Wednesday, 6 May 2026

Blog

తిరుపతి

రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి: తలపా దామోదరం రెడ్డి

రైతులు వరి పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోతూ వారి కుటుంబాలను పణంగా పెడుతున్నారు, రైతులు దేశానికి వెన్నెముక లాంటి వారిని కానీ నేడు వ్యవసాయ వ్యయం అధికమవడం దిగుబడి రాకపోవడంతో అనేక రకాలుగా రైతులు నష్టపోతున్నారని కావున వెనువెంటనే ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నట్లు శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దొంగ ఓట్లకు చెక్ – నెల్లూరులో సంతకాల ఉద్యమానికి శ్రీకారం

ఓటును కాపాడండి… దొంగ ఓటుకు తావివ్వొద్దు!” అనే నినాదంతో సంతకాల ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు నగర కాంగ్రెస్ కమిటీ, నెల్లూరు తెలియజేస్తోంది. పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల రెడ్డి గారు ఆదేశాల మేరకు, ఓటు హక్కును కాపాడేందుకు, దొంగ ఓట్లను నిలువరించేందుకు నెల్లూరులో లక్ష సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15, 2025న సాయంత్రం 3 గంటలకు నెల్లూరులోని వి ఆర్ సి వద్ద లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గడువు సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 14 వరకు ఒక నెల మాత్రమే ఉండును. జిల్లా నుంచి గ్రామం వరకు ప్రతి స్థాయిలో భాగస్వామ్యం అవుతూ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని అందరిని మనవి చేశారు.

రంగారెడ్డి

ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

పున్నమి: అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా: ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువతి మృతి, ఏడుగురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అబ్దుల్లా పూర్ మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం, వావిలాల గ్రామానికి చెందిన రాళ్లకత్వా వెంకటేశ్వర్ రెడ్డి(51) అతని కుమార్తె సౌమ్య రెడ్డి(25) హైదరాబాద్ లోని ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తుంది. కాగా ఆదివారం సెలవు దినం కావడంతో ఆమె సహోద్యోగులు వీరేంద్ర(26), నంద కిషోర్, ప్రణీష్, సాగర్, అరవింద్, జాన్సీ, శృతి లు మొత్తం ఎనిమిది మంది హైదరాబాద్ శివారు రాచకొండలోని సరళ మైసమ్మ తల్లి ఆలయానికి ఇన్నోవా క్రిస్టా కారులో వెళ్లారు. వాళ్ళు దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్ ఉన్న ఓఆర్ఆర్ లోకి ప్రవేశించారు. కాగా ఆదివారం రాత్రి 7.30గంటల సమయంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామ పరిధిలోకి చేరుకోగానే కారును డ్రైవింగ్ చేసిన వీరేందర్ అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయి ఓఆర్ఆర్ డివైడర్ ను బలంగా ఢీ కొట్టారు. దీంతో కారు పెద్ద అంబర్ పేట సైడ్ రోడ్డు వైపు తిరిగింది. దాని ఫలితంగా, అందరికీ తీవ్ర రక్తస్రావం కావడంతో వారిని వెంటనే హయత్ నగర్ లోని సన్ రైజ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సౌమ్యరెడ్డి, నందకిషోర్ లను మెరుగైన చికిత్స కోసం ఉప్పల్ లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాళ్లకత్వా సౌమ్య రెడ్డి మృతి చెందింది. దీంతో ఆమె తండ్రి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

గాంధీ మందిర స్మృతివనంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య వేడుకలు

మొక్కలు నాటిన లయనిజం (శ్రీకాకుళం – ) గాంధీ మందిర స్మృతివనంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహంకు పూలమాలలు వేసి, అంజలి ఘటించి, ప్రసంగించారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం, లయన్స్ క్లబ్ హర్షవల్లి సంయుక్తంగా నిర్వహించిన వేడుకలలో ఇంజినీర్ బృందానికి సత్కరించిన అనంతరం లయన్ సింధూర, లయన్ బరాటం లక్ష్మణ రావు, లయన్ హారికాప్రసాద్, లయన్ వి. జగన్నాధం తదితరులు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత సత్యాలను వివరించారు. ఇందులో భాగముగా జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ.రవి కుమార్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు బాధ్యతవహించి స్మృతివనంలో మొక్కలను నాటి, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ గా బాధ్యతలను చేపట్టిన పొన్నాడ. రవి కుమార్ కు అభినందనల ప్రశంసల జల్లులు కురిపించారు. సత్కరించిన ఇంజనీర్ లు బి.రమేష్, బి. సత్యన్నారాయణ, వి. శ్రీనివాస్ రావు, డి.కామేశ్వర రావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం. రామ్ గోపాల్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం, లయన్స్ క్లబ్ హర్షవల్లి సభ్యులబృందం పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి గా బాద్యతలు చేపట్టిన రాహుల్ మీన ఐ.పి.ఎస్.

సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి @ ఆదివారం ఉదయం డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి గా రాహుల్ మీన ఐ.పి.ఎస్., బాద్యతలు స్వీకరించారు. జిల్లాకు విచ్చేసిన నూతన ఎస్పి కి జిల్లా అదనపు ఎస్పి A.V.R.P.B.ప్రసాద్ పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. అనతరం పోలీస్ గౌరవవందనం స్వీకరించి జిల్లా ఎస్పి గా బాద్యతలు స్వీకరించారు. తదుపరి జిల్లా పోలీస్ అధికారులు అందరూ నూతన ఎస్పిని మర్యాధపూర్వకంగా కలిసారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మామిడికుదురులో స్టేట్ బయో ఫారం పదవ తరగతి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ

సెప్టెంబర్ 15 పున్నమి@డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,మమిడికుదురు మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునందు – స్టేట్ బయో ఫారం వారు రూపొందించిన పదవ తరగతి స్టడీ మెటీరియల్ ను మండలవిద్యాశాకాదికారి-I S.V.v.లక్ష్మినారాయణ, మండల విద్యాశాకాదికారి- II మోకా వెంకన్నబాబు బయో ఫారం సభ్యుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగినది MEO I & II లు ఈ స్టడీ మెటీరియల్ ఉపయోగించి మండలము నందు అధిక మంది విద్యార్థులు కు 100% సైన్స్ మార్కులు వచ్చే విధంగా ప్రతి బయాలజీ టీచర్ కృషి చేయాలని ఈ మెటీరియల్ చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకోవడం జరిగినది, HM బి.చిరంజీవి రావు ఈ అద్భుతమైన మెటీరియల్ పదోతరగతి ఉత్తీర్ణత లో మామిడికుదురు మండలము మరింత ముందుండేలాగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో APBSTF కోనసీమ జిల్లా మండల కోఆర్దినేటర్ చప్పిడి వెంకటేశ్వరరావు మండల బయాలజీ ఉపాధ్యాయులు సిహెచ్ గోపి, డి.దాసు, యస్.శ్రీనివాస రావు C H S N నారాయణ, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మెడికల్ కాలేజీల పై కుట్ర వద్దు : ప్రియాంక దండి

రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వైసిపితో విబేధిస్తుంది, జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు వైసీపీ ప్రభుత్వం పై అనేక అంశాల పై పోరాటం చేశామని,కాని వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను స్వాగతిస్తామని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా సుందరీకరించి, బెంచీలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ అలా అన్ని వసతులు కల్పించారని, వైద్య రంగంలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో తీసుకువచ్చిన 17 వైద్య కళాశలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం టీడీపీ ప్రభుత్వం చేస్తోందని, వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీంబరెన్స్మెంట్ (Fees Reimbursement) పథకం తీసుకురావడంతో రాష్ట్రంలో లక్షల మంది ఇంజనీర్లు అయ్యారని దేశంలోనే అది విప్లవాత్మక నిర్ణయమని విద్య అందిస్తే కుటుంబాలు బాగుపడతాయని వై ఎస్ రాజశేఖరరెడ్డి భావించరాని. వైసీపీ హయాంలో వచ్చిన 17 వైద్య కళాశలలను పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తే వేల మంది పేద విద్యార్థులు డాక్టర్లు అవుతారని, పీపీపీ విధాన నిర్ణయం ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రియాంక డిమాండ్ చేసారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా క్రీడాకారుల ఘనత

శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలానికి చెందిన క్రీడాకారులు బొమ్మాలి కగేశ్వరరావు మరియు సూరపు సురేష్ క్రీడలలో ప్రతిభ చూపుతూ పిల్లలకు కూడా శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇటీవల పంజాబ్ రాష్ట్రానికి ప్రత్యేకమైన ‘గట్కా’ ఆటకు ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 11 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ పోటీలలో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరచి రెండో స్థానం సాధించారు. మొత్తం 8 గోల్డ్ మెడల్స్, 17 సిల్వర్ మెడల్స్, 3 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకొని జిల్లాకు గౌరవాన్ని తీసుకువచ్చారు.ఈ విజయానికి శిక్షణనిచ్చిన కగేశ్వరరావు, సురేష్‌లను పలువురు అభినందిస్తూ ఆదర్శప్రాయులుగా ప్రశంసిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

పొట్నూరు.గిరీష్ ఆలోచన భేష్ – శర్వాణి విద్యా సంస్థల వ్యవస్థాపకులు అంధవరపు.సూరిబాబు (శ్రీకాకుళం – )

పొట్నూరు.గిరీష్ ఆలోచన భేష్ అని, శర్వాణి విద్యా సంస్థల వ్యవస్థాపకులు, విద్యావేక్త, అంధవరపు.సూరిబాబు అన్నారు. నరసన్నపేట స్థానిక శర్వాణి పాఠశాలలో రక్థధాన శిబిరాన్ని పొట్నూరు.గిరీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం అంధవరపు.సూరిబాబు ఒక ప్రకటనలో మాట్లాడుతూ పొట్నూరు.గిరీష్ సేవకు సంకేతమని, మానవత్వానికి ముద్రవేశారని, గిరీష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారంచుట్టి ప్రాణదాతగా నిలిచారన్నారు. ఈ రోజు ఆయన వ్యక్తిగత ఆనందం కాకుండా, సమాజానికి ఉపయోగపడే మహోత్సవంగా మలిచారని, మోక్ష బ్లడ్ బ్యాంక్ సహకారంతో, నరసన్నపేట శర్వాణి విద్యాలయం వేదికగా నిర్వహించిన ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమంలో ఇరవై మందికి పైగా రక్తదాతలు పాల్గొని తమ సేవా భావాన్ని చాటుకున్నారన్నారు. గిరీష్ మాట్లాడుతూ మన శరీరంలో తిరిగి పునరుత్పత్తి అయ్యే రక్తపు చుక్కలతో, మరొకరి ప్రాణం నిలబెట్టడం కన్నా గొప్ప దానం ఇంకేముందని, అడిగిన వెంటనే, రక్తదాన శిబిరానికి అంగీకరించిన పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. ఈ కార్యక్రమంలో శర్వాణి పాఠశాల డైరెక్టర్ సాయి రాణి, రక్తదాతలు, పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, గిరీష్ కుటుంబ సభ్యులు, మోక్ష బ్లడ్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.