Wednesday, 6 May 2026

Blog

E-పేపర్

బోధి పాఠశాల లో ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు

నారాయణఖేడ్ లోని బోధి పాఠశాలలో ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు వ్యాస రచన పోటీలు చిత్రలేఖనం లాంటివి నిర్వహించడం జరిగింది పాఠశాల హిందీ ఉపాధ్యాయులు హిందీ భాష యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశం గారు, హిందీ ఉపాధ్యాయులు ఇక్బాల్ గారు , ప్రకాష్ గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

జాబ్ మేళాలో జూపల్లి భగత్ (ఫిట్టర్) మేథా కంపనీలో ఉద్యోగం

సిద్ధార్థ మరియు శివ సాయి ఐటిఐ లలో సర్టిఫికెట్లను ప్రధానం చేసిన కరస్పాండెంట్స్ కట్ట మోహన్ రెడ్డి మరియు వైశాఖ రెడ్డి గార్లు జాబ్ మేళాలో జూపల్లి భగత్ (ఫిట్టర్) మేథా కంపనీలో ఉద్యోగం సాధించారు భువనగిరి పట్టణంలోని సిద్ధార్థ మరియు శివ సాయి ఐటిఐ లలో 2023 2025 బ్యాచ్కు చెందిన విద్యార్థులకు పాసైన సర్టిఫికెట్లను నేడు ప్రధానం చేయడం జరిగింది. మరియు అశోక్ లేలాండ్, స్ట్రైడ్ ఆర్గానిక్, గచ్చి ఎలక్ట్రో, ఏ జి ఐ గ్లాస్ ప్యాక్ భువనగిరి కంపెనీలకు చెందిన వారితో ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది .ఇట్టి సందర్భంగా కరస్పాండెంట్లు మాట్లాడుతూ 2011లో మా యొక్క ఐటిఐ లను ప్రారంభించి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపామని ప్రభుత్వ రంగ సంస్థలైన విద్యుత్ డిపార్ట్మెంట్ మరియు రైల్వే డిపార్ట్మెంట్లో చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు పొందాలని అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలకు చెందినటువంటి చాలా కంపెనీలు మా వద్ద జాబ్ మేళాను నిర్వహించిన సందర్భంలో వందల మంది విద్యార్థులు ఆ యొక్క జాబ్ మేళాలో పాల్గొని సెలెక్ట్ అయి ఉద్యోగాన్ని పొంది అటు తల్లిదండ్రులకు ఇటు కళాశాల యాజమాన్యానికి మంచి పేరు తీసుకొచ్చి జీవితంలో స్థిరపడ్డారని అదేవిధంగా నూతనంగా అడ్మిషన్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకు సూచనప్రాయంగా తెలియజేస్తూ మీ యొక్క పిల్లల్ని మంచి భవిష్యత్తు పొందాలంటే సిద్ధార్థ మరియు శివ సాయి ఐటిఐ లలో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ నేర్పించినటువంటి విద్యాబుద్ధులతో జీవితంలో స్థిరపడే విధంగా మేము తీర్చిదిద్దుతామని మా యొక్క ఎక్స్పీరియన్స్ మరియు మా వద్ద విద్యనాభ్యసించిన విద్యార్థులు జాబులు సంపాదించడమే నిదర్శనమని అన్నారు ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా సహాయపడుతూ వారికి సలహాలు సూచనలు చేస్తూ కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడి వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కృషి చేశామని తెలియజేశారు దయచేసి విద్యార్థులు కూడా గ్రామీణ ప్రాంతాల నుండి భువనగిరి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మా యొక్క ఐటిఐ లలో అడ్మిషన్ తీసుకొని శ్రద్దగా వినయంగా కళాశాలకు వచ్చినట్లయితే వారి భవిష్యత్తును వారే తీర్చిదిద్దుకునే అవకాశం పొందుతారని వేరే చెడు అలవాట్లకు విద్యార్థులు గురికాకుండా తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని ఆ విధంగా విద్యార్థులు కళాశాలకు వచ్చి ఉత్తీర్ణత పొందే విధంగా పాటుపడాలని సూచనప్రాయంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు గంగారం నాగరాజు గోరంత భాస్కర్ తంబు *సాయి వంశీ అనిల్ కుమార్ అరుణ ఎడ్ల ప్రదీప్ సుమారు 200 నుండి 300 వరకు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…

యాదాద్రి భువనగిరి

ఇండ్ల స్థలాల కోసం ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి

ఈరోజు భువనగిరి పట్టణంలో ఎమ్మార్వో ఆఫీస్ ను ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ700 సర్వే నెంబర్లు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి 20 ఏళ్లు గడుస్తున్న అధికారులు కానీ పాలకులు గాని పట్టించుకోవడం లేదు ఇండ్ల స్థలాలు ఇచ్చేంతవరకు ఈ పోరాట ఆగదని రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ అన్నారు రెండు నెలల క్రితం 700 సర్వే నెంబర్లు గుడిసెలు వేసుకుంటే అధికారులు నెల రోజులు టైం అడిగి మూడు నెలలు గడుస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఈరోజు ఎమ్మార్వో ఆఫీస్ ను ముట్టడి చేయడం జరిగింది. తహసిల్దారి ఈరోజు మాట్లాడుతూ వారం రోజులలో సర్వేను పూర్తిచేస్తే పై అధికారులకు ఇస్తామని ఎమ్మార్వో గారు హామీ ఇవ్వడం జరిగింది హామీతో ముట్టడిని విరమింప చేయడం జరిగింది లేనిపక్షంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఆమె అన్నారు భువనగిరి పట్టణంలో సుమారు అయిదారువేల మందికి ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటున్నారు ఇంటిలో ఎవరైనా మరణిస్తే ఇంటి యజమానులు ఇంటి ముందట వేయకుండా శవాన్ని ఊరు అవుతల చెట్ల కింద ఉంచి దహన సంస్కారాలు చేస్తున్నారు పాలకులు గానీ అధికారులు గానీ ఈ దీనమైన పరిస్థితిని గమనించి వెంటనే వారికి స్థలాలు కేటాయించి ఇండ్ల నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా హుస్నాబాద్ బస్వాపురం కాలనీలో ప్రభుత్వము అక్కడ కొంతమందికి ఇల్లు కేటాయించడం జరిగింది ఇండ్లు కట్టుకున్న సమయంలో రైతులు వచ్చి ఇది మా భూమి అని పునాదులు తీయకుండా మధ్యననే ఆపివేయడం దానివలన అనేకమంది నష్టపోయినారు 649లో గతంలో 470 మందికి పట్టాలి ఇవ్వడం జరిగింది సిపిఎం పోరాట ఫలితంగా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరూ చాలా సంవత్సరాలు అయినది వారి సర్టిఫికెట్లను డబ్బాలలో వెయ్యాలని ఆరోజు ఆర్డిఓ గారు ప్రకటించడం జరిగింది. అందులో కొంతమంది మాత్రమే వేయడం జరిగింది. వారికి జాగాలు 75 గజాలు చొప్పున ఇవ్వడం జరిగింది మిగతావారు వారికి తెలియక సర్టిఫికెట్లను డబ్బాలలో వేయలేదు వారు కూడా వందల సంఖ్యలో ఉన్నారు 700 సర్వే నెంబర్లు పట్టా సర్టిఫికెట్ వచ్చినవా వారికి 107 లో గతంలో ఇళ్లస్థలాలు కేటాయించిన వారికి 649లో పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ 700 సర్వే నెంబర్ సుమారు 14 ఎకరాల స్థలం ఉన్నదని తెలిసినది ఆ స్థలమును ఒక కాలనీగా ఏర్పాటు చేసి లేఅవుట్ ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సిపిఐ ఎం పార్టీ పట్టణ కమిటీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా అధికారులు కలెక్టర్ ఆర్డిఓ ఎమ్మార్వో గారు మరియు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇండ్ల జాగా చూపించి వారికి ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఇల్లు నిర్మాణం చేపట్టాలని గుడిసెల పోరాట కమిటీ డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ పట్టణ కార్యవర్గ సభ్యులు వనం రాజు కల్లూరి నాగమణి పట్టణ కమిటీ నాయకులు బర్ల వెంకటేష్ వల్లా దాస్ అంజయ్య దండుగిరి ఈర్ల రాహుల్ కొత్త లలిత మాటూరి కవిత కొత్త లక్ష్మయ్య నరాల నరసింహ గుడిసెల పోరాట నాయకులు దొడ్డి శంకర్ పిట్టల చంద్రశేఖర్ కన్యబోయిన కృష్ణవేణి కన్నబోయినా అరుణ గుండె గళ్ళ భారతమ్మ కళావతి స్వరూప వరమ్మ వెంకటమ్మ తులసి వల్దాసు జంగమ్మ గుండె గళ్ళ భారతమ్మ మంజుల లక్ష్మి సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు..

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అప్పనపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్లో ఫైలేరియా పరీక్షలు 19/19

సెప్టెంబర్ 15 పున్నమి@డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో TAS -2 ట్రాన్స్మేషన్ అసెస్మెంట్ సర్వే. మండల ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ అప్పనపల్లి పాఠశాలలో ఒక్కటి రెండు తరగతి మొత్తం 19 మంది పిల్లలకు ఫైలేరియా సంబంధిత పరీక్షలు చేయగా 19/19 మందికి నెగిటివ్ వచ్చింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శామ్యూల్ ప్రణయ్, యం పి హెచ్ మేల్ నాగరాజు, హెల్త్ సూపర్వైజర్ నరసింహారావు, లాబ్ టెక్నిషన్స్ శ్రీనివాసరావు, యంపీ హెచ్ ఈ ఓ హరిప్రసాద్ తో వైద్య సిబ్బంది మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నైనాల రఘురామయ్య, ఉపాధ్యాయులు పెద్దిరాజు,రామకృష్ణ, షబ్బీర్ హుస్సేన్, దేవి ఆధ్వర్యంలో జరిగింది.

నిర్మల్

బోధనా నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం.

భైంసా గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకాడమిక్ సెల్. అంతర్గత నాణ్యత మదింపు విభాగం ఆధ్వర్యంలో కళాశాలలో అందరి అధ్యాపకులకు మరియు విద్యార్థులకు కంప్యూటర్ పైన అవగాహన మరియు నైపుణ్యాలను ఉండాలని డాక్టర్. ఓం ప్రకాష్ సార్ కంప్యూటర్ను నేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య గారు మాట్లాడుతూ అందరికీ కంప్యూటర్ రావాలని తెలియజేశారు. IQAC కోఆర్డినేటర్ డాక్టర్ రవి కుమార్ సార్. మరియు రఘునాథ్ సార్. అధ్యాపకులు పాల్గొన్నారు

తెలంగాణ

తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి అండర్ 14, 17 కబడ్డీ పోటీలను ప్రారంభించిన :ఎమ్మెల్యే

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) ఈరోజు తిరుమలగిరి మండలం జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి అండర్ 14,17 బాలుర, బాలికల కబడ్డీ క్రీడోత్సవాల కార్యక్రమాన్ని తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మందుల సామేలు ప్రారంభించారు.

తూర్పు గోదావరి

చిన్న పాటి వర్షానికే చెరువుని తలపిస్తోన్న తాళ్ళపూడి మెయిన్ రోడ్

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్15) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి మండల కేంద్రంలో గల మెయిన్ రోడ్ లో చిన్న పాటి వర్షానికే చెరువుని తలపిస్తున్నట్లుగా తయారయింది అని వైసీపీ జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ అన్నారు. మండలం లో ఇదే పరిస్థితి లో ఉందని అన్నారు. గతంలో ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదన్నారు. అంతకన్నా ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో గోతులన్న నాయకులు ఇప్పుడు ఏమయ్యారు. అదేవిధంగా స్థానిక నాయకులు కూడా పట్టించుకోవడం లేదు,జిల్లా కలెక్టర్ , స్థానిక ఎమ్మెల్యే స్పందించి కనీసం గుంతలు పూడ్చే ఏర్పాటు చేయాలని మండల ప్రజల తరపున కోరుతున్నాము.

తూర్పు గోదావరి

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు

పున్నమి ప్రతినిధి, ధవళేశ్వరం: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు సోమవారం ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించబడ్డాయి. అధికారులు ఆ మహానుభావుని విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్.ఇ. కె గోపినాథ్ మాట్లాడుతూ, “మహానుభావుని విశేషవ్యవస్థ దేశ అభ్యుదయానికి చేసిన కృషి అపారమైనది. ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో ఆయన చూపిన దూరదృష్టి, చేసిన కృషి నేటికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. సమాజ హితానికి ఆయన చేసిన త్యాగస్ఫూర్తిని తరతరాలు స్మరించుకోవాలి” అని అన్నారు. జయంతి వేడుకలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది ఆయన సేవలను స్మరించుకున్నారు.

తూర్పు గోదావరి

మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన జిల్లా కలెక్టర్

పున్నమి ప్రతినిధి: తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం విజయవాడలో రాష్ట్ర మంత్రి శ్రీ కందుల దుర్గేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ మరియు మంత్రి మధ్య జరిగిన సమావేశంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై, వాటికి అవసరమైన అనుమతులపై చర్చ జరిగింది. ముఖ్యంగా సాగు, పారిశుద్ధ్యం మరియు నీటి రంగ అభివృద్ధికి సంబంధించి వివిధ అంశాలపై సమీక్ష జరిగింది. జిల్లాలో మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన శాశ్వత అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని Collector మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి శ్రీ కందుల దుర్గేశ్, ప్రభుత్వ సహకారం అన్ని విధాలుగా అందిస్తామని, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

తిరుపతి

రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి: తలపా దామోదరం రెడ్డి

రైతులు వరి పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోతూ వారి కుటుంబాలను పణంగా పెడుతున్నారు, రైతులు దేశానికి వెన్నెముక లాంటి వారిని కానీ నేడు వ్యవసాయ వ్యయం అధికమవడం దిగుబడి రాకపోవడంతో అనేక రకాలుగా రైతులు నష్టపోతున్నారని కావున వెనువెంటనే ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నట్లు శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.