Wednesday, 6 May 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

పోలీసుల సోదాలో కట్టలు కట్టలుగా డబ్బు.. బంగారం… సివిల్ సర్వీస్ అధికారిణి అరెస్ట్

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ అస్సాంలో సివిల్ సర్వీస్ అధికారిణి నుపుర్ బోరాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. భూ కుంభకోణానికి సంబంధించి ఆమెపైప ఆరోపణలు రావడంతో నుపుర్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాగా ఆమె ఇంట్లో రూ.90లక్షల నగదు.. రూ.కోటికి పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

జాతీయ అంతర్జాతీయ

ఐరాస హక్కుల కమిటీ చైర్పర్సన్ గా ప్రీతి సరన్

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల కమిటీ చైర్పర్సన్ భారత్ కు చెందిన మాజీ దౌత్యాధికారిణి ప్రీతి సరన్ నియమితులయ్యారు. జెనీవా కేంద్రంగా ఉన్న ఈ కేంద్రం ఆర్థిక, సామాజిక హక్కుల విషయమై సభ్య దేశాల మధ్య కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాల అమలును పర్యవేక్షిస్తుంది.ఇది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది

కామారెడ్డి

ఫోటో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ

కామారెడ్డి ప్రతినిధి , 16 సెప్టెంబర్ , పున్నమి న్యూస్: ఫోటో ఎక్స్పో పోస్టర్లను ఆవిష్కరించిన రామారెడ్డి ఎస్ఐ లావణ్య ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల ఫోటోగ్రాఫర్ యూనియన్ సభ్యులు ఈనెల తేదీ 21న హైదరాబాదులో జరిగే ఫోటో ఎగ్జిబిషన్ ఫోటో ఎక్స్పోజింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్ మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి@ అమరావతి : అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక ఆరు వరసులు.. 5.22 కిలోమీటర్లు పొడవుతో నిర్మాణం రూ. 2,500 కోట్ల రూపాయలతో త్వరలో టెండర్లు హైదరాబాద్-అమరావతి మధ్య తగ్గనున్న 35 కిలోమీటర్ల దూరం అమరావతిని అనుసంధానం చేస్తూ ఐకానిక్ కేబుల్‌ వంతెన నిర్మణం.. ఐకానిక్ వంతెన డిజైన్‌ను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు..

E-పేపర్

పైపులైను లీకేజీని అరికట్టండి..!

మండలం మాధవరం-1 గ్రామ పంచాయతీ రోడ్ నెంబర్ 13లో దాదాపు నెల రోజులుగా వీధి కొళాయి ఇనుప పైపు లైను లీకేజ్ అవుతుంది.సర్పంచ్ ఇంటికి కూతవేటు దూరంలో వున్న ఈ లీకేజ్ గురించి పలుమార్లు పంచాయతీ సెక్రెటరీ,సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించు కోలేదు.ఇదుగో అదిగో చేస్తాం అంటున్నారు తప్ప రిపేరు చేపించడం లేదు.ఈ పైపు లైన్ డ్యామేజ్ వలన నీరు నిల్వ చేరి అవే నీరు మరలా ఇళ్ళలోకి వస్తున్నాయి అంతేకాకుండా నిల్వ నీటిలో చుట్టు ప్రక్కల వారు చెత్తను కూడా వేయడంతో దోమలు ఎక్కువయ్యాయని దానివలన పిల్లలకు,వృద్దులకు విష జ్వరాలు సోకుతున్నాయని స్దానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని లీకేజీని అరికట్టి మరమ్మత్తులు చేపించాలని పరిసర ప్రజలు కోరుతున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ మెగా డీఎస్సీలో 75వ ర్యాంకు సాధించిన రోజువారీ కూలీ

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి@అంబేద్కర్ కోనసీమ జిల్లా : ఏపీలో ఏడు సంవత్సరాలుగా రోజువారీ కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన చాట్ల రత్నరాజు మెగా డీఎస్సీలో విజయకేతనం ఎగురవేశారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక శివారు కాట్రగడ్డకు చెందిన రత్నరాజు 2014లో బి.ఈడీ పూర్తిచేసి, రెండు సార్లు డీఎస్సీ రాసి విఫలమయ్యారు. కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచుతున్నారు. కష్టాల మధ్య చదువు వదలని రత్నరాజు ఈసారి 75వ ర్యాంకు సాధించి స్కూల్ అసిస్టెంట్ (సోషల్) టీచర్ పోస్టును పొందారు.

ఖమ్మం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి న సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య నేతలు

పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు ని మర్యాద పూర్వకంగా కలిసారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి గా ఖమ్మం జిల్లా కీ చెందిన దేవకీ వాసు దేవరావు నేడు పదవి భాద్యత లు స్వీకరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లిన సత్తుపల్లి నాయకులు రాష్ట్ర కార్యలయం లో రామ చంద్రరావు ని కలిసారు. కలిసి న వారిలో జిల్లా అధికార ప్రతి నిధి పడిగల మధు సుధన్ రావు, జిల్లా కార్యదర్సులు సుదర్శన్ మిశ్రా, నాయుడు రాఘవ రావు, సాలి శివ తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

ముగిసిన జేసీఐ శ్రీకాకుళం సన్‌రైజర్స్ వారోత్సవాలు – శ్రీకాకుళం యువత ఉన్నత దిశగా ప్రయాణించాలి – అధ్యక్షులు సింగూరు. ప్రవీణ్ కుమార్ (శ్రీకాకుళం)

జేసీఐ శ్రీకాకుళం సన్‌రైజర్స్ఆధ్వర్యంలో గ్రాటిట్యూడ్ అండ్ సెలబ్రేషన్ డే ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రాండ్ కన్వెర్సన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు సింగూరు. ప్రవీణ్ కుమార్ మంగళవారం మాట్లాడుతూ శ్రీకాకుళం యువత ఉన్నత దిశగా ప్రయాణించాలని, జెసిఐ వారోత్సవాల్లో ఏడు రోజులు చేసిన కార్యక్రమాలను వివరిస్తూ, చివరి రోజు పండగల చేసుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభావంతుల ప్రదర్శనలు నిర్వహించగా, సుమారు 100 మంది సభ్యులు, అతిథులు పాల్గొన్నారని, ఈ సందర్భంగా ప్రాజెక్ట్ చైర్మన్ వెంకటేష్ ఐటమ్, డే కోఆర్డినేటర్స్‌ జగదీష్, దామోదర్, ఉమా మహేష్, ఈశ్వర్, షర్మిల, అశోక్, శ్రీను లను ప్రత్యేకంగా సత్కరించామని, జెసిఐ వారోత్సవాలను విజయవంతం చేసిన ప్రతీ సభ్యునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జెసిఐ ఇండియా జోన్ 4 అడ్వైజర్ రఘురాం ప్రతి, జేసీ డాక్టర్.వినోద్ కుమార్, డాక్టర్ గీతా శ్రీకాంత్ లు మాట్లాడుతూ యువతకు కల్పించే అపారమైన అవకాశాలకు జేసీఐ వేదికని, విద్యార్థి దశ నుంచే యువతకు కావలసిన ట్రైనింగ్, లీడర్‌షిప్ క్వాలిటీస్, ఎమర్జెన్సీ టీమ్ సపోర్ట్ వీటన్నింటినీ జెసిఐ శ్రీకాకుళం సన్‌రైజర్స్ ఉచితంగా అందిస్తున్నారని, మిషన్ నవ నాయక్ కోసం తెలిపారు. జోన్ డైరెక్టర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ జెసిఐ శ్రీకాకుళం సన్‌రైజర్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలలో ముందంజలో ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, జేసీ సభ్యులు, టీమ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

“రక్తదాతలు “ప్రాణదాతలు”

రక్త దానం చేసే ప్రతీ వ్యక్తి ప్రాణదాతలే గురజాడ విద్యా సంస్థల అధినేత జి.వి.స్వామి నాయుడు(శ్రీకాకుళం – ) ‘రక్త దానం చేసే ప్రతీ వ్యక్తి ప్రాణదాతలేన’ని గురజాడ విద్యా సంస్థల అధినేత జి.వి.స్వామి నాయుడు అన్నారు. గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ కళాశాలలో జాతీయ సేవా పధకం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరo నిర్వహించారు. శిభిరంను ప్రారంభించి మాట్లాడుతూ రక్తదానంపై అవగాహన కార్యక్రమాలను ప్రతీ కళాశాలలో నిర్వహించాలని, అవకాశం ఉన్న ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా రక్త దానం చేయాలనీ అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యన్నారాయణ మాట్లాడుతూ ప్రతీ ఏడాది ఇటువంటి శిభిరాలను కళాశాలలో నిర్వహిస్తున్నామని, యాజమాన్య సహితం ఇందుకు అన్నీ విధాలుగా సహకరిస్తున్నదన్నారు. రిమ్స్, లయన్, రెడ్ క్రాస్ సంస్థలు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విదంగా సహకరించరని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రిమ్స్ మెడికల్ ఆఫీసర్ డా.శ్యామల, తాతారావు, లయన్ సునీల్, చరణ్, రెడ్ క్రాస్ సత్యన్నారాయణ, చైతన్య,కళాశాల జాతీయ సేవా పథకం పి.ఓలు అప్పల నాయుడు, గోపాలరావు, మేజర్ వంగ మహేష్ ‘చేయి చేయి కలుపు’ సoస్థ వినోద్, టెక్కలి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపాల్ నoదేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

_ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ ఎత్తేశారు.. ఈసారి మీరు కట్టే ప్రీమియం ఎంత తగ్గుతుందో తెలుసుకోండి..!!_

పున్నమి Daily న్యూస్ ప్రతినిధి : T.Ravinder ఖమ్మం *_ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ ఎత్తేశారు.. ఈసారి మీరు కట్టే ప్రీమియం ఎంత తగ్గుతుందో తెలుసుకోండి..!!_* ST on Insurance: సెప్టెంబర్ 3న స్టార్ట్ అయిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న సంస్కరణల గురించి ప్రకటించారు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న జీఎస్టీని సున్నాకు తగ్గిస్తున్నట్లు చెప్పారు. గతంలో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై 18 శాతం జీఎస్టీ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ రంగం జీఎస్టీ రేటును 12 శాతానికి తగ్గించాలని కోరిగా తాజా సంస్కరణల్లో దీనిని ఏకంగా జీరో జీఎస్టీ కేటగిరీలోకి తీసుకొచ్చింది కేంద్రం. మారిన కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తున్నాయి. ఉదాహణకు గతంలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకోసం ప్రీమియం రూ.10వేలు ఉంటే దానిపై 18 శాతం జీఎస్టీ కలిపితే పాలసీదారులు మెుత్తంగా రూ.11వేల 800 కట్టాల్సి వచ్చేది. అంటే ఇక్కడ రూ.18వందలు జీఎస్టీ అదనంగా పాలసీ ప్రీమియంపై పడేది. కానీ ప్రస్తుతం ఈ జీఎస్టీ రేటును సున్నా శాతానికి తగ్గించటంతో పాలసీదారులు కేవలం రూ.10వేలు పాలసీ మెుత్తం చెల్లిస్తే సరిపోతుంది. అంటే దాదాపు పదివేలకు 18వందల చొప్పున తగ్గింపు అందుకుంటారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులతో యులిప్ ప్లాన్స్, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్, టర్మ్ ప్లాన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ జీఎస్టీ, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ప్రయోజనం కలగనుంది. అసలు సమస్య ఇదే.. ప్రస్తుతానికి పాలసీదారులకు జీఎస్టీ మినహాయింపు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో పాలసీ ప్రీమియం రేట్లు పెరగొచ్చనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీలు పాలసీదారుల నుంచి కలెక్ట్ చేసే ప్రీమియంపై 18శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో వారు చెల్లించే ఏజెంట్ కమిషన్, మార్కెటింగ్ ఖర్చులు, ఆఫీసు అద్దెలపై ప్రభుత్వానికి జీఎస్టీ కడుతున్నాయి. దీంతో జీఎస్టీ చట్టాల కింద వారు పన్నులను వసూలు చేస్తున్న వాటికి చెల్లిస్తున్నవాటిని సర్థుబాటు చేసుకుంటున్నారు. మిగిలిన మెుత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. కానీ ఇకపై ప్రీమియంపై జీఎస్టీ లేకపోవటంతో ప్రభుత్వానికి కట్టే జీఎస్టీ తిరిగి క్లెయిమ్ చేసుకోవటానికి కుదరదు. అందువల్ల కంపెనీలు ఇకపై ఆ భారాన్ని కవర్ చేసుకునేందుకు పాలసీల రేట్లు పెంచుతాయని నిపుణులు అంటున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.