Wednesday, 6 May 2026

Blog

Blog

బాల అకాడమీలో ఘనంగా జరిగిన ప్రపంచ డెమోక్రసీ డే

నంద్యాలలోని పార్కు రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో ప్రపంచ డెమోక్రసీ డే ను ఘనంగా జరిగాయి ప్రతి సంవత్సరమూ సెప్టెంబర్ పదహారు వ తేదీన ప్రపంచ డెమోక్రసీ డే ను జరుపుకుంటాము ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ యమ్. జి. వి రవీంద్రనాధ్ ప్రిన్సిపల్ మాధవీలత ఉపాధ్యాయులందరూ విద్యార్థులు పాల్గొన్నారు ప్రిన్సిపల్ మాధవీలత మన డెమోక్రసీ ప్రజాస్వామ్యం గురించి చక్కగా విద్యార్థులందరికీ అర్థమయ్యేలా ప్రసంగించారు యమ్. జి. వి. రవీంద్రనాథ్ మన డెమోక్రసీ గురించి అందులోని విషయాలను గురించి చాలా చక్కగా విద్యార్థులకి అర్థమయ్యేలాగా వివరించారు ఈ కార్యక్రమం వలన విద్యార్థులందరూ మన డెమోక్రసీ గురించి చక్కగా అర్థం చేసుకోగలిగారు.

Blog

రాష్ట్రస్థాయి చెస్ పోటీల బహుమతులు అందజేసిన డాక్టర్ రవికృష్ణ

ఆంధ్ర చెస్ సంఘం ఆధ్వర్యం లో,నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో శని, ఆది వారాల లో నంద్యాలలో రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జరిగిన ముని నాగలక్ష్మి స్మారక రాష్ట్రస్థాయి రాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి నిర్వహణలో, ముని నాగలక్ష్మి సోదరుడు, నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల ఎలక్ట్రికల్ శాఖధిపతి, టోర్నమెంట్ డైరెక్టర్ రాజేష్ సౌజన్యంతో బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన వారు తమ కృషి కొనసాగించాలని, జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కోరారు. గెలవని వారు క్రమశిక్షణతో నిరంతర సాధన ద్వారా విజయాలు సాధించవచ్చున్నారు టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర సంఘం తరపున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ స్పాన్సర్ రాజేష్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి,కోశాధికారి అమిదేల జనార్ధన్, డాక్టర్ నీలా ప్రసాద్, జిల్లా వైద్యశాఖ ఏవో డాక్టర్ భరత్ ,ఆంధ్ర రాష్ట్ర చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి మరియు జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు సుజాత, జిల్లా చెస్ సంఘం ప్రతినిధులు రాజా రమేష్ చక్రవర్తి, ఇమామ్,కర్నూలు జిల్లా చెస్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, ప్రకాశం జిల్లా చెస్ ప్రెసిడెంట్ కొండారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన చదరంగం క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, కోచ్ లు పాల్గొన్నారు రాష్ట్రస్థాయి విజేతలు రాపిడ్ విభాగంలో ప్రథమ స్థానం శివ పవన్ తేజ శర్మ (ఎన్టీఆర్ జిల్లా),రెండవ స్థానం లక్షిత్ (కర్నూల్ జిల్లా) సాధించగా,బ్లిట్జ్ విభాగంలో మొదటి స్థానం సాత్విక్ (కోనసీమ జిల్లా), రెండవ స్థానం రామచరణ్ తేజ (తూర్పుగోదావరి జిల్లా) సాధించారు.ఎన్.ఆర్.జి చెస్ అకాడమీ విభాగంలో నీలేష్ ,శాలిని స్థానాలు పొందారు.

తెలంగాణ

అప్పుల ఊబి లో తెలంగాణ

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ తెలంగాణలో పెండింగ్ బకాయిలు 30 వేల కోట్లు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు 2.20 లక్షల కోట్లు* మరో 35100 కోట్ల అప్పుకు సన్నాహాలు* కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మరిన్ని రుణాలు తప్పనిసరి* పోరుబాట పట్టిన విద్యార్థులు, ఉద్యోగులు, ఆసుపత్రులు , అంగన్వాడి కార్యకర్తలు* తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా…? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి… రాజకీయ ఆర్థిక నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒకవైపు విద్యాసంస్థల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఫీజు బకాయిలు ₹8,300 కోట్లు పెండింగ్‌లో ఉండటం వల్ల విద్యార్థి సంఘాలు, విద్యాసంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల బంద్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. అదే సమయంలో, అంగన్వాడి కార్యకర్తలు మేనిపోస్ట్‌లో 18 వేల వేతనాలకు PF పెంపు కోసం న్యాయపరమైన డిమాండ్ నెరవేర్చకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయని ప్రవేట్ ఆసుపత్రులు స్పష్టం చేస్తున్నాయి.తెలంగాణలో 360కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తామని ప్రకటించాయి. 2025 జనవరిలో 10 రోజుల సమ్మె అనంతరం ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందని హామీ ఇచ్చినప్పటికీ, 7-8 నెలలుగా ఏవీ జరగడం లేదని అంటున్నారు. ఆసుపత్రులు తెలిపిన గణాంకాల ప్రకారం, రూ.1,400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కాంట్రాక్టర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు మొత్తం సుమారు రూ.30,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఉద్యోగుల బకాయిలే రూ.10,000 కోట్లు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు రూ.1,350 కోట్లు, పెద్ద కాంట్రాక్టర్లు రూ.1,100 కోట్లు, నిలిచిన పనులు రూ.1,000 కోట్లు, పాతబస్తీ కాంట్రాక్టర్లు రూ.680 కోట్లు, జీహెచ్ఎంసీ బకాయిలు ₹1,100 కోట్లు, గ్రామ పంచాయతీలు రూ.1,300 కోట్లు, చిన్న కాంట్రాక్టర్లు రూ.1,000 కోట్లు, ఆరోగ్యశ్రీ హాస్పిటళ్లు రూ.1,590 కోట్లు, బేవరేజెస్ కంపెనీలు రూ.3,900 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు రూ.12.56 కోట్లు, ఆర్ అండ్ బీ, పీఆర్, ఎంఏయూడీ రూ.1,000 కోట్లు, మన ఊరు మన బడి రూ.369 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ8,300 కోట్లు ఉండగా, చిన్న తరహా కాంట్రాక్టర్లు తమ రుణాలపై వడ్డీలు చెల్లించలేక, కొత్త పనులు చేపట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.పెండింగ్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం పైన ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆసుపత్రుల ప్రతినిధులు నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నాయి. ప్రతి నెలా రూ.500 కోట్ల చొప్పున డబ్బులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి హామీ ఇచ్చినప్పటికీ, అనేకమంది బాధితులు ఇప్పటికీ తమ వేతనాలు, రీయింబర్స్‌మెంట్ అందుకోలేక నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు.పెండింగ్ బకాయిల పై సమర్థవంతమైన వ్యవస్థలు లేకపోవడం, విత్తన , విద్య, ఆరోగ్య రంగాల్లో సమస్యలు పెరగడం, సామాజిక, ఆర్థిక వృద్ధికి అడ్డుగా మారుతుందనే వార్తలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి.* తెలంగాణ ప్రభుత్వం మరో రూ.35,100 కోట్ల అప్పుకు సన్నాహాలు* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.1,000 కోట్లు, మూసి సుందరీకరణ పేరిట రూ.4,100 కోట్లు, యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.30,000 కోట్లు అప్పు చేయనున్న రేవంత్ రెడ్డి .దీంతో 21 నెలలో రూ.2,34,500 కోట్లకు చేరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది* తెలంగాణ రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకుంది. మరికొన్ని పథకాలు అమలు చేయాలంటే మరిన్ని అప్పులు చేయాల్సిందేనని రాజకీయ నిపుణలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులకు 6000 పెన్షన్ పెంపుతో…. అర్హులైన లబ్ధిదారులు 5,11,656 మంది ఉన్నారు. నెల రోజులకు గాను 6,000 × 5,11,656 = రూ .307 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనుంది. హామీ నెరవేరాలంటే సంవత్సరానికి రూ.3,684 నిధులు అవసరం అవుతుంది.* *ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ పథకానికి నెలకు 550 కోట్లు అవసరం* తెలంగాణలో గ్యాస్ కనెక్షన్లు 1.1 కోట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నెలకు ఒక్కో కుటుంబానికి 1 సిలిండర్ అనుకుంటే 1.1 కోట్లు × 500 = రూ.550 కోట్లు నెలకు ఖర్చవుతుంది. *మహాలక్ష్మి పథకానికి నెలకు రూ.8,750 కోట్ల నిధులు అవసరం* తెలంగాణ రాష్ట్రంలో మహిళల అంచనా ప్రకారం సుమారు 35 లక్షల మహిళలు ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. నెలకు 8750 కోట్ల నిధులు అవసరం ఉంటుంది.మరిన్ని సంక్షేమ పథకాలు ప్రాజెక్టులు నిర్మించాలంటే మరో 4, లక్షల కోట్ల వరకు అప్పు చేయాల్సిందేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అప్పులు సమకూర్చేందుకు ప్రభుత్వ స్థలాలు వికయించడం, రిజిస్ట్రేషన్ స్టాంపులు పెంచడం, విద్యుత్ చార్జింగ్ పెంచడం, బస్ చార్జీలు పెంచడంతో ప్రజల పై మరింత భారం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఏ పని ముందుకు సాగాలన్న అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం మరిన్ని రుణాలు సేకరించి నెరవేరుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Blog

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవం

భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని 15 వ తేదీ సోమవారం జాతీయ ఇంజనీర్ల దినోత్సవం నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఈ. ఎస్.సి.ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో ఘనంగా నిర్వహించారు.నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సభా కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్,డాక్టర్ గెలిచి సహదేవుడు,డాక్టర్ రవి కృష్ణ అతిథులుగా పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలు వివరించారు.ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో, అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర విశిష్టమైనదని అన్నారు. డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ వైద్య బయో మెడికల్ ఇంజనీరింగ్ లో, వ్యవసాయ రంగంలో, సమాచారం విప్లవంలో ఇంజనీర్ల పాత్ర అద్వితీయ మైనదని అన్నారు.డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సౌజన్యంతో ముగ్గురు ఇంజనీరింగ్ అధ్యాపకులకు పురస్కారాలు, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు, అందజేశారు.కళాశాల సీనియర్ అధ్యాపకులు సంజీవ రాయుడు, విద్యా శ్రీ, సాయినాధ రెడ్డి లను శాలువా,జ్ఞాపికలతో సత్కరించి, లయన్స్ క్లబ్ జాతీయ ఇంజనీర్స్ దినోత్సవ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్, కార్యక్రమ స్పాన్సర్, రీజియన్ చైర్మన్ పీ.వీ.సుధాకర్ రెడ్డి,లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నిజాముద్దీన్, సభ్యులు మేడం చంద్రశేఖర్, కళాశాల అధ్యాపకులు రఘునాథరెడ్డి,రాజేష్, ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు. **వక్తృత్వ పోటీలు ..* “భవిష్యత్ భారత దేశం లో ఇంజినీర్ల పాత్ర” అన్న అంశంపై నిర్వహించిన వక్తృత్వపు పోటీలో వరస బహుమతులు సాధించిన రమ్యశ్రీ,సాయి హృతిక్, శ్రీవల్లి, హర్షియా,లిఖిత్ చందు,మహమ్మద్ సుఫియాన్ లకు బహుమతులు అందజేయడం జరిగింది.

తిరుపతి

రక్త దాన శిబిరాన్ని జయప్రదం చేయండి:కోలా ఆనంద్,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు

భారత ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 తేదీన నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ,రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు మరియు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ నేతృత్వంలో 17.09.2025 వ తేదీ రక్తదాన శిబిరం శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియం (మధు లాడ్జి)నందు ఉదయం 8 గంటల నుండిమధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.ఈ సేవ కార్యక్రమంలో ఎన్డీఏ (NDA) కూటమి తెలుగుదేశం, జనసేన,బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కొరడమైనది.

ఖమ్మం

మీడియా ప్రతి నిధి మీద పెట్టిన కేసులని ఎత్తి వేయాలి : BRS రాష్ట్ర నాయకులు సండ్ర

పున్నమి ప్రతినిధి మీడియా ప్రతినిధిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. పోలీస్లు ప్రజాస్వామికంగా వ్యవహరించాలి. పోలీస్ కమీషనర్ సునీల్ దత్ కీ వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై నమోడు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, పోలిస్ వ్యవస్థ ప్రజాస్వామికంగా వ్యవహారంచాలని జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సండ్ర వెంకట వీరయ్య లు పోలిస్ కమీషనర్ సునిల్ దత్ ను కోరారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కొణిజర్లలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న దృష్యాలను మీడియా ప్రతినిధి తన విధుల్లో భాగంగా వ్యవరిస్తే ఆ విషయా తప్పుదోవ పట్టించి కావాలనే విలేకరులపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. వాటిని వెంటనే ఎత్తివేయాలని, మీడియా స్వేచ్ఛను కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీని కలిసిన వారిలో బిఆర్ఎస్. లీ సెల్ బిచ్చాల తిరుమలరావు, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల బిఆర్ఎస్ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, భాషభోయిన వీరన్న, ఉన్నం బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

ప్రైవేటు విద్యాసంస్థల బంద్ విరమణ

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రము లో ప్రైవేటు విద్యా సంస్థ ల యాజమాన్యం నిర్వహించ తలపెట్టిన బంద్ రద్దు అయిందని తెలంగాణ ప్రైవేటు యాజమాన్య అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు తెలియజేసారు. సోమవారం తెలంగాణ ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్రమార్క తో జరిగిన చర్చలు సఫలం అవ్వడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలియజేశారు. బాకీ ఉన్న మొత్తం 1200 కోట్లకు గాను ఒక వారం లో 600 కోట్లు అలాగే మిగిలిన 600 కోట్లు దీపావళి కీ ఇచ్చే విధంగా ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్రమార్క హామీ ఇచ్చిన నేపథ్యంలో బంద్ ని విరమించుకుంటున్నట్లు వారు తెలియజేశారు

తెలంగాణ

నల్గొండ జిల్లాలో టీబీ రహిత, మాదక ద్రవ్య రహిత,జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్న : రాష్ట్ర గవర్నర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో జిల్లా అధికారులు, ప్రముఖ వ్యక్తులతో ముఖాముఖి నిర్వహించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ నల్గొండ జిల్లా ను టీబి రహిత, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముందుగా రాష్ట్ర గవర్నర్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ….నల్గొండ జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని జిల్లాలో వైటిపిఎస్, నీటిపారుదల. వైద్య ఆరోగ్య,విద్య జల్ జీవన్, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ పథకం, సమగ్ర శిక్ష అభియాన్,భవిత కేంద్రాలు గ్రామ సడక్ యోజన, టీబి ముక్త్ భారత్, ఆయుష్మాన్ భారత్, గ్రామీణాభివృద్ధి ఉపాధి హామీ, స్వచ్ఛభారత్, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, గృహ నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, అబ జన జాతీయ యోజన, ఆది కర్మయోగి అభియాన్, తదితర పథకాలపై లెక్కలతో సహా వివరించారు.

ఆంధ్రప్రదేశ్

విశాఖలో ఇంజినీర్స్ డే–2025 ఘనంగా

గీతం యూనివర్సిటీ నుండి హానరరీ డాక్టర్ ఆఫ్ లెటర్స్ అందుకున్న డా. ఆర్.వి.ఆర్.కు బిల్డర్స్ అసోసియేషన్ ఘన సత్కారం విశాఖపట్నం, సెప్టెంబర్ 15 భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 166వ జయంతి సందర్భంగా నగరంలోని ఎంఆర్‌సి కాకతీయ కన్వెన్షన్ సెంటర్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం సెంటర్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డే–2025ను ఘనంగా జరిపారు. వివిధ రంగాల ఇంజినీర్లు, బిల్డర్లు, విద్యావేత్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రాధ్యక్షులు డా. రాయల వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు.గీతం యూనివర్సిటీ ఇటీవల ఆయనకు ప్రదానం చేసిన హానరరీ డాక్టర్ ఆఫ్ లెటర్స్ (D.Litt.) డిగ్రీను గుర్తుచేసుకుంటూ ఈ గౌరవం అందజేశారు. డా. ఆర్.వి.ఆర్. రహదారులు, వంతెనలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల మౌలిక వసతులు వంటి అనేక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, ఇంజినీరింగ్ రంగంలో తన ముద్ర వేశారు. బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాణ్యత ప్రమాణాల పెంపు, కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం, ఆధునిక సాంకేతికత ప్రవేశపెట్టడం వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించారు.వృత్తిపరమైన కృషితో పాటు ఆయన సామాజిక సేవలలోనూ ముందుంటారు. విద్యారంగానికి తనవంతు సహకారం అందిస్తూ అనేక పాఠశాలలకు సదుపాయాలు కల్పించడం, వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, లైబ్రరీలు స్థాపించడం వంటి పనులు చేశారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి తాగునీటి సౌకర్యాలు, రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించడంలో ముందుండి సహాయం చేశారు. పేదవారికి ఆరోగ్య శిబిరాలు, వైద్య సహాయం అందించడంలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని సభలో పలువురు పేర్కొన్నారు. “ఇంజినీర్లు సమాజ శిల్పులు” – బ్రిగ్. సుశిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన బ్రిగేడియర్ సుశిల్ కుమార్ (డీడీజీ & సీఈ, డైరెక్టర్ జనరల్ నావల్ ప్రాజెక్ట్స్, విశాఖపట్నం) మాట్లాడుతూ –“ఇంజినీర్లు కేవలం ప్రాజెక్టులు నిర్మించేవారు కాదు, వారు సమాజ అభివృద్ధికి పునాదులు వేస్తారు. ఆర్.వి.ఆర్. తన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబం. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి” అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ నవనీత్, హానరరీ సెక్రటరీ ఎం.ఎన్. మూర్తి మాట్లాడుతూ –“ఆర్.వి.ఆర్. వృత్తిపరంగా మాత్రమే కాకుండా, సామాజికంగా కూడా ఎన్నో ముద్రలు వేశారు. ఇలాంటి వ్యక్తులే విశ్వేశ్వరయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారు” అని అభిప్రాయపడ్డారు.కార్యక్రమంలో పలువురు ఇంజినీర్లు, విద్యావేత్తలు, ప్రతినిధులు ఆర్.వి.ఆర్. చేసిన వృత్తిపరమైన కృషి, సామాజిక సేవలను కొనియాడారు. అనంతరం విందుతో కార్యక్రమం ముగిసింది.

తెలంగాణ

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకోత్సవానికి వచ్చిన : రాష్ట్ర గవర్నర్

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) సోమవారం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం లో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షత వహించారు.ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలు అంటే కేవలం ఇటుకలు,నిర్మాణాలు కావని, దార్శనికత, విలువలు, శ్రేష్టత కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.