏ ముప్పిడి వెంకటేశ్వరరావు ..

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(సెప్టెంబర్ 16) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గవర్నమెంట్ హైస్కూల్ నందు సహిత విద్య విభాగం కార్యక్రమంలో భాగంగా మెడికల్ అసెస్మెంట్ క్యాంపు లో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు మండలంలో గల అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న మరియు ఇంటి వద్దనే ఉంటున్నా విద్యార్థులకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో, ఆలింకో సంస్థ ద్వారా అర్హులైన పిల్లలకు ఉచితంగా ఇవ్వడానికి, ఉపకరణల నిద్దారణ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా వారికి ఉపకరణాలు 1. వీల్ చైర్లు, 2. రోలెటర్లు, 3. వినికిడి యంత్రాలు, 4. మూడు చక్రాల కుర్చీలు, 5. సి.పి చైర్లు, 6. యం.ఆర్ కిట్లు, 7. చంక కర్రలు, 8. బ్రెయిలి కీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో సమగ్ర శిక్షణాఏ. ఎం.సి, మున్సిపల్ చైర్ పర్సన్ , ఏ. యం.సి చైర్మన్ ,కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అప్పనపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్లో మెరుగైన బోధన పరిశీలన

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని మామిడికుదురు ఎం ఈ ఓ లక్ష్మీనారాయణ సూచించారు మంగళవారం ఆయన అప్పనపల్లి లోని మండల పరిషత్ మోడల్ స్కూల్ ప్రాథమిక పాఠశాల సందర్శించి పిల్లల సామర్థ్యాలను పాఠశాల పరిసరాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో హెచ్ ఎం నైనాల రఘురామయ్యతో పాటు ఉపాధ్యాయులు పెద్దిరాజు, రామకృష్ణ, షబ్బీర్ హుస్సేన్ అనంత లక్ష్మీ దేవి విద్యార్థులకు విద్య బోధన గురించి వివరంగా వివరించారు.

తిరుపతి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు:కోలా ఆనంద్

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా మంగళవారం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు డాక్టర్లు,నర్సులు,బిజెపి నాయకులు,కార్యకర్తలతో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ గారు పేషెంట్లకు పండ్లు బ్రెడ్,బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ సత్య కుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీకి అనేక బాధ్యతలు నిర్వహించి రాష్ట్ర వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందిస్తూ నిరంతరం కృషి చేస్తున్నాడని,కొనియాడారు. వారికి జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్

కమలపత్రం అందుకున్న జేసీ కూన.అనిల్ కుమార్ – యువతను ఉత్తమ నాయకులుగా తీర్చిదిద్దుతాం – అధ్యక్షులు హెజిఫ్ కూన.అనిల్ కుమార్ (శ్రీకాకుళం)

శ్రీకాకుళం యువతను, విద్యార్థులను బావితర ఉత్తమ నాయకులుగా తీర్చిదిద్దుతామని, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు హెజిఫ్ కూన.అనిల్ కుమార్ అన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ఆధ్వర్యంలో జేసీఐ వీక్ ను వేడుకగా నిర్వహించారు. స్థానిక ప్రెవేట్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు కూన. అనిల్ కుమార్ కుమార్ మంగళవారం మాట్లాడుతూ శ్రీకాకుళం జేసీఐ వ్యవస్థాపకులు డా. జామి.భీమశంకర్ సహకారంతో ఈ ఏడాది నలభై వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని, అధ్యక్షురాలుగా ప్రస్తుత కార్యదర్శి తమ్మినేని. ఉషారాణి సేవలందించనున్నారన్నారు. జెసిఐ వారోత్సవాల్లో కార్యక్రమాలను విజయంలోభాగమైన ప్రతీసభ్యునికీ ప్రత్యేక కృతజ్ఞతలని, ఇందులో భాగముగా జేసీఐ సభ్యులబృందాన్ని సత్కరించామని, జెసిఐ వారోత్సవాలను విజయవంతం చేసిన ప్రతీ సభ్యునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జెసిఐ ఇండియా జోన్ 4 మెంటర్ కె.వి. రావు, జూనియర్ జేసీ వింగ్ గొంప.సురేష్, జోన్ డైరెక్టర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బి. దిలీప్ కుమార్ మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కు ప్రత్యేక స్థానముందని, శ్రీకాకుళం జిల్లాలో చాలామంది యువత వక్తలుగా, ఉత్తమ నాయకులుగా తయారవటంలో జేసీఐ పాత్ర పోషించటం హర్షణీయమన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన సెక్రటరీ తమ్మినేని ఉష రాణి కు, ప్రశంసా పత్రాన్ని అతిధులచే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ సభ్యులు, జేసీఐ శ్రీకాకుళం సన్ రైస్ ప్రెసిడెంట్ సింగూరు ప్రవీణ్, వైజాగ్ వారియర్స్ ప్రెసిడెంట్ వెంకటరమణ, శ్రీకాకుళం జేసీస్ , జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సభ్యుల బృందం కోరాడ రమేష్,జగదీష్, కృష్ణకాంత్, మనీశర్మ,శివ తేజ,స్వాతి, మాధవి,రజిని, జామి అనురాధ, నరేంద్ర, రౌతు శ్రీనివాసరావు, మండవల్లి రవి, సూర్యారావు, ప్రత్యూష, వి టి నాయుడు, భాగ్యలక్ష్మి మొదలగు సభ్యులు పాల్గొన్నారు….

తిరుపతి

*ఘనంగా తంగేళ్లపాల్యం PACS చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణస్వీకారం*

శ్రీకాళశాస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తంగేళ్ల పాలెం PACS చైర్మన్ భాస్కర్ మరియు సభ్యులు ధనంజయులు, బత్తయ్య,ప్రమాణస్వీకార మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని చైర్మన్ మరియు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి రైతులకు ఉపయోగపడే ప్రతి పనిని ముందుండి చేయాలని సూచించడం జరిగింది. ముందుగా PACS చైర్మన్ మరియు సభ్యులు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ని ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.