Wednesday, 6 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

విశాఖలో ఇంజినీర్స్ డే–2025 ఘనంగా

గీతం యూనివర్సిటీ నుండి హానరరీ డాక్టర్ ఆఫ్ లెటర్స్ అందుకున్న డా. ఆర్.వి.ఆర్.కు బిల్డర్స్ అసోసియేషన్ ఘన సత్కారం విశాఖపట్నం, సెప్టెంబర్ 15 భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 166వ జయంతి సందర్భంగా నగరంలోని ఎంఆర్‌సి కాకతీయ కన్వెన్షన్ సెంటర్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం సెంటర్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డే–2025ను ఘనంగా జరిపారు. వివిధ రంగాల ఇంజినీర్లు, బిల్డర్లు, విద్యావేత్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రాధ్యక్షులు డా. రాయల వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు.గీతం యూనివర్సిటీ ఇటీవల ఆయనకు ప్రదానం చేసిన హానరరీ డాక్టర్ ఆఫ్ లెటర్స్ (D.Litt.) డిగ్రీను గుర్తుచేసుకుంటూ ఈ గౌరవం అందజేశారు. డా. ఆర్.వి.ఆర్. రహదారులు, వంతెనలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల మౌలిక వసతులు వంటి అనేక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, ఇంజినీరింగ్ రంగంలో తన ముద్ర వేశారు. బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాణ్యత ప్రమాణాల పెంపు, కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం, ఆధునిక సాంకేతికత ప్రవేశపెట్టడం వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించారు.వృత్తిపరమైన కృషితో పాటు ఆయన సామాజిక సేవలలోనూ ముందుంటారు. విద్యారంగానికి తనవంతు సహకారం అందిస్తూ అనేక పాఠశాలలకు సదుపాయాలు కల్పించడం, వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, లైబ్రరీలు స్థాపించడం వంటి పనులు చేశారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి తాగునీటి సౌకర్యాలు, రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించడంలో ముందుండి సహాయం చేశారు. పేదవారికి ఆరోగ్య శిబిరాలు, వైద్య సహాయం అందించడంలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని సభలో పలువురు పేర్కొన్నారు. “ఇంజినీర్లు సమాజ శిల్పులు” – బ్రిగ్. సుశిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన బ్రిగేడియర్ సుశిల్ కుమార్ (డీడీజీ & సీఈ, డైరెక్టర్ జనరల్ నావల్ ప్రాజెక్ట్స్, విశాఖపట్నం) మాట్లాడుతూ –“ఇంజినీర్లు కేవలం ప్రాజెక్టులు నిర్మించేవారు కాదు, వారు సమాజ అభివృద్ధికి పునాదులు వేస్తారు. ఆర్.వి.ఆర్. తన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబం. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి” అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ నవనీత్, హానరరీ సెక్రటరీ ఎం.ఎన్. మూర్తి మాట్లాడుతూ –“ఆర్.వి.ఆర్. వృత్తిపరంగా మాత్రమే కాకుండా, సామాజికంగా కూడా ఎన్నో ముద్రలు వేశారు. ఇలాంటి వ్యక్తులే విశ్వేశ్వరయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారు” అని అభిప్రాయపడ్డారు.కార్యక్రమంలో పలువురు ఇంజినీర్లు, విద్యావేత్తలు, ప్రతినిధులు ఆర్.వి.ఆర్. చేసిన వృత్తిపరమైన కృషి, సామాజిక సేవలను కొనియాడారు. అనంతరం విందుతో కార్యక్రమం ముగిసింది.

తెలంగాణ

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకోత్సవానికి వచ్చిన : రాష్ట్ర గవర్నర్

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) సోమవారం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం లో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షత వహించారు.ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలు అంటే కేవలం ఇటుకలు,నిర్మాణాలు కావని, దార్శనికత, విలువలు, శ్రేష్టత కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.

ఎన్ టి ఆర్ జిల్లా

డాక్టర్ పీర్ కుమార్ ని వరించిన డా. రాధాకృష్ణన్, ఎన్టీఆర్ జాతీయ సేవా అవార్డులు

సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి @ విజయవాడ విశాఖపట్నం డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాణ కేంద్రం నందు ఆదివారం సాయంత్రం శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ37వ వార్షికోత్సవాల సందర్భంగా డాక్టర్ బద్రి పీర్ కుమార్ ను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎక్సలెన్స్ అవార్డుతో కళాపరిషత్ నిర్వహకులు సత్కరించారు. అధ్యాపకుడిగానే కాక నాటక, టీవీ, సినీ నటుడిగా, రచయితగా, గేయ రచయితగా, నాటక దర్శకుడిగా, కళా రంగానికి చేస్తున్న సేవలను గుర్తించిన మా కమిటీ ఈ అవార్డుకి పీర్ కుమార్ ని ఎంపిక చేసిందని కళా భూషణ్ డాక్టర్ పి.ఎ. భాస్కర రావు తెలిపారు. అదేవిధంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన మదర్ సర్వీస్ సొసైటీ వారి 3వ వార్షికోత్సవం వేడుకలు విజయవాడ లోని నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కళాకేంద్రంలో సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు, కేరళ, ఒరిస్సా, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, ఆంద్రప్రదేశ్, రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాలలో సేవ చేస్తున్న వారికి సేవా అవార్డుల ప్రదానం లో భాగంగా డాక్టర్ బద్రి పీర్ కుమార్ ను ఎన్టీఆర్ జాతీయ సేవా పురస్కారంతో పలువురు ప్రముఖులు సత్కరించారు. A.P. SC కమీషన్ ఛైర్మన్, మాజీ మంత్రి వర్యులు అయిన కొత్తపల్లి శ్యామ్యుల్ జవహార్, మదర్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మల్లాది ప్రసాదరావు, హీరోయిన్ రజిత పాండే, సీనియర్ నటులు పృథ్వీరాజ్, నేటి అమరావతి దినపత్రిక చీఫ్ ఎడిటర్ మున్నం చిన సుబ్బారెడ్డి, నటుడు నిర్మాత డాక్టర్ మూసా అలీ ఖాన్, ప్రముఖ మిమిక్రీ స్టార్ తోట సిల్వర్ స్టార్, ఎన్వి సురేంద్రబాబు, నేటి శుభోదయం దినపత్రిక చీఫ్ ఎడిటర్ గోంగూర శ్రీనివాసరావు, సినీ ప్రొడ్యూసర్ డాక్టర్ ఎస్ కే జలీల్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయిరేణి శ్రావణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జనగాం

తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను బి జె హెచ్ పి ఎస్, వై ఎఫ్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా వారణాసి శివవర్మ నియామకం

పున్నమి: జనగాం జిల్లా, జనగాం నియోజకవర్గం స్టేషన్ ఘన్పూర్ మండల, గ్రామ పరిధికి చెందిన వారణాసి శివవర్మ, బి జె హెచ్ పి ఎస్, బేడ బుడగ జంగం జేఏసీ ఆధ్వర్యంలో బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా వారణాసి శివవర్మ ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమురయ్య హాల్లో నియామక పత్రం అందజేసారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బేడ బుడగ జంగాల కుల సేవ, వారణాసి శివవర్మ చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర నాయకత్వం  యూత్ ఫెడరేషన్ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా వారణాసి శివవర్మ మాట్లాడుతూ తనను రాష్ట్ర యూత్ ఫెడరేషన్ అధ్యక్షులుగా నియమించినందుకు బి జె హెచ్ పి ఎస్, బేడ బుడగ జంగం జేఏసీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బేడ బుడగ జంగం కులానికి సంఘానికి పాటు పడతానన్నారు. ఈ సందర్భంగా బి జె హెచ్ పి ఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప, జేఏసీ చైర్మన్ తూర్పాటి హనుమంతు, వ్యవస్థాపక చైర్పర్సన్ గగనం శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షులు గగనం శేఖర్, జేఏసీ నెంబర్స్ గగనం వెంకటస్వామి, సిరివాటి శ్రీనివాసులు, విభూతి వెంకటేష్, చల్ల బాలరాజు, తూర్పాటి శ్రీనివాసులు, గడ్డం కృష్ణ, సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు, బి జె హెచ్ పి ఎస్ రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కుల సంఘం కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం పథకాలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించి, బేడ బుడగ జంగం జాతి బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సిరివాటి మసికొండ, మిర్యాల తిరుపతి, చల్ల వెంకటేష్, తూర్పాటి చిన్నకోటయ్య, తూర్పాటి హనుమంతు, సిరువాటి రామకృష్ణ, గగనం రాజు, సిరిసాల రంగన్న, తూర్పాటి మహేష్, గగనం శివుడు, వారణాసి చందు, పస్తం యాకయ్య, పస్తం రాజు,తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం ఆమె జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా ఈనెల 17న ఉదయం 10 గంటలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని అనంతరం మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని తెలిపారు. ఆయా శాఖల అధికారులు వారి శాఖల ప్రగతికి సంబంధించిన వివరాలను తక్షణమే సిపిఓ కు పంపించాలని చెప్పారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, సిటింగ్, వేడుకలకు, ప్రముఖులను ఆహ్వానించడం, ఇన్విటేషన్ కార్డ్స్, తదితర అన్ని పనులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే ప్రారంభించాలన్నారు. సమయం తక్కువగా ఉన్నందున మంగళవారం నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.జిల్లా అధికారులందరూ వారి సిబ్బందితో సహా వేడుకలకు హాజరు కావాలన్నారు. సంక్షేమ శాఖల అధికారులు విద్యార్థులను వేడుకలకు తీసుకురావాలని చెప్పారు.

తిరుపతి

లిఫ్ట్ లలో ఛార్జింగ్ బ్యాటరీలు తీసుకెళ్లడంలో అజాగ్రత్త

ప్రతి ఫ్లాట్ యజమానికి మరియు లిఫ్టులు ఉన్న అన్ని భవనాలకు ముఖ్యమైన వార్తలు. గమనిక: ఒక వ్యక్తి తన ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఇంటికి తీసుకెళ్తున్నాడు, అయితే బ్యాటరీని లిఫ్ట్‌లో ఉంచితే, స్టాటిక్ విద్యుత్ కారణంగా అది పేలిపోతుందని అతనికి తెలియదు. లిఫ్ట్‌లలో బ్యాటరీలను తీసుకెళ్లడం సాధ్యం కాదు. లిఫ్ట్‌లలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను తీసుకెళ్లడం నిషేధించబడిందని దయచేసి అన్ని సొసైటీల భద్రతా సిబ్బందికి తెలియజేయండి. దయచేసి ఈ WhatsApp సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.*

తెలంగాణ

తెలంగాణ లో రేపు రాత్రి నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

పున్నమి ప్రతి నిధి. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ మీద అవాలభిస్తున్న నిర్లక్ష్య వైకరి కీ నిరసన గా రేపు అర్ధ రాత్రి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు గా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసోషియేషన్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1400 కోట్లు బకాయిలు రావాలని, బకాయిల విడుదల లో రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడినట్లు వ్యహరిస్తుంది అని ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ అసోసియేషన్ సభ్యులు విమర్శించారు.

నంద్యాల

చంద్రబాబు అమరావతి మాదిరిగా… నంద్యాల మెడికల్ కాలేజి గ్రాఫిక్స్ కాదు…. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ కట్టించినదే … వాస్తవాలు హోం మంత్రి అనిత కళ్లకుకనిపించలేదా?…. – మాజీ ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష

నంద్యాల,సెప్టెంబర్15, పున్నమి స్టాఫ్ రిపోర్టర్ ఆర్ఎన్ రెడ్డి: వైఎస్సార్సీపీ అధికారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆడుగులు వేసి అధికారంలో ఉన్న కాలంలోనే 5 మెడికల్ కళాశాలను సెప్టంబర్ నెల 15వ తేది 2023 సంవత్సరం అట్టహాసంగా ప్రారంభించి నేటికి సరిగ్గా రెండు సంవత్సరాలు కావస్తున్నది. దిగ్విజయంగా మూడవ సంవత్సరం మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపడుతున్నది. ఇది వాస్తవం కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ తో అమరావతిని సృష్టించినట్లు మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న 5 మెడికల్ కళాశాలలను గ్రాఫిక్స్ చేయలేదని, ఇందుకు నిలువెత్తు సాక్షాలుగా నంద్యాల మెడికల్ కళాశాల ఉందని ఇది వాస్తవమని నిజాలు చారిత్రక నిర్మాణాలు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కళ్లకు కనిపించలేదా అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష హోమంత్రి చేసిన అసత్యపు ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు వాస్తవాలను, నిజానిజాలను ప్రజలకు కూటమి ప్రభుత్వ నేతలకు తెలియజేసేందుకు సోమవారం నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాగణంలో కళాశాల ఎదురుగా మీడియా సమావేశం నిర్వహించి నిజాలను నిగ్గు తెల్చారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష మాట్లాడుతూ…..మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, దశల వారిగా 5మెడికల్ కళాశాలను సెప్టంబర్ నెల 15వ తేది నాటికి నంద్యాల మెడికల్ కళాశాలతో సహా మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరంలో అట్టహాసంగా ప్రారంభించడం జరిగిందన్నారు. నేటికి ఈ మెడికల్ కళాశాలలు ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి అయ్యాయని, అలాగే ఈ విద్యాసంవత్సరంలో 3వ సారి అడ్మిషన్ల ప్రక్రియకూడా ప్రారంభించి పూర్తి కావస్తుందని తెలిపారు. చారిత్రక ఆధారాలు ఉన్నవాటిని కూడా కాదని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వార నంద్యాల మరియు ఇతర నాలుగు ప్రాంతాలలో నిర్మించిన మెడికల్ కళాశాలల ఆనవాళ్లు లేవని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాయ చేశాడని మంత్రాలు వేస్తాడని హాస్యాస్పద వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు మాదిరి అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించినట్లు నంద్యాల మెడికల్ కళాశాలను చూపడం సాధ్యం కాదని.. ఒక్కసారి చారిత్రక మెడికల్ కళాశాల నిర్మాణాలను కళ్లుపెట్టుకుని చూడాలని వాస్తవాలను, నిజానిజాలను తెలుసుకొని మాట్లాడాలని మంత్రి అనిత చేసిన అసత్యపు ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. నంద్యాల మెడికల్ కళాశాలకు అనుమతులు రావడానికి మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, నాటి జిల్లా కలెక్టర్ ఎంతో ప్రయత్నాలు చేసి చివరకు మెడికల్ కళాశాలను ప్రారంభించామని గర్వంగా చెబుతున్నామన్నారు. టీడీపీ నాయకులు మెడికల్ కళాశాల అనుమతులు రాకుండా కోర్టులలో కేసులు వేశారని అయినా అనేక సార్లు కోర్టుల వెంట తిరిగి మెడికల్ కళాశాలను సాధించామన్నారు. ఈ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు, రెండవ సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు అలాగే ఈ విద్యా సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. నంద్యాల మెడికల్ కళాశాలకు చెందిన మహేష్ అనే ప్రథమ సంవత్సరం చదివిన విద్యార్థి యూనివర్సిటీ టాపర్ గా నిలిచాడన్నది చారిత్రాక సాక్షం అని నంద్యాల మెడికల్ కళాశాల ఎంతో గర్వకారణంగా నిలిచిందన్నారు. ఎన్.ఎం.సీ అనుమతులతో ప్రారంభించిన కళాశాలకు సంబంధించి ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలను నేటికీ కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదని, అలాగే పులివెందులలో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి అయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, కూటమి ప్రభుత్వం తమకు మెడికల్ కళాశాలకు అనుమతులు వద్దని అడ్మిషన్ల ప్రక్రియ రద్దు చేయమని ఎన్.ఎం.సి కి ఉత్తరాలు పంపారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు విధానాలు లోపభూయిష్టమైనదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్న అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి నేతలు నంద్యాల మెడికల్ కళాశాలను ఒక్కసారి టచ్ చేసి చూడాలని ఇది గ్రాఫిక్స్ తో చూపించారా… లేదా అన్న వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం వారు కళాశాలలోకి వెళ్లి అధికారులతో మాట్లాడి, అటు తర్వాత రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మెడికల్ కళాశాల ఆవరణంలో ఉన్న డా.వైఎస్సార్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మార్క్ఫెడ్ అధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్ని సా, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీపీ మధు సూధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ పీఏ.సి.ఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ వివిధ విభాగాల నాయకులు రసూల్ ఆజాద్, రమణ, ప్రతాప్ రెడ్డి, బసవేశ్వర రెడ్డి, శివయ్య, కారు రవికుమార్, దేవనగర్ బాష, జాకీర్ హుసేన్, గన్నీకరీం, సోహేల్ రాణా, సాయిరాంరెడ్డి, మునయ్య, లక్ష్మీనారాయణ, కిరణ్, షేక్ రహంతుల్లా, భాస్కర్ రెడ్డి, యూసఫ్, రామ సుబ్బారెడ్డి, కాల్వనాగరాజు, పార్థసారధి, కౌన్సిలర్లు, కృష్ణమోహన్, మేస చంద్రశేఖర్, సాధిక్, సమ్మద్, ఆరిఫ్ నాయక్, తమీమ్, మజీద్, అబ్దుల్ కరీం, మురళి, షేక్ తోహిద్,రామచంద్రుడు,చింత శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి

విద్యార్థులు రాష్ట్ర జట్టు కు ఎంపిక

ఓడిచెరువు:పున్నమి న్యూస్: మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగేడు కుంట చెందిన పలువురు విద్యార్థులు 10 మంది రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ కు ఎంపికయ్యారు అని వ్యాయామ ఉపాధ్యాయుడు రాజేష్ తెలిపారు శనివారం అనంతపూర్ లోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల జరిగిన ఎన్నికలలో అండర్ 14 అండర్ 17 అండర్ 19 కు మొత్తం పదిమంది విద్యార్థులు విద్యార్థినిలు పీప్ సైట్ ఓపెన్ సైట్ కేటగిరీలో ఎన్నికయ్యారు విద్యార్థినిలు సారిక మహిత లక్ష్మీకాంత అండర్ 19 పీప్ సెట్ నందు లహరి రక్షిత హారిక అండర్ 17 నందు వెన్నెల అండర్ 14 నందు తానేశ్వర్ రెడ్డి విశ్వనాథ చారి ఓపెన్ సైట్ నందు అండర్ 17 కు ఎంపికయ్యారు వీరు త్వరలో రాజమండ్రి నందు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్గొన్నట్టారని తెలిపారు దీనిపై ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయుడు తిరుపాల్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు వీరి ఎంపిక పట్ల గ్రామస్తులు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తూ మారుమూల గ్రామాల నుంచి వెళ్లడం ఆనందంగా ఉండడం అని మీరు మరింత నైపుణ్యం సాధించి రాష్ట్రస్థాయిలో మెరిట్ సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని కోరారు ఇందుకు తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.

భక్తి

తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తులకు ప్రత్యేక రైళ్లు

సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి @ తీర్థయాత్రలకు భక్తుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ IRCTC ప్రత్యేక రైలు, విమాన ప్యాకేజీలను ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు జరిగే ‘దివ్య దక్షిణ యాత్ర’లో తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్ వంటి ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించవచ్చు. ధరలు స్లీపర్ ₹14,100, 3AC ₹22,500, 2AC ₹29,500. పూర్తి వివరాలకు 9701360701, 9281030726, 9281030750 నెంబర్లకు కాల్ చేయవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లో చూడవచ్చు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.